Jump to content

Vijayawada- Amaravati seed capital access way


Recommended Posts

  • 3 weeks later...
దూసుకెల్తున్న సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పనులు
 

seed-access-road-amaravati-26112016.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చాలా ప్రతిష్టాత్మికంగా నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున constructions కంపెనీ, దీన్ని 2017 ఏప్రిల్ నాటికి పూర్తీ చేసే విధంగా పనులు చేస్తుంది. ఈ రహదారి పూర్తి అయితే, రాజధాని గ్రామాల్లో ఎక్కడికైనా నిమషాల్లో చుట్టేయవచ్చు. ఈ రహదారి రాజధానికి ప్రధాన మార్గం, అందుకే ముఖ్యమంత్రి ప్రతి వారం ఈ రోడ్డు పనులను సమీక్షిస్తున్నారు.

కృష్ణా కరకట్టకు సమాంతరంగా ఉండవల్లి నుంచి దొండపాడు వరకు 18 కిలోమీటర్లు పొడవున సీడ్‌రోడ్డు నిర్మిస్తున్నారు. మొదటివిడతగా రూ.270 కోట్లు సీడ్‌ రోడ్డు నిర్మాణానికి కేటాయించారు.

 

ప్రస్తుతం ఎర్త్‌ వర్క్‌ జరుగుతోంది. 14 కిలోమీటర్లు దూరం.. మీటరు లోతు మట్టిని ఎక్స్‌కవేటర్లతో తీస్తున్నారు. ఆ లోతులో గ్రావెల్‌ నింపుతున్నారు. ఇప్పటికి మూడు కిలోమీటర్లు గ్రావెల్‌ నింపారు. ఎర్త్‌ వర్క్‌ కోసం 20 ఎక్స్‌కవేటర్లు, 40 ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. చదును చేసే పనులు కూడా సమంతరంగా జరిగిపోతున్నాయి.

రోడ్డు మధ్యలో అవసరమైన చోట కాంక్రీట్‌తో కల్వర్టర్లను నిర్మించనున్నారు. దీని వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోతుంది. ఈ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు కంపెనీ అంటుంది

 
Link to comment
Share on other sites

రాజధాని అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. 18.27 కి.మీ. పొడవైన తొలి దశ రహదారి పనులను ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి పనులను రూ.125 కోట్ల వ్యయంతో ఎన్‌సీసీ సంస్థ చేపట్టింది. కేంద్ర రాజధాని ప్రాంతం (సీడ్‌ కేపిటల్‌), ప్రభుత్వ భవనాల సముదాయాలను జాతీయ రహదారితో అనుసంధానించే రహదారి ఇది. జాతీయ రహదారిపై విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేప్పుడు కనకదుర్గ వారధి దాటాక మణిపాల్‌ ఆస్పత్రి వద్ద మొదలై బోరుపాలెం వరకు ఈ రహదారి వెళుతుంది. రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం తర్వాత ప్రభుత్వం ప్రారంభించిన రెండో పెద్ద ప్రాజెక్టు ఇదే.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులను రెండు భాగాలుగా చేశారు. దీని మొత్తం పొడవు 21.5 కి.మీ.లు. దీనిలో 18.27 కి.మీ.లకు మొదట టెండర్లు పిలిచారు. ఈ రహదారి మధ్యలో 16.3 మీటర్ల వెడల్పు ప్రాంతాన్ని బీఆర్‌టీఎస్‌ కోసం, మెట్రో రైలు కోసం కేటాయించారు. ఒక పక్క 7.25 మీటర్ల వెడల్పులో రెండు వరుసల రహదారి, మరో పక్క ఇంతే వెడల్పున మరో రెండు వరుసల దారిని నిర్మిస్తారు. ఈ రహదారికి పక్కన అటూఇటూ సైకిల్‌ట్రాక్‌లు ఉంటాయి. తొలి విడత రహదారి పనులు ఉండవల్లి సమీపంలో మొదలై బోరుపాలెం వరకు కొనసాగాలి. రాజధానిలో నిర్మిస్తున్న ఏడు ప్రధాన రహదారుల్లో మూడు ఈ రహదారి మీదుగా వెళుతున్నాయి. ఈ రహదారిపైకి వచ్చేందుకు దాదాపు 30 చోట్ల అప్రోచ్‌లు ఉంటాయి. రహదారి మధ్యలో ఉండే డివైడర్‌ను 12 చోట్ల తెరిచి ఉంచుతారు. 18.27 కి.మీ.దూరంలో 41 కల్వర్టులు, రెండు మినీ వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది.15349570_1489966951016891_23994345560584

Link to comment
Share on other sites

  • 3 weeks later...
మలుపుల మెలిక
 
636181691820981245.jpg
  • అవసరం లేకున్నా సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు మలుపులు
  • దీని వెనుక కొందరి హస్తం! ఫ సర్వేను అడ్డుకున్న రైతులు
  • 60 మంది రైతులు నష్టపోతారని ఆవేదన
గుంటూరు/మంగళగిరి: మలుపుల్లేని రోడ్డు మార్గాలను నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానోద్దేశం. రాజధాని అమరావతిలో ఈ తరహా రోడ్లనే నిర్మిస్తామని ఆ యన పదే పదే చెబుతున్నారు. ఇంచుమించు రూ.600 కోట్లకు పైగా వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో సాధ్యమైనంతగా మలుపులను తగ్గిస్తామని సీఎం చెబుతుండగా.. సదరు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు రూపకల్పనలో అదృశ్య శక్తులు వాలి తమ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరం లేకున్నా.. మలుపులను సృష్టిస్తున్నారు. కనకదుర్గ వారధి జంక్షన్‌ నుంచి దొండపాడు వరకు సుమారు 21.5 కిలోమీటర్ల పొడవునా సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణాన్ని రెండు దశలుగా చేపడుతున్నారు. తొలిదశలో ఉండవల్లి గుహాలయాల వద్ద వున్న కొండవీటివాగు నుంచి దొండపాడు వరకు రూ.230 కోట్ల వ్యయంతో 18.3 కిలోమీటర్ల పొడవునా నిర్మాణ పనులను కొద్ది నెలల కిందట చేపట్టారు. ఈ పనులు శరవేగంగా జరుగుతుండగా... రెండవ దశలో ఉండవల్లి సెంటరు నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 3.2 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్లతో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును నిర్మించేందుకు అవసరమైన సన్నాహాలను చేస్తున్నారు. వారధి జంక్షన్‌ వద్ద మణిపాల్‌ ఆసుపత్రికి ఉత్తరంగా ప్రారంభమయ్యే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును తొలి 400 మీటర్ల తరువాత అవసరం లేకున్నా 1.2 కిలోమీటర్ల నిడివిలో అర్థచంద్రాకారంగా వంపు తిప్పుతూ రూటు మ్యాపును ఫైనలైజ్‌ చేయించేందుకు కొందరు కసరత్తులు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతంలో రోడ్డును మలుపు తిప్పకుండానే నేరుగా ముందుకు తక్కువ ఖర్చుతో కొనసాగించే వీలుంది. ఈ ప్రాంతంలో ఏడాదిలో మూడు పంటలు పండే సారవంతమైన భూములున్నాయి. ఈ భూములకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను హైవే మీదకు తీసుకువెళ్లేందుకు 2003లో తమంతట తాముగా 40 అడుగుల వెడల్పు గల రహదారిని 800 మీటర్ల పొడవునా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రహదారిని కృష్ణా పుష్కరాల సందర్భంగా అభివృద్ధి చేశారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నేరుగా ముందుకు సాగాలంటే సరిగ్గా ఈ రోడ్డును ఇరువైపులా విస్తరించుకుంటూ వెడితే సరిపోతుంది. దీనివలన భూసేకరణ గణనీయంగా తగ్గుతుంది. కానీ, అధికారులు ఈ రోడ్డుకు దక్షిణంగా 150 నుంచి 200 మీటర్ల దూరంగా అర్థచంద్రాకారంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును మలుపు తిప్పే విధంగా ప్రతిపాదించారు. దీనివలన మొత్తం రోడ్డుకు ఎక్కువగా భూసేకరణ చేయాల్సి రావడంతోపాటు సమీపంలోని 40 అడుగుల రోడ్డు నుంచి ఆ ప్రాంత భూములన్నీ చిన్న చిన్న ముక్కలు చెక్కలయ్యే ప్రమాదం వుంది. ఈ పరిస్థితి వలన అక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈ క్రమంలో సర్వేకు వచ్చిన ప్రతినిధులను రైతులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొత్త ప్రతిపాదనను అంగీకరించేదిలేదని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.

రోడ్డుకు వ్యతిరేకం కాదు..
ప్రభుత్వం నిర్మించనున్న సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును మేం వ్యతిరేకించడంలేదు. అయితే ఉన్న అవకాశాలను వినియోగించుకుని అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా వుండే విధంగా చర్యలు చేపట్టాలి. కావాలంటే కరకట్ట రోడ్డును లేదా పాత టోల్‌గేటు సెంటరు నుంచి బకింగ్‌హామ్‌ కాలువ కట్ట మీదుగా సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును అభివృద్ధి చేసుకోవచ్చు.

- బుర్రముక్కు కోటిరెడ్డి, రైతు

60 మంది రైతులకు నష్టం
సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును అర్థవృత్తంలో మలుపు తిప్పి నిర్మి స్తే సుమారు 60 మంది రైతులు నష్టపోతారు. 13 ఏళ్ల క్రితమే తమ రైతులంతా 40 అడుగుల రహదారి కోసం స్వచ్ఛందంగా తలాకొంతగా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో భూములను వదులుకున్నాం. అవసరమైతే ఈ రోడ్డు విస్తరణకు మరికొన్ని భూములను ఇవ్వడానికి సిద్ధం.

- కొల్లి సీతారెడ్డి, రైతు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...