Jump to content

JVC

Members
  • Posts

    6,914
  • Joined

  • Last visited

  • Days Won

    9

Posts posted by JVC

  1. 3 hours ago, surapaneni1 said:

    boats ki permissions ichhe atanu maa frnd on godavri river... vadi pani vadini enadu chakkaga cheyanivvaledu.. just checking ki vastam antene presidents mla lu phone chesevallu.. akkarledu mundu certificate ichheyyandi ani.. now u can tell.. edo urike sollu cheppadam kadu..

    Mee odu vaallu icheyamante ichestaada? Sincerity ledannatte ga? Ala ayina... 

    Half knowledge evarido ee db lo ide section lo Chala sarlu prove ayindi le.. manam Inka daani gurinchi maatlaadukovatam endukule

  2. అమరావతిలో తానా భవన్‌!

    సీఎం చంద్రబాబును కోరిన తానా సభ్యులు

    చికాగో: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తానా ప్రతినిధులు కలిశారు. ఆ దేశంలోని 20 నగరాల్లో 5కె రన్‌ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో ఏపీలో అభివృద్ధి పనులు చేపడతామని వారు సీఎంకు తెలిపారు. అమరావతిలో 20 మిలియన్‌ డాలర్లతో తానా భవన్‌ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నామని స్థలం కేటాయించాలని సీఎంను కోరారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

    Babu garu.. ee kampulu kuda akkada enduku andi maaku.

  3. Ee rajakeeyanakulaki enduku saami illu.

    Elaagu vaallu akkada undi chachedi undadu. Vaalla thoththugallaki mandu ki, vindu ki tappa enduku vaadaru vatini. Anavasaram ga jaaga bokka. Malli eetiki security Ani thokka ani extra kharchu.

     

    Ippudu dabbu leni rajakeeyanakudu evadunnadu asalu

  4.  

    అంబేద్కర్‌ జయంతి నాడే స్మృతి వనానికి శంకుస్థాపన

     

    636254190636224593.jpg
    • 125 అడుగుల విగ్ర హ ఏర్పాటు
    • నాలుగు ప్రదేశాలను పరిశీలించిన మంత్రి రావెల
    • శాఖమూరు, ఐనవోలు రెవెన్యూలోనే..
    • 20 ఎకరాలు కేటాయించనున్న సీఆర్‌డీఏ
    తుళ్ళూరు: రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా 97.69 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 125 అడుగుల ఎత్తయిన కాంస్య విగ్రహ స్థాపనకు ప్రభుత్వం స్థల పరిశీలన చేపట్టింది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు సీఆర్‌డీఏ అధికారులతో కలిసి శాఖమూరు, ఐనవోలు రెవెన్యూ పరిధిలో నాలుగు ప్రదేశాలను పరిశీలించారు. శాఖమూరు పరిధిలోని జస్టిస్‌ సిటీ ప్రాంతంలో అంబేద్కర్‌ స్మృతి వనానికి స్థలం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే 200 ఎకరాల్లో సీఆర్‌డీఏ గ్రీనరీ పార్క్‌ ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని స్మృతి వనానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్త్నునట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 14కి జ్ఞాన కేంద్రం, లైబ్రరీ పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. స్థల పరిశీలనలో సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌, సీఆర్‌డీఏ భూవ్యవహారాల ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ రఘునాథరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

     

    avasarama idi? 

  5. Vijayawada


    ----------------------------------------


     


    5. Foundry karimulla --- Chaala bagundi. 


    8. Rasoi - ulavacharu biryani  --- Ulavacharu Biryani lo veedini minchinodu ledu.


    9. Srinivasa - (Unlimited biriyani kavalante)  ---- Idi inka undaa?  eppudo 2006 lo tinnna ikkada. Pieces,Biryani unlimited.


    10. Dvmanor -- Not bad


  6.  

    మైక్రోసాఫ్ట్‌ వస్తోంది

     

    Superb. Babu gariki Bill Gates bamardi lekka anukunta ga. BABU Garu adagatame aalasyam emo

     

     

    636126097860129204.jpg

    • త్వరలో డెవల్‌పమెంట్‌ సెంటర్‌.. స్టార్టప్స్‌ సెంటర్‌గా ఆంధ్రప్రదేశ్‌
    • ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సిలికాన్‌ వ్యాలీ తరహా వృద్ధి: సీఎం
    • విశాఖలో 8 ఐటీ కంపెనీలకు శ్రీకారం.. త్వరలో మరో 32
    • 5 వేల సర్కారీ బడుల్లో డిజిటల్‌ పాఠాలు.. తొలి దశలో 1212
    • టెక్నాలజీతో టీచర్‌ పోస్టులకు ముప్పు రాదు: ముఖ్యమంత్రి
    విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన టెక్నాలజీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఆంధ్రప్రదేశలో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో ఎనిమిది అమెరికన్‌ ఐటీ కంపెనీల అనుబంధ సంస్థలను గురువారం మధ్యాహ్నం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు ఇటీవల రాష్ట్రంలోని కేఎల్‌, నాగార్జున యూనివర్సిటీలను సందర్శించారని, ఆయా వర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ఆ విద్యార్థుల కోసం ఏపీలో డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని సీఎం వెల్లడించారు. ఇది మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేయనున్న 11వ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ అని తెలిపారు. ఐటీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతిభ చూపుతున్నారని, ముఖ్యంగా ఆంధ్రులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఐటీలో ఆంధ్రప్రదేశ ట్రెండ్‌ సెట్టర్‌ అని సీఎం వ్యాఖ్యానించారు. అమెరికాలో ఐటీ సర్వర్‌ పేరుతో 500 కంపెనీలు ఒక సమూహంగా ఏర్పడి మల్టీనేషనల్‌ కంపెనీలకు సొల్యూషన్స అందిస్తూ రెండు బిలియన డాలర్ల వ్యాపారం చేస్తున్నాయన్నారు. వీరంతా విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఎంఓయూలు చేసుకున్నారని, అందులో తొలి విడతగా 8 కంపెనీలు ఈ రోజున తమ కేంద్రాలను విశాఖలో ఏర్పాటు చేశాయన్నారు. వీటి ద్వారా 500 మందికి ఉపాధి లభించిందన్నారు. మిగిలిన 32 కంపెనీలు త్వరలోనే విశాఖలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ప్రగతిలో దూసుకువెళుతోందని, వాటికి సంబంధించిన పనులు ఈ కంపెనీలకు అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చా రు. విశాఖ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, ప్రతి విద్యాసంస్థలో ఇన్నోవేటివ్‌ సొసైటీలు, ప్రతి కార్యాలయంలో ఇన్నోవేషన చాప్టర్లు, యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా ఫలితాలు వచ్చే వరకు పరిశోధనలు నిర్వహించాలని సూచించారు. ఏపీని స్టార్టప్స్‌ సెంటర్‌గా మార్చాలనేదే తన ధ్యేయమన్నారు. ఐటీకి సిలికాన వ్యాలీ పేరొందిందని ఏపీలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సిలికాన వ్యాలీ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఐటీ సంస్థలకు రాయితీలు కల్పిస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు ఒక్కో ఉద్యోగానికి రూ.50 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. అదే ఎంఎ్‌సఎంఈ అయితే రూ.1.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చక్కటి ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలతో ఐటీ స్పేస్‌ అందించిందని వుడా వీసీ బాబూరావునాయుడును అభినందించారు. రిలయన్స్‌ జియో సహకారంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, విద్యాలయాలకు ఉచితంగా వైఫై అందిస్తామన్నారు. అమెరికా కంటే విశాఖలోనే నైట్‌ లైఫ్‌ బాగుందని సీఎం ప్రశంసించారు.

     

    యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

    యువత ఉద్యోగాల కోసం అన్వేషించకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆస్తుల కంటే విజ్ఞానమే గొప్పదని, దాన్ని సాధించేందుకు యువత శ్రమించాలన్నారు. విద్యార్థులందరికీ ట్యాబ్‌లు ఇస్తే, వారు తరగతి గదుల్లోనే కాకుండా చెట్లు కింద కూడా కూర్చొని నచ్చినప్పుడు చదువుకోవచ్చన్నారు. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలే... కొన్నాళ్లకు ఏపీని ఉన్నత స్థాయిలో నిలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

    </p>
×
×
  • Create New...