Jump to content

Amaravathi Invitation - Jaffa, KCR, PK


Bezawada_Lion

Recommended Posts

Credits:- Lifted from FB (Sivaram Kurapati)

 

పొద్దు పొద్దున్నే రామోజీరావు ఫోన్ చేసి శివరాం పెద్ద చిక్కొచ్చి పడిందిరా ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు అని ఫీలవుతుంటే.. ఏమయింది ఏంటి సార్ అంత ఇదవుతున్నారు అంటే..రాత్రి Guntur.General.Hospitalనుంచి ఇంటికెళ్తూ ఎల్తూ దారిలో మా ఇంటికి(రామోజీ ఫిలిం సిటీ)వచ్చి అమరావతి నిర్మాణానికి వెళ్ళాలా వద్దో అర్ధం కావట్లేదు కొంచం సలహా ఇవ్వండి సార్ అని జగన్ తలపట్టుకుని కూర్చున్నాడు..ఇంకో పక్క ఫాం హౌస్ నుంచి కేస్యార్ కాల్ చేసి అదే ధర్మసందేహం అడిగాడు .. సలహా ఇస్తే చంద్రబాబు , ఇవ్వకుంటే జగన్/కేస్యార్ ఫీలవుతారేమో అని సంకటంలో పడిపోయా అని చెప్తే.. ఇందులో ఆలోచించటానికి ఏముంది సార్... అల్మారాలో "దాన వీర సూర కర్ణ" సినిమా కాసేట్ వుంది కదా అనగానే, ఆయనకీ ఎక్కడో బల్బ్ వెలిగి ఆహా సూపర్ చెప్పావురా నేను చెలరేగిపోతా అని ఫోన్ పెట్టేసి... నాయనా జగన్మోహనా నువ్వు ఇంటికెళ్ళి,తంబీ కేస్యార్ నువ్వు ఫోన్ పెట్టేసి ఈటీవిచూడండి ... మీ కోసమే క్రోడీకరించిన సలహా బుల్లితెర మీద వస్తుంది అని సెలవిచ్చాడు అంట....

ఫాం హౌస్ & లోటస్ పాండ్లలో పెద్ద పెద్ద స్క్రీన్లు కట్టి ఈటీవి పెట్టగానే, తెర మీద శకుని మామ ధుర్యొధనుడికి మధ్య రాజసూయ యాగం ఆహ్వాన పత్రిక సీన్ రసవత్తరంగా సాగుతుంది...సీనంతా అయ్యాక ఇద్దరూ రామోజీకి ఫోన్ చేసి, థ్యాంక్స్ గురూ సలహా అదిరిపోయింది.. ఓపెన్ సీక్రెట్ రాష్ట్రం అందరి ముందు నా ఒక్కడికే అర్ధం అయ్యే భాషలో బలే చెప్పారే ఎవరికి వాళ్ళు మహా ఖుషీ అయిపోయి .. మీరు నిజంగా రాజగురునే ,అని అవతల పెద్దాయన చెప్పేది వినకుండానే ఆత్రంగా ఫోన్ పెట్టేసి మీడియాని పిలిచి వర్తమానం అందించి రిలాక్స్ అయిపోయారు అంట....

అవతల ఫిలింసిటీలో బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగులో వున్న రామోజీ గారు స్క్రీన్ మీద, "నన్ను పిలవొద్దు... నేను రాను" అని జగన్ డైలాగు.. "దాయాదుల ఇంట ఇంతటి మహా యజ్ఞానికి మేము రాకపోవటమా..చంద్రన్న చెక్కుతున్న అమరావతి శిల్ప సౌందర్యాన్ని మేముయూ చూసి తరించవలె " అని K.T.R డైలాగు చూసి అయోమయంలో పడిపోయారు.. ఇదంతా విన్న లోకేష్ నాకు ఫోన్ చేసి, "భలే సలహా ఇచ్చావు బ్రదర్ .. ఒక దెబ్బకి రెండు పిట్టలు పడ్డాయి" అని సంబరంలో మునిగిపోయాడు..

ఇంతలో మిత్రుడు "పవన్ కళ్యాన్" కాల్ చేసి, మిత్రమా అన్నయ్యకే అర్ధం కాని "దాన వీర శూర కర్ణ" CodeWord, ఆ మట్టి బుర్రకి ఏం అర్ధం అవుతుంది అని చెప్పావ్.. "అత్తారింటికి దారేది" క్లైమాక్స్ సీన్ వెయ్యమనాల్సింది అని ఇదవుతుంటే , సీన్లు అంటున్నావ్ కాబట్టి చెప్తున్నా రాసుకుంటావో ,దాచుకుంటావో నీ ఇష్టం సాంబా అని ..."ఆకేదో.. పువ్వేదో.. తెలీనోడికి ఎన్ని సీన్లు చూపించినా వ్యవహారంలో సారం వుండదు నాయనా" అని డైలాగ్ చెప్పగానే "WOW ఏం చెప్తిరి ఏం చేప్తిరి" అనెంటనే TWITTERలో పెట్టేసుకున్నాడు

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...