Jump to content

jeevgoran

Members
  • Posts

    18
  • Joined

  • Last visited

Profile Information

  • Gender
    Male
  • Location
    Sweden
  • Interests
    Andhra Development

Recent Profile Visitors

440 profile views

jeevgoran's Achievements

  1. సిఐఐ ఎక్స్‌కాన్‌ ప్రతినిధి భరతన్‌ విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల రంగంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య ఎక్స్‌కాన్‌ ప్రతినిధి టిఆర్‌ భరతన్‌ పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో అధునాత న సాంకేతిక పరిజ్ఞానం, నూతన పరికరాల ప్రదర్శనను డిసెంబరు 12 నుంచి 16 వరకు బెంగళూరులో నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో గురువారం రోడ్‌ షో నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి పనులు మొదలు కాబోతున్నాయని, రహదారులు, వంతెనలు, వివిధ ప్రాజెక్టులు వస్తాయని, వీటి కోసం లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా వున్నారన్నారు. దేశంలో పెద్దనోట్ల రద్దు, జిఎ్‌సటిఅమలు తరువాత జిడిపి గణనీయంగా పడిపోయిందని, అయితే అదే సమయంలో నిర్మాణ రంగం మాత్రం అభివృద్ధిని సాధిస్తోందని విశ్లేషించారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 20 నుంచి 25 శాతం అభివృద్ధి నమోదైందన్నారు. గృహ నిర్మాణ రంగంలో ధనికుల కోసం నిర్మించే ప్రాజెక్టులను పూర్తిగా పక్కనపెట్టి, మధ్య తరగ తి ప్రజలకు అవసరమైన అఫర్డబుల్‌ హౌసింగ్‌పైనే అన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. నెలవారీ జీతాలు తీసుకునే ఉద్యోగులకు బ్యాంకులు వెంటనే గృహరుణాలు మంజూరు చేస్తున్నాయని, దాంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపడుతున్నారన్నారు. ఎక్స్‌కాన్‌ కన్వీనర్‌ శక్తికుమార్‌ మాట్లాడుతూ, నాలుగు రోజులు జరిగే ప్రదర్శనకు 40 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ఇక్కడ భారీ భవంతుల నిర్మాణానికి అవసరమైన యంత్ర సామగ్రి మొత్తం ప్రదర్శిస్తారన్నారు. పెద్దనోట్ల రద్దు, రెరా చట్టం అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులకు మంచి సేవలు అందించే బిల్డర్లే మిగులుతారని, చిన్నచితకా కనుమరుగైపోతారన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత నిర్మాణ రంగంలో ఎక్స్‌కవేటర్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, వ్యాపారం బాగా జరుగుతోందని విశ్లేషించారు.
  2. పట్టిసీమ వృథా అని చెప్పే ధైర్యముందా? జగన్‌కు మంత్రి సోమిరెడ్డి సవాల్‌ ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లోని పత్తి పంటలను వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి , ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు, ఆ శాఖ కమిషనర్‌ జవహర్‌, శాస్త్రవేత్త ఎస్‌. రత్నకుమారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలో 1.82 లక్షల హెక్టార్లలో పత్తిసాగు చేశారన్నారు. రాష్ట్రంలోని 13 లక్షల ఎకరాలకు పట్టిసీమ ద్వారా నీరందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి పట్టిసీమపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ధైర్యం ఉంటే కృష్ణా డెల్టా పొలాల్లో నిలబడి పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. వ్యవసాయంలో సాంకేతికతను జోడించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి నలభై టీఎంసీల సాగునీటిని పంటలకు కేటాయిస్తున్నామన్నారు. రైతుల కోసం ప్రత్తిపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గులాబీ రంగు పురుగు వల్ల రైతులు ఆందోళన చెందొద్దనీ, నివారణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు రూ.1900 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చామన్నారు. విశాఖ పట్నంలో 15, 16, 17 తేదీల్లో ‘మిల్లిండా గేట్స్‌’ సమావేశం జరగనుందనీ, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేడీఏ ఎం. విజయభారతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ వి. సత్యనారాయణ, పీడీ సీహెచ్‌. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
  3. తూర్పు ‘ప్రకాశం’... ధాన్య ప్రసాదం... పట్టిసీమతో కరవు సీమకు గోదావరి జలాలు పర్చూరు, చీరాల రైతుల్లో పెరిగిన సాగు ఉత్సాహం ఎకరాకు 50 బస్తాలు పండిస్తున్న రైతులు ఈనాడు డిజిటల్‌- ఒంగోలు కృష్ణమ్మ నుదుటన గోదారమ్మ పచ్చబొట్టు పెట్టింది... పట్టిసీమ రూపంలో రెండు నదుల కలయికతో కరవు సీమకు కొత్త కళ వచ్చింది... ఫలితంగా కరవు జిల్లాలో వరికి వూపిరి వచ్చింది... కృష్ణా జలాలే ఆధారంగా ఉన్న కొమ్మమూరు కాలువకు నీళ్లు వస్తుండడంతో ప్రకాశాన ధాన్యాగారం నిండుతోంది. తెలుగునాట అన్నపూర్ణగా పేరొందినవి గోదావరి జిల్లాలు... ఎకరానికి 50 నుంచి 60 బస్తాల దిగుబడితో ఏటా 25 లక్షల టన్నుల వరిని ఆ రెండు జిల్లాలే అందిస్తాయి. దీనికి కారణం గోదారమ్మ చెంతన ఉండడమే. సిరులనిచ్చే భూములున్నా ప్రకాశాన జలధారలే కరవయ్యాయి. అందుకే ఏటా సేద్యంపై నిరాసక్తతో రైతులు కమతాన్ని వీడుతున్నారు. కానీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కొత్త ఆశలు మొలకెత్తాయి. నిరుడు సాగు మధ్యలో పట్టిసీమ నీళ్లు అందడంతో పర్చూరు, చినగంజాం, చీరాల, కారంచేడు ప్రాంతాల్లో అక్కడక్కడా సాగు వేశారు. వేసిన కొద్దిచోట్ల కూడా మంచి ఫలితాన్ని రాబట్టారు. అదే ఉత్సాహంతో ఈ ఏడాది ఈ కాలువ పరిధిలో 45 వేల ఎకరాల మేర సాగుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ చేలు కీలకదశకు చేరుకున్నాయి. గత ఫలితాలు ఇలా...! గత మూడేళ్లుగా కరవు కారణంగా కృష్ణా జలాలు అందలేదు. ఫలితంగా వరి వేయాల్సిన పొలాలను రైతులు బీడుగా వదిలేశారు. అందుకే జిల్లాలో 2015-16, 2016-17లో వరి సాగు 75 శాతం లోపే ఉంది. దీంతో వరి ఉత్పత్తి కూడా తగ్గింది. ఖరీఫ్‌ చివరి సమయానికి పట్టిసీమ నీరు అందడంతో అక్కడక్కడా సాగు పెరిగి ఫలితాలు మెరుగయ్యాయి. గత ఏడాది ఖరీఫ్‌, రబీల్లో వరికి ఆ నీరు వూపిరి పోసింది. వరికి వూపిరి అదే...! జిల్లాలో వరికి వూపిరి పోసేది కృష్ణా డెల్టా ప్రాంతమే. ఈ ఏడాది సకాలంలో పట్టిసీమ నీరు అందే పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో శతశాతం నాట్లు పడ్డాయి. సెప్టెంబరు రెండో వారంలో నాట్లు ప్రారంభమవడంతో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పైరు ఏపుగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా డెల్టా పరిధిలో శత శాతం నాట్లు పడడం ఇదే తొలిసారి. జిల్లాలో వరికి వూపిరి పోసే చినగంజాం, చీరాల, పర్చూరు, వేటపాలెం, కారంచేడు మండలాల్లో సాగు ఆశాజనకంగా ఉండడంతో రైతులు, అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. గత ఏడాది ఈ ప్రాంతాల్లో పట్టిసీమ నీరు కారణంగా 45 బస్తాలు పండింది. జిల్లాలో సగటున ఎకరాకు 35 నుంచి 40 బస్తాలే దిగుబడి వచ్చేది. కానీ గోదారి జలాల ప్రభావం, రైతుల నిరంతర శ్రమతో గత ఏడాది 40 బస్తాలు సాధించారు. ఈ ఏడాది ఈ 24 వేల హెక్టార్లలోనూ ఎకరాకు సగటున 47 బస్తాలు పండుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చినగంజాంతో పాటు, అక్కడక్కడా నీటి లభ్యతకు ఇబ్బంది లేకుండా ఎత్తిపోతల ద్వారా కూడా నీటిని మళ్లిస్తున్నారు. కేవలం కాలువలనే నమ్ముకోకుండా రైతులు ప్రధాన కాలువ నుంచి నీటిని మోటార్లతో తోడుకుంటున్నారు. తొలిసారిగా సకాలంలో...! మూడు దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్నాను. గడిచిన కొన్నేళ్లలో కరవు కారణంగా నీటి కోసం తీవ్రంగా శ్రమించాం, ఇక సాగు చేయలేం అనుకునే సమయానికి పట్టిసీమ నీరు అందింది. గత ఏడాది మంచి దిగుబడులు సాధించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సకాలంలో పూర్తిస్థాయిలో నాట్లు వేశాం. ఇప్పుడు చేలు కీలక దశలో ఉన్నాయి. - కె. బాలకోటయ్య, రైతు, చినగంజాం 50 బస్తాలు వస్తాయి...! మా ప్రాంతంలో 2013 నుంచి 2015 వరకు వ్యవసాయాన్ని పక్కన పెట్టాం. ఇక సేద్యం కష్టమే అనుకున్న సమయంలో గత ఏడాది పట్టిసీమ జలాల కారణంగా 40, 45 బస్తాలు పండాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి పట్టిసీమ ద్వారా నీరు అందడంతో సెప్టెంబరు రెండోవారానికి నాట్లు వేసేశాం. నీటి కోసం ఎదురు చూడాల్సిన పని తప్పింది. ఇప్పుడు 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. - వెంకట ప్రసాద్‌, రైతు, పెదగంజాం
  4. పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం రెండ్రోజుల్లో ఉత్తర అండమాన్‌వైపుగా అల్పపీడనం ఈనాడు, విశాఖపట్నం: దక్షిణ భారత తీరాన్ని ఆనుకుని శ్రీలంక మీదుగా నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. అండమాన్‌ సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ సియామ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఇది రాబోయే రెండురోజుల్లో ఉత్తర అండమాన్‌ దిశగా కదిలేందుకు అవకాశం కనిపిస్తోందని వివరించింది. ఈ ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందని తెలిపింది. 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 4, 5వ తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలతో పాటు రాయలసీమలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది.
×
×
  • Create New...