June 11Jun 11 Author పనులు పట్టాలెక్కాయ్By Andhra Pradesh Dist. DeskPublished : 11 Jun 2026 05:49 ISTEeFont size2 min readఅక్టోబరుకు ఇంటిగ్రేటెడ్ సిద్ధం చేసి ట్రయల్రన్డిసెంబరులో ప్రారంభించేందుకు ముహూర్తంఈనాడు, అమరావతిచురుగ్గా సాగుతున్న అద్దాల పనులువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు మళ్లీ పట్టాలెక్కాయి. ఎట్టకేలకు టెండర్లు ఖరారు చేసి కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు 10రోజుల కిందట వర్క్ ఆర్డర్ ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం 280 మంది కార్మికులతో టెర్మినల్ మిగులు పనులను చేపట్టారు. టెర్మినల్ వెలుపలి వైపున గ్లాస్‌తో చేపడుతున్న గ్లేజింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే మధ్యలో ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ మిగులు పనులు పూర్తి చేస్తున్నారు. భవనం లోపల ఫ్లోరింగ్, రూఫ్, టాయ్‌లెట్స్ పనులు కూడా ఆరంభించారు.5 నెలలు లక్ష్యం..రూ.470 కోట్లతో చేపడుతున్న టెర్మినల్ పనులు ఇప్పటికే 80శాతం పూర్తయ్యాయి. మిగతా 20శాతం మిగులు పనులను ఐదు నెలల్లో పూర్తిచేయాలని.. గుత్తేదారు సంస్థ కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు లక్ష్యం నిర్దేశించారు. అక్టోబరు చివరి నాటికి అన్నీ పూర్తి చేసి ట్రయల్‌రన్‌కు భవనాన్ని సిద్ధం చేయాలి. ఆ తర్వాత రెండు నెలలు.. భవనంలో ఉండే అన్ని విభాగాల కేటాయింపు, సీసీ కెమెరాలు, కన్వేయర్‌బెల్ట్‌లు, ఏసీలు అన్నింటినీ టెస్టింగ్ పూర్తిచేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించి.. డిసెంబరు నుంచి భవనంలో కార్యకలాపాలు నిర్వహించాలని.. తాజాగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నిర్దేశించింది. దీని ప్రకారమే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థకు సూచించారు.500 మంది కార్మికులతో..టెర్మినల్‌కు సంబంధించిన స్ట్రక్చర్ వర్క్‌లోనూ కొంత ఇంకా బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు అదనంగా మరో ఐదు నుంచి 600 మందిని 15 రోజుల్లోగా సమకూర్చుకుని ఈ పనులను వేగవంతం చేయనున్నట్లు ఏఏఐ అధికారులు వెల్లడించారు.* టెర్మినల్ భవనంలోని విద్యుత్తు, ఇంటర్‌నెట్, అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటు సైతం చేపట్టాలి. భవనం లోపలి పనులు పూర్తయిన తర్వాతే ఇవి మొదలుపెడతారు.మరో సంస్థకు..విమానాశ్రయంలో కీలకమైన కన్వేయర్ బెల్ట్ పనులను మరో సంస్థకు అప్పగించారు. ఇప్పటికే ఇవి 70శాతం పూర్తయ్యాయి. భవనం మొత్తం పూర్తయిన తర్వాత మిగతా 30శాతం పనులు చేపడతారు. సెప్టెంబరు చివరి నాటికి భవనం లోపలి పనులు పూర్తి చేసి అప్పగిస్తే కన్వేయర్ బెల్ట్ మిగులు పనులు చేపట్టి అక్టోబర్ చివరికి మొత్తం ఒకేసారి ట్రయల్‌రన్‌కు సిద్ధం చేస్తారు.
June 14Jun 14 On 6/13/2026 at 5:07 AM, sonykongara said:@sonykongara - RMN Dubai connection ki codeshare kosam work chesthunnadu annadu eeyana. Ye airline ki Emirates codeshare ippistharoo. Edited June 15Jun 15 by Avinash
Thursday at 02:20 PM5 days 11 minutes ago, sonykongara said:@sonykongara - is this source reliable? Emirates flying to Vijayawada will be huge. I am curious which existing routes they plan to cut to reallocate capacity to Vijayawada.
Thursday at 03:13 PM5 days Author 50 minutes ago, Avinash said:@sonykongara - is this source reliable? Emirates flying to Vijayawada will be huge. I am curious which existing routes they plan to cut to reallocate capacity to Vijayawada.Antha ki mundu kuda integrated terminal purthi ayithe naduputaru ane talk ayithe unnadi. Alage ah post vesina athani info reliable ga untundi.
Create an account or sign in to comment