Jump to content

APDevFreak

Members
  • Posts

    1,060
  • Joined

  • Last visited

  • Days Won

    1

Everything posted by APDevFreak

  1. I might disagree with you brother, as they don't have water they are not expecting. I have seen places in Anathapur where they were planting paddy even when one bore in the farm is working. once these people get used to the taste of getting water and cultivating lands...you cannot stop them..
  2. రూ.6000 కోట్లతోనే సాగర్‌ ఆయకట్టుకు గోదారి! పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి తీసుకొచ్చే అదనపు గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు మళ్లించే పథకం అంచనా వ్యయం తగ్గించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 7000 క్యూసెక్కులే ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువలో పోస్తున్నందున భూసేకరణ తొలి అంచనాలంత అవసరం లేదని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయంలో శనివారం రాత్రి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. దాదాపు రూ.6000 కోట్లతోనే గోదావరి నీళ్లు సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు అందించగలమని లెక్క తేల్చినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో తాజా పరిణామాలను జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ రాష్ట్ర మంత్రిమండలికి వివరించారు. నవయుగకు పనులు కట్టబెడుతూ జలవనరులశాఖ నిర్ణయం తీసుకుంది.
  3. Government should train youth/farmers and make them certified consultants. people can buy their services when needed. Other states also might be interested to buy the services.
  4. ప్రకృతి ఒడి.. ఫలితాల మడి! ప్రత్యేక సేద్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న మన్యం రైతులు న్యూస్‌టుడే- సీతంపేట, వీరఘట్టం గ్రామీణం ప్రకృతి సేద్యం విధానంలో ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాల్లో సాగు చేయవచ్చు. 10 శాతం నీరుతో పంట పండించవచ్చు. ప్రజారోగ్యాన్నిచ్చే నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించవచ్చు. - ప్రకృతి సేద్యం ఆధునిక రూపకర్త సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయాన్ని లాభసాటి చేయడంతో పాటు హాని తలపెట్టని ఆహార ఉత్పత్తుల తయారీకి తోడ్పడే ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (జడ్‌బీఎన్‌ఎఫ్‌) వైపు జిల్లాతో పాటు సీతంపేట మన్యం రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటేటా ఈ విధానంలో సాగుచేసే రైతుల సంఖ్య రెట్టింపైంది. గుంటూరు (అమరావతి)లో తొమ్మిది రోజుల పాటు ప్రకృతి సాగుపై ప్రకృతి సేద్యం ఆధునిక రూపకర్త సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు చెందిన రైతులు, సీఆర్పీలు, సీఏలు, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాలు పొందిన రైతులు మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని చూసి మరికొంత మంది ఇదే విధానంలో సాగుకు ఉపక్రమిస్తున్నారు.అంతర పంటలు సైతం సీతంపేట మండలం కె.కొత్తగూడకు చెందిన సవర భాస్కరరావు అనే గిరిజన రైత ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటలు పండిస్తున్నారు. తనకున్న సుమారు మూడెకరాల విస్తీర్ణంలో నేలపనస, పసుపు, ఉసిరికి, జీడి, సీతాఫలం తదితర పంటలను రెండేళ్లుగా పూర్తిగా ఈ విధానంలోనే సాగు చేస్తున్నారు. పెట్టుబడి తక్కువ కావడం వల్ల మేలు కలుగుతోందని ఆయన అంటున్నారు. వీరఘట్టం మండలంలో.. వీరఘట్టం మండలం చిదిమి గ్రామానికి చెందిన బి.గౌరీశ్వరరావు అనే రైతు గత ఖరీఫ్‌లో 90 సెంట్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేశారు. రూ. నాలుగు వేల పెట్టుబడి పెట్టారు. 28 బస్తాల ధాన,్యం దిగుబడి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదే మండలం కంబర గ్రామానికి చెందిన ఎం.రఘురాములునాయుడు 2 ఎకరాల 50 సెంట్లలో వరి పండించారు. రూ. పది వేల పెట్టుబడి పెట్టారు. 70 బస్తాల దిగుబడి సాధించారు. మంచి ఆదాయం సీతంపేట మండలం నౌగూడకు చెందిన సవర ఆనందరావు గత ఖరీఫ్‌లో గులిరాగి పద్ధతిలో ఎకరన్నర విస్తీర్ణంలో రాగులు పండించారు. 13 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధించారు. కేవలం రూ. అయిదు వేల పెట్టుబడి పెట్టానని, పెట్టుబడి పోనూ సుమారు రూ. 25 వేల ఆదాయం పొందినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మరో మూడెకరాల్లో ఇదే విధానంలో సాగు చేస్తున్నారు. కూరగాయలు 0.75 సెంట్లలో, జీడిమామిడి నాలుగు ఎకరాల్లో పండిస్తున్నారు. గిరిజనులకు పాడి ఆవులు రుణంపై అందిస్తే మరింత మేలు కలుగుతుందని ఆనందరావు అంటున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఇలా.. * క్లస్టర్లు: 26 * గ్రామాలు: 66 * గత ఖరీఫ్‌లో లక్ష్యం: సుమారు 15 వేల హెక్టార్లు * రైతులు: 7500 మంది * గుంటూరులో శిక్షణకు వెళ్లినవారు: సుమారు 390 మంది * ప్రకృతి సేద్యానికి అవసరమైన వస్తువులు: దేశవాళీ ఆవు పేడ, మూత్రం, మరికొన్ని పదార్థాలతో కూడిన ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం * ఉపయోగం: రైతులకు పెట్టుబడి చాలా తక్కువ కావడం. దీని ద్వారా పండే ఆహార పదార్థాలపై ఎలాంటి రసాయనిక ఎరువుల ప్రభావం ఉండదు. ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. * అవసరం: ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పశువులు ఉండాలి. దేశవాళీ ఆవు ఉంటే మరీ మంచిది. ప్రాధాన్యం మరింత పెరిగింది గతంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ విధానం అవలంబిస్తున్న రైతులు ఏటా పెరుగుతున్నారు. పెట్టుబడి స్వల్పం, ఆదాయం రెట్టింపు స్థాయిలో రావడంతో పాటు తిండి గింజలకు సంబంధించి ఎలాంటి హాని ఈ విధానంలో పండించే పంటలు చేయకపోవడంతో అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. -బి.రాజగోపాల్‌, సహాయ సంచాలకులు (ఏడీ), వ్యవసాయ శాఖ, పాలకొండ
  5. ప్రకృతి సేద్యమైనా ఫలించేనా? ప్రత్యామ్నాయం వైపు మొగ్గు పెట్టుబడి లేక రైతుల ఆసక్తి అనుభవాలు తెలుసుకున్న ‘ఈనాడు’ ఈనాడు, గుంటూరు అధిక దిగుబడుల సాధనకు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి నష్టాల బాటలో కొనసాగుతున్న రైతులు పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు. ఈపాటికే కొందరు సదరు సాగు చేపట్టి కొంత వరకు ఫలితాలు సాధించినా మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యాన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వద్ద జరుగుతున్న శిక్షణకు హాజరవుతున్నారు. మరికొందరు కొత్త విధానంలోనైనా సాగు లాభసాటిగా మారుతుందేమో ఒకసారి చూద్దామనే ధోరణితో వస్తున్నారు. సందేహాలు నివృత్తి చేసుకుంటూనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దిగుబడులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే లాభదాయకంగా ఉంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల అనుభవాలను ‘ఈనాడు’ తెలుసుకుంది. అవి వారి మాటల్లోనే... తక్కువ పెట్టుబడితో లాభదాయకం ఏడేళ్లుగా ప్రకృతి సేద్యం విధానంలో వరి సాగు చేస్తున్నా. దిగుబడులు కొంతమేర తగ్గుతున్నా పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండటంతో అనుసరిస్తున్నా. దుక్కులు నుంచి కోత వరకు ఎకరాకు రూ.10 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. సాంబ మసూరి రకం ఎకరానికి 25, స్వర్ణ 30, 1001 రకం 30 బస్తాల వరకు దిగుబడి ఇస్తున్నాయి. బీజామృతం, ఘన బీజామృతం, పంచగవ్వ తదితరాలను తయారు చేసుకుని పంటలకు వేస్తున్నా. ఎకరానికి ఒక బస్తా డీఏపీ వాడుతున్నా. పశువుల పేడ ఎకరాకు రెండు ట్రాక్టర్లు వినియోగిస్తున్నా. పురుగుమందులు పిచికారీ చేయడం లేదు. ఈ విధానంలో ఇప్పటివరకు నష్టాలు వచ్చిన దాఖలాలు లేకపోవడంతో మా గ్రామం మొత్తం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రభుత్వం నుంచి పురస్కారం పొందింది. హైదరాబాద్‌ నుంచి శ్రేష్ఠ సంస్థ వచ్చి యంత్రంతో తేమ, రసాయనాల శాతం పరీక్షించి ధాన్యం కొనుగోలు చేస్తోంది. మార్కెట్లో మిగిలిన వారితో పోల్చితే అధిక ధర ఇస్తోంది. ఇది లాభదాయకంగా ఉండటంతో అందరం ప్రకృతి సేద్యం చేస్తున్నాం. - జి.సుందరరావు, పూసర్లపాడు, గార మండలం, శ్రీకాకుళం జిల్లా పొలం నుంచే అన్ని ఉత్పత్తులు పదకొండేళ్లుగా 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నా. బోరు ఉన్న చోట వరి వేస్తున్నా. మెట్ట భూమిలో వేరుసెనగ, కంది తదితర పంటలు పండిస్తున్నా. ఎకరాలో బీపీటీ-5204 రకం వరి 39 బస్తాల దిగుబడి ఇచ్చింది. ఒక్కొక్క బస్తా 90 కిలోల బరువు తూగుతోంది. ఉల్లి 1.25 ఎకరాల్లో వేస్తే సాధారణం 150కన్నా తక్కువగా 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు అందరికీ వేరుసెనగ 8- 9 బస్తాలు దిగుబడి వస్తే మాకు మాత్రం 12 బస్తాల దిగుబడి రావడంతోపాటు ఒక్కోటీ 45 కిలోల బరువు వచ్చింది. ఇంటికి సంబంధించి అన్ని కూరగాయలు, ధాన్యం పొలంలోనే పండించుకుంటాం. రెండు ఆవులతోనే సాగు చేస్తున్నాం. బెల్లం, కాఫీ పొడి మాత్రమే బయట కొనుగోలు చేస్తాం. మేము పండించిన బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి వ్యాపారులు వచ్చి క్వింటా రూ.7 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇంటి వద్దే మొత్తం విక్రయిస్తున్నాం. మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే గిట్టుబాటు అవుతాయి. 2010లో నంది అవార్డు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. - పి.నంజుండప్ప, చింతర్లపల్లి, కల్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి ప్రకృతి సేద్యంలో పెట్టుబడి తక్కువగానే ఉన్నా సాగులో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. ఎకరాలో పందిళ్లు వేసి దొండ, కాకర సాగు చేశా. తొలుత కాపు బాగానే వచ్చింది. ఎండుకొమ్మ, పండు తెగుళ్లు, బిళ్ల పురుగు వస్తున్నాయి. వీటి నివారణ చర్యలు తెలుసుకుని సస్యరక్షణ చేపట్టే సరికి పంట దెబ్బతింటోంది. రూ.2 లక్షలు రావాల్సిన చోట రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. ప్రకృతి సేద్యపు ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్‌ లేకపోవడంతో సాధారణంగా విక్రయిస్తుండగా పెద్దగా ధర రావడం లేదు. తెగుళ్లు వచ్చిన వెంటనే నివారణకు మార్గాలు తెలియజేస్తే ఉపయోగం ఉంటుంది. దీనికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో శిక్షణకు వచ్చాను. ఆ తŸర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తా. - రామ్మోహన్‌రెడ్డి, జిల్లెళ్లపాడు, వెలిగండ్ల మండలం, ప్రకాశం జిల్లా దిగుబడి తగ్గినా లాభదాయకమే రెండేళ్లుగా ప్రకృతి సేద్యం విధానంలో పత్తి వేస్తున్నాను. ఈ ఏడాదీ రెండెకరాల్లో సాగు చేశాను. ఇప్పటివరకు ఏడు క్వింటాళ్ల పత్తి తీసి అమ్మాను. మరో రెండు క్వింటాళ్ల వరకు తీయాల్సివుంది. పక్క పొలాల రైతులు రసాయన విధానంలో సేద్యం చేసి ఎకరాకు 8-10 క్వింటాళ్లు పండించారు. వారితో పోల్చుకున్నప్పుడు పెట్టుబడి తక్కువ కావడంతో దిగుబడి తగ్గినా నష్టాలు రాలేదు. ఈసారి భారీవర్షాలకు నీరు పొలంలో నిలిచిపోవడంతో దిగుబడి తగ్గింది. కషాయాలు పిచికారీ చేస్తే పొలం పచ్చగా పెరుగుతోంది. గతంలో పురుగుమందులు వాడి తీవ్రంగా నష్టపోయాం. ప్రకృతి సేద్యంలో పెట్టుబడి తక్కువగా ఉండటంతో పొరుగు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. తొలుత దిగుబడులు తగ్గుతున్నా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విధానంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఈ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నా. - పి.నాగరాజు, ఉయ్యాలవాడ, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా రోజూ 200 కి.మీ. ప్రయాణం చెన్నైలో ఉంటున్నా. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఐతంపాడులో 60 ఎకరాలు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం చేస్తున్నా. మూడేళ్లుగా రసాయనాలు వేయకుండా మామిడి, నేరేడు, జామ తోటలు పండిస్తున్నా. ఇప్పటివరకు వివిధ కారణాలవల్ల పెట్టుబడి పెడుతున్నా ఆశించిన లాభాలు రావడం లేదు. కూరగాయల పంటలు వేస్తున్నా. నిత్యం చెన్నె నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొలానికి వచ్చి తిరిగి సాయంత్రం వెళుతున్నా. ప్రకృతి సేద్యం ద్వారా పొలం ఉన్న గ్రామం నుంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. ఇప్పుడిప్పుడే కొంత ఫలితాలు వస్తున్నాయి. పంట దిగుబడులు వస్తున్నా మార్కెటింగ్‌ సౌకర్యం లేక దళారులకు అడిగినంత ఇవ్వాల్సివస్తోంది. ఈ క్రమంలో చెన్నైలో ఆర్గానిక్‌ ఉత్పత్తులు విక్రయించే వారితో మాట్లాడి ఒప్పందం చేసుకుంటున్నా. ఎకరాలో పది రకాల కూరగాయలు వివిధ రోజుల్లో కోతకు వచ్చేలా సాగు చేయాలని సూచించారు. వారి సూచనల మేరకు పండిస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశముంది. ఆ దిశగా ప్రణాళికను రూపొందించుకుంటున్నా. ప్రకృతి సేద్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికే శిక్షణకు హాజరవుతున్నా. మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు.. సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అనుసరించి పలువురికి మార్గదర్శకంగా నిలవాలని ఉంది. - అనుమోలు సుగుణ, చెన్నై, ప్రకృతి సేద్యం మహిళా రైతు
  6. ఊరించి... ఉసూరుమనిపించి..! బారువ ఓడరేవు ప్రాజెక్టుకు చుక్కెదురు సాగరమాల నుంచి జారిపడిన బారువ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పట్టించుకోని వైనం న్యూస్‌టుడే- సోంపేట కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సాగరమాల ప్రాజెక్టు నుంచి బారువ అదృశ్యం కావడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. రూ.48 కోట్లకుపైగా నిధులతో బారువతీరంలో వివిధ నిర్మాణాలు చేపడితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయనుకొన్న ఆశలు అడియాశలయ్యాయి. సాగరమాలలో భాగంగా బారువ తీర ప్రాంతానికి గత వైభవం వస్తుందన్న ఎదురుచూపులు ఎండమావిగా మారాయి. తీర ప్రాంతంలో రూ.వంద కోట్లతో నిర్మించతలపెట్టిన మూలపొలం బ్లాక్‌టైగర్‌ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏడేళ్లుగా ఊరిస్తుండగా.. కేంద్రప్రభుత్వం ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాగరమాల చేజారడంతో స్థానికులు ఉసూరుమంటున్నారు. సోంపేట తీరంలో పర్యటక, రవాణా, అన్నివిధాలా అభివృద్ధికి ఉన్న అవకాశాలు సద్వినియోగపడకపోవడంపై అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే వేలాది మంది యువత వలసలుపోతున్నారు. సాగరమాల ప్రాజెక్టు ముందుగా బారువ నుంచే మొదలవుతుందని మత్స్యకారులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఆశలు పెంచుకోగా, ఇప్పుడు బారువ ప్రసక్తి లేకుండా ఈ ప్రాజెక్టు కార్యాచరణకు సమాయత్తమవుతుండడంతో వెనుకబడిన ప్రాంతాల ప్రగతి హామీలకే పరిమితం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టైగర్‌ రొయ్య ఉత్పత్తికేంద్రం... భూసేకరణకే పరిమితం రూ.వంద కోట్లతో మూలపొలం వద్ద నిర్మించతలపెట్టిన టైగర్‌ రొయ్య పిల్లల ఉత్పత్తికేంద్రం భూసేకరణకే పరిమితమైంది. బారువ తీరం సమీపంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి వంద ఎకరాల పంట పొలాలను జాతీయ మత్స్యశాఖాభివృద్ధి సంస్థ సేకరించింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిర్మించతలపెట్టిన టైగర్‌ రొయ్య పిల్లల ఉత్పత్తి, పరిశోధన కేంద్రానికి మౌలిక వసతుల పేరిట పాత జాతీయరహదారి నుంచి రూ.10కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడంతో మెరుగైన జీవనోపాధి పేరిట భూములు ధారాదత్తం చేసిన రైతులు ఉపాధి లేక వలస పోతున్నారు. సాగరమాల ప్రాజెక్టులో బారువ తీరం అభివృద్ధి చెందితే రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలపొలంలో రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారన్న ఆశతో తీరప్రాంత ప్రజలు ఉన్నారు. అయితే ఎలాంటి కారణాలు చూపకుండానే సాగరమాల నుంచి బారువ ప్రాజెక్టును తప్పించడంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండూ అందీ అందని ద్రాక్షగా మారాయని స్థానికులు వాపోతున్నారు. ఓడరేవుగా ప్రసిద్ధి పొందినా ప్రాజెక్టులో దక్కని స్థానం రెండో ప్రపంచయుద్ధం ముందువరకు రాష్ట్రంలో ప్రధాన ఓడరేవుగా బారువతీరం ఎంతో ప్రసిద్ధిచెందింది. రంగూన్‌తో పాటు పలు విదేశాలతో వర్తక, వాణిజ్య అంశాలు నిర్వహిస్తూ బారువ ఓడరేవు ప్రాధాన్యం పొందింది. 1917 జులై 1న చిల్కఓడ ఇక్కడే అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ తరువాత 1936 వరకు ఓడరేవు కార్యకలాపాలు నిర్వహించి కాలక్రమేణా రవాణా, ఇతర అంశాలకు గండి పడడంతో ఓడరేవు తన ఉనికిని కోల్పోయింది. 1766 నుంచి 1936 వరకు బారువ ఓడరేవు ఓ వెలుగు వెలిగింది. ఈనేపథ్యంలో బారువతీరం అభివృద్ధి విషయమై పలుమార్లు ప్రతిపాదనలు చేయడం, విభిన్న కారణాల వల్ల అది మూలనపడింది. ఆరేళ్లక్రితం రూ.3 కోట్ల కేంద్రప్రభుత్వ నిధులతో పర్యటక కాటేజీలు, ఇతర నిర్మాణాలను చేపట్టడంతో గత వైభవానికి మార్గం సుగమమైంది. కేంద్ర ఉపరితల జలరవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో బారువతీరంలో నిర్మించిన లైట్‌హౌస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈనేపథ్యంలో సాగరమాలలో భాగంగా బారువతీరంలో జెట్టీ నిర్మాణంతో పాటు పర్యటక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తెలిసి స్థానికులు ఆశలు పెంచుకున్నారు. ఇక్కడ జెట్టీ నిర్మాణం చేపడితే టెక్కలి డివిజన్‌తో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల పరంగా లక్షలమందికి ఉపయోగపడే పరిస్థితి. రాష్ట్రంలో 9 సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా జిల్లాలో బారువ, కళింగపట్నం ఉండడంతో అన్నివిధాలా ప్రయోజనం చేకూరుతుందని భావించారు. ప్రస్తుతం కళింగపట్నం మాత్రమే సాగరమాలలో ఉండడంతో టెక్కలి డివిజన్‌ ప్రాంత వాసులు ఉసూరుమంటున్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు బారువ తీరం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారు. సాగరమాలలో భాగంగా బారువ, కళింగపట్నం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తామని పలుమార్లు నాతో చెప్పారు. బారువను ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే అంశాన్ని పరిశీలించి భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై ఆయన ఓ నిర్ణయం తీసుకొంటారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల సహకారంతో సాగరమాలలో బారువ ప్రాజెక్టు ఉండేలా నావంతు కృషి చేస్తాను. - డాక్టర్‌ బెందాళం అశోక్‌, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం
  7. సాగులో పాలేకర్‌ సలహాలు పాటించాలి జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంలో సుభాష్‌ పాలేకర్‌ సూచనలు అన్నతదాతలు పాటించాలని రాష్ట్ర సెర్ఫ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై తొమ్మిది రోజుల పాటు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి శిక్షణకు శుక్రవారం జిల్ల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి 588 మంది రైతులను 17 అర్టీసీ బస్సుల్లో పంపారు. మంత్రి సునీత, జేసీ రమమాణి, రెండో జేసీ సయ్యద్‌ఖాజా పచ్చజెండా ఊపి వీరిని సాగనంపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పాత పద్ధతుల్లో గోమూత్రం, పశువుల ఎరువుతో సహజసిద్ధంగా పంటలను పండించాలని సూచించారు. తొమ్మిది రోజుల పాటు గుంటూరులో జరిగే శిక్షణలో పాలేకర్‌ సూచనలు, సలహాలు శ్రద్ధగా విని సాగులో పాటించాలని సూచించారు. సలహాలను తోటి రైతులకు చేరవేసి, వాటిని ఆచరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేడీఏ శ్రీరామ్మూర్తి, డీడీఏలు శ్రీనివాసరావు, సురేంద్రబెనర్జీ, తిరుపతయ్య, డాక్టర్‌ నాగన్న, డీపీఎం లక్ష్మానాయక్‌, తదితరులు పాల్గొన్నారు.
  8. Pattiseema has shown the taste of good yield and continuous supply of water. This year there was constant flow until November. Next year expectations will be high, Govt should be very careful as there are many factors like enough rains and rush for early crops.
  9. Anna garu..court ordered TG govt...AP money ichesindi kada TG ki.
  10. మహా యజ్ఞంపై మెలిక 19-12-2017 02:14:55 నదీ సంధానంపై కేంద్రం కొత్త ప్రతిపాదన కాళేశ్వరం నుంచి కావేరీ వరకు ‘సంగమం’ స్టాక్‌ పాయింట్‌గా నాగార్జున సాగర్‌ కాళేశ్వరం చేర్చడంపై ఏపీ అభ్యంతరాలు గోదావరి- కావేరీపై సీఎం సానుకూలత రాష్ట్రానికి వచ్చిన తమిళనాడు అధికారులు నేడు సంధానంపై చర్చలు అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరీ నదుల మహా సంగమ ప్రాజెక్టుపై కేంద్రం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో గోదావరి జలాలను పెన్నా నది వరకు తీసుకెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన కాగా... దీనిని కావేరీ వరకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. తాజాగా... తెలంగాణలోని కాళేశ్వరాన్ని కూడా జతచేర్చి... అక్కడి నుంచి కావేరీ వరకు మహా సంగమం ప్రాజెక్టు చేపట్టాలంటూ కొత్త మెలిక పెట్టింది. గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమం అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానం కిందకు రాదని, తమిళనాడునూ కలుపుకోవాలన్నది తొలి ప్రతిపాదన. రూ.90 వేల కోట్ల దాకా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులను మంజూరు చేసే అవకాశం ఉన్నందున రాష్ట్రం సుముఖత తెలిపింది. అయితే, తాజాగా కాళేశ్వరాన్ని కూడా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు తాగు నీటిని అందిస్తున్నందున కావేరీ దాకా గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని తీసుకువెళ్లడంపై దృష్టి సారించి డీపీఆర్‌ను సిద్ధం చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో కేంద్రం మరో మెలిక పెట్టింది. తెలంగాణనూ కలుపుకోండి తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు, సాగర్‌ నుంచి సోమశిలకు, సోమశిల నుంచి కావేరీకి నదుల అనుసంధానం చేయాలంటూ తాజాగా గడ్కరీ ప్రతిపాదించారు. గోదావరి (కాళేశ్వరం), కృష్ణా (నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), కావేరీ నదులను అనుసంధానం చేయడం ద్వారా 100 టీఎంసీల నీటిని బదలాయించేలా కార్యచరణను సిద్ధం చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సాగర్‌లోకి పంపి నిల్వ చేసిన వెంటనే కృష్ణా జలాలపై వాటాను కోల్పోతామని ఏపీ జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లోని వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు. తమిళనాడు అధికారుల రాక గోదావరి - పెన్నా - కావేరీ అనుసంధాన ప్రక్రియపై ఏపీ అధికారులతో చర్చించేందుకు తమిళనాడు జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలోని ఓ బృందం సోమవారం విజయవాడకు వచ్చింది. ఈ బృందం మంగళవారం రాష్ట్ర జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌తో సమావేశమై కావేరీ దాకా గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుపై సమీక్షించనుంది. ఈ చర్చలలో పురోగతి ఉంటే భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు ఏపీ - తమిళనాడు మధ్య జరిగే వీలుందని అధికార వర్గాలు వివరించాయి.
  11. హడలిపోతున్నారు... మాఫియా ధాటికి మూతపడుతున్న పరిశ్రమలు కఠినంగా వ్యవహరించలేకపోతున్న పోలీసులు కాకినాడ నుంచి కృష్ణపట్నం పోర్టునకు తరలివెళుతున్న వ్యాపారులు ఈనాడు, కాకినాడ కాకినాడ తీరంలో ఆయిల్‌ మాఫియా ఆగడాలకు విసిగిపోతున్న ఆయిల్‌ పరిశ్రమల యాజమాన్యాలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. తరచూ ఆయిల్‌ దొంగతనాలు చోటు చేసుకుంటుండడం, వ్యవస్థీకృతమైన మాఫియా ఆగడాలను పోలీసులు నిలువరించలేకపోవడం, కొందరి ఆధిపత్యం కారణంగా భారమైన రవాణా ఛార్జీలను మోయలేక వ్యాపారులు కృష్ణపట్నం వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. రెండు లక్షల టన్నుల ఆయిల్‌ దిగుమతయ్యే కాకినాడలో ఇప్పుడు కేవలం 70 వేల టన్నుల ఆయిల్‌ మాత్రమే దిగుమతి అవుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వంట నూనెల తయారీకి సంబంధించి 11 ఆయిల్‌ పరిశ్రమలుంటే అందులో ఇటీవల కాలంలో ఆరు పరిశ్రమల వరకు మూతపడ్డాయి. మిగిలిన పరిశ్రమలు అదే బాటలో ఉన్నాయని ఓ ఆయిల్‌ వ్యాపారి ‘ఈనాడు’కు వివరించారు. ప్రధానంగా రవాణాలో మాఫియా ఆగడాలను నిలువరించలేకపోవడం, భద్రత లేకపోవడంతో ఎగుమతి, దిగుమతి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ట్యాంకర్ల ఆగడాలను భరించలేక పైపులైన్ల ద్వారా ఆయిల్‌ రవాణాకు చర్యలు చేపట్టినా వాటికీ రంధ్రాలు పెట్టి దొంగిలించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లను కాపాడుకునేందుకు ఒక్కో ఆయిల్‌ కంపెనీ తరఫున ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించుకుని 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ గస్తీ బృందాలను సైతం మాఫియా లోబరుచుకోవడం, భయపెట్టడం ద్వారా వారి కార్యక్రమాలను యథేచ్చగా సాగిస్తున్నారు. ఇటీవల కాకినాడ గ్రామీణం పరిధిలో పైపులైనుకు రంధ్రం చేసి ఆయిల్‌ చోరీ చేసిన ఘటనపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మాఫియాకు మద్దతుగా ఉన్న నేతలు నేరుగా రంగంలోకి దిగి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులపై ఒత్తిడి చేశారంటే వారి సంబంధాలు ఎంతలా వేళ్లూనుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. కృష్ణపట్నం వైపు చూపు... 1999 నుంచి కాకినాడలో ఆయిల్‌ మాఫియా ఆగడాలు మొదలయ్యాయి. ప్రైవేటు పోర్టులొచ్చాక సరకు రవాణాలో ట్యాంకర్ల ఆధిపత్యం ఉండేది. దాన్నుంచి బయటపడేందుకు ఈ ప్రాంతంలో వంటనూనెల ఆయిల్‌ పరిశ్రమలను స్థాపించిన వ్యాపారవేత్తలు పైపులైన్ల ద్వారా ఆయిల్‌ రవాణాకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయిల్‌ మాఫియా ఆగడాలు పెరగడం, యూనియన్ల గొడవల వ్యవహారాల్లో హత్యలు సైతం చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు ఈ వివాదాల్లో తలదూర్చి మరక అంటించుకున్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన ఎస్పీకి, మరో పోలీసు అధికారికి మధ్యన తలెత్తిన ఆయిల్‌ వివాదం అప్పట్లో పోలీసు శాఖ ప్రతిష్ఠను మసకబార్చింది. ఆయిల్‌ దొంగ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల ఆగడాలను నిలువరించడంలో పోలీసులు విఫలమవ్వడం, మాఫియాను ఎదుర్కొనేందుకు మెతక వైఖరి అవలంబిస్తుండటం, ఆయిల్‌ దొంగలకు తుని నుంచి కాకినాడ వరకు నేతల సహకారం పుష్కలంగా ఉండటంతో వారికి అడ్డన్నది లేకుండా పోయింది. ఈ పరిస్థితులతో కాకినాడ పోర్టు కేంద్రంగా ఆయిల్‌ వ్యాపారం చేయాలనుకుంటున్న చాలామంది వ్యాపారులు తమ కార్యకలాపాలను తగ్గించుకుని కాకినాడ నుంచి కృష్ణపట్నం వైపు వెళుతున్నారు. కేసులొస్తే కాసుల పంటే... ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయిల్‌ మాఫియాలో తలదూర్చుతున్న పోలీసులకు ఆయిల్‌ మాఫియా అందించే మామూళ్లు కోట్లనే ఉంటున్నాయనే ప్రచారం ఉంది. 20 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో మధ్య మధ్యలో కొంత బ్రేక్‌ పడుతున్నా ఆయిల్‌ దొంగ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఆయిల్‌ దొంగతనాలను నిలువరించే విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. దీని వెనుకాల రాజకీయ నేతల హస్తం ఉండటం, తుని నుంచి కాకినాడ వరకు నేతలకు మామూళ్లు ముట్టడంతో వారి అండదండలతో ఆయిల్‌ మాఫియా చెలరేగిపోతోంది. గత రెండేళ్ల నుంచి ఈ ఆగడాలు మరింత పెరిగాయని పోలీసు అధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు. కఠిన చర్యలేవీ... పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే కాకినాడలో ఆయిల్‌ మాఫియా కార్యక్రమాలే ఉండవు. అప్పుడప్పుడూ ఏదో ఒక ఒత్తిడితో ఆయిల్‌ దొంగతనాల మీద కేసులు నమోదు చేస్తున్నా పోలీసులు ఆ తరువాత ఆయిల్‌ మాఫియా మూలాలను ఛేదించడంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయిల్‌ దందాలో జరిగిన అరెస్టులు, కేసు విచారణలో పోలీసుల ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై విమర్శలకు తావిస్తోంది. గత నెల 28న ఆయిల్‌ దొంగతనంపై పోలీసులు కొంతమంది అరెస్టు చూపించారు. అందులో పైపునకు రంధ్రం చేసిన వారిని, లారీ డ్రైవర్లను, సంపు స్టోరేజీ నుంచి అమ్మిన వారిని, ఆఖరికి సంపు స్టోరేజీ గోదాం అద్దెకిచ్చిన వ్యక్తిని కూడా అరెస్టు చేసిన పోలీసులు దొంగ ఆయిల్‌ కొనుగోలు చేసిన వ్యాపారిని మాత్రం వదిలేశారు. ఈ పరిణామం పోలీసులు నిస్పక్షపాతంగా కేసును విచారణ చేయడం లేదనే ఆరోపణలు ఎదుర్కొనేందుకు అవకాశం కల్పించినట్లైంది. స్థలం అద్దెకు ఇచ్చిన వ్యక్తి కేసులో చిట్టచివరి వ్యక్తి అవుతాడు. వైకేరియస్‌ లయబిలిటీ కింద అతనిపైన కేసు నమోదు చేసి విచారణ చేసే అధికారం పోలీసులకు ఉంది. నేరం చేయాలనే దృఢ సంకల్పం ఉన్నట్లు (మెన్సిరియా)గా రుజువు చేస్తే అతన్ని కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొనే అవకాశం ఉంది. అద్దెకిచ్చిన వ్యక్తిపై మెన్సిరియాకి సంబంధించి దృఢమైన సంకల్పంతో ఆయిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో కూడా పెట్టలేకపోయారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ ప్రధాన ముద్దాయి అరెస్టు చూపకుండా ముందస్తు బెయిల్‌ తెచ్చుకునేందుకు అవకాశం కల్పించి చిన్న వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా కేసును నీరుగార్చుతున్నారనే అపవాదు పోలీసుల మీద పడింది. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు... ట్యాంకర్ల ద్వారా రవాణా చార్జీలు భరించలేకపోతున్న వ్యాపారులు కాకినాడ పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. కార్గో రవాణా గతంతో పోల్చితే ఇప్పుడు ఆయిల్‌ దిగుమతి తగ్గుతూ వస్తోంది. కొంత మంది ట్యాంకర్ల ఆగడాలను భరించలేక పైపులైన్లు వేసుకుని వ్యాపారం చేస్తున్నారు. అక్కడ కూడా దొంగతనాలు పెరగడంతో ఇక్కడ నుంచి కృష్ణపట్నం వైపు వెళ్లిపోతున్నారు. 1999లో ప్రైవేటు పోర్టు వచ్చే సమయంలో కాకినాడ కేంద్రంగా రూ. నాలుగు వేల కోట్ల ఆయిల్‌ వ్యాపారం జరిగేది. ఇప్పుడు అది రూ. 400 కోట్లకు పడిపోయింది. మా పరంగా అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నాం. - డాక్టర్‌ కోయప్రవీణ్‌, డైరెక్టర్‌ ఏపీ పోర్ట్స్‌, కాకినాడ
  12. Amaravati effect? 4 lakh more cars and bikes on Vijayawada’s roads in just one year Data accessed by TNM shows there is a boom when it comes to vehicle registrations in Vijayawada, one of the cities closest to the upcoming Amaravati. Charan Teja Friday, December 15, 2017 - 14:53 Share @Facebook Share @twitter Share @Email Share @google+ Share @reddit There were 3,73,320 more motorbikes on Vijayawada’s streets between 2016 and 2017 January, according to transport department data accessed by TNM. This is an increase of 73.5% from the previous year – there were just over 5 lakh bikes in the city in 2016. Between 2015 and 2016, the growth was just 6.17%. Similarly, the number of cars in the city has also seen a sudden increase: Whereas, there were 61,422 cars in Vijayawada in 2016, in 2017, the number increased to 85,931, which is a 40% rise, compared to 9.72% in the previous year. It’s not just non transport vehicles like cars and bikes, even vehicles used for transporting goods have seen a significant increase of 15%, from 94,259 in 2016 to 1,08,441 in 2017. Between 2015 and 2016, the increase was less than 10%. This boom in the number of vehicles in the city is directly linked to the construction of the new Andhra capital Amaravati, say people in the transport department. E Meera Prasad, Krishna district Deputy Transport Commissioner told TNM, “The shifting of the capital and the construction of the Secretariat has resulted in all-round development. This happened with transportation too. As a result, ownership of the vehicles has gone up.” Speaking about non-transport vehicles, Meera Prasad said that since the land rates have increased in and around Vijayawada, people who sold off their land could have purchased vehicles. The swelling strength of Vijayawada’s traffic is evident in the city’s chaotic traffic jams during peak hours. This is especially prominent on routes that lead to the capital city of Amaravati. The metropolitan areas of Guntur and Vijayawada are closest to Amaravati’s border. While the bifurcation of the state in itself had undeniably created a buzz among the cities in Andhra Pradesh like Vijayawada and Visakhapatnam, Chief Minister N Chandrababu Naidu's indication to shift his administrative base from Hyderabad to Amaravati might have also given impetus for the increase in the number of vehicles. While transport vehicles include autorickshaws, goods carriages, school and college buses, cabs etc, non-transport vehicles include cars, motorbikes and tractor trailers, among others. As of January 2016, transport officials in Vijayawada said that a total of 6,80,594 vehicles were plying the roads of the city. In the next year, this number increased to 9,86,870, which is an increase of 45%. This figure is almost double that of 2010, just four years before the state’s bifurcation. In 2010, there were only 4,14,865 vehicles in the city. However, there is a definite downside to the vehicle boom, say experts. Earlier this year, it was reported that Vijayawada had the highest level of PM10 in the state with 110 µg/m³, as compared to 90 u µg/m³ in 2011. The state's Pollution Control Board (PCB) determines the Air Quality Index (AQI) of an area by breaking it down into PM2.5 and PM10 levels, where ‘PM’ stands for particulate matter, while the accompanying numbers give the size of these particles, which are measured in microns. The standard values of PM 2.5 and PM 10 that are considered acceptable are 60 and 100 micrograms per cubic metre (µg/m³) respectively. According to data from the Ambient Air Quality Station at MC Guest House in Vijayawada, as of last month, the air quality index parameters were crossing the standard values every day during peak traffic hours. Urban development experts feel that a continuous check on the transport system and adopting alternative transport means can reduce the traffic chaos, while also keeping another major issue – pollution – in check.
  13. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ-వీసాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ 15-12-2017 16:43:25 అమరావతి: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ-వీసాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నుంచి విశాఖ‌లో టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవ‌ల్ ప్రారంభం కానుంది. ఈ-టూరిస్ట్ వీసాతో ఏపీలో ప‌ర్యాట‌కానికి కొత్త ఊపు వస్తుందని మంత్రి భూమా అఖిలప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వీసాతో విదేశీ ప‌ర్యాట‌కులు నేరుగా విశాఖ చేరుకోవ‌చ్చని, దేశంలోని 16 ఎయిర్‌పోర్ట్‌ల‌కు మాత్రమే ఈ-వీసా స‌దుపాయం ఉందని అఖిలప్రియ తెలిపారు.
  14. 15 వేల హెక్టార్లలో అదనంగా వరి సాగు అందుబాటులో రాయితీ విత్తనాలు ఈతేరు (బాపట్ల), న్యూస్‌టుడే: పట్టిసీమ నుంచి అందిన సాగునీటితో.. జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో ఈ ఏడాది ఖరీప్‌లో అదనంగా 15 వేల హెక్టార్లలో వరి సాగు చేసినట్లు జేడీఏ విజయభారతి అన్నారు. మండల పరిధిలో ఈతేరులో నిర్వహించిన వరి కోత ప్రయోగాన్ని జేడీఏ బుధవారం పరిశీలించారు. రైతు కుంచాల సాంబయ్య పొలంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు 41 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల గతేడాది కన్నా సగటు దిగుబడి ఓ బస్తా తగ్గినట్లు తేలిందన్నారు. గతేడాది ఖరీప్‌లో వరి సాగు విస్తీర్ణం 1.69 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 1.84 లక్షల హెక్టార్లలో వరి పండించారని వివరించారు. సాగు ధ్రువీకరణ, ఎల్‌ఈసీ పత్రాలు ఉన్న కౌలు రైతులకు టార్పాలిన్‌ పట్టాలు, రాయితీ పరికరాలను అందజేస్తామన్నారు. పల్లాకు తెగులు సోకని మినుము టీబీజీ-104 రకం విత్తనాలు, పెసరలో ఐపీఎం 2-14 విత్తనాలను రాయితీపై రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల్లో అపరాలు, శనగ సాగు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పత్తి పంట విస్తీర్ణం పెరగగా మిర్చి విస్తీర్ణం మాత్రం తగ్గిందన్నారు. కార్యక్రమంలో డీడీ ఎం.రామలింగయ్య, ఏఎస్‌వోలు టి.మధుసూదనరావు, డి.శేషగిరిరావు, ఏడీఏ ఏవీఎస్‌ శాస్త్రి, ఏవో ధనరాజ్‌, ఏఈవోలు భాగ్యలక్ష్మి, శ్రావణబిందు, ఎంపీఈవోలు నరేంద్ర, పృథ్వీ, సీపీడబ్ల్యూ మాధవరావు, అభ్యుదయ రైతులు మార్పు నాగేశ్వరరావు, మన్నె సాంబశివరావు పాల్గొన్నారు.
  15. ఆత్మసాక్షిగా.. భవిత భేషుగ్గా.. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రోత్సాహం మున్ముందు జిల్లావ్యాప్తంగా అమలు యోచన కృష్ణదేవిపేట,న్యూస్‌టుడే సేద్యంలో రసాయన ఎరువుల వినియోగం రైతుల పాలిట గుదిబండగా మారింది. దీంతో వీటికి బదులుగా సహజసిద్ధమైన వనరులతో ప్రకృతి వ్యవసాయం చేయడంపై దృష్టి సారించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే విధానంపై తొలిదశలో రైతులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం తలపెట్టింది ప్రభుత్వం. గ్రామీణ జిల్లాలో సుమారుగా 10 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ అనుబంధంగా సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. కళ్లాల వద్ద లభ్యమయ్యే ఆవుపేడ, ఆవుమూత్రం, వేప ఆకులు, పొగాకుతోపాటు బెల్లం, శెనగపిండి తదితర నిత్యావసర సరకులతో పంటలకు సారాన్నిచ్చే సేంద్రియ ఎరువులు, తెగుళ్లు, పురుగుల నివారణకు మందులు తయారు చేసుకునే వీలుంది. ఇవన్నీ తక్కువ ధరలకే లభించేవే. జిల్లాలో ఆత్మ, వ్యవసాయశాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. దీంతో అన్ని ప్రాంతాల్లో మున్ముందు ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని ప్రతిపాదించారు. రైతులు అధిక పెట్టుబడుల భారం నుంచి ఒడ్డెక్కి, మెరుగైన దిగుబడులు సాధించే అవకాశముందని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదించింది. ఎప్పటికప్పుడు సూచనలు తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు చేసే దిగువస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తమదైన శైలిలో సరికొత్త విధానాలు వివరిస్తున్నారు. వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలో 5 మండలాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు మోహన్‌రావు నేతృతంలో ఆయా మండల వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. సిబ్బంది పరంగా అందిస్తున్న సూచనల్లో తేడాలొస్తే వాటిని సరిచేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా మున్ముందు ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటే పెట్టుబడులు బెడద నుంచి ఉపశమనం పొందినట్టేనని పలువురు సన్నకారు రైతులు అభిప్రాయపడుతున్నారు. మెరుగైన దిగుబడులు పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో రైతులు మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ వ్యవసాయం ద్వారా పంటలకు సోకే తెగుళ్లు, ఆశించే పురుగుల ప్రభావం ఎక్కడా కన్పించలేదు. ఈ పెట్టుబడులు లేని వ్యవసాయంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దశలవారీగా అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే ప్రతిపాదన ఉంది. - టి.మధుసూదనరావు, వ్యవసాయాధికారి, గొలుగొండ మండలం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉండటంతో తమ భూముల్లోనూ ఇదే తరహా సాగు చేస్తామంటూ రైతులు ముందుకొస్తున్నారు. తొలుత ఈ సాగుపై అవగాహన లేక వెనుకంజ వేసిన రైతులు రసాయనిక ఎరువులు కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పట్టారు. రసాయన ఎరువులు వాడిన పొలాలు, సేంద్రియ ఎరువులు వినియోగించిన పంటలు బేరీజు వేసుకొని సత్ఫలితాలు ఇస్తున్న ప్రకృతి వ్యవసాయంపైనే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆయా మండలాల్లో రైతుల స్పందన బాగుంది. - సీహెచ్‌.లక్ష్మీకిషోర్‌, బీటీఎం, ఆత్మ, నర్సీపట్నం
  16. Yes I too heard from port higher mgmt employee.. Fake talk kuda vundi...babu binami ani
×
×
  • Create New...