May 3May 3 Author విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో డెంటిక్ వరల్డ్ సంస్థ ప్రారంభంBy Andhra Pradesh News DeskPublished : 03 May 2026 06:30 ISTEeFont size1 min readఒప్పందపత్రాలు చూపిస్తున్న మెడ్‌టెక్, డెంటిక్ వరల్డ్ సంస్థల ప్రతినిధులు, చిత్రంలో మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్రశర్మ తదితరులువిశాఖపట్నం (పరవాడ), న్యూస్‌టుడే: దేశంలోనే మొట్టమొదటి డెంటల్ మెడ్‌టెక్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అయిన డెంటిక్ వరల్డ్ సంస్థను శనివారం విశాఖ మెడ్‌టెక్ జోన్ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. మెడ్‌టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ, డెంటిక్ వరల్డ్ సీఈవో కృష్ణసాయి ఇంకోలు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ దంతవైద్య రంగం ప్రస్తుతం భారీగా దిగుమతులపై ఆధారపడి ఉందని, దాదాపు 85-90% దంతవైద్య పరికరాలు విదేశాల నుంచి రావడంతో సామాన్యులకు అధునాతన దంతవైద్యం అందుబాటులో ఉండట్లేదని.. ఈ లోటు భర్తీ చేసేందుకు భారతదేశం సొంతంగా డెంటల్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డెంటిక్ వరల్డ్‌ను స్థాపించామన్నారు. ఈ హబ్ స్టార్టప్‌లకు, దంతవైద్య కళాశాలలకు, పరిశోధకులకు, పరిశ్రమల భాగస్వాములకు మద్దతుగా నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలమంది దంతవైద్యులు సరికొత్త ఆవిష్కరణలను త్వరగా అందిపుచ్చుకోవడానికి ఇది సహాయపడుతుందని, ఈ హబ్ ద్వారా పరిశోధన, డెంటల్ డిజైన్ సేవల తయారీ, టెస్టింగ్, క్లినికల్ వాలిడేషన్ లాంటి అంశాల్లో సమగ్ర మద్దతు అందిస్తుందన్నారు. ప్రస్తుతం దిగుమతి అవుతున్న జిర్కోనియాడిస్క్‌లు, నెక్స్ట్ జనరేషన్ డెంటల్ ఇంప్లాంట్ల లాంటి కీలక ఉత్పత్తులను ఇక్కడే తయారు చేయడంపై డెంటిక్ వరల్డ్ ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. అత్యాధునిక ఉత్పాదక సౌకర్యాలు ఉండడంతో కొత్తగా వచ్చే ఆవిష్కర్తలకు, స్టార్టప్‌లకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా ఉండడమే కాకుండా విశాఖను డెంటల్ టెక్నాలజీ తయారీకి ప్రధాన కేంద్రంగా మారుస్తుందన్నారు. అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
June 19Jun 19 Author మెడ్‌టెక్ జోన్‌కు ప్రతిష్ఠాత్మక గుర్తింపుBy Andhra Pradesh News DeskPublished : 19 Jun 2026 06:22 ISTEeFont size1 min readఎన్‌సీవీఈటీతో కీలక ఒప్పందందిల్లీలో ఒప్పందం కుదుర్చుకుంటున్న మెడ్‌టెక్ జోన్, ఎన్‌సీవీఈటీ ప్రతినిధులుపరవాడ, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ), విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు బయోమెడికల్ స్కిల్ అవార్డింగ్ బాడీగా గుర్తింపు ఇచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ గుర్తింపుతో మెడ్‌టెక్ జోన్ క్యాంపస్‌లో లేదా దాని పర్యవేక్షణలో నడిచే కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు మూల్యంకనం చేసి ఎస్‌ఎస్‌క్యూఎఫ్ ప్రమాణాలతో కూడిన ధ్రువపత్రాలు జారీచేసే అధికారం లభించింది. వైద్య పరికరాల తయారీ కేంద్రానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంలో మెడ్‌టెక్ జోన్ పాత్ర బలోపేతం కానుంది. ఈ గుర్తింపు ప్రక్రియలో భాగంగా వైద్య పరికరాల తయారీ పరిశ్రమలో మారుతున్న శ్రామిక శక్తి అవసరాలను తీర్చడానికి మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్) రూపొందించిన ప్రొడక్షన్ అసోసియేట్ మాన్యుఫ్యాక్చరింగ్ (మెడికల్ డివైజ్) ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవెల్ 4.5 కోర్సుకు ఎన్‌సీవీఈటీ ఆమోదం తెలిపింది. ఆధునిక తయారీ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేలా ఈ కోర్సును రూపొందించారు. ఎంఎస్‌డీఈ కార్యదర్శి, ఎన్‌సీవీఈటీ ఛైర్‌పర్సన్ దేబశ్రీ ముఖర్జీ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మెడ్‌టెక్ జోన్ తరఫున ఏఐసీ మెడివ్యాలీ సీఈవో దిలీప్‌కుమార్ చేకూరి, ఐబీఎస్‌సీ నేషనల్ కో-ఆర్డినేటర్ నరేష్ నిట్టూరి, ఎన్‌సీవీఈటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్ గాబా, డైరెక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ విక్రమ్‌సింగ్ భాటి హాజరయ్యారు. ఈ గుర్తింపుపై మెడ్‌టెక్ జోన్ సీఈవో డాక్టర్ జితేంద్రశర్మ సంతోషం వ్యక్తం చేశారు.
July 26Jul 26 Author ఆరోగ్య ఆవిష్కరణలకు కేంద్రంగా విశాఖBy Andhra Pradesh Dist. DeskUpdated : 26 Jul 2026 06:31 ISTEeFont size2 min read100కి పైగా స్టార్టప్‌లతో ఏపీ మెడ్‌టెక్ జోన్మెడ్టెక్ జోన్ వరల్డ్ ఇంక్యుబేషన్ హబ్ పరవాడ, న్యూస్‌టుడే: విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్) 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు వేదికగా మారడం ఒక మైలురాయి వంటిదని, ఇది భారతదేశపు హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ వ్యవస్థకు నిదర్శనమని మెడ్‌టెక్ జోన్ సీఈవో, ఎండీ డాక్టర్ జితేంద్రశర్మ తెలిపారు. ఇది ఏఎంటీజెడ్ ఇకో సిస్టమ్‌పై ఆవిష్కర్తలకు ఉన్న నమ్మకం, ఇన్నోవేషన్ ద్వారా హెల్త్‌కేర్‌ను మార్చాలనే నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. ‘ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏఎంటీజెడ్ ప్రోత్సహిస్తోంది. ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్, ప్రాణాలను కాపాడే వైద్యపరికరాలు, బయో టెక్నాలజీ, పునరావాస సాంకేతికతలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో రోగుల సంరక్షణను మెరుగుపరిచే సాంకేతికతను, ఆలోచనల నుంచి నిజరూపంలో తీసుకురావడానికి ఏఎంటీజెడ్ ఒక ప్రధాన వేదికగా మారింది. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు అవసరమైన ప్రత్యేక మౌలిక సదుపాయాలు, నిబంధనలపై నైపుణ్యం, తయారీ, క్లినికల్ ధ్రువీకరణ, నిధులు అవసరమయ్యే ఈ సమయంలో మెడ్‌టెక్ అభివృద్ధి ప్రయాణాన్ని ఏఎంటీజెడ్ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చింది. తన ప్రత్యేక కేంద్రాలైన మెడీవాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్, బయోవ్యాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్, భారత్ లింట్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యాడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి ప్రత్యేక కేంద్రాల ద్వారా 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లను ఇక్కడ ఇంక్యుబేట్ చేశారు. సాధారణ ఇంక్యుబేటర్లలా కాకుండా ఏఎంటీజెడ్ స్టార్టప్‌లకు అధునాతన తయారీ, ప్రయోగాత్మక ప్రొటోటైపింగ్, టెస్టింగ్ ల్యాబొరేటరీలు, నిబంధనల మార్గదర్శకత్వం, నాణ్యతా ధ్రువీకరణ, క్లినికల్ సహకారాలు, వాణిజ్యపరమైన మద్దతును అందిస్తుంది. కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా పలు కీలక కార్యక్రమాల ద్వారా ఏఎంటీజెడ్ ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకెళ్తోంది.’ అని పేర్కొన్నారు.కీలక కార్యక్రమాలు..మెడ్‌టెక్ హ్యాకథాన్: నిజమైన ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడానికి ఆవిష్కర్తలు, వైద్యులు, పరిశ్రమల నిపుణులతో కలిసి పని చేస్తారు.వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరమ్: స్టార్టప్‌లను గ్లోబల్ ఇన్వెస్టర్లు, పాలసీ మేకర్లు పరిశోధకులు, హెల్త్‌కేర్ నాయకులతో అనుసంధానిస్తుంది.ఇన్నోవేషన్ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్: మెంటార్‌షిప్, నిబంధనలపై మార్గదర్శకత్వం, మార్కెట్ ప్రవేశం, వాణిజ్యానికి మద్దతును అందిస్తుంది.
Create an account or sign in to comment