Jump to content

ఎన్టీఆర్ 'ఊసరవిల్లి' ఇన్ సైడ్


Jag@NTR

Recommended Posts

సినిమా రిలీజ్ కాకముందే ఫిల్మ్ సర్కిల్స్ టాక్ మైదలైపోతుంది. అందులోనూ క్రేజ్ ఉన్న సినిమాలకైతే మరీనూ. ఇప్పుడు ఆ సినిమా ఎన్టీఆర్ ఊసరవిల్లి. ఊసరవిల్లి విషయానికి వస్తే...ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ అని ఎన్టీఆర్ ఎనర్జిటిక్ ఫెరఫార్మెన్స్ ప్రేక్షకులనకు గ్యారెంటీగా నచ్చుతుందని ఒక టాక్. మరో టాక్ ఏమిటంటే.. లవర్ బోయ్ గా ఎన్టీఆర్ అదరకొట్టాడు అంటున్నారు. మొదటి సారిగా ఎన్టీఆర్ లుక్,స్టైల్ పూర్తిగా మారాయని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం పాటలు మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకోవటం ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర విలక్షణంగా ఉంటుందని సురేంద్ర రెడ్డి చెప్తున్నారు. ఆయన పాత్ర గురించి చెబుతూ..యుద్ధంలో గెలవాలంటే రెండే రెండు మార్గాలు. బలం, బలగం సరిపోతాయి అనుకొంటే సైనికుడై దూకాలి. అవి చాలని పక్షంలో మెదడుకు పదును పెట్టాలి. పరిస్థితిని బట్టి మారాలి... అవసరమైతే శత్రువులను ఏమార్చాలి. మా కథానాయకుడు రెండో మార్గాన్నే ఎంచుకొన్నాడు.

 

మరి రణ రంగంలో వీరుడై ఎలా నిలిచాడో తెలియాలంటే ఎన్టీఆర్‌ కొత్త చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే అన్నారు.అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...