Jump to content

Recommended Posts

తానా ఎన్నికల అక్రమాల విచారణకు కమిటీ..!

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపడానికి బోర్డు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ప్రస్తుతం తానాలోనే కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఒకరు.. మరో కీలక పదవికి పోటీ చేస్తూ… ఓటర్ల లిస్టులో దొంగ ఓటర్లను చొప్పించారు. ఈ కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన ఎన్నికల కమిటీ.. అత్యవసరంగా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఏం చేయాలో చర్చించింది. అంతిమంగా మూడు అంశాలపై తీర్మానాలు చేశారు. అందులో మొదటిది.. తానాలో అత్యంత సీనియర్లు, అందరి ఆమోదం కలిగిన ముగ్గురు గౌరవప్రదమైన వ్యక్తులతో… దొంగ ఓట్ల వివాదంపై విచారణ జరిపించాలని నిర్ణయించారు. ఈ కమిటీలో బండ్ల హనుమయ్య, జంపాల చౌదరి, మురళీ వెన్నం సభ్యులుగా ఉంటారు. వీరు మొత్తం అవకతవకలుజరిగిన విధానం… ఎవరు చేశారు… ఎలా చేశారన్నదానిపై విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. రెండోది ఎన్నికల కమిటీ మరోసారి ఖచ్చితమైన ఓటర్ లిస్టును రెడీ చేసి సమర్పించాలి. మూడోది.. ఏప్రిల్ ముప్ఫయ్యో తేదీలోపు.. సభ్యులందరికీ బ్యాలెంట్లు పంపిణీ చేయాలనే తీర్మానాలు చేశారు. సమావేశానికి ముందే.. నామినేషన్ అండ్ ఎలక్షన్ కమిటీ.. తన నివేదికను బోర్డుకు సమర్పించింది. అందులో దొంగ ఓటర్ల అవకతవకల గురించి సమగ్రంగా ఉంది. దాంతో విచారణ కమిటీ నియామకం చేయాలని తీర్మానం చేశారు. ప్రవాసాంధ్రులు అత్యధికంగా సభ్యులుగా ఉన్న తానాలో … దొంగ ఓటర్ల జాడ్యం తరహా పరిస్థితులు రావడం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతారు.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా.. అన్న చర్చ ఇప్పుడు తానా సభ్యుల్లో నడుస్తోంది.
telugu360.com

Link to comment
Share on other sites

7 minutes ago, Telugunadu said:

Ave ekkava.

Asalu takkuva.

Hahaha.

Asalu committee enduku? Aa committee vaallani gunde meeda cheyi vesukoni cheppamanandi.. Vallaki nijamga ee donga votes batch evaro teliyadu ani.

Link to comment
Share on other sites

2 hours ago, JVC said:

Hahaha.

Asalu committee enduku? Aa committee vaallani gunde meeda cheyi vesukoni cheppamanandi.. Vallaki nijamga ee donga votes batch evaro teliyadu ani.

Naku anta idea ledu bhayya.

Few years back aithe new member registration ani cheppi baga join chesaru.

Janalu interest ga lekapothe, valla details teesukuni $125 membership fee ni kuda pay chesaru. Literally $125 pay chesi vote konnaru.

One time payment and life time vote concept.You might know which panel I am talking about.

 

Link to comment
Share on other sites

నరేన్ కొడాలి చైర్మన్ గా నిర్వహించిన 2019 డీసి కాన్ఫరెన్స్ లెక్కల మతలబు ఇప్పటికీ తేలని విషయం తెలిసిందే. తానా బైలాస్ ప్రకారం కాన్ఫరెన్స్ పూర్తి అయిన 3 నెలలలోపే అన్ని లెక్కలు బోర్డుకి అందజేసి అప్రూవల్ తీసుకోవలసి ఉంది. కానీ కోర్ట్ కేసుల మాదిరి వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ రెండేళ్ళుగా సాగదీస్తున్న నరేన్ కొడాలికి తానా బోర్డు ఏప్రిల్ 25 గా చివరి గడువు ఇచ్చింది. ఏప్రిల్ 25న ఎట్టి పరిస్థితుల్లో బోర్డుకి లెక్కలు సమర్పించాలి.

 

అయితే నరేన్ కొడాలి ఒరిజినల్ ప్లాన్ ప్రకారం బ్యాలెట్స్ మెయిల్ అయ్యేదాకా అంటే ఏప్రిల్ 15 వరకు ఏదోలా డ్రాగ్ చేస్తే కాన్ఫరెన్స్ కాకి లెక్కలు తన మెడకి చుట్టుకోకుండా ఉంటాయి, ఎలక్షన్ లో ఏదోలా నెట్టుకొచ్చి తమ వాళ్ళు గెలిస్తే అప్పుడు గుడ్డిగా వారితో అప్రూవల్ తెచ్చుకోవచ్చు.

 

కానీ ఎలక్షన్ నిర్వహిస్తున్న థర్డ్ పార్టీ కంపెనీ ‘ఎలక్షన్ ట్రస్ట్’ అమెరికా అధికారిక తపాలాశాఖ యూ ఎస్ పి ఎస్ కు చెందిన నేషనల్ చేంజ్ అఫ్ అడ్రస్ డేటాబేస్‌ లో అడ్రస్ ఫార్వార్డ్ రిక్వెస్ట్స్ ని ప్రాసెస్ చేసే ప్రక్రియలో డిలే అవ్వడంతో నరేన్ కొడాలి ప్యానెల్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇప్పుడు బ్యాలెట్స్ ఏప్రిల్ 25 లోపు రావు, కానీ ఏప్రిల్ 25న తానా బోర్డుకి డీసి కాన్ఫరెన్స్ లెక్కలు అప్పచెప్పాలి. ఆ లెక్కల్లో ఎటూ పెద్దమొత్తంలో బొక్కలున్నాయి. ఇప్పుడు అవి బయటకి వస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన నరేన్ కొడాలి ప్యానెల్ కొత్త డ్రామాకి తెరలేపారు. ఎలక్షన్ ఆగిపోయిందని, అడ్రసుల్లో మతలబు జరిగిందని ఒక ప్లాన్ ప్రకారం తన ప్యానెల్ వారిచేత సోషల్ మీడియాలో తానా ఎలక్షన్ కమిటీపై అనుమానం వచ్చేలా అసత్యప్రచారం మొదలుపెట్టించారు.

 

ఇంకో పక్క పెదరాయుడి స్టైల్ లో పారదర్శకత, సంస్థ గౌరవం, ఎమర్జెన్సీ మీటింగ్ అంటూ నరేన్ కొడాలి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఎన్నో నేషనల్ ఎలక్షన్స్ నిర్వహించిన అనుభవం ఉన్న థర్డ్ పార్టీ కంపెనీ ‘ఎలక్షన్ ట్రస్ట్’ తోపాటు తానా ఎలక్షన్ కమిటీ కూడా నిర్విరామంగా పనిచేస్తుందని, బ్యాలెట్స్ కొన్నిరోజులు మాత్రమే ఆలస్యం అవుతున్నాయని తానా ఎలక్షన్ కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు నిర్ధారించారు.

 

తానా సభ్యుల పూర్తి చిరునామాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల కమిటీ నిర్ణయించినందున కాస్త సమయం పడుతుందని, శుక్రవారంతో తుది పరిశీలన పూర్తి అయిందని, వచ్చే వారం బ్యాలెట్లను తపాలాకు అందిస్తామని ఐనంపుడి కనకంబాబు చెప్పారు. అయినా పదే పదే తానా ఎలక్షన్ కమిటీపై బురద చల్లడం ఎంతవరకు సబబు? అమెరికాలో ఉన్న ఎవరికైనా యూ ఎస్ పి ఎస్ అడ్రస్ ఫార్వర్డ్ రిక్వెస్ట్స్ గురించి తెలియకుండా ఉండదు.

 

అయినప్పటికీ నరేన్ కొడాలి ప్యానెల్ డీసి కాన్ఫరెన్స్ లెక్కలు బయటపడితే ఓటమి ఖాయమని తెలిసి, ఈ డ్రామాని రక్తికట్టించడానికి పడుతున్న కష్టాన్ని చూసి తానా సభ్యులు ఈసడించుకుంటున్నారు. తమ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడంతో తానా సభ్యులను పక్కదారిపట్టించడానికి ఎంతకైనా తెగిస్తారా అని అందరూ అనుకుంటున్నారు. 3 నెలల్లో సబ్మిట్ చేయాల్సిన కాన్ఫరెన్స్ లెక్కలు 2 సంవత్సరాలైనా సబ్మిట్ చెయ్యని నరేన్ కొడాలికి బ్యాలెట్స్ కొన్ని రోజులు లేట్ అయితే వచ్చే కంగారు ఏంటో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారేమో.

 

ఇలా ఒక ప్లాన్ ప్రకారం డ్రామాతో తానా పరువుని రోడ్డు కీడుస్తున్న నరేన్ కొడాలి ప్యానెల్ ఓటమి భయంతో కాన్ఫరెన్స్ లెక్కలు బయటకి రాకుండా ఉండేందుకు కోర్ట్ కెళ్ళినా ఆశ్చర్యం లేదని అంటున్నారు తానా సభ్యులు. తానా 44 ఏళ్ళ చరిత్రలో ఎంతోమంది కోర్టు మెట్లెక్కి జడ్జిలు చేత మొట్టికాయలు వేయించుకున్నారు తప్ప తానా మీద ఒక్క కేసు కూడా గెలవలేదు. చూద్దాం కాన్ఫరెన్స్ లెక్కలు బయటకి రాకుండా ఉండేందుకు తానా మీదే కోర్ట్ కెళ్లిన ఘనత సాధిస్తారేమో! తానాను తామే ఇన్నాళ్లు ఏకచక్రాధిపత్యంతో ఏలాము అన్నవాళ్ళే ఈ పరిస్థితికి రావడం విడ్డూరం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...