Jump to content

sonykongara

Members
  • Posts

    66,400
  • Joined

  • Last visited

  • Days Won

    89

Everything posted by sonykongara

  1. అమరావతి: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ(Janasena)ఖరారు చేసింది. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజు పోలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరికీ నియామక పత్రాలను అందజేశారు. తెదేపా, భాజపా, జనసేన పొత్తులో భాగంగా తొలుత పి.గన్నవరం సీటును తెదేపాకు కేటాయించారు. మహాసేన రాజేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు.
  2. ప్రణీత్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజింగరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  3. ఆ ఆరు స్థానాలపై ఆచితూచి.. ఎవరికి ఇవ్వాలన్న సందిగ్ధంతోనే పెండింగ్‌ తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి. Updated : 23 Mar 2024 10:16 IST తెదేపా అసెంబ్లీ టికెట్ల వ్యవహారం ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్‌ కేటాయించాలని అడుగుతున్నారు. చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెబుతున్నారు. నిర్ణయం ఎటూ తేలకపోవడంతో ఈ రెండుచోట్లా అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించడంతో... మరో మాజీమంత్రి కళా వెంకటరావు చీపురుపల్లి టికెట్‌ అడుగుతున్నారు. చీపురుపల్లికి ఆయన పేరూ పరిశీలనలో ఉంది. మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో... అక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరును భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది. ఆయా స్థానాల అంశం గంటా, కళా వెంకటరావు, బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్‌లో పడింది. విజయనగరం లోక్‌సభ స్థానాన్ని భాజపా నుంచి తీసుకుని రాజంపేట ఇచ్చే అంశం తెదేపా పరిశీలనలో ఉంది. అదే జరిగితే విజయనగరం లోక్‌సభ స్థానానికి కళా వెంకటరావు పేరు పరిశీలించే అవకాశముంది. ప్రకాశం జిల్లా దర్శి టికెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. దర్శి నుంచి శిద్దా కోడలి పేరు పరిశీలనలో ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ఇస్తామన్న ప్రతిపాదనతో... జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు, యాదవ సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి పేరూ పరిశీలిస్తున్నారు. గుమ్మనూరుకే ఎక్కువ అవకాశాలున్నట్టు సమాచారం. అనంతపురం అర్బన్‌ టికెట్‌కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్‌ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు.
  4. తెదేపా అసెంబ్లీ టికెట్ల వ్యవహారం ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్‌ స్థానాలున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్‌ కేటాయించాలని అడుగుతున్నారు. చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెబుతున్నారు. నిర్ణయం ఎటూ తేలకపోవడంతో ఈ రెండుచోట్లా అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించడంతో... మరో మాజీమంత్రి కళా వెంకటరావు చీపురుపల్లి టికెట్‌ అడుగుతున్నారు. చీపురుపల్లికి ఆయన పేరూ పరిశీలనలో ఉంది. మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో... అక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరును భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది. ఆయా స్థానాల అంశం గంటా, కళా వెంకటరావు, బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్‌లో పడింది. విజయనగరం లోక్‌సభ స్థానాన్ని భాజపా నుంచి తీసుకుని రాజంపేట ఇచ్చే అంశం తెదేపా పరిశీలనలో ఉంది. అదే జరిగితే విజయనగరం లోక్‌సభ స్థానానికి కళా వెంకటరావు పేరు పరిశీలించే అవకాశముంది. ప్రకాశం జిల్లా దర్శి టికెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. దర్శి నుంచి శిద్దా కోడలి పేరు పరిశీలనలో ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ఇస్తామన్న ప్రతిపాదనతో... జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు, యాదవ సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి పేరూ పరిశీలిస్తున్నారు. గుమ్మనూరుకే ఎక్కువ అవకాశాలున్నట్టు సమాచారం. అనంతపురం అర్బన్‌ టికెట్‌కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్‌ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు.
×
×
  • Create New...