Jump to content

skilaru

Members
  • Posts

    7,610
  • Joined

  • Last visited

Reputation Activity

  1. Angry
    skilaru reacted to sonykongara in TDP   
    టీడీపీలో 30 నుంచి 40 మందికి ఉద్వాసన.. లేదంటే పార్టీకి నష్టమే?
    22-08-2018 10:47:17   సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 40 మంది అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించబోతున్నారు. 30 నుంచి 40 మందికి ఉద్వాసన పలకబోతున్నారు. ఈ వడపోత కార్యక్రమం చురుకుగా సాగుతోందని తెలుసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికలు సమీపించే నాటికి తమ జాతకం ఎలా ఉంటుందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామంపై ఆసక్తికర కథనం మీకోసం!         ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నెలల ముందే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడు పార్టీ వ్యవహారాలపై దృష్టిపెడుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి నెలకొన్న తరుణంలో ఆంధ్రాలో రాజకీయ పార్టీలు కూడా హడావుడి మొదలుపెట్టాయి.          ఇదిలా ఉంటే, టీడీపీ అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీలో చిత్రమైన పరిణామం సంభవించింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ముగ్గురు ఆశావహులు రాజీకి వచ్చారు. తమలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా ఫర్వాలేదనీ, అందరం కలిసి పనిచేసుకుంటామనీ ఆ ముగ్గురు నేతలు నేరుగా చంద్రబాబు వద్దకు వచ్చిచెప్పారు. టిక్కెట్‌ లభించని మిగతా ఇద్దరికి నియామక పదవులు ఇవ్వాలని వారే సూచించారు. స్థానికంగా ఉన్న నేతలే ఇలా సర్ధుబాటు చేసుకోవడంతో అధిష్టానానికి ఆ తలనొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక స్థానాల్లో టీడీపీ టిక్కెట్‌ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా "మదనపల్లె ఫార్ములా''ని పాటించాలని నిర్ణయించారు. అయితే మదనపల్లె నేతల మాదిరిగా వారిలోనూ ఉదార స్వభావం ఉండాలి కదా? అన్నది కొందరు నేతల సూటి ప్రశ్న!          సార్వత్రిక ఎన్నికలకు ముందే 40 మంది అభ్యర్ధులను ప్రకటించాలని టీడీపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిన్నట్టు సమాచారం. ఎవరెవరిని ప్రకటించాలనే అంశంపై పార్టీలో ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రత్యర్ధుల వ్యూహాలను గమనిస్తూ జాబితాను విడుదల చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఎక్కడైతే పోటీ ఎక్కువగా ఉందో అటువంటి స్థానాల్లో నేతల మధ్య సఖ్యత లేనిపక్షంలో వారిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాంటి నేతలకి త్వరలోనే ఆహ్వానాలు అందనున్నాయి.          ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్‌ కూడా ఉంది. ప్రస్తుత సిటింగ్‌లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోంది. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. సీఎం పలుమార్లు పిలిపించి మాట్లాడినప్పటికీ ప్రవర్తన మార్చుకోని వారికి ఉద్వాసన పలకాలని టీడీపీ నాయకత్వం డిసైడ్‌ అయ్యింది. నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టినప్పుడు కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒక మాటని స్పష్టంచేశారు. స్థానిక అభ్యర్ధిని మారిస్తేనే పార్టీ గెలుస్తుందని కుండ బద్దలుకొట్టేశారు. ఇటీవల చంద్రబాబు చేయించిన ఒక సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బలమైన సంకేతాలు అందాయి. అలాంటివారికి టిక్కెట్‌ నిరాకరించినప్పటికీ పార్టీకి వారు చేయగలిగే నష్టం ఏమీ ఉండదని కార్యకర్తలు చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో టిక్కెట్లు పొందిన ఆయా నేతల గురించి తెలుగు తమ్ముళ్లకు ఏమీ తెలియదనీ, కేవలం తెలుగుదేశంపై అభిమానంతోనే వారికి జైకొట్టామనీ పలువురు పేర్కొన్నారు.            తాము చేయించిన సర్వే ఫలితాలను పరిశీలించిన ముఖ్యమంత్రి టీడీపీకి గుదిబండగా మారిన వారిని వచ్చే ఎన్నికల్లో మార్చివేయాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో 30 నుంచి 40 మంది వరకు ప్రజాప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినవారిలో కొందరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటివారిలో కొందరు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారనీ, వారి పేర్లు కూడా తొలి జాబితాలో చోటుచేసుకునే అవకాశముందనీ టీడీపీ పెద్దల కొందరు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద నేతలు వలస వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి చోట్ల స్థానికంగా పాత, కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించాలని పార్టీ హైకమాండ్‌పై తెలుగు తమ్ముళ్లు వత్తిడి తెస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తెలుగుదేశంలో కీలక పరిణామాలు చేటుచేసుకుంటాయని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూద్దాం!
×
×
  • Create New...