Jump to content

kondaveedu fort and golden temple


Recommended Posts

కొండవీడు కోటలోఆధ్యాత్మిక పరిమళాలు
 

రెండు దేవాలయాలు, మసీదు పునర్నిర్మాణం

gnt-gen8a_34.jpg

కొండవీడును పర్యటకంగా అభివృద్ధి చేసే క్రమంలో ఆధ్యాత్మిక భావనలు విరజిల్లేలా పురాతన ఆలయాలను పునరుద్ధరిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు దేవాలయాలు, మసీదు పునరుద్ధరిస్తున్నారు. మనోహరమైన విగ్రహాలను తయారు చేయించి  ఆలయాల్లో    ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం వారు చెంఘీజ్‌ఖాన్‌పేటలో ప్రతిష్ఠాత్మకమైన స్వర్ణహంస దేవాలయం నిర్మాణం చేపట్టింది. వీటితో పాటు కొండవీడు పరిసర ప్రాంతాల్లోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి, గోపీనాథస్వామి ఆలయాల పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నారు.

కొండవీడు(యడ్లపాడు), న్యూస్‌టుడే

కొండవీడు కొండపై పురాతన కట్డడాల పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.79 లక్షలతో ఆలయాల పునరుద్ధరణ పనులు చేపట్టారు. పురాతన శివాలయం, లక్ష్మీనరసింహ ఆలయాల నిర్మాణాల బండరాళ్లను తొలగించారు. పురాతన ఆలయాల మాదిరి యథాతథంగా నిర్మించనున్నారు. అందులో భాగంగా ఆలయాల నుంచి తొలగించిన ప్రతిరాయిపై క్రమపద్ధతిలో తెలుగు, నలుపు రంగు గుర్తులు వేశారు. పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయం వెనుక భాగంగా ఉన్న కొండగుహలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సన్నాహలు చేస్తున్నారు. శివాలయాన్ని ఊడదీసే క్రమంలో ఆలయ గర్భగుడిలో బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్లు లభ్యమయ్యాయ. దీంతో పురావస్తు శాఖాధికారులు ప్రస్తుత ఆలయానికి ఎడమ వైపున కొద్దిదూరంలో ఆలయాన్ని పునర్నిర్మించే పని చేపట్టారు. చెరువు ఒడ్డున ఉన్న మసీదు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.

మహాబలిపురం, కాశీల నుంచి విగ్రహాలు: పురావస్తు శాఖాధికారులు ఆలయాల పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం దేవాదాయ శాఖాధికారులు రెండు దేవాలయాల్లో విగ్రహాలను, ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించనున్నారు. 3.5 ఎత్తు ఉన్న లక్ష్మీదేవి, లక్ష్మీనరసింహస్వామి కలిసి ఉండే విగ్రహాన్ని మహాబలిపురంలో తయారు చేస్తున్నారు. అడుగున్నర ఎత్తు ఉన్న శివలింగాన్ని కాశీలో రూపొందిస్తున్నారు. రెండు ఆలయాల్లో రెండు చెక్క ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.10 లక్షల వ్యయంతో రానున్న ఏప్రిల్‌లోపు విగ్రహాలను ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.

గోపీనాథస్వామి ఆలయానికి మహర్దశ
కొండవీడు వైభవానికి, చారిత్రక శిల్పకళా సంపదకు పేరుగాంచిన పురాతన గోపీనాథస్వామి(కత్తుల బావి) ఆలయాన్ని పునర్నిర్మించటానికి అంచనాలు రూపొందించాలని ఇటీవల ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా పౌరసరఫరాల శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పురావస్తు అధికారులను ఆదేశించారు. అధికారులు ఇప్పటికే ఆలయంలో కొలతలు సేకరించారు. ఆలయంతో పాటు ముందున్న శ్రీకృష్ణదేవరాయులి విజయ స్తూపం పునరుద్ధరించునున్నారు. కొండవీడు కొండపై ఉన్న పురాతన బొల్లమోర వెంకటేశ్వరస్వామి, చెంఘీజ్‌ఖాన్‌పేటలోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు దేవాదాయ శాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 192
  • Created
  • Last Reply

Top Posters In This Topic

పర్యావరణ పరిరక్షణకు కృషి 

కొండవీడు కొండపై మొక్కలు నాటిన విద్యార్థులు

gnt-brk2a_54.jpg

కొండవీడుకోట(యడ్లపాడు), న్యూస్‌టుడే: కొండవీడు అభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపొందించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అటవీ సంరక్షణాధికారి శ్రీనివాసశాస్త్రి పేర్కొన్నారు. నగర వనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొండవీడుకోటపై ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నాలుగు నగరవనాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొండవీడుకోటలో ప్రకృతి సంపద దెబ్బతినకుండా 75 హెక్టార్లలో నగర వనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మూడు గొలుసుకట్టు చెరువులు, నడకదారులు, పార్కుల వెంట నీడనిచ్చు, పండ్ల జాతి మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. కొండవీడుకోటలో 100 రకాల ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయన్నారు. పచ్చదనం ఆవశ్యకత, కొండవీడుకోట విశిష్టత తెలుసుకోవడానికి మొక్కలు నాటడానికి భావి పౌరులైన విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖాధికారి మోహనరావు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతకు 33 శాతం పచ్చదనం తప్పనిసరి అన్నారు. జిల్లాలో 16 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నారు. 2020 నాటికి 50 శాతం పచ్చదనం పెంచాలని సీఎం చంద్రబాబు లక్ష్యం విధించినట్లు చెప్పారు. కొండవీడు అభివృద్ధిలో భాగం పచ్చదనానికి పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాస్‌, తహశీల్దార్‌ రామాంజనేయులు, ఎంపీపీ స్టీఫెన్‌కరుణాకర్‌, కొండవీడు అభివృద్ధి కమిటీ సమన్వయకర్త కల్లి శివారెడ్డి, తెదేపా నాయకులు మద్దూరి వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, హఫీజ్‌బేగ్‌, అధ్యాపకుడు గోవిందాచార్యులు పాల్గొన్నారు. 
ఉత్సాహంగా  పాల్గొన్న విద్యార్థులు 
సాయితిరుమల, పీఎన్‌సీ, ఆర్వీఆర్‌అండ్‌జేసీ, మార్నింగ్‌స్టార్‌ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు 8 బస్సులతో సహా కొండపైకి చేరుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా మొక్కలు నాటారు. ముందుగా అధికారులు మొక్కలు నాటి, నీరు పోసి నగరవనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తగా ప్రతిష్ఠించిన ఆంజయస్వామి విగ్రహం వద్ద పూజలు చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా విద్యార్థినులు మొక్కలు నాటారు. అటవీ సిబ్బంది మొక్కలను సరఫరా చేసి విద్యార్థులు మొక్కలు నాటడానికి సహకరించారు.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కొండవీడు చరిత్ర అందరికీ తెలిసేలా ఉత్సవాలు

పేటలో వైభవంగా శోభాయాత్ర
18న ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

amr-brk3a_55.jpg

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : కొండవీడు చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యడ్లపాడు మండలం కొండవీడులో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలకు ముందుగా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం విద్యార్థులతో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. దీనిలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో రెండు రోజులు ఆనందంగా గడిపేందుకు అంతర్జాతీయ స్థాయి కళాకారులు, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 18న జరిగే ఉత్సవాలకు హాజరవుతారని చెప్పారు. ప్రపంచ చిత్రపటంలో కొండవీడు కోటను చూపించబోతున్నామన్నారు. రెడ్డిరాజుల ప్రాభవాన్ని తెలిసేలా అప్పటి విగ్రహాల ఏర్పాటు, మసీదు, దర్గాలు పునర్నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత, రాబోయే తరాలవారికి కూడా గుర్తుండిపోయేలా కొండవీడును తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉత్సవాల్లో జబర్దస్త్‌, బిగ్‌బాస్‌ బృందాలు సందడి చేస్తాయన్నారు. కొండపైన హెలీరైడింగ్‌, ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌... ఇలా ప్రజలను ఆనందపరచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు, ఉత్సవాలకు వచ్చేవారికి తాగునీరు, వైద్య శిబిరాలు.. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ క్రీడలు కూడా ఉంటాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని ప్రత్తిపాటి కోరారు.

ఆకట్టుకొన్న కళాకారుల ప్రదర్శనలు..
శోభాయాత్రలో కళాకారుల కోలాట ప్రదర్శనలు, డప్పు వాద్యాలు, తప్పెట్లు, వివిధ వేషధారణలు ప్రజలను ఆకట్టుకొన్నాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోలాటం ఆడుతూ.. డప్పులు వాయిస్తూ అలరించారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ కూడలి నుంచి ప్రారంభమైన యాత్ర శాఖాగ్రంథాలయం, గ్రామీణ పోలీసు స్టేషన్‌ మీదుగా గడియార స్తంభం వరకు సాగింది. కార్యక్రమంలో పురపాలక సంఘ ఛైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రెండ్రోజుల కార్యక్రమాలు ఇలా..
17, 18 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కొండవీటి ఉత్సవాల రెండ్రోజుల కార్యక్రమాల వివరాలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం వెల్లడించారు. 17న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉత్సవాలు ప్రారంభిస్తారని, అతిథులుగా సభాపతి కోడెల, మంత్రులు అయన్న పాత్రుడు, శిద్దా రాఘవరావు, భూమా అఖిలప్రియ, ఎం.డి.ఫరూక్‌, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్నారు. 18న సీఎం చంద్రబాబునాయుడు ముగింపు ఉత్సవాలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

అలరించనున్న ప్రదర్శనలు..
ఉత్సవాల రెండ్రోజులు సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. 17న జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు టీవీ యాంకర్‌ చిత్రలేఖ వ్యాఖాతగా వ్యవహరిస్తారు. సినీనటులు లావణ్య త్రిపాఠి, ఆలీ, శివాజీ పాల్గొంటారు. షరీఫ్‌ మిమిక్రీ, శివమణి డ్రమ్స్‌, టీవి సినీ కళాకారులు రోహణి, మైథిలి, అంబికా, లేఖ్యభరణి నృత్యాలు ఉంటాయి. సినీ గాయకులు యాసిన్‌జార్‌, హేమచంద్ర, ధనుంజయ, దామిని, మాల్గుడి శోభ, మంగ్లీ, మల్లికార్జున్‌, అంబికతో పాట కచేరి, దామోదర గణపతి జానపద కార్యక్రమాలు, అంతర్జాతీయ సాంసృతిక కార్యక్రమాల్లో భాగంగా రష్యన్‌ క్విట్‌ ఛేంజస్‌, ఈజిప్టియన్‌ తనోరా, లైవ్‌బ్యాండ్‌, కొండవీటి వైభవంపై లేజర్‌షో ఉంటాయి.

18న సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా టీవీ నటి శ్యామల, రోల్‌రైడా(బిగ్‌ బాస్‌ఫేం) వ్యవహరించనున్నారు. సినీ ప్రముఖులు అమలాపాల్‌ పాల్గొంటారు. వైష్ణవి, సాయినాథ్‌ నృత్యాలు ఉంటాయి. సినీ సంగీత దర్శకుడు మణిశర్మ బృందంచే సంగీత విభావరి, ప్రత్యేక ఆకర్షణగా రాహుల్‌ సక్సేనా, ఇమిటేషన్‌ రాజు మిమిక్రీ, అంతర్జాతీయ కార్యక్రమాలు ఆఫ్రికన్‌ యాక్రో బ్యాట్‌, బిలాస్‌ నాయక్ స్పీడ్‌ పెయింటింగ్‌ ఉంటాయి. అనంతరం మద్రాసుకు చెందిన ఏక్‌నాథ్‌ బృందంచే కొండవీటి ఘాట్‌, బురుజులపై అరగంట సేపు మిరిమిట్లు గొలిపేలా బాణసంచా వేడుక జరగనుంది.

 

Link to comment
Share on other sites

సందడే సందడి
 

నేటి నుంచి రెండ్రోజులపాటు కొండవీడు ఉత్సవాలు
ముగింపునకు ముఖ్యమంత్రి హాజరు
ఈనాడు, గుంటూరు

gnt-top1a_68.jpg

కొండవీటి కోట.. తెలుగువారి ప్రాభవానికి నిలువెత్తు దర్పణం. రెడ్డిరాజుల పాలనలో ఓ వెలుగు వెలిగిన చారిత్రక నిర్మాణం. నవ్యాంధ్రలోనూ కొత్త కళ సంతరించుకుంటోంది. చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతిపరంగా పర్యటకులను కట్టిపడేసే అందాలకు నిలయంగా ఉండడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తోంది. రాజధాని అమరావతి నగరానికి సమీపాన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో ఇది ఉండడంతో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది. దీని వైభవాన్ని చాటి చెప్పేందుకు ఆది, సోమవారాల్లో కొండవీడు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

తెలుగు నేలపై కొండవీడు కోటకు ప్రత్యేకస్థానం ఉంది. ఎన్నో నాటకాలు, సినిమాల్లో దీని ప్రస్తావన లేకపోలేదు. కొండవీడు కొండపై కొన్ని వందల అడుగుల ఎత్తున నిర్మించిన దుర్గం ఒకప్పటి శత్రుదుర్భేద్యం. కొండ చుట్టూ రెడ్డిరాజులు నిర్మించిన రాతిగోడ, కోట బురుజులు, ఆలయాలు, చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పాలు, విశాలమైన చెరువులు, అనంతమైన విజ్ఞానంతోపాటు అంతులేని ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. అప్పట్లో శత్రువుల నుంచి రక్షణ కోసం రెడ్డిరాజులు చుట్టుపక్కల ప్రాంతాల్లో 80కిపైగా కట్టడాలు నిర్మించారు. వీటిలో కొండవీడు దుర్గం అతి పెద్దది. వీరుడిగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను జయించడానికి చాలా శ్రమించాల్సివచ్చిందని చరిత్ర చెబుతోంది. తూర్పున పుట్టకోట నుంచి పశ్చిమాన కొండవీడు వరకు మధ్యలో కొండమీద వైష్ణవ, శైవ దేవాలయాలతోపాటు సభామండపాలు, రెండు మసీదులు సైతం నిర్మించారు. కొండకింద భాగంలో ఉన్న కత్తులబావి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇక్కడికి దగ్గర్లోనే చెంఘీజ్‌ఖాన్‌ పేట వద్ద  వెన్నముద్ద వేణుగోపాలస్వామి ఆలయంలోని ఏకశిలా విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. కొండవీడుకు సమీపంలో రూ.200 కోట్లతో ఇస్కాన్‌ స్వర్ణ హంస ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న కొండవీడు కోట అభివృద్ధికి 2003 నుంచి కొన్ని సంఘాలు కృషి చేశాయి. 2010లో నిధుల విడుదల మొదలైనా 2014 తర్వాత పురోగతి సాధ్యమైంది.

ఆకర్షిస్తున్న ఘాట్‌ రోడ్డు అందాలు
కోటను చేరుకోవడానికి కింది నుంచి 5 కిలోమీటర్ల మేర ఘాట్‌ రోడ్డును వేశారు. దాని మీదుగా కొండపైకి చేరుకున్న తర్వాత కిందికి చూస్తే మెలికలు తిరిగిన పాము మాదిరిగా అందర్నీ ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ సాగే ఘాట్‌ ప్రయాణం పర్యటకులకు కనువిందు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న మెట్ల మార్గం శిథిలావస్థకు చేరుకోగా పైన ఉన్న చారిత్రక నిర్మాణాలు మరుగునపడ్డాయి. 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన సమతల భూమితో మూడు పెద్ద చెరువులు ఉన్నాయి. ఒకటి నిండిన తర్వాత మరో దానిలోకి నీరు వెళ్లేలా అప్పట్లో వీటిని నిర్మించారు. శిథిలావస్థకు చేరిన లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి, శివాలయాల జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. సందర్శకుల కోసం జంతు ప్రదర్శనశాల, రిసార్టులు నిర్మిస్తున్నారు. అటవీ శాఖ అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో ఇటీవలే పనులు మొదలయ్యాయి. కొండ పైభాగంలో అరుదైన వృక్షజాతులూ ఉన్నాయి. పుస్తకాల్లో చూసే కొన్ని ఔషధ మొక్కలను పరిశీలించేందుకు, పరిశోధించేందుకు విద్యార్థులు తరలివస్తుంటారు.

gnt-top1b_16.jpg

వైభవంగా శోభాయాత్ర
రాష్ట్ర విభజన తర్వాత చారిత్రక ప్రాంతం కొండవీడు కోట అభివృధ్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీని ప్రాధాన్యతను ప్రజలు, పర్యటకులకు తెలియజేసేందుకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. రెండు రోజులుగా చిలకలూరిపేట, ఫిరంగిపురం, గుంటూరు నగరంలో కొండవీడు కోట ఉత్సవాలను పురస్కరించుకుని శోభాయాత్ర జరిపారు. ఈ సందర్భంగా రెండు రోజులపాటు సినీ, టీవీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల ద్వారా కొండవీడు కోట ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పుల్లారావు తెలిపారు.

Link to comment
Share on other sites

పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట
 

gnt-gen3a_58.jpg

ఫిరంగిపురం గ్రామీణం న్యూస్‌టుడే: యడ్లపాడు మండలంలోని కొండవీడు కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పౌరసరఫరాల శాఖ మంత్రి పుల్లారావు అన్నారు. ఈనెల 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కొండవీడు కోట ఉత్సవాల్లో  భాగంగా ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడుకోట అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు చెప్పారు. కొండవీడుకోటతో పాటు, ఫిరంగిపురంలోని కార్మెల్‌మాత ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. టీవీ, సినిమా, జబర్ధస్త్‌ నటులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అంతకు ముందు  శాసనభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఈ స ందర్భంగా పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌ డప్పుకొడుతూ సందడి చేశారు. మహిళల కోలాటం, వివిధ వేషదారణలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండల పరిషత్‌ కార్యాలయం నుంచి సొలస అడ్డురోడ్డు వరకు శోభాయాత్ర సాగింది. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉత్సవాలను జయప్రదం చేయాలి
రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కొండవీటి ఉత్సవాలను జయప్రదం చేయాలని మంత్రి పుల్లారావు కోరారు. ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యనిర్వాహక సంచాలకులు మల్లికార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షుడు దాసరి రాజా మాస్టారు, ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ, గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌, గుంటూరు తూర్పు తెదేపా ఇన్‌ఛార్జి మద్దాళి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

gnt-gen3b_3.jpg

కొండవీటి కోట చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: కొండవీటి కోట చరిత్ర భావి తరాలకు తెలియజేసేందుకే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఉత్సవాలు నిర్వహిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్‌ క్రీడాప్రాంగణంలో శోభాయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలకు సినీ కళాకారులు హాజరవుతున్నారని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఉత్సవాలకు రెండు లక్షల మంది హాజరవుతారన్నారు. 50 కొండల సమాహారమే కొండవీడు కోట అని, 17, 18 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా కొండవీడు కోటను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో రెండు గొప్ప విషయాలు జరిగాయన్నారు. ఒకటి రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా శరవేగంగా అభివృద్ధి చేయడం, చరిత్ర కలిగిన  కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడమన్నారు. ఈకోట కట్టడాలను వీక్షించేందుకు రూ.50 కోట్లతో రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్బన్‌ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులు విచిత్ర వేషధారణలు, జానపద నృత్యాలు, కోలాటాలు, డప్పు కళాకారులు విన్యాసాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత చరిత్ర వైభవాన్ని చాటి చెబుదాం, కొండవీటి ఉత్సవాలను విజయవంతం చేద్దాం అని విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష్మీపురం మీదుగా లాడ్జి సెంటర్‌ వరకు శోభాయాత్ర సాగింది. ఎమ్మెల్సీ ఏ.ఎస్‌ రామకృష్ణ, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మద్దిరాల మ్యాని, రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ దాసరి రాజామాస్టర్‌, మిర్చియార్డు ఛైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి, మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర తెదేపా కార్యదర్శి రాయపాటి రంగారావు, నాట్స్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

gnt-gen3c.jpg

కొండవీడులో ఏర్పాట్లు పరిశీలన
కొండవీడు(యడ్లపాడు), న్యూస్‌టుడే: కొండవీడు ఉత్సవాల నేపథ్యంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హిమాంశు శుక్లా, జిల్లా గ్రామీణ ఎస్పీ రాజశేఖరబాబుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కొండపై సీఎం ఆవిష్కరించనన్న పైలాన్‌, హెలీపాడ్‌ స్థలం, స్టాల్స్‌, సాహస, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. కొండవీడు ఉత్సవాల సందర్భంగా తాగునీటి, పారిశుద్ధ్యం నిర్వహణ చర్యలు తీసుకున్నట్లు గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్‌ఈ సత్యనారాయణ తెలిపారు. 6 లక్షల నీటి ప్యాకెట్లను సందర్శకులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎంపిక చేసిన 10 ప్రదేశాల్లో టెంట్లు వేసి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు కొండపైన 40, కొండ దిగువన 20 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, చిలకలూరిపేట రూరల్‌ సీఐ విజయచంద్ర, కొండవీడు అభివృద్ధి కమిటీ సమన్వయకర్త కల్లి శివారెడ్డి పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

కొండవీడు పూర్వ వైభవానికి కృషి 

 

ఉత్సవాలను వేడుకగా ప్రారంభించిన మంత్రులు

ap-state4a_2.jpg

ఈనాడు డిజిటల్‌-గుంటూరు, యడ్లపాడు-న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కొండవీడు కోటను సందర్శించి అలనాటి చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధానిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవిరళ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇందులో భాగంగానే ప్రతి ప్రాంతంలోనూ పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో రెండు రోజుల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రారంభ సూచికగా బెలూన్లను ఎగురవేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి తరవాత అంతే అందంగా కొండవీడు ఘాట్‌రోడ్డును మూడేళ్లలో పూర్తిచేసి, పర్యాటకులను ఆకర్షించడం అభినందనీయమన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి కొండవీడు కోటకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరంలో రోజూ 20 వేల మంది పర్యాటకులు కోటకు వచ్చేలా సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తిరుపతి నుంచి సప్తగిరి బస్సులను తీసుకువచ్చి కొండపైకి వెళ్లేందుకు ఉచిత సర్వీసులు నడిపారు. పర్యాటకుల కోసం కొండపైన ట్రెక్కింగ్‌, పారా గ్లైడింగ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, హెలికాప్టర్‌ రైడింగ్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కొండవీడును సందర్శించనున్నారు. నూతనంగా నిర్మించిన ఘాట్‌ రోడ్డును ప్రారంభించి, రోడ్డు మార్గం ద్వారా కొండపైకి వెళ్లి కొండవీడు నగరవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

ap-state4b.jpg

 

Link to comment
Share on other sites

ఘన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు
18-02-2019 08:37:55
 
636860758765610202.jpg
  • డిప్యూటీ సీఎం చినరాజప్ప
  • అట్టహాసంగా ప్రారంభమైన కొండవీడు ఉత్సవాలు
  • హాజరైన మంత్రులు సోమిరెడ్డి, ప్రత్తిపాటి
కొండవీడు కోట (యడ్లపాడు): శతాబ్దాల ఘనచరిత్రకు కొండవీడుకోట నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నదని డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండవీడుకోట ఉత్సవాలను ఆదివారం సాయంత్రం చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 700 సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిన కొండవీడు కోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లా రావులు కృషిచేస్తున్నారన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు భావితరా లకు గుర్తుండేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కొండవీడు కొండపై ఉన్న మూడు చెరువులు, దేవాలయాలు, కోటలు, బురుజులు, చారిత్రక కట్టడాలు అన్నీ అబ్బుర పరుస్తున్నాయని చిన రాజప్ప పేర్కొన్నారు. అలనాటి చరిత్రను ప్రజలందరూ తెలుసు కోవలసిన అవసరం ఉన్నదన్నారు. దేశంలోనే ఇంతటి విశిష్టత కలిగిన కోట మరొకటి ఉండదని తెలిపారు. ఆధ్యాత్మికత, పర్యాటకం కలగలిసిన ప్రాంతం కొండవీడు అని కొనియాడారు. గత చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టేలా కొండవీడును అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ప్రతియేటా కొండవీడు ఉత్సవాలను నిర్వహిస్తామని, ప్రపంచ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
 
 
తొలుత మంత్రులు ఖోఖో, వాలీబాల్‌, బాక్సింగ్‌ పోటీలను ప్రారం భించారు. విజేతలకు బహుమతులు అందించారు. వేమన పద్య రత్నావళి, కొండవీడు చరిత్ర పుస్తకాలను ఆవిష్కరించారు. బెలూన్‌లు ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు.
 
కార్యక్రమంలో పురావస్తుశాఖ కమిషనర్‌ వాణీ మోహన్‌, పర్యాటకశాఖ జేడీ మల్లికార్జునరావు, స్టెప్‌ సీఈవో రజనీప్రభు, చిలకలూరిపేట మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి, టీడీపీ రాష్ట్ర నాయకులు రాయపాటి రంగబాబు, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, మంత్రి ప్రత్తిపాటి సతీమణి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కందిమళ్ల జయమ్మ, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
 
చారిత్రక కట్టడాలు అద్భుతం: సోమిరెడ్డి
వ్యవసాయశాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ శతాబ్దం పాటు కొండవీటి కేంద్రంగా పరిపాలన కొనసాగించిన కొండవీటి రాజులు కొండపై చెరువులు తవ్వించి, దేవాలయాల నిర్మాణం చేశారన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందని ఆ రోజులలోనూ చెరువులు ఒకదాని తర్వాత మరొకటి నిండేవిధంగా ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కొండచుట్టూ రెడ్డిరాజులు 23 కి.మీ మేర రాతిగోడ, చారిత్రక కట్టడాలు కళ్లను కట్టిపడవేస్తున్నాయన్నారు. భావితరాలకు కొండవీడు కోట స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు.
 
కొండవీడుకు పూర్వవైభవం తెస్తాం: ప్రత్తిపాటి
పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడుకు పూర్వవైభవం తీసుకువస్తానన్నారు. రాబోయే ఏడాదికాలంలో రోజూ 25వేల మంది పర్యాట కులు పర్యటించేవిధంగా అభివృద్ధి చేస్తామన్నారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, రామాలయం, శివాలయం, దర్గా, మేరిమాత దేవాలయం ఇలా మూడు మతాలకు సంబంధించిన కొండవీడు కోటను మతాల కతీతంగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. రెడ్డిరా జులు, గజపతులు, కృష్ణదేవరాయలు, కుతుబ్‌షాలు పరిపాలించిన కొండవీడు కోటకు నేడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్వవైభవం వచ్చిందన్నారు.
 
కొండవీడు కొండలు... భూమికి హారంలా: నన్నపనేని
రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కొండవీడు కోట ఘాట్‌రోడ్డు చాలా చక్కగా ఉన్నదన్నారు. కొండవీడులోని 50 కొండలు భూమికి ఒక హారంలా కనిపిస్తున్నాయన్నారు. గోల్కొండ కోట కన్నా ఘన చరిత్ర కొండవీడుకు ఉన్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో అమరావతి, కొండవీడు, కోటప్పకొండ ఇలా ప్రతి దానికి ఒక చరిత్ర ఉన్నదన్నారు. కొండవీడు కోట అభివృద్ధితో గుంటూరు జిల్లా చరిత్ర పుటలలో నిలిచిపోతుందన్నారు.
Link to comment
Share on other sites

సాయం సమయంలో విశాఖ తీరం, గుంటూరు జిల్లా కొండవీడు గాట్ రోడ్ వెలుగులు చెబుతున్నాయి నవ్యాంధ్ర బవిషత్ దగదగలు చంద్రబాబుతోనే సాద్యం అని.. జయహో @ncbn మళ్ళీ నువ్వే రావాలి.. #Andhrapradesh

Dzs7uMHU8A44F3t.jpg
Dzs7uXVVYAEiecZ.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...