Jump to content

Yuvagarjana tho poorva vaibhavam


mannam

Recommended Posts

యువగర్జనతో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా ?( సర్వే ఫలితం)  

 

హైదరాబాద్ : యువగర్జనకు జనం పోటెత్తి రావడంతో రాజకీయవర్గాల్లోనే కాకుండా మీడియా వర్గాల్లో కూడా ఆసక్తి చెలరేగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఛానెళ్లతో పాటు పత్రికలు కూడా యువగర్జన ప్రభావం టీడీపీపై ఏ మేరకు పడుతుందన్న విషయంపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీవీ 5 ఛానెల్ ఎస్‌ఎంఎస్ పోల్ నిర్వహిస్తున్నది. యువగర్జనతో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా ? అన్న ప్రశ్నకు గురువారం సాయంత్రం వరకు అందిన సమాచారం వరకు 72 శాతం మంది పూర్వవైభవం వస్తుందని కరాఖండిగా తేల్చిచెప్పారు. కాగా, 28 శాతం మంది ఎటువంటి ప్రభావం చూపదని అంటున్నారు.

 

పార్టీల నిఘా...

తెలుగుదేశం యువగర్జన పట్ల ఎదుటి పార్టీలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ,  ప్రజారాజ్యం పార్టీ నాయకులు గత రెండు మూడు రోజుల నుండి యువగర్జన జన సేకరణ విషయంపై లెక్కలు తీస్తూనే ఉన్నారు. ఒక ప్రముఖ పార్టీ నాయకులు బుధవారం అంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్ద వీడియో కెమెరాలు పెట్టుకుని యువగర్జనకు వెళ్లే జనాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు సైతం యువగర్జన సదస్సుపై ఆరా తీసున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...