Jump to content

floating hotel ga INS Viraat ship ?


sonykongara

Recommended Posts

విరాట్‌ కోసం... ఆరాటం

అనువైన ప్రాంతం కోసం నిపుణుల అన్వేషణ

 

image.jpg

విశాఖ తీరంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక మ్యూజియంపై మళ్లీ కదలిక వచ్చింది. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో దీనిని ఎక్కడ ఏర్పాటుచేయాలనే దానిపై అనువైన ప్రదేశం ఎంపికకు వుడా రంగంలోకి దిగింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులు విశాఖకు రావడంతో మ్యూజియం ఏర్పాటుపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది. విశాఖ నుంచి భీమిలి వరకూ దాదాపు పాతిక కిమీ మేర సుందర తీరం ఉంది. ఓ పక్క కొండలు, మరోవైపు సోయగాల సముద్రంతో బీచ్‌రోడ్డు పర్యాటకులను పులకరింపజేస్తోంది.

- న్యూస్‌టుడే, గ్రామీణభీమిలి

ఈనేపథ్యంలో భారత నౌకాదళం నుంచి తన సేవలను విరమించుకుని విశాఖకు రానున్న విరాట్‌ యుద్ధనౌక విశాఖకు తలమానికమై ప్రపంచ ఖ్యాతి తేనుందని ప్రభుత్వం భావిస్తోంది. దీని ఏర్పాటుకు తీరంలో దాదాపు 750 నుంచి 1000 ఎకరాల మేర స్థలం అవసరం నిపుణులు తేల్చారు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని జోడుగుళ్లపాలెం-భీమిలి నియోజకవర్గంలోని సాగర్‌నగర్‌, రుషికొండ, తిమ్మాపురం, మంగమారిపేట, చేపలుప్పాడ, ఐఎన్‌ఎస్‌కళింగ, ఎర్రదిబ్బలు, భీమిలి తీరాలు రేసులో ఉన్నాయి. అయితే జోడుగుళ్లపాలెం నుంచి రుషికొండ వరకూ, అలాగే రుషికొండ ఐటీపార్కు నుంచి తొట్లకొండ వరకూ, చేపలుప్పాడ నుంచి ఎర్రదిబ్బల వరకూ, భీమిలి బీచ్‌లు ఈ యుద్ధనౌక ఏర్పాటుకు అనువుగా ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఇందులో భీమిలి, ఐఎన్‌ఎస్‌ కళింగ, చేపలుప్పాడ, మంగమారిపేట వంటి ప్రాంతాల్లో సముద్రపుకోత తీవ్రంగా ఉంది. అయితే తొట్లకొండ, తిమ్మాపురం, రుషికొండ ఐటీ పార్కు, సాగర్‌నగర్‌, జూపార్కు, జోడుగుళ్లపాలెం ప్రాంతాల్లో కోత ప్రభావం లేదు. ఎందుకంటే ఇక్కడి తీరంలో అలలు తీరానికి బలంగా చొచ్చుకురాకుండా రాళ్లగుట్టలు అడ్డుగా ఉన్నాయి. దీంతో ఈప్రాంతాలు మ్యూజియం ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. తొట్లకొండ-తిమ్మాపురం నడుమ మ్యూజియం ఏర్పాటుచేస్తే ఈప్రాంతంలో రొయ్యల హేచరీలు అడ్డంకిగా మారే అవకాశ ఉంది. మంగమారిపేట-చేపలుప్పాడ మధ్య ఏర్పాటుచేస్తే మంగమారిపేట, చినమంగమారిపేట, పుక్కెళ్లపాలెం పాతూరు వంటి గ్రామాలను తరలించడంతో పాటు మత్స్యకారుల చేపలవేటకు అడ్డంకిగా ఉంటుంది. బోట్లు, వలలు పెట్టుకునేందుకు స్థలం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఐఎన్‌ఎస్‌ కళింగ నుంచి ఎర్రదిబ్బల మీదుగా భీమిలి వరకూ దాదాపు ఆరు కిలోమీటర్ల మేర తీరమంతా ఖాళీగా ఉంది. భీమిలిలో కూడా ఉప్పుటేరు, మూలకుద్దు, పెదనాగమయ్యపాలెం నడుమ స్థలం ఉంది.

నగరానికి దగ్గర్లోనే విరాట్‌ మ్యూజియం ఏర్పాటుచేయాలి

నగరానికి సమీపంగా ఉన్న జోడుగుళ్లపాలెం-సాగర్‌నగర్‌-ఎండాడ బీచ్‌ల మధ్య లేదంటే రుషికొండ-మధురవాడ ఐటీపార్కుకు ఎదురుగా ఉన్న బీచ్‌లో విరాట్‌నౌక మ్యూజియంను ఏర్పాటుచేస్తే బాగుంటుంది. లక్షలాది మంది నగరవాసులకు దగ్గరగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యుద్ధనౌకతో ఈప్రాంతంలో మ్యూజియంను ఏర్పాటు చేయడం విశాఖకు మంచిపేరు వస్తుంది. ప్రపంచ పర్యాటకంలో విశాఖ పేరు సుస్థిరం అవుతుంది.

-చెన్నా దాసు(రుషికొండ)

భీమిలిలో ఏర్పాటుచేయాలి

చారిత్రక నేపథ్యమున్న భీమిలిలో విరాట్‌ మ్యూజియంను ఏర్పాటుచేసి ఈప్రాంతానికి పూర్వవైభవం తేవాలి. ఇటు ఉప్పుటేరు నుంచి అటు ఎర్రదిబ్బల వరకూ సువిశాలమైన తీరం ఉంది. అందువల్ల భీమిలిలో మ్యూజియం ఏర్పాటే సముచితం. విరాట్‌ నౌకా మ్యూజియం ఏర్పాటుతో పర్యటకంగానే కాక వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.

-ఆచార్య సత్యబాల రతన్‌రాజ్‌ (భీమిలిగల్లీరోడ్డు)
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
విరాట్‌ కథ కంచికి..?
 
636238454357989898.jpg
  • 6న డీ కమిషనింగ్‌
  • మ్యూజియంగా మార్చేందుకు భారీ వ్యయం
  • ఆర్థిక సాయం కోరుతున్న ఆంధ్రప్రదేశ్
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): భారత యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ కథ కంచికి చేరుతోంది. సుదీర్ఘకాలం భారత నౌకాదళానికి సేవలందించిన ఈ నౌక మార్చి 6వ తేదీన డీ కమిషనింగ్‌కు వెళుతోంది. ఆ రోజున సూర్యుడు అస్తమిస్తున్న సమయాన నౌకపై పతాకాన్ని అవనతం చేసి డీకమిషనింగ్‌ ప్రకటిస్తారు. విరాట్‌కు ఏ యుద్ధనౌకకు లేని చరిత్ర వుంది. ప్రపంచంలో ఎక్కువ కాలం సేవలందించినది ఇదే. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 1959 నుంచి 1980 వరకు ‘హెచ్ ఎంఎస్  హెర్మస్‌’ పేరుతో పనిచేసింది. వారి నుంచి 650 లక్షల డాలర్లకు కొనుగోలు చేసి, 12 మార్చి 1987న భారత నౌకాదళంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విరామం లేకుండా సేవలు అందించింది. దేశంలో డీ కమిషనింగ్‌ జరిగిన యుద్ధ విమాన వాహక నౌకల్లో మొదటిది విక్రాంత కాగా రెండోది విరాట్‌. ప్రతి యుద్ధనౌకకు ఒక నినాదం ఉంటుంది. విరాట్‌ నినాదం మాత్రం చాలా శక్తిమంతంగా, స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ‘జలమేవ యశ్యే...బలమేవ తశ్యే’’ అనే నినాదం విరాట్‌పై ఉంటుంది. అంటే... సముద్రాన్ని శాసించేవారే శక్తివంతులు అనేది దాని అర్థం. ఆ విధంగానే విరాట్‌ పనిచేసింది.
 
కేంద్రానిదే నిర్ణయం : శ్రీకాంత్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఏపీ టూరిజం
విరాట్‌ను ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని ప్రతిపాదనలు ఇచ్చాం. విశాఖలో ఫ్లోటింగ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దాలనేది ఆలోచన. స్థలం ఎంపికకు నిపుణుల కమిటీ అవసరం. అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్‌ను నియమించాల్సి ఉంది. ఈ వివరాలన్నీ కేంద్రానికి తెలియజేశాం. అటు నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. వారి ప్రతిస్పందనపైనే అంతా ఆధారపడి ఉంది.
 
మ్యూజియం అంత ఈజీకాదు
మొదటి యుద్ధ విమాన వాహక నౌక విక్రాంతను డీ కమిషనింగ్‌ తరువాత మ్యూజియంగా మార్చాలని ప్రయత్నించారు. సఫలం కాలేదు. ఇప్పుడు విరాట్‌ను కూడా మ్యూజియంగా చేయాలని భావిస్తున్నారు. దీనిని విశాఖపట్నంలో ఫ్లోటింగ్‌ (నీటిపై తేలియాడే) మ్యూజియంగా, హోటల్‌గా, కన్వెన్షన సెంటర్‌గా మార్చాలనేది ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆలోచన. అందుకని విరాట్‌ను ఏపీకి ఇవ్వాలని కోరారు. దీని కోసం గోవా కూడా పోటీపడింది. అయితే ఏపీ వైపే కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే విశాఖలో కురుసుర సబ్‌మెరైన మ్యూజియం ఉండడంతో విరాట్‌ను కూడా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే విరాట్‌ను మ్యూజియంగా మార్చడంలో అనేక సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. నీటిలో తేలియాడే విధంగా చేస్తే దానికి కింద తుప్పు పట్టకుండా నిర్ణీత కాలానికి రక్షణ కోటింగ్‌ వేయాలి. ఆ పనిచేయాలంటే...ఆ నౌకను మళ్లీ డ్రై డాక్‌కు చేర్చాలి. అంటే కోచీ వరకు తీసుకువెళ్లాలి. ఇంజిన్లు తీసేసిన నౌకను అలా తీసుకెళ్లాలంటే భారీ టగ్‌లు అవసరం. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇపుడు విరాట్‌ను మ్యూజియంగా మార్చడానికి రూ.వేయి కోట్లు వ్యయం అవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా. ముందు నౌకను మాత్రమే అడిగిన ఏపీ అధికారులు, ఇప్పుడు అంచనా వ్యయంలో సగం (రూ.500 కోట్లు) ఆర్థిక సాయం కూడా కోరుతున్నట్టు సమాచారం. అంత సొమ్ము వెచ్చిస్తే దాని నుంచి ఎటువంటి ఆదాయం వస్తుంది? ఆ సొమ్ము నిర్వహణకు సరిపోతుందా? మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి భారీ యుద్ధ విమాన వాహక నౌకలను మ్యూజియంగా మార్చడం కష్టమని, అందుకే కేంద్రం దీనిపై ఏ విషయం తేల్చకుండా జాప్యం చేస్తోందని విశ్వసనీయ సమాచారం.
Link to comment
Share on other sites

విరాట్‌’ కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ!

 

636240091400853627.jpg
  • నిధుల కోసం చంద్రబాబు యత్నం
  • సగం ఖర్చు ఇవ్వలేమన్న రక్షణ శాఖ
  • పర్యాటక శాఖదీ అదేమాట!
  • పట్టణాభివృద్ధి శాఖపై దృష్టి
  • కేంద్రానికి చంద్రబాబు లేఖలు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): విమాన వాహక నౌక ‘విరాట్‌’ను విశాఖపట్నానికి చేరి, దానిని మ్యూజియంగా మార్చేందుకు అయ్యే వ్యయంలో సగం సగం భరిద్దామంటూ సీఎం చంద్రబాబు రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. అయితే, రక్షణ మంత్రిత్వశాఖ దానిపై ఇప్పటివరకు లిఖితపూర్వకంగా స్పందించలేదు. సగం ఖర్చును పెట్టుకోబోమని మాటపూర్వకంగా తేల్చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యాటక శాఖను కూడా సగం ఖర్చు పెట్టుకోవాలని అడిగింది. సగం అంటే భరించలేమని, ఇప్పుడున్న కేంద్ర పర్యాటక ప్రాజెక్టుల్లో ఏదైనా పథకం ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చునని పర్యాటకశాఖ బదులిచ్చింది. ఇప్పుడున్న కేంద్ర పర్యాటక పథకాలన్నీ చిన్నచిన్న మొత్తాలతో కూడినవే. వందల కోట్లు వచ్చే పథకాలేమీ లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
 
అరైవల్‌ వీసాలపై లేఖ

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో అరైవల్‌ వీసాలు, ఇ-వీసాలు ఇచ్చేలా అనుమతించాలని విదేశాంగ శాఖమంత్రి సుష్మా స్వరాజ్‌కు సీఎం లేఖ రాశారు. దీనివల్ల పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చేవారు ఎక్కువగా హైదరాబాద్‌లో దిగి, అక్కడి నుంచి ఏపీలోని విమానాశ్రయాలకు వస్తున్నారు. హైదరాబాద్‌లో అరైవల్‌ వీసా తీసుకునే సౌకర్యం ఉంది. ఏపీలోని ప్రధాన విమానాశ్రయాలు మూడింటికీ ఆ సౌకర్యం వస్తే పర్యాటకం పెరుగుతుందని, విదేశాల నుంచి వచ్చేవారు నేరుగా రాష్ట్రానికి వస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ-తిరుపతికి నేరుగా విమానం నడిపాలనీ కేంద్రాన్ని కోరాలని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

ఐఎన్‌ఎస్ విరాట్’ను ఏం చేయనున్నారు?
 

636244370978446029.jpg
ముంబై : దశాబ్దాలు సేవలందించిన ఐఎన్‌ఎస్ విరాట్ శకం ముగిసింది. సోమవారం ఆ యుద్ధనౌకకు నావికా దళం వీడ్కోలు పలికింది. ఐఎన్‌ఎస్ విరాట్ ఉపసంహరణ కార్యక్రమాన్ని అన్ని లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఐఎన్ఎస్ విరాట్‌ను నిర్మించారు. 27 ఏళ్ల పాటు బ్రిటీష్ నేవీలో అధీనంలో ఉంది. 1986లో భారత నావికా దళంలోకి ప్రవేశించింది. సుమారు 11 లక్షల కి.మీ. దూరం ప్రయాణించింది. ఇప్పుడు ఐఎన్ఎస్ విరాట్‌ను ఏం చేస్తారు? ‘నా మదిలో ఉన్న ప్రతిపాదనను చెబుతాను. ఏం జరుగుతుందో చూద్దామ’ని నేవీ చీఫ్ సునీల్ లాంబా అన్నారు. కనీసం 4 నెలల వరకు ఐఎన్ఎస్ విరాట్‌ను అలా ఉంచుతామని, ఎవరూ కొనడానికి ముందుకు రాకపోతే ధ్వంసం చేయడమే మార్గమని చెప్పారు. సముద్ర గర్భంలోకి తరలించి, డైవర్స్‌కు పర్యాటక కేంద్రంగా మార్చాలన్నది ఓ ప్రతిపాదన. ఐఎన్ఎస్ విరాట్‌ను మ్యూజియంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినా, ఆ ప్రాజెక్టు రూ.1000 కోట్లు వ్యయమయ్యే కారణంగా అవకాశం లేదు.
Link to comment
Share on other sites

గుడ్‌బై.. ఐఎన్‌ఎస్‌ విరాట్‌!
 
636244482808856773.jpg
  • ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం.. సేవలందించిన యుద్ధ నౌక 
  • 57 ఏళ్లలో 10.94 లక్షల కి.మీ ప్రయాణం
  • ముంబైలో సేవలకు వీడుకోలు
 
ముంబై, మార్చి 6: ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం సేవలందించిన ఏకైక యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌. బ్రిటిష్‌ రాయల్‌ నేవీకి 27 ఏళ్లు, భారత నేవీకి 30 ఏళ్లు సేవలందించిన ఈ యుద్ధ నౌక సోమవారం సేవల నుంచి విరమించింది. ముంబై నావల్‌ డాక్‌ యార్డ్‌లో భారత్ నేవీ దీనికి ఘనంగా వీడుకోలు పలికింది. ఈ వీడుకోలు వేడుకకు భారత్ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా సహా, విరాట్‌పై విధులు నిర్వహించిన పలువురు మాజీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పలు విశేషాలు..
 
  • ప్రపంచంలోనే సుదీర్ఘకాలం సేవలందించిన యుద్ధ నౌకగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌ గిన్నిస్‌ రికార్డులకెక్కింది.
  • ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తొలుత హెచ్‌ఎంఎస్‌ హెర్మెస్‌ పేరుతో 1959 నవంబరు 18న సాగర ప్రవేశం చేసి బ్రిటిష్‌ రాయల్‌ నేవీకి 27 ఏళ్ల పాటు సేవలందించింది. అనంతరం దీనిని 6.5 కోట్ల డాలర్లు వెచ్చించి భారత నేవీ కొనుగోలు చేసింది.
  • 1987 మే 12 నుంచి భారత నేవీకి సేవలందిస్తోంది. దీనికి ‘జలమేవ్‌ యస్య బలమేవ్‌ తస్య’ (సముద్రాన్ని నియంత్రించే వాడు అన్నింటా శక్తిమంతుడు) అనే మోటోను భారత నేవీ ఇచ్చింది.
  • ఐఎన్‌ఎస్‌ విరాట్‌ భారత జలాల్లో ప్రవేశించాక ఇప్పటి వరకు 22 మంది కెప్టెన్లు దీనిపై విధులు నిర్వర్తించారు.
  • దీనిపై విధులు మొదలుపెట్టిన అధికారుల్లో ఐదురుగు భారత నేవీ చీఫ్‌ స్థానాన్ని అధిష్ఠించారు.
 
భూమి చుట్టూ 27 సార్లు!
ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తన సర్వీసు కాలంలో 2,250 రోజుల పాటు సముద్రంలో గడిపింది. మొత్తంగా 10.94 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది భూమిని 27 సార్లు చుట్టి రావడంతో సమానం!
 
చివరి ప్రయాణం
గత ఏడాది జూలై 23న దీని చివరి ప్రయాణం మొదలైంది. డీకమిషనింగ్‌ (సేవల విరమణ)కు అవసమైన ఏర్పాట్ల కోసం ముంబై నుంచి కొచ్చికి వెళ్లింది. అనంతరం అక్కడి నుంచి తిరిగి ముంబైకి చేరుకుంది. దీని వీడుకోలు వేడుకల్లో భారత, బ్రిటిష్‌ నేవీ అధికారులు పాల్గొన్నారు.
 
వచ్చే ఏడాది విక్రాంత్ జల ప్రవేశం
రానున్న ఐదేళ్లలో రెండు యుద్ధ విమాన వాహక నౌకలను రూపొందించాలని భారత నేవీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌ స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చే ఏడాదిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత జల ప్రవేశం చేయనుంది. దాదాపు 37,500 టన్నుల బరువున్న విక్రాంతకు 2018 మొదట్లో సముద్రంలో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తారు.
 
మెరైన్‌ మ్యూజియంగా మారుస్తాం : సునీల్‌ లంబా 2sunil-lanba.jpg
ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను మెరైన్‌ మ్యూజియంగా మార్చాలని భావిస్తున్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా తెలిపారు. ఈ నౌకను ‘ఫైవ్‌ స్టార్ట్‌’ హంగులతో పర్యాటక హోటల్‌, మ్యూజియంగా మారుస్తామంటూ గతంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే, దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కాగా, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లా దీని భాగాల కొనుగోలుకు బజాజ్‌ కంపెనీ నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

‘రక్షణ’ పర్యాటకానికి బాటలు!
 
636245366214977350.jpg
  •  టీయూ-142 యుద్ధ విమానాన్ని రాష్ట్రానికి తీసుకురావాలని యత్నం 
  •  రక్షణ శాఖకు 30 ఏళ్ల పాటు సేవలు 
  •  ఈ నెలాఖరులోపు డీకమిషనింగ్‌ 
  •  విరాట్‌తో పాటు టీయూ-142నూ ఇవ్వండి 
  •  రక్షణ శాఖకు సీఎం చంద్రబాబు లేఖ 
  •  విశాఖలో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు 
అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక శాఖను అభివృద్ధి బాట పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఏళ్లుగా రక్షణ శాఖకు సేవలందించిన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను రాష్ట్రానికి తెప్పించి ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే సేవల నుంచి విరమించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను మెరైన్‌ మ్యూజియంగా మార్చి విశాఖ తీరంలో నిలపాలని కేంద్రంతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ఇదే బాటలో ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక యుద్ధ విమానాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత బలగాలకు దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన యాంటీ సబ్‌ మెరైన్‌ విమానం ‘టీయూ 142’ డీకమిషనింగ్‌ను ఈ నెలాఖరులోపు నిర్వహించేందుకు భారత నేవీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనిని మన రాష్ర్టానికి తీసుకువచ్చి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఐఎన్‌ఎస్‌ విరాట్‌తో పాట టీయూ 142ను తమకు అందించాల్సిందిగా కోరుతూ సీఎం చంద్రబాబు.. రక్షణ శాఖకు లేఖ రాశారు. దీనిపై రక్షణ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తమిళనాడు అరక్కోణంలో ఉన్న దీనిని ఏపీ తరఫున ఒక కమిటీ సోమవారం పరిశీలించింది. దానిలోని ప్రత్యేకతలను గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రక్షణశాఖ ఆమోదం తెలిపితే కేవలం నెలరోజుల్లో ఈ ప్రతిష్టాత్మక యుద్ధ విమనం రాష్ట్రంలో ల్యాండ్‌ అవుతుంది. అన్ని అనుకూలిస్తే విరాట్‌తో పాటు దీనిని కూడా విశాఖ తీరంలోనే ప్రత్యేక మ్యూజియంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రక్షణశాఖ నుంచి ఆమోదం లభిస్తే ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేయాలా.. కైలాసగిరిలో ఏర్పాటు చేయాలన్న దానిపై పర్యాటక శాఖ అధికారులు ఆలోచన చేస్తున్నారు. నేవీ అధికారులు మాత్రం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేస్తే బాగుటుందని ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.
టీయూ 142 విమానం ప్రత్యేకతలు
టీయూ 142ను 1972లో రష్యా తయారు చేసింది. 1988లో రష్యా నుంచి భారత దీనిని కొనుగోలు చేసింది. దేశంలో ఏ విమానం సాధించలేని ఘనత టీయూ 142 సొంతం. 30 వేల గంటల పాటు ఆకాశంలో ప్రయాణించిన ఈ విమానం ఒక్కసారి గాలిలోకి వెళ్తే సుమారు 10 గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టగలదు. ఆకాశం నుంచే విదేశాలకు చెందిన సబ్‌మెరైన్‌లను గుర్తించి దాడి చేయగలదు. గాలిలో ఉండగనే ఇంధనం లోడ్‌ చేసేకునే అవకాశం కూడా దీనిలో ఉంది. కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు అత్యంత వెడల్పు, పొడవు, ఎత్తయిన విమానం కూడా ఇదే. ఇది 53 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 12.6 మీటర్ల ఎత్తు ఉంటుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
విరాట్‌ మ్యూజియానికి ఏపీ ఓకే
 
అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఐఎన్‌ఎస్‌ విరాట్‌లో పర్యాటక, ఆతిథ్య మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్‌ బమ్రే వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నకు బమ్రే సమాధానం ఇచ్చారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...