Jump to content

గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు


Recommended Posts

Ade kada TG Baffas ee AP baffas kante ghoram. They don't know ground realities. Veellani nammukunte 2012-14 Congress high command AP Congress & TRS leaders ni nammukuni muniginatle. Veellu eru daataka theppa tagalese rakalau. Indirect supporters of Jaffas.

Link to comment
Share on other sites

  • 4 months later...
  • 8 months later...

 

 
ఎన్నికల ముందు పశ్చిమ గోదావరిలో ‘కొత్త’ కుదుపు...
27-09-2018 15:08:39
 
636736577215893826.jpg
  • నియోజకవర్గాలపై మళ్ళీ కదలిక
  • ఒక్కసారిగా ఆశావహుల అప్రమత్తం
  • అప్పుడే లోలోన సమాలోచనలు
  • అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు
ఏలూరు/పశ్చిమ గోదావరి: రాష్ట్ర విభజన దరిమిలా అతి తక్కువ స్థానాలతో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగనుందంటూ విస్తృత ప్రచారం. కేంద్రా నికి ముందస్తు నివేదికలు... నియోజకవర్గాల సంఖ్య పెరిగేలా తగినంత మద్ధతు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి వేడుకోలు... అప్పట్లో తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరించింది కాబట్టి నియోజకవర్గాల పెంపుదల విషయంలో అనుకున్నదే సాధిస్తామని అనుకున్నారు. రానురాను ఇదికాస్తా సడలింది. నియోజకవర్గాల పునర్విభజన మరిచిపోయే అంశంగానే అధికార పక్షం భావించింది. ఆఖరుకి నియోజకవర్గాల నుంచి ఆశలు పెంచుకున్న వారందరికీ ఇది అప్పట్లోనే అతి పెద్ద నిరాశ కలిగించింది. కానీ తాజాగా నియో జకవర్గాల పునర్విభజన విషయంలో కొంత కదలిక రావడంతో ఆశావహుల ఆనందం అంతా ఇంతా కాదు. సరాసరిన ప్రతి జిల్లాలోనూ మూడు నుంచి ఐదు నియోజక వర్గాల చొప్పున సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని మరీ లెక్కకట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పరోక్షంగా ఇలాంటి సంకేతాలు ఇచ్చింది.
 
 
పార్టీల్లో చేరబోతున్న కొత్త ముఖాలకు ఈ ప్రతిపాదన సరికొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే నియోజకవర్గాల సంఖ్య పెరిగేందుకు అవకాశం పెద్దగా లేదని తేల్చారో అప్పటి నుంచే రాజకీయ వేదికపై విర్రవీగే కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో జారుకోవాల్సి వచ్చింది. కొత్త ముఖాలు పెట్టుకున్న ఆశలన్నీ కేంద్రమే నేరుగా నీరుగార్చింది. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చిన్న సమాచారం కూడా రాజకీయ పక్షాల్లో ఒక కుదుపు ఇస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. నియోజక వర్గాల పెంపుదల విషయంలో హఠాత్తుగా చోటు చేసుకున్న పరిణామాలపైనే అందరి దృష్టి పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి అంశం లేవనెత్తిందో అదికాస్తా ఇప్పుడు రాజకీయ పక్షాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. అన్ని పక్షాల నేతలు బుధవారం రాత్రి ఇదే అంశంపై చర్చల్లో మునిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యా సాధ్యాలను వ్యక్తిగతంగా సమీక్షించుకున్నారు. వీరికి చాలా చోట్ల ఆశావహులు జతకలిశారు.
 
 
ఇంతకుముందు ఏం జరిగింది
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కుదిస్తారా, లేక పెరగబోతున్నాయా అనే చర్చ జరిగినప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17 లేదా 18కి చేరవచ్చంటూ అంచనా కట్టారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఎవరకు వారు నియోజకవర్గాల విభజన ఎలా జరగబోతుందో అంచనాకు వచ్చారు. దీనికి విరు గుడుగా మరికొందరు వేరే ప్రచారం తెరముందుకు తెచ్చారు. విభజన జరిగే నియోజకవర్గాల్లో చింతల పూడి, పోలవరంతో పాటు మరో రెండు నియోజక వర్గాలు ఉంటాయని వాదించిన వారూ లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం నుంచి రెండు ముంపు మండలాలు నేరుగా పోలవరం నియోజకవర్గంలో కలిసి నందున, పునర్విభజన తప్పక పోవచ్చనంటూ ప్రచారం జరిగింది. దీంతో సమాంతరంగా అతి పెద్ద నియో జకవర్గాల్లో చింతలపూడి కూడా ఉండడంతో దీనిలో మార్పులు, చేర్పులు ఉంటాయని రాజకీయాల్లో తల పండిన వారే అంచనాకు వచ్చారు.
 
 
ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెంచినట్టైతే అది ఏ పార్టీకి అనుకూలమో ఊహాగానాలతో విస్తృత ప్రచారాలకు తలపడిన వారు లేకపోలేదు. ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉంటాయని మరి కొందరు అంచనాకు వచ్చారు. ఏలూరు అర్బన్‌ నియోజకవర్గంగా మార్పులు చేసి రూరల్‌ ప్రాంతాన్ని దెందులూరు నియోజక వర్గంలో విలీనం చేయడం, అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్న కొంత భాగాన్ని పొరుగున ఉన్న చింతలపూడిలో కలిపే అవకాశం ఉందని రకరకాల అంచనాకు వచ్చారు. ఇవన్నీ అన ధికారికంగా విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి తేనెతుట్టెను కదిపింది. ఆశావహుల్లో అంచనాలను పెంచింది. రాజ కీయంగా సరికొత్త దూకుడుకు అవకాశం కల్పించింది. నియోజక వర్గాల పెంపు సాధ్యమా, కాదా అనే విష యంపై రకరకాల సందేహాలు ఉన్నా రాజకీయ పార్టీల్లో మాత్రం ఇదే పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.
Link to comment
Share on other sites

 పునర్విభజనలో జిల్లాల వారీగా పెరిగే నియోజకవర్గాల లిస్ట్ ఇదే

 

 
 

నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభజన బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లో  లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌వ్వగానే  ఈ బిల్లు పార్ల‌మెంట్‌కు చేర‌బోతోంది అని సమాచారం. చాలా నెలల క్రిత‌మే  ఈ ఫైల్ ప్ర‌ధాని కార్యాలయానికి వచ్చినా, బీజేపీ ఒక నిర్ణ‌యం తీసుకోకపోవ‌డంతో ఈ అంశం పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇప్పటికే ఎన్నికల కమీషన్, కేంద్ర హోమ్ శాఖ మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఐతే ఇప్పటికి కూడా బిజెపి కూడా నాన్చుడు ధోరణిలో ఉన్నట్టు,అమిత్ షా అంత సుముఖంగా లేరని తెలుస్తుంది, సాధారణ గుజరాతిలా నాకేంటి లాభం అని చూస్తున్నట్టు తెలుస్తుంది.  రాజస్థాన్,మధ్యప్రదేశ్ లో కూడా వచ్చే ఎన్నికల్లో అధికార బిజెపి ఎదురుగాలి తట్టుకుని తిరిగి అధికారంలోకి రావాలంటే పునర్విభజన అనివార్యం అన్న సంకేతాలు ఉన్నాయి. అయినా పునర్విభజన కి బిజెపి అధ్యక్షుడికి ఏంటండి సంబంధం? అది పార్లమెంట్ పని కదా? అని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా పెరిగే నియోజకవర్గాల సంఖ్య ఇదేనని సమాచారం.

 

రాయలసీమ : అనంతపూర్,చిత్తూర్,కడప,కర్నూల్

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాలకి మరొక నాలుగు కొత్తగా కలిసి మొత్తం 18 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూర్ లో ఉన్న 14 నియోజకవర్గాలకి మరొక నాలుగు కొత్తగా కలిసి మొత్తంగా చుస్తే నియోజకవర్గాల సంఖ్య 18 అవుతాయని  అంతే కాక, కడపలో ఉన్న 10 నియోజకవర్గాలు 13 అవుతాయని సమాచారం. చివరగా కర్నూల్లో ఉన్న 14, నాలుగు సీట్లు పెరిగి 18 అయ్యే ఛాన్స్ ఉందట.మొత్తంగా రాయలసీమ లో ఉన్న 52 సీట్స్ కి మరొక 15 కలిసి 67 సీట్లు అవుతాయని సమాచారం.

 

 

 

 

శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం :

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 కాస్త 13 అవుతాయని సమాచారం. విజయనగరం జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాలకు ఇంకొక రెండు కలిసి 11 అవుతాయని,అంతే కాక విశాఖపట్నం లో ఉన్న 15 కాస్త 20 అవుతాయని తెలుస్తుంది.

 

తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి :

ఇప్పటికే  అన్ని జిల్లాల కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తూర్పు గోదావరి జిల్లాకి విభజనలో కూడా ఎక్కువ నియోజకవర్గాలు కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న 19 కి ఇంకొక 6 కలిసి 25 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతే కాక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 కి ఇంకొక 4 కలిసి 19 అవుతాయని తెలుస్తుంది.

 

గుంటూరు,కృష్ణ :

రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లా మరియు కృష్ణ జిల్లాలో నియోజకవర్గాల పెంపు ఇలా ఉండొచ్చు. గుంటూర్ జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలకు మరొక ఐదు కలిసి 22 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడ ఉన్న కృష్ణ జిల్లాలో మరొక నాలుగు కలిసి ఇరవై నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

ప్రకాశం,నెల్లూరు : ఇక ప్రకాశం నెల్లూరు జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం లో ఉన్న 12 కాస్త 15 అవుతాయని, నెల్లూరు జిల్లాలో ఉన్న పది కి మరొక మూడు కలిసి 13 అవుతాయని సమాచారం.

 

 

మొత్తంగా చూస్తే రాయలసీమ లో ఉన్న 52 సీట్స్ కి మరొక 15 కలిసి 67 సీట్లు, కోస్తాంధ్ర ప్రాంతం లో ఉన్న 123 కాస్త 35 కొత్త నియోజకవర్గాలు కాస్త 158 అవుతాయని సమాచారం. పునర్విభజన జరిగితే మాత్రం షుమారు గా ఇదే సంఖ్యలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం. ఐతే పునర్విభజన ని వైకాపా వ్యతిరేకిస్తుంటే, తెలుగు దేశం స్వాగతిస్తుంది. కాని ఈ పునర్విభజనతో ఎటువంటి సంబంధం లేని అమిత్ షా నాన్చుతున్నట్టు తెలుస్తుంది. కాని ఇప్పటికి ఉన్న సమాచారం నిజమైతే పునర్విభజన జరిగి తీరుతుంది అని ఘంటాపధం గా చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ పునర్విభజన మీద అతి త్వరలోనే స్పష్టత వస్తుందని తెలుస్తుంది. పార్లమెంట్ లో బిల్లు పెట్టటంతో ప్రక్రియ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల లోపే జరుగుతుందా అంటే అది డీ లిమిటేషన్ కమిటీ పని తీరు మీద ఆధారపడి ఉంటుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...