Jump to content

sonykongara

Members
  • Posts

    66,776
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. నిర్దిష్ట కాలపరిమితిలో రాజధాని నిర్మాణాలు సీఆర్డీయే ఉన్నతాధికారులతో నారాయణ చర్చలు ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధాని రూపకల్పనలో అత్యంత కీలకంగా నిలవనున్న పరిపాలన, న్యాయ నగరాల నిర్మాణపనులు విజయదశమినాడు ప్రారంభం కాబోతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ ఆ సంస్థ ఉన్నతా ధికారులతో విస్తృత చర్చలు జరిపారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాల యానికి గురువారం ఉదయం వచ్చిన ఆయన కొన్ని గంటలపాటు అక్కడే ఉండి, అమరావతి నిర్మాణాన్ని వడివడిగా సాగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముమ్మర సంప్రదింపులు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించిన ప్రకారం రాజధానిలోని అడ్మినిస్ట్రేటివ్‌, జస్టిస్‌ సిటీల్లోని ప్రధాన కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, స్టాఫ్‌ క్వార్టర్లు ఇత్యాది వాటిని పనులు మొదలెట్టిన 18 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో ఐకానిక్‌ కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టుల కాన్సెప్ట్‌ డిజైన్లు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం పొందిన సంగతి విదితమే. అసెంబ్లీ కోహినూర్‌ వజ్రాకృతిలో, హైకోర్టు బౌద్ధస్థూపం ఆకారంలో నిర్మించనున్న విషయమూ తెలిసిందే. ఆగస్టు 15నాటికి శాసనసభ, అదే నెల 30వ తేదీకల్లా హైకోర్టు తుది డిజైన్లను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ అందించనున్నారు. అదే వరుసలో సెప్టెంబరులో సెక్రటేరియట్‌ డిజైన్లూ రూపుదిద్దుకోనున్నాయి. ఆ తర్వాత మిగిలిన భవనాల నిర్మాణాన్ని సైతం ప్రాధాన్యతాక్రమంలో చేపట్టనున్నారు. వీటిల్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణాన్ని దసరా పర్వదినాన ప్రారంభించనుండగా, మిగిలిన వాటి పనులూ ఆ వెంటనే మొదలవుతాయి. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టి, నిర్దిష్ట గడువైన 2019, మార్చి 31లోగా పూర్తి చేసేందుకు ఏ విధంగా ముందుకు కదలాల్సి ఉందన్న విషయంపై నారాయణ, సీఆర్డీయే ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. వీటి టెండర్ల ప్రక్రియను ఎప్పుడు చేపట్టాలి, ఆ డాక్యుమెంట్లలో పేర్కొనే నియమ నిబంధనలెలా ఉండాలి ఇత్యాది అంశాలపై మంతనాలు సాగాయని తెలిసింది. రాజధానికి ప్రముఖ విద్య, హోటళ్ల గ్రూపులను రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటికి జరపాల్సిన భూకేటాయింపులు, నిధుల సమీకరణ వంటివీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
  2. రాజధానిలో ‘పై డాటా’..సై తొలిదశ ప్రాజెక్టుకు నేడే శ్రీకారం మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం రాజధానిలో తొలి ఐటీ ప్రాజెక్టు మంగళగిరి: స్థానిక ఐటీ పార్కులో ప్రతిష్టాత్మకమైన ఐటీ ప్రాజెక్టు... పై డాటా సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ కంపెనీ పై డాటా సెంటర్‌ దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో రూపుదిద్దుకున్న తొలి అంతర్జాతీయ ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కావడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో నాల్గవ టైర్‌ డాటా సెంటర్‌గా గుర్తింపు పొందనున్న తొలి ఐటీ ప్రాజెక్టు కూడ ఇదే కానుంది. ఈ డాటా సెంటర్‌ ఏర్పాటు వలన మూడొందల మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి కలుగనుండగా స్థానికంగా మరో రెండేవేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ప్రస్త్తుతానికి తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేసి శుక్రవారం రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. లోకేష్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంగళగిరిలో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి చెందిన ఇక్కడి ఐటీ పార్కులో ప్లాటు నెం.12 కింద పదెకరాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ 2015 మేలో జీఓ నెం.11 పేరుతో ఉత్తర్వులను ఇచ్చింది. ప్రభుత్వం కూడ ఎన్నో షరతులను విధిస్తూ లీజు కేటాయింపులను చేసింది. 33 ఏళ్లకుగాను లీజుకింద రూ.పదికోట్లను చెల్లించాలని కోరగా పై డాటా యాజమాన్యం ఆ చెల్లింపులను చేసింది. సదరు భూమిని ఏపీఐఐసీ నుంచి పై డాటా కంపెనీ స్వాధీనం చేసుకున్న ఆరు మాసాల్లోగా నిర్మాణ పనులను ఆరంభించి తదుపరి 15 మాసాల్లోగా ప్రాజెక్టు తొలిదశను పూర్తిచే యాలని ఆతదుపరి మూడు మాసాల్లోగా ప్రాజెక్టులో అనుకున్న విధంగా పనులు ప్రారంభించి తీరాలని ప్రభుత్వం షరతులు విధించింది. ప్రాజెక్టు పనితీరు పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందినట్టయితేనే తదుపరి 33 ఏళ్లకు లీజు కొనసాగుతుందని కూడ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టులో విధిగా 300 మందికి తగ్గకుండా ఐటీ నిపుణులకు ఉపాఽధిని కల్పించాలని కూడ ప్రభుత్వం స్పష్టం చేసింది. పై డాటా సెంటర్‌ యాజమాన్యం కూడ ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలను చేపట్టింది. భూమిని స్వాధీనం చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఇక్కడ భవన నిర్మాణ పనులను చేపట్టింది. చాలా శరవేగంగా తొలిదశ భవన సముదాయాన్ని పూర్తి చేసింది. మొత్తం ఐదు లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న పై డేటా సెంటర్‌ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.600 కోట్లను ఖర్చు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. తొలి దశ కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఐదు వేల సర్వర్‌ ర్యాక్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో ర్యాక్‌లో 47 సర్వర్‌లకు స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. ఈ ఐటీ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడ మంచి సహకారాన్ని అందించింది. ప్రాజెక్టు నిర్వాహణకు అవసరమయ్చే అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా విద్యుత్‌, నీటి సరఫరా విషయంలో రాజీలేని విధంగా ఏర్పాట్లను చేసింది. గుంటూరు ఛానల్‌ నుంచి ప్రత్యేక పైపులైనుతో కృష్ణా జలాలను అందించడంతో పాటు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కూడ ప్రభుత్వం ఏర్పాట్లను గావించింది. తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.ఆరు కోట్ల వ్యయంతో ప్రజారోగ్యశాఖ ఆఽధ్వర్యంలో పనులను చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత అవసరాలకు 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేసి దానికి తాడేపల్లిలోని నులకపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ ప్రత్యేక విద్యుత్‌ లైనును ఏర్పాటుచేశారు. ఇందుకోసం రమారమి రూ.ఏడు కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018 నాటికి ప్రాజెక్టులో ర్యాక్‌ల సంఖ్యను 15వేల వరకు పెంపు చేసే అవకాశం వుంది. ఆ సందర్భంలో సబ్‌స్టేషన్‌ సామర్ధ్యాన్ని 60 మెగావాట్స్‌కు పెంచాల్సివుంటుంది. మొత్తంమీద 2018 నాటికి భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌గా పై డేటా అవతరించబోతుంది. క్లౌడ్‌ కంఫ్యూటింగ్‌ సర్వీస్‌లో అత్యంత ఎక్కువ సామర్ధ్యం కల సర్వర్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పై డేటా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటుంది.
  3. పేదలకు బ్రాండెడ్‌ సరకులు గ్రామీణ మాల్స్‌గా చౌకధర దుకాణాలు టెండర్లు పిలిచిన పౌరసరఫరాల సంస్థ ప్రీబిడ్‌ సమావేశానికి అనూహ్య స్పందన ఈనాడు, అమరావతి: చౌకధర దుకాణాలను గ్రామీణ మాల్స్‌గా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ దుకాణాల ద్వారా బ్రాండెడ్‌ సరకులను తక్కువ ధరకే కార్డుదారులకు విక్రయించే ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మరో అడుగు వేసింది. ఈ సరకులను దుకాణాలకు సరఫరా చేసేందుకు సరఫరాలదారుల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఈ నెల 26 వరకు సమయాన్నిచ్చింది. బుధవారం ఆ సంస్థ వెలగపూడిలోని సచివాలయంలో ప్రీ-బిడ్‌ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రిలయన్స్‌, వాల్‌మార్ట్‌, మెట్రో, ఇతర స్థానిక సరఫరా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాజస్థాన్‌లో ఈ తరహా ప్రయోగాన్ని ప్రారంభించినప్పుడు ఇలాగే నిర్వహించిన ప్రీ-బిడ్‌ సమావేశానికి కేవలం ఫార్చ్యూన్‌ గ్రూప్‌ ప్రతినిధులే హాజరైనట్లు తెలిసింది. దీంతో మన రాష్ట్రంలో అనూహ్య స్పందన వచ్చినట్లయిందని పౌర సరఫరాలశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. * కనీసం 30శాతానికి తక్కువ కాకుండా రాయితీపై చేయాలి. * ప్రతీ సరకుకు మూడు రకాల బ్రాండ్లను అందుబాటులోఉంచాలి. * పట్టణ, నగర ప్రాంతాలే కాకుండా ఒక మోస్తరు మండల కేంద్రాల్లోని చౌకధర దుకాణాల్లోనూ ఈ సరకులను కార్డుదారులకు అందుబాటులోకి తీసుకురావాలి. * సాంకేతిక బిడ్లు వచ్చాక, ఆర్థిక బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని వాటి ప్రక్రియ (ప్రాసెస్‌)ను పూర్తి చేసేందుకు కనీసం 30 నుంచి 45 రోజులు అవసరమవుతుంది కాబట్టి సెప్టెంబరు నుంచి సరకులను చౌకధర దుకాణాల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధం కావాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  4. మేఘా, నవయుగకు ‘చింతలపూడి’ పనులు 20-07-2017 02:06:18 ఆర్కే ఇన్‌ఫ్రాకు వెలిగొండ.. ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): చింతలపూడి మూడో దశ పనులను మేఘా ఇంజనీరింగ్‌కు, నాలుగో దశ పనులను నవయుగ ఇంజనీరింగ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం తీర్మానించింది. అదేవిధంగా వెలిగొండ టన్నెల్‌కు సంబంఽధించిన పనులు ఆర్కే ఇన్‌ఫ్రాకు అప్పగించాలని నిర్ణయించారు. చింతలపూడి మూడో దశ పనులకు ఇంటర్నల్‌ బెంచ్‌ మార్కు ధర రూ. 652.5 కోట్లకు 4.4ు అధికంగా రూ.681.21 కోట్లకు మేఘా టెండరు వేసింది. చింతలపూడి నాలుగో దశ పనులకు ఇంటర్నల్‌ బెంచ్‌ మార్కుగా నిర్ధారించిన రూ.1608.50 కోట్లకు నవయుగ 4.49ు అధికంగా టెండరు వేసింది. వెలిగొండ టన్నెల్‌ పనులకు సంబంధించి బెంచ్‌ మార్క్‌గా నిర్ధారించిన రూ.91.15 కోట్లకు 4.71ు అదనంగా 95.44 కోట్లకు టెండరు దాఖలు చేసిన ఆర్కే ఇన్‌ఫ్రా కంపెనీకి పనులు అప్పగించాలని నిర్ణయించారు.
  5. 324 మంది వైద్యుల భర్తీకి ఓకే 20-07-2017 02:07:11 418 స్టాఫ్‌ నర్సు పోస్టులకూ లైన్‌క్లియర్‌ అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ (ఏపీవీవీపీ)లో 324 వైద్యుల పోస్టులు, 418 స్టాప్‌ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై బుధవారం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. 324 వైద్యుల పోస్టుల్లో 113 గైనకాలజీ, 116 అనస్థీయా, 95 ప్రిడియాట్రిక్స్‌ పోస్టులు ఉన్నాయి. వెంటనే భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ఏపీవీవీపీ కమిషనర్‌కు సూచించారు. మరోవైపు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, ఏపీవీవీపీ నుంచి లేట్రల్‌ ఎంట్రీ కోసం సుమారు 700 దరఖాస్తులు డీఎంఈకి చేరాయి. ఈ 700 దరఖాస్తులతో పాటు సీనియారిటీ ప్రకారం వైద్యుల జాబితా.. డీహెచ్‌, ఏపీవీవీపీ కమిషనర్‌ కార్యాలయాల నుంచి డీఎంఈకి అందాయి.
  6. కాజీపేటలో బయటపడిన అతి పెద్ద బుద్ధపాద శిల్పం ఉభయ తెలుగు రాష్ట్రాలో ఇంతకు మున్నెన్నడూ వెలుగు చూడని అతిపెద్ద బుద్ధపాద శిల్పం బయటపడిందని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ అమరావతి, విజయవాడ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి బుధవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శివనాగిరెడ్డి కడప జిల్లా కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లిలోని వెంకట్రామపురంలో పర్యటించారు. గంగానమ్మ ఆలయం వెనుక ఉన్న కాలువ గట్టుపైన మూడు అడుగుల రెండు అంగుళాల పొడవు, మూడు అడుగుల వెడల్పు, మూడు అంగుళాల మందంతో నాపరాయిపై చెక్కిన ఇక్ష్వాకుల కాలం(క్రీ.శ.3వ శతాబ్దం) నాటి బుద్ధపాదంగా గుర్తించినట్లు తెలిపారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న ఈ శిల్పానికి పురావస్తుశాఖ అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరారు. - న్యూస్‌టుడే, మొగల్రాజపురం(విజయవాడ సిటీ)
  7. 2019 మార్చికల్లా పరిపాలన నగరం విజయదశమి నాడు శంకుస్థాపన ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్‌డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ఉచితంగా భూమి ఇచ్చేందుకు సంసిద్ధత ఈనాడు - అమరావతి అమరావతిలో పరిపాలన నగరం నిర్మాణ పనులను విజయదశమి రోజున ప్రారంభించి... 2019 మార్చి 31 నాటికి పూర్తిగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య కోసం దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా ప్రఖ్యాత విద్యాసంస్థలను ఇక్కడకు తీసుకురావాలని సూచించారు. అవసరమైతే ఆయా సంస్థలకు కావాల్సిన భూమిని ఉచితంగా అందించేందుకైనా సిద్ధమేనన్నారు. ఆ స్థాయి విద్యాసంస్థలు స్థాపించేందుకు ఎవరు ముందుకొచ్చినా ఆ ప్రతిపాదనలను మంత్రివర్గంలో చర్చించి వెంటనే అనుమతులు ఇస్తామని ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం రాజధాని నిర్మాణ పురోగతిపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ధీరూభాయ్‌ అంబానీ ట్రస్టు తమ విద్యాసంస్థను అమరావతిలో నెలకొల్పేందుకు గతంలో హామీ ఇచ్చిందని అధికారులకు గుర్తు చేశారు. * రాజధాని ప్రస్తుత అవసరాల కోసం 20 వేల హోటల్‌ గదులైనా ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 2500 ఉంది. * విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండు నుంచి కనకదుర్గగుడికి వెళ్లే మార్గాలను ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేయాలి. ఈ 3 ప్రాంతాలను సమీకృతం చేయాలి. రైల్వే అధికారులతో మాట్లాడాలి. * ఈ జోన్‌లో నిత్యం లక్షన్నర మంది రాకపోకలు సాగిస్తుంటారు. వారందర్నీ ఆకట్టుకునేలా ఈ జోన్‌లో ప్రత్యేక ఆకర్షణలు ఉండాలి. * ఈ ప్రత్యేక జోన్‌లో బయట వాహనాలను అనుమతించకుండా ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉండాలి. జలరవాణాను దీనిలో అంతర్భాగం చేయాలి. * బందరు, రైవస్‌, ఏలూరు కాలవల మార్గాలను పర్యాటక ఆకర్షణీయంగా, వాటర్‌ ఫ్రంట్‌లుగా తీర్చిదిద్దాలి. పట్టణ ప్రాంతాలును కళాత్మకం చేయాలి రాష్ట్రంలోని 110 పట్టణాలను గోడలకు ప్రకటనలు అతికించని ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న గోడలను కళాకృతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ఈ విషయంలో ఎన్జీవోలు, విద్యార్థులు, మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పురపాలక శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర కళ్లకు కట్టేలా, ఆహ్లాదం, ఆకర్షణ కలిగే భావనాత్మక చిత్రాలను గోడలపై వేయాలని సూచించారు. * పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఎవరిపైనా బలవంతంగా రుద్దొద్దని, కోరుకున్న వారికే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని చంద్రబాబు సూచించారు.
  8. ఉల్లాస వనం రాజధానికే తలమానికంగా ఉద్యానవనం 241 ఎకరాల్లో సకల వసతులతో నిర్మాణం వచ్చే సంక్రాంతికి సిద్ధం చేయాలని లక్ష్యం తుది ప్రణాళిక ఖరారు చేసిన ప్రభుత్వం ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిలోని శాఖమూరు గ్రామంవద్ద 241 ఎకరాల్లో నిర్మించే ఉద్యానవనం తుది ఆకృతులు ఖరారయ్యాయి. బుధవారం సీఆర్‌డీఏ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పార్కు ఆకృతులపై తుది నిర్ణయం తీసుకున్నారు. పార్కులో సకల విహార, వినోద సదుపాయాలు, వసతులుండేలా డిజైన్‌ చేశారు. 6 నెలల్లో సిద్ధం చేసి, వచ్చే సంక్రాంతికి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ‘గాంధీ మెమోరియల్‌’ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పార్కు ప్రణాళికను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌పీసీ సంస్థ రూపొందించింది. పార్కును మొత్తం నాలుగు జోన్లుగా విభజించారు. మధ్యలో పెద్ద జలాశయం ఉంటుంది. దాని చుట్టూ జోన్‌లు వస్తాయి. మొదటి జోన్‌ 85, రెండో జోన్‌ 34, మూడో జోన్‌ 49, నాలుగో జోన్‌ 73 ఎకరాల్లో ఉంటుంది. నాలుగో జోన్‌లోనే 19.6 ఎకరాల్లో అంబేద్కర్‌ పార్కు ఉంటుంది. జోన్‌-1లో వచ్చేవి * క్రాఫ్ట్స్‌ బజారు: 3.5 ఎకరాలు * అమ్యూజ్‌మెంట్‌పార్కు/వాటర్‌ వరల్డ్‌: 34 ఎకరాలు * ఈవెంట్‌ ఎరీనా/యాంఫీ థియేటర్‌: 5 ఎకరాలు * రిసార్ట్‌: 16 ఎకరాలు. జోన్‌-2లో వచ్చేవి * వాటర్‌ ఫ్రంట్‌ ప్రొమెనేడ్‌ * బోటింగ్‌, జల క్రీడలు * అవుట్‌డోర్‌ వ్యాయామశాల: 1 ఎకరం * పెంపుడు జంతువుల పార్కు: 2 ఎకరాలు * పిల్లల సాహసక్రీడల పార్కు: 27 ఎకరాలు జోన్‌-3లో వచ్చేవి * చరక వనం/రాశి వనం: 5 ఎకరాలు * పుష్పాలు, కాక్టస్‌ గార్డెన్‌: 2 ఎకరాలు * బాతుల చెరువు (డక్‌ పాండ్‌): 3.6 ఎకరాలు * యోగా, ధ్యాన కేంద్రాలు * జాగింగ్‌ ట్రాక్‌లు జోన్‌-4లో వచ్చేవి * జాగింగ్‌ ట్రాక్‌లు, హరిత ప్రాంతాలు * ఆర్టిస్ట్‌ ప్లాజా * శిల్ప ఉద్యానవనం * సాంస్కృతిక మ్యూజియం * హస్తకళలు, శిల్పాల ప్రదర్శనశాల * ఈవెంట్‌లు, ఫెయిర్ల నిర్వహణకు ప్రత్యేక గ్రౌండ్‌: 12 ఎకరాలు * స్పోర్ట్స్‌ క్లబ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్‌: 12 ఎకరాలు * ఇండోర్‌ అథ్లెటిక్‌ సెంటర్‌: 1.5 ఎకరాలు * ఐదు నక్షత్రాల హోటళ్లు: 7 ఎకరాలు జురాంగ్‌ పార్క్‌ తరహాలో నైట్‌ సఫారీ శాఖమూరు పార్కు ప్రణాళికపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. * శాఖమూరు పార్కును కోసం వృక్ష పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా ఒక నర్సరీ అభివృద్ధి చేయాలి. * నైట్‌ సఫారీ కోసం వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా జురాంగ్‌ పార్క్‌ తరహాలో ప్రత్యేక ఏర్పాటు చేయాలి. * రెండు మూడు స్టార్‌ హోటళ్లుండాలి. * కొల్లేరు, పులికాట్‌ వంటి పక్షుల విడిది కేంద్రాలకు దీటుగా ఇక్కడ విహంగాలకు ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రవాణా వ్యవస్థపై 15 రోజుల్లో నివేదిక రాజధానిలో రవాణా వ్యవస్థపై జర్మనీకి చెందిన నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని, 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అమరావతితో పాటు సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో ఈ బృందం అధ్యయనం చేస్తుందన్నారు.
  9. చంద్రబాబు ఇ-గవర్నెన్స్‌ పథకాలు భేష్‌! ఐరాస సమావేశంలో అంతర్జాతీయ ప్రశంసలు సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలపై కితాబులు ఈనాడు, అమరావతి: ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వేదిక ఆధ్వర్యంలో సుస్థిరాభివృద్ధి, 2017పై నిర్వహించిన అత్యున్నత రాజకీయ వేదిక (హెచ్‌ఎల్‌పీఎఫ్‌) సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన కార్యక్రమాలపై ప్రశంసలు కురిశాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోర్‌ డ్యాష్‌బోర్డ్‌ వంటి ఇ-గవర్నెన్స్‌ పథకాలకు అంతర్జాతీయంగా మంచి స్పందన లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జులై 10-19 వరకు జరిగిన ఈ సమావేశంలో మనదేశం నుంచి ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే పాల్గొంది. ఇందులో ఏపీ తరఫున విజన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి చెందిన అలెన్‌ జాన్‌ సామ్యూల్‌ మాట్లాడుతూ.. సంతృప్తీకరణ, హామీ, అవగాహన, ఇ-గవర్నెన్స్‌ వంటి అంశాలపై సవివరంగా ప్రదర్శన ఇచ్చారు. పింఛన్ల ద్వారా సామాజిక రక్షణ, ప్రజా పంపిణీ వ్యవస్థతో చవకగా ఆహార ధాన్యాలు, గ్యాస్‌ అందించటం వంటి కార్యక్రమాలను వివరించారు. పిల్లలందరికీ ప్రాథమిక విద్య, ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 100 రోజుల ఉపాధి, దారిద్య్రరేఖ దిగువన గల కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు, అందరికీ తగినంత సురక్షిత నీరు అందిచంటంతో పాటు కుటుంబ వికాసం, మహా సంకల్పం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, స్వచ్ఛ ఆంధ్ర, జన్మ భూమి, నీరు ప్రగతి, వనం-మనం వంటి కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తోందని వివరించారు. ఇ-ప్రగతి, మీసేవ, ప్రభుత్వ సేవలకు సంబంధించిన మొబైల్‌ యాప్‌, కోర్‌ డ్యాష్‌బోర్డు, ఏకగవాక్ష పోర్టల్‌, ఆన్‌లైన్‌లో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే పీపుల్‌ ఫస్ట్‌ వంటి పథకాలనూ ప్రస్తావించారు. తీర ఆర్థిక, ఉపాధి ప్రాంతాలు.. పారిశ్రామిక నడవాలు.. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌.. ఆర్థిక నగరాలు, రిటైల్‌ పార్కుల వంటి ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల గురించీ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మనదేశం నిర్వహించిన మరో కార్యక్రమంలో ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌.. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగడియా తదితరులు పాల్గొన్నారు. ఇందులో అరవింద్‌ పనగడియా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ఇ-గవర్నెన్స్‌ కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయ రియల్‌టైమ్‌ ఎగ్జిక్యూటివ్‌ డ్యాష్‌బోర్డు (కోర్‌ డ్యాష్‌బోర్డు) పథకానికి మంచి స్పందన లభించింది
×
×
  • Create New...