Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

The system is very likely to move west-northwestwards and further intensify slightly during next 24 hours. It is very likely to maintain its peak intensity upto evening of 11th December 2016. Thereafter, it is likely to weaken gradually while moving towards Andhra Pradesh coast. It is very likely to cross south Andhra Pradesh coast between Nellore and Machilipatnam around afternoon/evening of 12th December 2016.

 

IMD

Link to comment
Share on other sites

కావలి వద్ద తీరం దాటనున్న ‘వర్ద’

విశాఖపట్నం: అండమాన్‌ తీరం వద్ద ఏర్పడిన ‘వర్ద’ తుపాను కోస్తాంధ్రలోని కావలి వద్ద తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతమిది మచిలీపట్నానికి 870 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 12వ తేదీ రాత్రికి ఇది కావలి-బిట్రగుంట సమీపంలోనే తీరాన్నిదాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే తీరాన్ని దాటకముందే దీని తీవ్రత క్రమంగా తగ్గే అకాశముందని వాతావరణశాఖ భావిస్తోంది. ప్రస్తుతమిది పశ్చిమ వాయువ్యదిశగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖకు చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతంస ముద్రంలోనే పెనుతుపానుగా మారిన వర్ద ప్రభావంతో ఆపరిసర ప్రాంతాల్లో గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరో వైపు 11వతేదీ రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోస్తాంధ్రలోని మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కూడా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాలని సీఎం ఆదేశించారు.

చంద్రబాబు గల్ఫ్‌ పర్యటన రద్దు

వర్ద తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్ద తుపాను, నోట్ల రద్దు అంశాలను సమర్థంగా ఎదుర్కోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. విపత్తు నిర్వహణ, ఆర్థికశాఖ అధికారులు, బ్యాంకర్లతో శనివారం ఉదయం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...