Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 05/06/2018 in Posts

  1. teja g

    JAI SREERAMA

    JAI SREERAM
    2 points
  2. 1 point
  3. girikurnool

    JAI HANUMAN

    Jai Hanuman
    1 point
  4. Rtn

    JAI SREERAMA

    Jai Sree Ram
    1 point
  5. NBK NTR

    JAI HANUMAN

    Jai hanuman
    1 point
  6. NBK NTR

    JAI SREERAMA

    Jai Sreeram Om sairam
    1 point
  7. Bezawada_Lion

    JAI SREERAMA

    Jai Sree Ram
    1 point
  8. ఏడుకొండల వాడికి ఎసరు! 06-05-2018 01:34:41 ‘చరిత్ర’ పేరిట కేంద్రం కుట్ర భక్తుల మనోభావాలతో ఆటలు దివ్య పుణ్యక్షేతాన్ని ‘పురావస్తు’గా మార్చి,చేతుల్లోకి తీసుకొనే ఎత్తు జీర్ణ కట్టడాల్ని కాపాడే శాఖ చేతికి జనజీవత్వంతో వెలిగే దేవాలయం అదే జరిగితే విస్తరణ, అభివృద్ధికి గండి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ టీటీడీ ఈవోకు పురావస్తు శాఖ లేఖ ఏడేళ్ల క్రితమూ ముంచుకొచ్చిన ముప్పు ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు, జనాగ్రహంతో టీటీడీ సాధికార కమిటీ యత్నాలకు బ్రేక్‌ మళ్లీ ఇన్నాళ్లకు తిరగదోడిన ఢిల్లీ పెద్దలు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారంతో వెనకడుగు.. ‘కర్ణాటక’ భయంతోనే! వందల సంవత్సరాల చరిత్ర! ఏ రాయిని ముట్టినా, ఏ స్తంభాన్ని తాకినా ప్రతిధ్వనించే ప్రాచీన వేద గానం! అన్నమయ్య గొంతులో పలికిన ఆది జానపదాల జావళీలు! ఏడు కొండల మీద వెలిసిన కలియుగ దైవానికి క్రీస్తుశకం తొలి పాదంలో తొండమాన్‌ చక్రవర్తి కట్టించిన ఆలయం!.. కథలు కథలుగా చెప్పుకొంటున్న, పాటలుగా పాడుకొంటున్న ఈ చరిత్రే ఇప్పుడు తిరుమల వేంకటేశ్వరుడికి, ఆయన ఆలయాలకు బంధనం కానుందా? ‘చరిత్ర గల’ అనే పేరిట వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదా? జీర్ణదశలో ఉన్న కట్టడాలను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖకు.. జన జీవత్వంతో ప్రవర్ధమానమవుతున్న ఆలయాన్ని అప్పగించడానికి రంగం సిద్ధం చేసిందా? పురావస్తు శాఖ టీటీడీకి పంపిన తాజా లేఖను చూస్తే.. అవునన్న సమాధానమే వస్తోంది. అమరావతి, తిరుపతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమల తిరుపతి దేవస్థానం, దాని పరిధిలోని ఆలయాలను ‘రక్షిత కట్టడాలు’గా ప్రకటించి..పరిరక్షించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించండి’ ..అంటూ భారత పురావస్తు శాఖ విజయవాడలోని తన విభాగం ద్వారా శుక్రవారం టీటీడీకి ఓ లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ప్రజలకే కాదు.. ఏడుకొండల వాడికీ ఎసరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ఈ లేఖ స్పష్టంచేస్తోంది. నిజానికి, ఏడేళ్ల క్రితం, 2011 ఇలాంటిదే ప్రతిపాదన ముందుకువచ్చినప్పుడు..ఆ ఆలోచనను వ్యతిరేకిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన కథనం ప్రచురించింది. టీటీడీలోని అంతర్గత విభేదాలు ఎలా తిరుమల ఆలయం అస్తిత్వానికి ముప్పుగా మారిందీ, ఈ ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించడానికి రహస్యంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వెలుగులోకి తెచ్చింది. ఆ కథనంతో భక్తులు కదిలి.. ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను వరుసగా దెబ్బతీస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం రూపంలో ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ‘మా వాళ్లు వస్తారు. సమాచారం ఇవ్వండి’ అంటూ ఓ ఆదేశాన్ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు పురావస్తు శాఖ జారీ చేసింది. పురావస్తు శాఖకు ఇస్తే.. తిరుపతి సమీపంలో శ్రీనివాస మంగాపురం ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఆ మధ్య పురావస్తు శాఖకు అప్పగించారు. అప్పటినుంచి కాలు తీస్తే ఒక నిబంధన, కాలు వేస్తే ఒక నిబంధన అన్నట్టు.. ఆలయ నిర్వాహకులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేకుండాపోయింది. చివరకు ఉత్సవాల సమయంలో పందిళ్లు వేయాలన్నా ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయం పక్కన దారికి అడ్డంగా పడిపోతున్న శిథిల తోరణాన్ని తొలగించడానికే దశాబ్దాల కాలం పట్టింది. ఈ ఆలయమనే కాదు, పురావస్తు శాఖ సంరక్షణలోని కట్టడాలకు మరమ్మతులు, పునర్నిర్మాణాల కోసం అనుమతులు పొందటం చాలా కష్టం. ఎందుకంటే, ఈ శాఖ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఏదైనా ఒక కట్టడాన్ని, ప్రదేశాన్ని, చారిత్రక ప్రాంతాన్ని పురావస్తు ప్రదేశంగా ప్రకటిస్తే... వాటి చుట్టూ ప్రత్యేక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఆ కట్టడంతోపాటు, చుట్టూ ఉన్న వంద మీటర్ల ప్రాంతాన్ని నిషిద్ధ స్థలంగా ప్రకటిస్తారు. మరో వంద మీటర్ల పరిధిని రెగ్యులేటెడ్‌ ఏరియాగా గుర్తిస్తారు. ఇలా ప్రకటించిన ప్రదేశంలో... దాని యజమానితో సహా ఎవరూ, ఎలాంటి మార్పులు చేపట్టకూడదు. కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెడితే...ఉన్నవాటికి మరమ్మతులు కూడా చేయడం కుదరదు. లేఖలో ఏమున్నదంటే.. ‘‘తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), దాని పరిధిలోని ఇతర దేవాలయాల ప్రాచీనత, చారిత్రక నేపథ్యం దృష్ట్యా వాటిని రక్షిత కట్టడాలుగా ప్రకటించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మా డైరెక్టరేట్‌కు సమాచారం అందింది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన వివరాలను, విశేషాలను పరిశీలించేందుకు మా భారత పురావస్తు విభాగం అధికారులు మిమ్మల్ని కలుస్తారు. సంబంధిత సమాచారాన్ని వారికి అందజేసి సహకరించాలని విజ్ఞప్తి.’’ అంటూ టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు విజయవాడలోని తమ విభాగం ద్వారా భారత పురావస్తు శాఖ లేఖ రాసింది. సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ సంతకంతో శుక్రవారం అందిన ఈ లేఖ తీరును చూస్తే, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. తెల్ల పాలకులే తాకలేదు వాస్తవానికి తిరుమలలోని ప్రధాన ఆలయాలతో పాటు పరిసరాల్లోని వివిధ ఆలయాలు కూడా వందల సంవత్సరాల నాటివి. ప్రస్తుతం ఉన్న గర్భగుడి, విమాన ప్రదక్షిణం, సంపంగి ప్రదక్షిణం, బాహ్య ప్రాకారం కలిపి తూర్పు, పడమరలుగా 415 అడుగులు... ఉత్తర, దక్షిణాల్లో 263 అడుగులు 1843 లోనే ఏర్పాటయ్యాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన వచ్చాక ఈ ఆలయ నిర్వహణను హథీరాంజీ మఠానికి, ఆ తర్వాత 1932లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించారు. అంతకముందే తొండమాన్‌ చక్రవర్తి ఒకటో శతాబ్దంలోనే ప్రధాన ఆలయాన్ని నిర్మించినట్లు రికార్డులున్నాయి. అప్పటినుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ వచ్చింది. ఈస్ట్‌ ఇండియా పాలకులుగానీ, చివరకు బ్రిటిషర్లు కూడా ఈ ఆలయాన్ని తాము పరిపాలించాలని కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు కేంద్రం దానిపై కన్నేసింది. నిజానికి, రాష్ట్రాల పరిధిలోని కట్టడాలను భారత పురావస్తు శాఖ తీసుకోవాలంటే, ఆ రాష్ట్రం నుంచి అభ్యర్థన రావాలి. ఈ కారణంగానే 2011లో ఒకసారి తీర్మానం చేసినా, మళ్లీ వెనక్కి తీసుకొంది. అప్పట్లోనూ ఇలాగే.. తిరుమల గర్భాలయం సహా అన్ని ఆలయాలను భారత పురావస్తు శాఖకు అప్పగించి వాటి నిర్వహణను ఆ సంస్థ ద్వారా చేపట్టాలని, ఆలయానికి సంబంధించిన హక్కులు మాత్రం టీటీడీకే ఉండాలని పేర్కొంటూ 2011లో టీటీడీ సాధికార కమిటీ ఓ తీర్మానం చేసింది. తిరుమల ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయం(తిరుచానూరు), గోవిందరాజ స్వామి ఆలయం(తిరుపతి), కపిలేశ్వర స్వామి ఆలయం(తిరుపతి), కోదండరామ స్వామి ఆలయం(తిరుపతి), ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం(అప్పళాయగుంట), అభయ వేంకటేశ్వరస్వామి మందిరం (నారాయణవనం), వేదనారాయణ స్వామి ఆలయం(నాగలాపురం), వేణుగోపాలస్వామి ఆలయం(కార్వేటి నగరం)లను కలుపుకొని మొత్తం 9 ఆలయాలను ఈ జాబితాలో చేర్చిం ది. దీనిపై అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు.. చాలా రహస్యంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖకు పంపిన లేఖలోని అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడం, జనాగ్రహంతో ఆ ప్రతిపాదన ఆగింది. గత్యంతరం లేక కొద్ది రోజుల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది. తూచ్‌.. తిరుమల వెంకన్నను గుప్పిట్లో పెట్టుకోవాలన్న తన ఆలోచనలు బట్టబయలు కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పురావస్తు శాఖ లేఖ విషయాన్ని శుక్రవారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రజల ముందుకు తెచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమయింది. ఆగమేఘాల మీద తన ప్రతిపాదనను వెనక్కి తీసుకొంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఈ అంశం కర్ణాటక ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పరిణమించవచ్చునన్న ఆలోచనతోనే ఇలా వెనక్కి తగ్గినట్టు సమాచారం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ విజయవాడలోని పురావస్తు శాఖ విభాగం శనివారం మరో లేఖను టీటీడీ ఈవోకు రాసింది. ‘రక్షిత కట్టడం’ గా తిరుమల ఆలయాన్ని పరిగణించడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ శుక్రవారం తాను రాసిన లేఖను ఉపసంహరించుకొంటున్నట్టు తాజా లేఖలో పేర్కొంది. పరిరక్షించుకొనే సామర్థ్యం ఉంది ‘‘తిరుమల తిరుపతి దేవస్థానం, వాటి ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం టీటీడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర పురావస్తుశాఖ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పురావస్తుశాఖ రాసిన (శుక్రవారం) లేఖపై సీఎంతో చర్చించిన తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటాం. దేశ, విదేశాల్లో తిరుమలకు కోట్లాది మంది భక్తులున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు టీటీడీ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి’’ - కేఈ కృష్ణమూర్తి, దేవదాయశాఖ మంత్రి కంగారు పడక్కర్లేదు ‘‘ఢిల్లీ ఆర్కియాలజీ విభాగం అధికారులతో మాట్లాడాం. తమకు తెలియకుండా విజయవాడ ఆఫీస్‌ నుంచి ఆ లేఖ జారీ అయ్యిందని వారు తెలిపారు. అది పూర్తిగా తప్పుడు కమ్యూనికేషన్‌. దాన్ని పంపించి ఉండాల్సింది కాదు. అలాంటి నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఆ లేఖను వెనక్కి తీసుకుంటామని భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడితో ఈ వివాదానికి తెరపడిందని భావిస్తున్నాను’’. - అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టీటీడీ ఈవో సంతోషంగా ఉంది ‘‘లేఖ అంశాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ దృష్టికి తీసుకెళ్లా. వెంటనే లేఖను వెనక్కి తీసుకోవడం సంతోషంగా ఉంది. ఆ లేఖ రాసిన అధికారిపై తప్పక చర్య తీసుకొంటామని హామీ ఇచ్చారు. తమ అధికారుల వైపునుంచి జరిగిన పొరపాటుకు బాధ్యత వహించి, టీటీడీకి ఏఎస్ ఐ డీజీ స్వయంగా క్షమాపణలు చెప్పడం ఆనందాన్ని కలిగించింది’’ - జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ ఎంపీ టీటీడీ ఈవోకు పురావస్తు శాఖ శుక్రవారం రాసిన లేఖ 5-2-11 తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం
    1 point
  9. teja g

    JAI SREERAMA

    JAI SREERAM
    1 point
  10. NAGA_NTR

    JAI SREERAMA

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
    1 point
  11. girikurnool

    JAI HANUMAN

    Jai Hanuman
    1 point
  12. Bullet

    JAI SREERAMA

    Jai sree ram
    1 point
  13. Bezawada_Lion

    JAI HANUMAN

    Jai Sree Ram Jai Hanuman
    1 point
  14. Rtn

    JAI SREERAMA

    Jai Sree Ram
    1 point
  15. Bezawada_Lion

    JAI HANUMAN

    Jai Sree Ram Jai Hanuman
    1 point
  16. MRP

    JAI HANUMAN

    Jai Hanuman
    1 point
  17. MRP

    JAI HANUMAN

    Jai Hanuman
    1 point
×
×
  • Create New...