Jump to content

Missile test facility at Nagayalanka


sonykongara

Recommended Posts

SECON Private Limited, Bengaluru, has said it will prepare Environment Impact Assessment (EIA) report for the Missile Test Launch Facility project proposed by the Defence Research and Development Organisation (DRDO) at Nagayalanka in Krishna district.

The SECON, in its official website, has claimed that the DRDO is one of its major clients in India following the National Highways Authority of India and the oil industry. A few key studies such as oceanographic and seismic studies apart from onshore and offshore investigations will be taken up to prepare the EIA report for the project. In January, the National Board for Wildlife’s Standing Committee chaired by Union Minister for Environment, Forest and Climate Change Prakash Javadekar has approved the missile test launch facility project to be set up at Nagayalanka.

A total of 154.42 hectares has been proposed for the project, covering test facility in above six hectares and technical facility in 130 hectares. The test site is falling in the limits of the Krishna Wildlife Sanctuary. “The feasibility of using barges along the Krishna creek for transportation of equipment and articles is being explored,” said Chief Construction Engineer (R&D), South, DRDO, B. Suresh Kumar during the site inspection by the AP Forest authorities.

DRDO Scientific Chief Engineer K. Radha Krishna has informedo the AP Forest authorities that the mangroves would be retained with cross drainage system.

Nagayalanka is the most appropriate for Missile Test Launch Facility in view of technical, safety and security considerations.

K. Radha Krishna

DRDO Scientific Chief Eingineer

Link to comment
Share on other sites

అవనిగడ్డ, నవంబరు 14 : కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు.ఈ ప్రయోగ కేంద్రం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

Link to comment
Share on other sites

  • 1 year later...
  • 5 months later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...

రాజధానికి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

నాగాయలంకలో డీఆర్‌డీవో క్షిపణి పరీక్ష కేంద్రం

బాలాసోర్‌ను మించిన వసతులు

మొదటి దశ అటవీ అనుమతులు మంజూరు

స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కార్యాలయం

రూ.1,200 కోట్లతో పట్టాలెక్కబోతున్న ప్రాజెక్టు

ఈనాడు - అమరావతి

30ap-main10a.jpg

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో అత్యాధునిక క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకోసం కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద తీరంలో ఇప్పటికే ప్రభుత్వం 381 ఎకరాలను కేటాయించింది. ఈ స్థలంలో అటవీ ప్రాంతం ఉండడంతో అనుమతుల విషయంలో జాప్యమైంది. ఆరేళ్ల నుంచి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి ఎట్టకేలకు మొదటి దశ అనుమతులు ఇటీవల మంజూరయ్యాయి. భూమి బదిలీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రెవెన్యూ భూములకు సంబంధించిన పరిహారం ఖరారైంది. వచ్చే నెలలో తుది అనుమతులు రానున్నాయి. ఆనక రూ.1,200 కోట్లతో తొలి దశ ప్రాజెక్టు నిర్మాణం మొదలుకానుంది. కీలకమైన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. భవిష్యత్తులో ఇది దేశ ప్రధాన క్షిపణి పరీక్ష వేదిక కానుంది.

అడ్డంకులు అధిగమించి..

ఒడిశా బాలాసోర్‌లో క్షిపణి పరీక్ష కేంద్రం ఉంది. దీనికంటే మెరుగైన సదుపాయాలతో మరోచోట కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కేంద్రం ఏర్పాటుకు తూర్పు తీరంలోని వివిధ ప్రాంతాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. తొలుత తమిళనాడులోని ట్యూటికోరిన్‌ తీరాన్ని పరిశీలించారు. ఇది కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రానికి సమీపంలో ఉండడంతో ప్రతిపాదనను విరమించుకున్నారు. చివర కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని అనువైనదిగా గుర్తించారు. ఈ ప్రాంతం కృష్ణా డెల్టా సమీపంలో ఉంది. పైగా బంగాళాఖాతంలోకి చొచ్చుకెళ్లినట్లు ఉండడం కలసివచ్చింది. పరీక్ష కేంద్రం చుట్టుపక్కల ఎనిమిది కి.మీ పరిధిలో ఎక్కడా జనావాసాలు లేవు. పరిసరాల్లో దట్టమైన మడ అడవులు ఉన్నాయి. దీని కోసం గుర్తించిన 381 ఎకరాలలో 321 ఎకరాలు రెవెన్యూ భూమి. ఇది రికార్డుల్లో అటవీ భూమిగా నమోదైంది. మిగిలిన 60 ఎకరాలు కృష్ణా అభయారణ్యంలో ఉంది. దీంతో ఈ ప్రాంతమంతా 1980 అటవీ సంరక్షణ చట్టం పరిధిలోకి వచ్చింది. దీనిపై అటవీ శాఖ కేంద్రానికి పంపిన నివేదిక ప్రధాని అధ్యక్షతన గల జాతీయ వన్యప్రాణి బోర్డు వద్దకు వెళ్లింది. అక్కడ అనుమతి ఇచ్చాక తుది నిర్ణయానికి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎట్టకేలకు గత నెలలో తొలి దశ అనుమతి లభించింది. ఇటీవల రక్షణ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. రెవెన్యూ ఆధీనంలోని 321 ఎకరాలను పలువురు ఆక్రమించి ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ భూములకు ఎకరాకు రూ.1.80 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. అభయారణ్యంలోని భూములకు కూడా కలిపి మొత్తం రూ.35 కోట్ల వరకు చెల్లించడానికి డీఆర్‌డీవో అధికారులు అంగీకరించారు. ఇంతే విస్తీర్ణాన్ని కృష్ణా అభయారణ్యంలో ప్రభుత్వం కలపాల్సి ఉంది. ఇందుకోసం సొర్లగొంది వద్ద స్థలాన్ని గుర్తించారు.

బాలాసోర్‌లోని క్షిపణి పరీక్ష కేంద్రంలో అధునాతనమైన అగ్ని, పృథ్వీ, ఆకాశ్‌, బ్రహ్మాస్‌, కె-15 వంటి వాటి సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఇక్కడికి సమీపంలో ఉన్న దామ్రాలో నౌకాశ్రయం రావడం వల్ల ప్రయోగాలకు ఇబ్బంది ఎదురవుతోంది. పైగా పెరుగుతున్న రక్షణ అవసరాల దృష్ట్యా ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది.

అభివృద్ధికి అవకాశం

* గుల్లలమోద వద్ద అత్యాధునిక లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించనున్నారు. ఆధునిక రాడార్‌ వ్యవస్థ, ఎలక్ట్రోఆప్టిక్‌ కెమెరాలు, టెలిమెట్రీ వ్యవస్థ తదితర సదుపాయాలను కల్పిస్తారు. ఇవన్నీ బాలాసోర్‌లో లేవు. లాంచింగ్‌ సమయంలోనే రియల్‌టైం డేటా విశ్లేషణ వంటివి సాధ్యమవుతాయి. ప్రధాన కేంద్రం నుంచి విడిభాగాలను తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానిస్తారు. బాలాసోర్‌లో కార్యకలాపాలు తగ్గించి గుల్లలమోద నుంచే ఎక్కువ ప్రయోగాలు చేయాలని తలపోస్తున్నారు.

* క్షిపణి పరీక్ష కేంద్రం ఇక్కడికి రావడం వల్ల మౌలిక వసతులు సమకూరనున్నాయి. స్థానికులు దాదాపు 600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివసించనున్నారు. ఇది ఈ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుంది.

* 381 ఎకరాలలో అవసరమైనంత మేరకే స్థలాన్ని వినియోగించుకోనున్నారు. మిగిలిన ప్రాంతంలో పచ్చదనానికి పెద్ద పీట వేస్తారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద పల్లెల్లో ప్రగతి పనులను డీఆర్‌డీవో చేపట్టనుంది.

Link to comment
Share on other sites

  • 4 months later...
  • 5 months later...
ఏపీలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు డీఆర్‌డీవో గ్రీన్ సిగ్నల్
28-06-2018 19:20:20
 
636658104212461334.jpg
న్యూఢిల్లీ: ఏపీలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు డీఆర్‌డీవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగాయలంక దగ్గర గుల్లలమోద ప్రాంతంలో 154 హెక్టార్లలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 600 కోట్ల రూపాయల ఖర్చుతో క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణం చేపడ్తారు. రెండో దశలో వెయ్యికోట్లు ఖర్చు చేస్తారు.
Link to comment
Share on other sites

On 1/27/2018 at 8:39 PM, swarnandhra said:

peddaga emi vundadu. infact long term lo big losse. defence installations mandate lot of regulations/restrictions to nearby development. vizag is prime example.

In one way it is absolutely fine as the agriculture land will be there for agriculture instead of having industries.... 

Link to comment
Share on other sites

On 1/28/2018 at 7:09 AM, swarnandhra said:

peddaga emi vundadu. infact long term lo big losse. defence installations mandate lot of regulations/restrictions to nearby development. vizag is prime example.

vizag airport laga untundi paristhiti

Link to comment
Share on other sites

గుంటూరుకు... ఐటీ సొబగులు
29-06-2018 09:38:00
 
636658618813416572.jpg
  • ప్రప్రథమంగా ఐటీ కంపెనీ
  • నేడు సీఎం చంద్రబాబుచే ప్రారంభం
గుంటూరు (ఆంధ్రజ్యోతి): వ్యాపార, వాణిజ్య నగరంగా రాష్ట్రంతో పాటు, దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న గుంటూరు నగరం ఐటీ కళ సంతరించుకోనుంది. జిల్లా కేంద్రంలో ప్రప్రథమంగా ఐటీ కంపెనీ నేడు ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు నగరలో శుక్రవారం నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. డెస్క్‌టాప్‌లకు సంబంధించి ఏఎండీ మైక్రో ప్రోసెసర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇక్కడ నిర్వహిస్తున్న సంస్థ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులోనే వేద ఐఐటీ సంస్థ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.
 
 
ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞపి మేరకే నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం చేశారు. దానిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మంత్రి లోకేష్‌ హాజరుకానున్నారని జిల్లా యంత్రాంగం తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీలను తీసుకోచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధికల్పించారు. గడిచిన వారంలోనే రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో జిల్లా ఐటీ హబ్‌గా మారనుంది.
 
24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలు సాగించనున్నాయి. ఇందులో వందల సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉపాధి లభించనుంది. ఈ టవర్‌ ఉదయం 1.30గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 30 సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు.
 
 
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలదేరి 12.15గంటలకు మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
 
 
అక్కడి నుంచి 12.20కు రోడ్డు మార్గం ద్వారా విద్యానగర్‌ 1వలైన్‌కు చేరుకుని 1.30గంటలకు ఐటీ సంస్థలను ప్రారంభిస్తారు.
 
తిరిగి 2.15నిమిషాలకు హెలికాప్టర్‌లో కాకినాడకు బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
 
పటిష్ఠ బందోబస్తు
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌ ఎస్పీ విజయరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన అధికారులు, సిబ్బందికి బందోబస్తుపై తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటించే మార్గంలో ఆయన కార్యక్రమానికి వచ్చి వెళ్లే కొద్ది సమయం ముందు వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. సీఎం పర్యటన ముగిసే వరకు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.
Link to comment
Share on other sites

ఏపీ సిగలో ‘క్షిపణి’
29-06-2018 02:52:35
 
636658375559525618.jpg
  • నాగాయలంకలో ప్రయోగ కేంద్రం
  • కేంద్ర న్యాయ శాఖ గ్రీన్‌సిగ్నల్‌.. త్వరలో పర్యావరణ అనుమతి కూడా
  • బాలాసోర్‌ తర్వాత ఇక్కడే.. ఏడేళ్ల క్రితమే గుల్లలమోదలో భూసేకరణ
  • ‘న్యాయ’ చిక్కులతో పెండింగ్‌.. 1,600 కోట్లతో నిర్మాణానికి సిద్ధం
  • దసరా నాటికి తొలి దశ నిర్మాణాలకు శ్రీకారం!
విజయవాడ/న్యూఢిల్లీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించనుంది. కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలోని గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కొలిక్కి వస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన చట్ట సవరణలు చేయడానికి కేంద్ర న్యాయశాఖ అంగీకరించింది. అంతా అనుకున్నది అనుకొన్నట్టు జరిగితే, వచ్చే దసరానాటికి 154 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం పనులు ప్రారంభం అవుతాయి. దీనికోసం రూ.1600 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశ పనులను రూ. 600 కోట్లతో చేపడతారు.
 
దేశంలో ప్రస్తుతం ఒడిసాలోని బాలాసోర్‌ (వీలర్‌ ద్వీపం)లో సమగ్ర క్షిపణి పరీక్ష కేంద్రంఉంది. అన్ని క్షిపణులను అక్కడి నుంచే పరీక్షిస్తున్నారు. మరో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మేరకు ఏడేళ్ల కిందటే డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌) నిపుణులు అధ్యయనం చేశారు. ఇందుకు నాగాయలంక మండలంలోని గుల్లలమోద ప్రాంతం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతం నాగాయలంక నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరానికి దగ్గరలో ఉంది. దానికోసం 381 ఎకరాలు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ భూమిలో 321 ఎకరాలు రెవెన్యూది కాగా, 60 ఎకరాలు అటవీ భూమి ఉంది.
 
రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తుండటంతో, రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీవో ప్రతిపాదనలను వెనువెంటనే ఆమోదించింది. తన పరిధిలోని 321 ఎకరాలను ముందుగా కేటాయించింది. అటవీ శాఖకు చెందిన 60 ఎకరాలను కూడా తీసుకొని, బదులుగా వేరే ప్రాంతంలో అంతేభూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకు ఇచ్చింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూమిలో 121 మంది రైతులు 280 ఎకరాలను ఎప్పటి నుంచో సాగు చేస్తున్నారు. వీరికి ఎకరాకు 1.80 లక్షల నష్టపరిహారం చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. భూసేకరణలో భాగంగా రైతులకు చెక్కులు అందిస్తున్న సమయంలో చిక్కులు తలెత్తాయి. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జడ్‌)కు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సీఆర్‌జడ్‌ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్ల పరిధిలో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయరాదు. అయితే, ఇది అణు ప్రాజెక్టు కాదు కాబట్టి నిబంధనలను సవరించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో, నిబంధనల సవరణకు సంబంధించిన ప్రక్రియ మొదలయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి సవరణ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
 
తాజాగా ఈ ప్రతిపాదనలను కేంద్ర న్యాయ శాఖ ఆమోదించింది. ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 18 నెలల పాటు ఈ అంశంపై సుప్రీం కోర్టు గ్రీన్‌ బెంచ్‌ విచారణ జరిపి, గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా తమ ఆమోదం తెలపనున్నాయి. గుల్లలమోద క్షిపణి కేంద్రాన్ని రాకెట్‌ ప్రయోగాల కూడా అనువుగా సిద్ధం చేస్తారని సమాచారం. అలాగే, డిఫెన్స్‌కు సంబంధించిన పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మలుస్తారని తెలుస్తోంది. నాగాయలంక ప్రాంతంలోని భూగర్భంలో గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని గుర్తించి, ఇటీవలే ఓఎన్జీసీ అక్కడ డ్రిల్లింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.
Link to comment
Share on other sites

  • 1 month later...
మరో అనుమతికి.. 
నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటులో పురోగతి 
పూర్తి కావొచ్చిన  వన్యప్రాణి ప్రణాళిక 
త్వరలో రెండో దశ అనుమతికి సమర్పణ 
ఆమోదం అనంతరం పనులు ప్రారంభం 
ఈనాడు - అమరావతి 
kri-top2a.jpg

కృష్ణా జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రతిష్ఠాత్మక క్షిపణి పరీక్షా కేంద్రం ఇక ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నాగాయలంక సమీపంలోని గుల్లలమోద ప్రాంతంలో ఇది రాబోతోంది. రూ.1,200 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొదటి దశ అనుమతులు లభించాయి. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లోనూ ప్రచురించింది. ప్రభుత్వానికి రూ. 35 కోట్ల మేరకు పరిహారాన్ని డీఆర్‌డీవో చెల్లించింది. పరీక్షా కేంద్రానికి ఇచ్చిన 381.61 ఎకరాల భూములలో అధిక శాతం అటవీప్రాంతం. గుల్లలమోదలోని సర్వే నెం. 634, 674లోని 154.42 హెక్టార్ల మేరకు అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించారు. రెండో దశ అనుమతులు వస్తే ఇక నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ దశ అనుమతిలో ఎంతో కీలకమైన వన్యప్రాణి ప్రణాళిక తయారీ యుద్ధప్రాతిపదికన తయారవుతోంది. ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది. త్వరలో ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు.

జీవావరణం దెబ్బతినకుండా.. 
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కృష్ణా అభయారణ్యం విస్తరించింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972లోని సెక్షన్‌ 26-ఏ కిందకు దీన్ని చేర్చారు. దాదాపు 86 జాతులకు చెందిన 2.46 లక్షల పక్షులు ఉన్నాయి. వన్యప్రాణి చట్టంలోని  షెడ్యూల్‌ ఒకటిలో బావురు పిల్లి, ఆలివ్‌ రిడ్లీ తాబేలును చేర్చారు. అంతరించిపోతున్న జీవులను ఇందులో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో మడ అడవుల్లోని జీవావరణô, అంతరించిపోతున్న జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేక షరతులు విధించింది. సంబంధిత డివిజనల్‌ అటవీ శాఖ అధికారి కూడా ప్రతి ఏటా తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. బదలాయించనున్న అటవీ భూమికి రెండు రెట్లు అధిక ప్రాంతాన్ని అటవీ శాఖకు ఇవ్వాలి. రెండో దశ అనుమతి వచ్చినప్పటి నుంచి మూడేళ్లలో ఈ భూభాగాన్ని పచ్చదనంతో నింపేయాలి. అభయారణ్య పరిధిలో కేవలం పగటి పూట మాత్రమే తమ కార్యకలాపాలను సాగించాలి. రాత్రి పూట పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది. ఆలివ్‌ రిడ్లీ తాబేలు గుడ్లు పెట్టే జనవరి నుంచి మే నెలల మధ్య సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఈ ప్రాంతంలో అధిక శక్తి గల దీపాలను బిగిస్తే జంతువుల సంచారానికి ఇబ్బంది కలుగుతుంది కనక పరిమితంగా వినియోగించాల్సి ఉంది. పరీక్షా కేంద్రం వద్దకు సామగ్రిని చేరవేసేందుకు రోడ్డుకు బదులు కృష్ణా జలాల్లో పడవుల ద్వారా రవాణా చేసే అవకాశాలను పరిశీలించాలి. ఈ అనుసంధా మార్గం కొద్ది ఎత్తులో నిర్మిస్తే కడలి కెరటాల ప్రవాహానికి అడ్డురాకుండా ఉంటుంది. నిర్మాణానికి పోను మిగిలిన ప్రాంతంలో మడ అడవులను విస్తారంగా పెంచాలి.

అభివృద్ధికి అవకాశం 
ఒడిశాలోని బాలాసోర్‌లోని క్షిపణి పరీక్ష కేంద్రంలో దూర ప్రాంత క్షిపణుల సామర్థ్యాలను పరీక్షిస్తారు. పెరుగుతున్న రక్షణ అవసరాల దృష్ట్యా కొత్త కేంద్రం ఏర్పాటుకు తూర్పు తీరంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. చివరకు.. నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని అనువైనదిగా గుర్తించారు. సాంకేతిక, భద్రత, రక్షణపరంగా ఇది ఎంతో అనుకూలంగా ఉండడంతో ఎంపిక చేశారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 8 కి.మీ పరధిలో ఎక్కడా జనావాసాలు లేవు. దీని క్షిపణులు ప్రయోగించడానికి అనుకూలంగా ఉండడమే కారణం. క్షిపణి పరీక్ష కేంద్రం ఇక్కడికి రావడం వల్ల స్థానికంగా మౌలిక వసతులు సమకూరనున్నాయి. జిల్లాలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక.. దూరంగా విసిరేసినట్లు ఉండే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భారీ కంటైనర్లు వచ్చేందుకు వీలుగా రహదారులను విస్తరించనున్నారు. కంద్రం నిర్మాణం మొదలైతే స్థానికులు దాదాపు 600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివాసం ఉండనున్నారు. దీని వల్ల ఈ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుంది. 381 ఎకరాలలో అవసరమైనంత మేరకే స్థలాన్ని వినియోగించుకోనున్నారు. మిగిలిన ప్రాంతలో పచ్చదనానికి పెద్ద పీట వేయనున్నారు. దీని వల్ల తీర ప్రాంతం హరితమయం కానుంది. సమీపంలోని పల్లెల్లో మౌలిక వసతులు పెరుగుతాయి.

తయారవుతున్న వన్యప్రాణి ప్రణాళిక 
ఇప్పటికే అప్పగించిన 381 ఎకరాలకు సంబంధించి భూమిలో అటవీ ప్రాంతం ఉన్న విస్తీర్ణానికి రెండు రెట్లు భూమిలో మొక్కలు పెంచాలి. దీనికి సంబంధించి సొర్లగొండి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భూమిని కేటాయించారు. రెవెన్యూ ఫారెస్ట్‌ భూమికి అంతే మొత్తం విస్తీర్ణాన్ని అటవీ ప్రాంతంలో విలీనం చేయాలి. ఈ ప్రక్రియ కూడా ముగిసింది. గణపేశ్వరంలోని సర్వే నెం. 647లో కలిపారు. 45 హెక్టార్లలో ఉన్న మడ అడవుల జోలికి వెళ్లరు. కృష్ణా అభయారణ్యంలో ప్రాంతం కావడంతో ఇక్కడ జంతుజాలం పెద్ద సంఖ్యలో మనుగడ సాగిస్తున్నాయి. వీటికి సంబంధించి సమగ్ర ప్రణాళికను డీఆర్‌డీవో సమర్పించిన తర్వాతే తుది అనుమతులు వస్తాయి. మొత్తం ప్రాజెక్టులో ఈ నివేదికే కీలకం. దీంతో ప్రస్తుతం దీని తయారీపై దృష్టి సారించారు. ప్రాజెక్టు రానున్న ప్రాంతం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం వరకు సంచరించే వన్యప్రాణులు, జీవజాతులు, తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీటి వల్ల నష్టం సంభవించే పక్షంలో వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పన వంటి అంశాలపై కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. జంతువులకు సంబంధించి పరిశోధనకు డీఆర్‌డీవో నిధులు కేటాయించాలి. ఈ ప్రాజెక్టు నడిచినంత కాలం జీవాలు, వాటి ఉనికి, ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు అటవీ శాఖకు అయ్యే వ్యయాన్ని భరించాలి. ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర ప్రణాళిక తయారవుతోంది. ఇది పూర్తి అయిన తర్వాత.. డివిజనల్‌ అటవీ అధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి చీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌కు వెళ్తుంది. అక్కడ ఆమోదముద్ర వేసుకున్న అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చేరుతుంది. అక్కడ రెండో దశకు ఆమోదం ఇవ్వాలి. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం పనులు మొదలవుతాయి.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...