August 30Aug 30 Author వరదకు అడ్డుకట్ట.. అమరావతికి అనుసంధానంBy Andhra Pradesh Dist. DeskUpdated : 30 Aug 2026 05:55 ISTEeFont size2 min readఈ-1 రహదారితో పర్యాటకాభివృద్ధిరూ.443 కోట్లతో బృహత్తర ప్రణాళికఉద్దండరాయునిపాలెంలో ఈ-1 రహదారి విస్తరణ పనులు ఈనాడు - అమరావతి: రాజధాని అమరావతి నగరానికి అనుసంధానాన్ని పెంచే కీలకమైన కృష్ణా కుడిగట్టు కరకట్ట విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో భారీ వరదలను తట్టుకునేలా అధునాతనంగా విస్తరిస్తున్నారు. గతంలో ఉన్న సింగిల్ రోడ్డు స్థానంలో నాలుగు వరుసల రహదారి నిర్మిస్తున్నారు. ఈ-1 రోడ్డుగా అభివృద్ధి చేస్తున్న ఈ మార్గం.. కృష్ణా తీరం వెంట అమరావతి అభివృద్ధికి కీలకం కానుంది. రాజధాని అమరావతికి విజయవాడను అనుసంధానించేలా ఇటీవల సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నదికి వరదలు వచ్చిన సమయంలో తీర గ్రామాలను రక్షించేలా 1954లో కరకట్ట నిర్మించారు. అప్పట్లో జలవనరులశాఖ అధికారుల తనిఖీ నిమిత్తం 22 కిలోమీటర్ల పొడవుతో.. 5.5 మీటర్ల వెడల్పుతో ఒకే వరుస రోడ్డు వేశారు. కట్ట సగటు ఎత్తు 4.50 మీటర్లు.మాస్టర్ ప్లాన్‌లో విస్తరణఅమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో విజయవాడ నుంచి వెళ్లేందుకు కరకట్ట మార్గాన్నే వినియోగించారు. అప్పట్లో హడావుడిగా సింగిల్ రోడ్డును తాళ్లాయపాలెం వరకు తారురోడ్డుగా వేసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. సీడ్‌యాక్సెస్ రహదారిని వెంకటపాలెం వరకు నిర్మించేవరకు సీఎం చంద్రబాబు సహా వీఐపీలందరూ ఇదే మార్గంలో సచివాలయానికి వెళ్లి వచ్చేవారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ఈ-1 రోడ్డుగా కరకట్ట రహదారి విస్తరణను ప్రతిపాదించారు. ఇటీవలే అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు ఈ రహదారి ఉంది. ప్రస్తుతం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు 6.90 కిలోమీటర్ల మేర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం రూ.443.26 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది. మూడు ప్యాకేజీలకుగాను రూ.313.37 కోట్లతో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఎన్‌సీసీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 13.90 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా.. కుడి కరకట్టను 11.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో నిర్మించారు. 2024లో నదికి వరద వచ్చినప్పుడు 11.43 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ ప్రవాహం నమోదైంది. భవిష్యత్తులో 13.90 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల అంచనా మేరకు ఆ ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. కరకట్టను 24 మీటర్ల వెడల్పు.. 6 మీటర్ల సగటు ఎత్తుకు పెంచుతున్నారు. నదివైపు నీటి కోతను ఆపడానికి ‘కటాఫ్ వాల్’.. అమరావతివైపు రక్షణ కోసం ‘టో వాల్’ గట్లపై రాళ్లను అమర్చేలా వరద నిరోధక పద్ధతులు వాడుతున్నారు. కరకట్ట బలోపేతం ద్వారా రాజధానికి భవిష్యత్తులో వరద భయం ఉండదు. ఐకానిక్ యాక్సెస్ రోడ్డుగా..ఈ-1 రహదారి అమరావతికి ఐకానిక్ యాక్సెస్ రోడ్డుగా మారబోతోంది. అధునాతన వీధి లైటింగ్, అందమైన పచ్చదనంతో కూడిన మీడియన్ అండ్ స్లోప్ ల్యాండ్ స్కేపింగ్, పాదచారుల కోసం ప్రత్యేక కాలిబాటలు, స్ట్రీట్ ఫర్నిచర్‌తో ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. పలు పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు సేదతీరేలా.. సందర్శకులకు అవసరమైన పర్యాటక ఆకర్షణలు ఏర్పాటు చేయనున్నారు.
August 30Aug 30 Author 38 minutes ago, ramntr said:6 lane vundali kada why only 4 lane..80M road kani slope ekkuva untundi anta, 6 lane chesthene bagutundi cost ekkuva ani 4 chesthunnaru anukunta, retaining wall kattadani ki permission raledu anta adi kudirithe 6 lane ga chese vallu
August 30Aug 30 This E1 road correct ga plan chesi execute chesthe game changer ayyiddi amaravati ki... Time pattina manchiga cheyyali Riverfront road..
September 4Sep 4 Author రాజధానికి కొత్తశోభABN , Publish Date - Sep 04 , 2026 | 05:21 AMనవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం నగిషీలు అద్దుకుంటూ దూసుకుపోతోంది. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి.. చెప్పుకోదగ్గ మార్పుతో నవనగర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. మొన్నటి వరకు మట్టితో, గుంతలతో ఉన్న రాజధాని రహదారులు ఇప్పుడు తారురోడ్లుగా మారిపోతున్నాయి.అమరావతి రహదారులకు నగిషీలుLATESTబైక్‌లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరఆర్టీసీకి కాసుల పంట..మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైకొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చినఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామాచేత వెన్నముద్ద...సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐసమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ కోరిన మంత్రినేపాల్ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదంగీతాచార్యుని రాజనీతిబైక్లు నడపలేం.. రిక్షాపై ఎక్కించాల్సిందే.. ఖాకీల వీడియో వైరఆర్టీసీకి కాసుల పంట..మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైకొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చినఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామాచేత వెన్నముద్ద...సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐసమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ కోరిన మంత్రినేపాల్ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదంగీతాచార్యుని రాజనీతి700 కి.మీ. మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లునిర్మాణం పూర్తయిన రోడ్లలో పనులు ప్రారంభంఈ3, ఎన్9, ఈ9, ఈ6రోడ్లు, జోన్ 2ఏలో నిర్మాణంఅమరావతికి ప్రత్యేక ఆకర్షణగా కొత్త హంగులురోడ్డు, ట్రాక్‌లకు మధ్య అవెన్యూ ప్లాంటేషన్గుంటూరు(రాజధాని), సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం నగిషీలు అద్దుకుంటూ దూసుకుపోతోంది. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి.. చెప్పుకోదగ్గ మార్పుతో నవనగర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. మొన్నటి వరకు మట్టితో, గుంతలతో ఉన్న రాజధాని రహదారులు ఇప్పుడు తారురోడ్లుగా మారిపోతున్నాయి. ఆ వెనువెంటనే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. రాజధాని నగరంలో తూర్పు-పడమరలను కలుపుతూ ఈ 1 నుంచి ఈ 16 వరకూ 16 ‘ఈ’ సిరీస్ రోడ్లు, ఉత్తర-దక్షిణాలను కలుపుతూ ఎన్ 1 నుంచి ఎన్ 17 వరకూ 17 ‘ఎన్’ సిరీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి మొత్తం పొడవు 350 కి.మీ. ఉంటుంది. ఈ రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో మొక్కలను పెంచడంతో పాటు స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మిస్తారు. అమరావతి మొత్తం మీద రోడ్లకు ఇరువైపులా 700 కి.మీ.ల మేర సైక్లింగ్ ట్రాక్‌లు, 700 కి.మీ. మేర వాకింగ్ ట్రాక్‌లు నిర్మించనున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో ట్రాక్‌ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.
Create an account or sign in to comment