Jump to content

డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఇక లేరు

rajanani

Recommended Posts

కాకర్ల సుబ్బారావు కన్నుమూత 

కాకర్ల సుబ్బారావు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.  పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత  వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషకంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు.

Link to comment
Share on other sites

తెలుగునేల వైద్య దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని.. ఆయన మరణం వైద్యవృత్తికి తీరనిలోటు అన్నారు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావులు కాకర్ల అని కొనియాడారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య
సేవలకు ఆయన ఎంతో సేవ చేశారన్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, ravindras said:

96 years good.

it is tough for many people to cross 80 

6 hours ago, rama123 said:

RIP....US lo entho earnings ni vadukukoni ntr maata meeda ap ki vachi ...nims ni oka pride inistitutevgaa teerchididdaru

1 hour ago, rajanani said:

తెలుగునేల వైద్య దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని.. ఆయన మరణం వైద్యవృత్తికి తీరనిలోటు అన్నారు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావులు కాకర్ల అని కొనియాడారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య
సేవలకు ఆయన ఎంతో సేవ చేశారన్నారు.

Aayana aathma santhoshanga vellalani devunni prarthisthunna.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...