Jump to content

sonykongara

Members
  • Posts

    66,716
  • Joined

  • Last visited

  • Days Won

    90

sonykongara last won the day on April 4

sonykongara had the most liked content!

1 Follower

About sonykongara

  • Birthday 09/01/1987

Profile Information

  • Gender
    Male
  • Location
    PALNADU, CHENNAI

Recent Profile Visitors

24,062 profile views

sonykongara's Achievements

  1. మా అభ్యర్థుల గెలుపును ఆపలేరు: సీఎం రేవంత్‌ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. Published : 17 Apr 2024 04:13 IST భారాస నుంచి హస్తం గూటికి చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా వాసి, భారాసకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాసి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన.. వారి మెడలో పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని సీఎం అన్నారు.
  2. Nara Lokesh: నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. Updated : 17 Apr 2024 16:23 IST గుంటూరు: కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెదేపా అని, వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లకుపైగా నిధులు కేటాయించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెదేపాకి 70 లక్షల మంది కార్యకర్తలే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 50 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుభానితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేశ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
  3. అనపర్తి సీటు కోసం తాజాగా ఉంగుటూరు లేక దెందులూరు సీటు అడుగుతున్న బీజేపీ.
  4. విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.
  5. Guntur west lo ycp storng avuthundi, TDP ayomayam ga unnadi anipisthundi, vennu potulu kuda untayi anipisthundi.
×
×
  • Create New...