Jump to content

remote controlloing for agri motor pumps.


Recommended Posts



రైతు కోసం రుణం!


635968876683430436.jpg


  • అత్యాధునిక పంపు సెట్ల కోసం హెచ్‌వీడీఎస్‌
  • విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరుల్లో భూగర్భ కేబుళ్లు
  • ప్రపంచ బ్యాంకు నుంచి 3800 కోట్ల రుణం
  • జూన్‌లో ఒప్పందం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమ పథకాల కోసం రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఇంధన శాఖ సిద్ధమైంది. ఇందుకు చేయూత అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులు గురువారం సమావేశమై ఈమేరకు ఒప్పందాలు చేసుకునేందుకు సూత్రప్రాయంగా అవగాహనకు వచ్చారు. రూ.3800 కోట్లు రుణంగా అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.

 

రైతులకు వ్యవసాయ పంప్‌ సెట్లకు విద్యుత్తు సరఫరా, మోటార్లు రిమోట్‌తో పనిచేసే పరికరాల అమరిక, పంప్‌ సెట్లకు విద్యుత్తు సంరక్షణ విధానాల అమలుకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. వీటితోపాటు భూగర్భ కేబుళ్ల అమరిక, రిమోట్‌తో పనిచేసే సబ్‌స్టేషన్లకూ ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో అజయ్‌జైన్‌ బృందం జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవి..

 

  • రాష్ట్రంలోని పంపు సెట్లన్నింటికీ రెండున్నరేళ్లలో హైవోల్టేజీ డిసి్ట్రబ్యూషన్‌ సిస్టమ్‌ (హెచ్‌విడీఎస్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఇందుకోసం రూ.1900 కోట్లు రుణం తీసుకోవాలి. 
  • వ్యవపాయ పంప్‌సెట్లన్నింటినీ రిమోట్‌తో అనుసంధానం చేస్తారు. రైతు పొలానికి వెళ్లకుండానే దేశంలో ఎక్కడ నుంచెనా తన ఫోన్‌లో ఏర్పాటు చేసుకున్న నంబర్లను నొక్కడం ద్వారా పంప్‌సెట్‌ను ఆన్‌ చేయవచ్చు. ఇందుకోసం 300 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
  • రాష్ట్రంలోని 50,000 పంప్‌ సెట్లలో విద్యుత్తు సంరక్షణ విధానాలు అమలు చేస్తారు. ఇందుకు రూ.250 కోట్లు ఖర్చవుతుంది.
  • విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులలో విద్యుత్తు స్తంభాలకు స్వస్తిపలికి.. భూగర్భ కేబుళ్లు వేయాలని సంకల్పించారు. ఇందుకోసం 400 కోట్లు వ్యయం అవుతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...