April 27Apr 27 Author 4 దశలు.. 1,200 సర్క్యూట్ కి.మీ.ల లైన్లుBy Andhra Pradesh News DeskPublished : 27 Apr 2026 04:05 ISTEeFont size2 min readగ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం ఆమోదంరూ.21,500 కోట్లతో కొత్త ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రతిపాదనఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను (జీఈసీ) నాలుగు దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఒక్కో దశ రెండేళ్ల చొప్పున 8 నుంచి 10 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది. రూ.21,500 కోట్లతో జీఈసీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించింది. సుమారు 11 వేల మెగావాట్ల సౌర విద్యుత్, 7,300 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ సరఫరా కోసం నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసేందుకు వీలుగా జీఈసీ ప్రాజెక్టును ఎన్ని దశల్లో పూర్తి చేయనున్నారనే వివరాలు పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌కోను ఇటీవల కోరింది. ప్రాజెక్టుకు చేసే ఖర్చులో సుమారు రూ.6,450 కోట్లు (30 శాతం) కేంద్రం గ్రాంటుగా ఇవ్వనుంది. ఏటా 2,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా విస్తరణరాష్ట్రంలో విద్యుత్ ఎగమతి విధానం కింద ఇప్పటివరకు సుమారు 80,798 మెగావాట్ల సౌర, పవన, పీఎస్‌పీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వాటిలో సుమారు 9,386 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 11,725 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మెజారిటీ పునరుత్పాదక ప్రాజెక్టులు రాయలసీమ పరిధిలో ఏర్పాటు కానున్నాయి. వాటి నుంచి వచ్చే విద్యుత్ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాకు తీసుకెళ్లాలంటే నెట్‌వర్క్ అవసరం. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్ కిలో మీటర్ల కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు అనుసంధానం చేసేలా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌నూ విస్తరించాల్సి ఉంది. ఏటా ఎన్ని ప్రాజెక్టులు ఉత్పత్తిలోకి వస్తాయో గుర్తించి.. దానికి అనుగుణంగా నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికను ట్రాన్స్‌కో సిద్ధంచేసింది. రాబోయే రెండు దశాబ్దాలకాలం పాటు విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌కు ఇబ్బంది లేకుండా ప్రతిపాదనలు రూపొందించింది. విద్యుత్‌ను గ్రిడ్‌కు తీసుకెళ్లేందుకు ప్రస్తుత నెట్‌వర్క్ సామర్థ్యం సరిపోదు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలన్నా నెట్‌వర్క్ విస్తరించక తప్పని పరిస్థితి. ప్రస్తుతం రాయలసీమలో 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ విద్యుత్‌ను 17 సబ్ స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్‌వర్క్‌కు అనుసంధానించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జీఈసీ ప్రాజెక్టులో భాగంగా ఒక్కొక్కటి 400 కేవీ సామర్థ్యం ఉన్న నాలుగు కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అనంతపురంలో రెండు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.
May 23May 23 Author క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీBy Andhra Pradesh News DeskUpdated : 23 May 2026 06:05 ISTEeFont size4 min readదేశవ్యాప్తంగా అందించే స్థాయికి ఎదుగుతున్నాంసేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి లోకేశ్జగన్ పనైపోయిందంటూ ఎద్దేవా ఈనాడు - కడపసేల్ సోలార్ ప్రాజెక్టు వద్ద మంత్రి నారా లోకేశ్ సెల్ఫీ. చిత్రంలో సంస్థ సీఈవో లక్షిత్ ఆవ్లా, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వైస్ ఛైర్మన్ కమలాకర్ బాబురాష్ట్రం ఇప్పుడు స్వచ్ఛ ఇంధనాన్ని (క్లీన్ ఎనర్జీ)ని వినియోగించడమే కాదు.. దేశానికి సరఫరా చేసే రాష్ట్రంగా ఎదుగుతోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరు వద్ద సస్టెయినబుల్ అండ్ ఎఫర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ (ఎస్‌ఏఈఎల్) సోలార్ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవి, సవితలతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘ఈ సేల్ సోలార్ ప్రాజెక్టు దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిపిన వేడుక. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఆ కంపెనీ సొంత ప్లాంట్లలో తయారైన 12 లక్షలకు పైగా అధునాతన టాప్‌కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ఏర్పాటుతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది’ అని ప్రశంసించారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 1,000 మందికి పైగా ఉపాధి లభించగా, అందులో 80 శాతం మంది స్థానిక యువతే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక లీజు ద్వారా 760 మంది రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్, డ్రోన్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా తదితర తయారీ రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రపంచంతో పోటీపడగల ఎకోసిస్టమ్స్‌ను నిర్మిస్తున్నాయని చెప్పారు. బ్రాండ్ సీబీఎన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే పెట్టుబడుల సాధన, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో విజయపథాన సాగుతున్నామని లోకేశ్ అభివర్ణించారు. ఏ కంపెనీ అయినా పెట్టుబడులకు ముందుకొస్తానంటే తాను ఒక్క వాట్సప్ కాల్ దూరంలోనే ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవి,ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కంపెనీ ప్రతినిధులు‘మా నాన్న ఉత్తరం రాశారు.. మా తాత కల కన్నారు.. నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు బ్రదర్! మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన.. మీ బ్రాండ్ గొడ్డలి! ఈ రెండింటికీ నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైకాపా అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. వైకాపా నేతల బెదిరింపులకు భయపడేవారెవరూ ఇక్కడ లేరని హెచ్చరించారు. రెడ్‌బుక్ పేరు చెబితేనే వైకాపా నేతలు వణికిపోతున్నారని, చివరకు రోడ్డుపై ఎర్ర కారు వెళ్తున్నా భయపడుతున్నారని విమర్శించారు. వైకాపా హయాంలో తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని, కేసులు పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా కడప గడ్డపై నుంచే మిషన్ రాయలసీమను ప్రకటించామని, రూ.లక్ష కోట్ల నిధులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి భారీగా కంపెనీలను తెస్తామని, 2029 నాటికి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి తీరతామని, గండికోట నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో లోకేశ్ముద్దనూరు మండలం పెనికలపాడులో రైతు మునగాల ద్వారకానాథరెడ్డికి చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని లోకేశ్ సందర్శించారు. 17 ఎకరాల్లో రసాయనాలు లేకుండా, కేవలం ఒకే ఒక్క ఆవుతో.. సమీకృత పండ్ల తోటలు, నాటుకోళ్లు, పొట్టేళ్లు, చేపల పెంపకం చేపడుతూ స్థిరమైన ఆదాయం ఆర్జిస్తున్న రైతు కుటుంబాన్ని ఆయన అభినందించారు. సేంద్రియ పద్ధతిలో పండిన మామిడి పండ్లను మంత్రి రుచి చూశారు.
May 23May 23 Power cuts baaga avuthunnayiUsage baaga perigindhi last 1-2 weeks nunchi so power cuts kuda baaga perigaayi Edited May 23May 23 by Yaswanth526
Create an account or sign in to comment