Jump to content

mannam

Members
  • Posts

    12,330
  • Joined

  • Last visited

  • Days Won

    2

Posts posted by mannam

  1. రూల్ ఆల్రెడీ ఉన్నప్పుడు పాటించకపోతే షాపుల వాళ్ళది తప్పేగా. ఐనా సొంత రాష్ఠ్ర భాషని 60:40 రేషియోలో వ్రాయటానికి ఏం నొప్పి అంట. కన్నడ రాని వాడు 40 రేషియోలో ఉన్న ఇంగ్లీషు బోర్డ్ చూసుకుంటాడు, అంతేకానీ బ్రతుకుతెరువు కోసం వాళ్ళ ఊరుకు పోయి వాళ్ళ భాషని కూడా భరించలేకపోతే ఎలా. పరాయి దేశపు ఇంగ్లీషు మీదున్న ప్రేమలో కొంచెం పక్క రాష్ఠ్రపు కన్నడ నేర్చుకోవటం మీద కూడా పెడితే భాషకి భాష వచ్చుద్ది, అలాగే వాళ్ళకి మన మీద గౌరవం, అభిమానం కూడా పెరుగుతుంది. అంతేకానీ వాళ్ళకి సంస్కృతి, వేషభాషలు కూడా మేమే నేర్పుతామంటే ఎలా. 

  2. 1 hour ago, vk_hyd said:

    Aunu CBN skill development case terrorist case mari

    serious-kota-srinivasarao.gif

    అలాగే పాత కేసుల్లో బెయిల్ తీసుకుని ఫారిన్ పారిపోయిన ముద్దాయి కూడా😂😂. ఎవరు ఎన్ని అన్నా, అనుకున్నా, పట్టిన శని వదలనంతవరకూ మాటలు పడాల్సిందే, కష్ఠాలు అనుభవించాల్సిందే. 

  3. 41 minutes ago, Raaz@NBK said:

    *This is the final list of ministers.*
    *1 Revanth Reddy CM.*
    *2 Mallu Bhatti Vikramarka Deputy CM and Finance Minister.*
    *3 Danasari Anusaya (Seetaka) Deputy CM and Home Minister.*
    *4 Duddila Sridhar Babu Speaker.*
    *5 Sudarshan Reddy Agriculture Minister.*
    *6 Thummala Nageswara Rao Road and Building Minister.*
    *7 Damodar Raja Narasimha Education Minister.*
    *8 Jupally Krishna Rao Tourism Minister.*
    *9 Uttam Kumar Reddy Panchayat Raj Minister.*
    *10 Komatireddy Venkat Reddy Municipal Minister.*
    *11 Konda Surekha Women and Child Welfare Minister.*
    *12 Ponguleti Srinivas Reddy Irrigation Minister.*
    *13 Vivek Venkata Swamy SC Welfare Minister.*
    *14 Malreddy Rangareddy Sports Minister.*
    *15 Ponnam Prabhakar Goud Forest Minister.*
    *16 Madan Mohan IT Minister.*
    *17 Kodanda Ram Reddy (MLC) Health Minister.*
    *18 Adanki Dayakar (MLC) Labour Minister.*
    *19 Mohammed Ali Shabbir Minority Minister.*

    బాగుంది, మరీ అందరూ రెడ్లతో నింపకుండా. సామాజిక న్యాయం నేర్చుకున్నాడు అనుకుంటా చంద్రబాబు దగ్గర. మదన్ మోహన్ ఎవరో కానీ బాగా చెయ్యకపోతే ఫస్ట్ కంపారిజన్ తనదే కేటీఆర్ తో. 

  4. 8 minutes ago, Raaz@NBK said:

    mundhu mana fans ki buddhi vundali bro.. Hero fans medha nammakam tho close ga vunapudu konni matladataru.. avi bayata pettakudadhu Ani ingitha gnanam leni fans vunnaru manaki..

    ఆ ఫ్యాన్ ఎవరో కానీ స్వామి మాల వేసుకుని ఉన్నారు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను కానీ కొంచెమన్నా బుద్ధీ జ్ఞానం ఉండాలిగా. అత్యుత్సాహం కాకపోతే. 

  5. 1 hour ago, PP SIMHA said:

    first half manalne denginatu unnadu , kakapothe manam em teliyanatu ignore chesedham 

    ఒకళ్ళని అనేదేముందిలే అక్కడ, జరిగిన పరిణామ క్రమం చెప్పాడు. 

  6. 15 minutes ago, Husker said:

    appudu kuda US ollu movie chudaru ani edinchi nuvve.. daniki reply ichindi nene.. malla nenu edo anna reverse :roflmao:

    appudu cheppindi neeku ardam kakapothe malli cheptha..  ippatiki NBK as a hero is a hard sell in US market.. baagunte chustharu lekunte ledu.. evadu preferred ga balayya movies vasthundi ani egesukuni vellaru like other heros.. that is because of years of social media negative on him.. daaniki audience ni anukunte em raadhu.. 

    adi slow ga perception change auvthundi thanks to programs like unstoppable.. 3 back-to-back millions paddai.. 

    ee movie ki planning sarigga edisthe.. weekend lope 1.5M cross avvalsina movie.. adi audience mistake kadu.. producer di.. 

    నేను మాత్రం థియేటర్లో చూసేది బాలకృష్ణ సినిమా ఒక్కదానినే. మిగిలిన సినిమాలనైతే సూపర్ గా ఉన్నాయని టాక్ వస్తే ఎప్పుడైనా ఓటీటీలో చూస్తాను. ఇకపోతే నాలాగే చాలామంది ఓన్లీ బాలకృష్ణ సినిమాలనే చూసేవాళ్ళు కూడా ఉన్నారు. థియేటర్లు, సినిమా రిలీజ్ టైమింగ్స్ బాగా చూసుకుంటే సినిమాలు బాగా ఆడతాయి. అమెరికాలో వాళ్ళకి అదొక రకమైన విచిత్రమైన మనస్తత్వం. దాదాపు 20 ఏళ్ళుగా ఉంటున్నాను కాబట్టి కొంత అవగాహనైతే ఉంది. 

  7. 5 minutes ago, Husker said:

    US inka lite le.. nenu chusina vatillo.. Omaha only has one show at 3 PM, Lincoln only one show at 2 PM, and Columbus shows at 12PM & 3:45PM.. assalu ee showtimes deniki.. rent kuda bokka.. just namesake.. inka inni theaters hold chesam ani sollu xxxxtaniki kakapothe.. okka evening show kuda levu.. 
    repu Tuesday evening show 9:40 ki undi.. working day roju evadu chusthadu ah time ki.. :sleep:maree ridiculous ga weekend ayinaka kuda passes enable cheyyala.. 

    next weekend tho run complete anukunta.. 

    మీరు ఉండేది నెబ్రాస్కా లోనా? నేను నాలుగేళ్ళు అక్కడ ఉన్నాను యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా-లింకన్ లో. అప్పట్లో లింకన్ కి అసలు తెలుగు సినిమాలే వచ్చేవి కావు. ఏదో పెద్ద సినిమాలు మాత్రమే ఒమాహా కి తీసుకొచ్చేవాళ్ళు. 

  8. 1 hour ago, Raaz@NBK said:

    So USA Vs India War jarigithe US citizenship teesukunna Indians (owned US Citizenship who were in Army) vachi India medha bombs veyochu anamata.. 🤯

    బాంబులు వెయ్యక్కర్లేదు కానీ, ఇండియా మీద మమకారం పోకపోతే ఇండియాకు తిరిగొచ్చి ఇండియన్ మిలిటరీలో చేరి ఇండియా తరఫున అమెరికాకు వ్యతిరేకంగా పోరాడితే తప్పు లేదని నా ఫీలింగ్. 

  9. 1 hour ago, TDP_2019 said:

    Jail lo pedithe em ayyiddi. inka sympathy vasthadi. Delhi lo undatam valla what are we acheiving???? We need to mobilize public against these atrocities. Delhi lo koorchunta ante cadre ela fight chestharu

    అందరూ జైలుకి పోతే జనాల్లో తిరిగేదెవరు? ఇంకా 7 నెలలు ఉన్నాయిగా ఎలక్షన్లకి, ఈ కేసులు మహా అయితే ఇంకో నెల ఉంటాయి. 

  10. 14 minutes ago, TDP_2019 said:

    Enni rojulu ila. This will send weak signals to public If delay beyond 5th, 

    ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో. పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తే ఏమో జైలులో పెడతారు, ప్రారంభించకపోతే ఏమో జనాలు మర్చిపోతారు అంటారు.

  11. 5 hours ago, RKumar said:

    INDIA trying to get TDP in to alliance.

    YCP did this with support of BJP.

    (or) YCP did this to stop TDP & BJP tie up.

    అన్నీ మూసుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదే ఫోకస్ అంతా పెట్టి గెలిస్తే మంచిదేమో మనకు. అప్పుడు సపోర్ట్ అవసరమైతే ఎవడైనా మన దగ్గరకే వస్తాడు, అంతేకానీ ముందుగానే ఎవడితోనూ జట్టుకట్టటం మంచిది కాదేమో. 

  12. 9 hours ago, ask678 said:

    TG public kullu tho suicide chesukune days entho duram lo levu....asale free food batch...

    నిజం. వాళ్ళ ఏడుపులతో అమరావతికి వచ్చే దిష్ఠి పోతుందిలే. 

  13. ఒక్కోసారి అన్నీ అలా కలిసొస్తుంటాయి. నాకు వారియర్స్ లో బాగా నచ్చే అంశమేమంటే పాసింగ్. సెల్ఫిష్ నెస్ లేకుండా బాగా ఆడినట్టు అనిపిస్తారు. కజిన్స్ ఒక్కడే కొంచెం తన ప్లేసేంటో తెలియక తికమక పడుతున్నాడనిపిస్తుంది ప్రస్తుతానికి. టైం గడిచేకొద్దీ తను కూడా సెటిల్ అవుతాడేమో. 

×
×
  • Create New...