Jump to content

SREE_123

Members
  • Posts

    5,930
  • Joined

  • Last visited

Posts posted by SREE_123

  1. 54 minutes ago, mahesh1987 said:

    Srisailam current storage 110tmc

     

    Another 110-120 tmc on the way

    60 confirm bro...100 doubt...! as rains stopped above Almattiii...

     

    ప్రస్తుత వరదనీటి ప్రవాహనాన్ని అంచనావేస్తే రానున్న మూడు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి మరో 60 టీఎంసీల నీటినిల్వ చేరే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడుకు తొలుత ప్రభుత్వం నీటిని విడుదల చేయనున్నది. శ్రీశైలంలో నీటినిల్వ 875 అడుగులకు చేరుకోగానే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం త్వరితగతిన నిండుతుందని నీటిపారుదలశాఖ చెపుతోంది. అయితే ఆల్మట్టి ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతంలో రెండురోజుల నుంచి వర్షాలు కురవటం లేదు. ఆల్మట్టికి రెండు మూడు రోజుల తరువాత వరదనీటి ప్రవాహం తగ్గవచ్చని అంచనా. మొత్తం మీద మంగళవారం నాటి పరిస్థితిని పరిశీలిస్తే ఆల్మట్టికి వరదనీటి ప్రవాహం 1,69,145 క్యూసెక్కులు ఉంది. అక్కడి నుంచి 1,78,196 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలచేస్తున్నారు. నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల అవుతున్న వరదనీరు శ్రీశైలంకు వారం రోజులు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

  2. తుంగభద్రకు కొనసాగుతున్న వరద
    18-07-2018 09:41:34
     
    636675036955854009.jpg
    కర్నూలు: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 64,825 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 1,335 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1630.04 అడుగులకు చేరింది. అలాగే నీటి నిల్వ 89.860 టీఎంసీలుగా నమోదు అయ్యింది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఈరోజు సాయంత్రం తుంగభద్ర రిజర్వాయర్‌ గేట్లను అధికారులు ఎత్తివేసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
  3. 7 minutes ago, rk09 said:

    strange thing - Sriram sagar doesn't have any inflows

    Looks like nothing coming from Nanded and upper catchemnts

    But at Bhadrachalam its been 1 lakh + cuses from last couple of days

    It is not surprise bro...every year it happens...!

    Most of the water come from pranahitha and indravathi and sabari...

    That's y TG is planing to lift water to upper godhavarii...from lower godhavarii(from kalaswaram..after pranahitha merger..)

  4. There is a Big confusion ...in Kurnool link...road....& ....there is no clarity on this....some papers will write Kurnool link will join after Nandal( it is already 4 lane ...nothing much needed...)..some papers will tell after dornala.......for which existing 2 lane( K G road) need to extend to 4 lane.......Any Idea....which one they are focusing...?

  5. అమరావతికి ఏడు డైమండ్లు: చంద్రబాబు


    అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో  ఏడు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతిలో పరిపాలన భవనాలకు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఏడు రహదారుల నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. రూ.915 కోట్లతో నిర్మించనున్న ఈ ఏడు రోడ్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోడ్లు రాజధానికి ఏడు డైమండ్లు అని అభివర్ణించారు. ఈ ఏడు రోడ్లను వచ్చే ఉగాదికల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు.

     

    భవిష్యత్‌లో ఒలింపిక్స్‌ ఇక్కడే నిర్వహించేలా అమరావతిని తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు ప్రధాన రహదారులతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో  ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుందన్నారు. స్థిర నివాసంతో పాటు పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు అమరావతి కేంద్రం అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇక ఉండవల్లి, పెనుమాక, నిడమర్రులో కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదని, వారు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి భూములు ఇవ్వాలని ఆయన సూచించారు.

    కాగా ఈ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 331 ఎకరాలను సమీకరించింది. అయితే యర్రబాలెంలో మరో 12.50 ఎకరాలను రైతులు సమీకరణకు ఇవ్వలేదు. మరోవైపు రహదారుల నిర్మాణానికి రూ.915 కోట్లను ప్రపంచ బ్యాంక్‌ ఇస్తుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నప్పటికీ ... ఆ ప్రతిపాదనలకు ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంక్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం. దీంతో హడావుడిగా శంకుస్థాపన చేసినా...పనులు జరగడం కష్టమేనని కొందరు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

×
×
  • Create New...