Jump to content

Just 3 days appu dorkkapote , jaggadi paristiti


bharath_k

Recommended Posts

13 hours ago, Nfdbno1 said:

cbn and yanamala calling each other on phone and laughing... no words .. only laughing 😂 

Oka video eyochu ga evaraina ee concept paina.

Link to comment
Share on other sites

2021-22లో నికర రుణ పరిమితి రూ.42,472 కోట్లే
రూ.27,589 కోట్లు పెట్టుబడి వ్యయం చేయాల్సిందే
రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్రం లేఖ

Link to comment
Share on other sites

ఈనాడు, అమరావతి: ఇక రాష్ట్రం ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి వీలు లేదు. ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికీ కుదరదు. పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితి (నెట్‌ బారోయింగ్‌ సీలింగు) ఎంతో కేంద్రం నిర్దేశిస్తోంది. ఇందులోనే అన్ని రకాల అప్పులు ఉంటాయి. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయోత్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా వేశారో అందులో కేవలం 4శాతం మేర మాత్రమే నికర రుణంగా ఉండాలి. అంటే... ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణంలో... తిరిగి చెల్లించిన అప్పును మినహాయిస్తే నికర రుణ పరిమితి ఎంతన్నది తేటతెల్లమవుతుంది. ఇందులోభాగంగానే పదిహేనో ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.10,61,802 కోట్లను స్థూల జాతీయోత్పత్తిగా అంచనా వేసింది. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఈ నికర రుణ పరిమితిని దాటకూడదు.  బహిరంగ మార్కెట్‌, ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునేవి, చిన్న తరహా పొదుపు మొత్తాలు, విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణం, ప్రావిడెంట్‌ ఫండ్‌, చిన్న మొత్తాల పొదుపు, రిజర్వు నిధులు, డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం... ఇవన్నీ దీనిలోకి వస్తాయని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖను పంపింది. దీంతో పాటు రెండు రకాల ఫార్మాట్లను జత చేసింది. రాష్ట్ర ఆర్థిక, రుణ పరిస్థితి, డిస్కంల వివరాలను దానిలో నింపి తమకు పంపాలని, ఆ తర్వాత రిజర్వుబ్యాంకు నుంచి రుణం పొందేందుకు వీలు కల్పిస్తామని తెలియజేసింది. పైగా స్థూల జాతీయోత్పత్తిలో నిర్దిష్టంగా కొంత మొత్తం మూలధన వ్యయంగా ఖర్చు చేయాల్సిందేనని పేర్కొంది. అలా ఖర్చు చేయని పక్షంలో నికర రుణ పరిమితిలో 0.50శాతం మేర కోత విధిస్తామని తెలియజేసింది.

Link to comment
Share on other sites

రాష్ట్రాలు కచ్చితంగా ఇంత మొత్తాన్ని పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేయాలని కూడా కేంద్రం పరిమితి విధిస్తోంది. 2018-19లో రాష్ట్రం పెట్టుబడి వ్యయం, 2019-20లో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు, 2021-22 స్థూల జాతీయోత్పత్తిలో 0.50శాతం ఎంతో... ఆ లెక్కల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని పేర్కొంటోంది. ఆ లెక్కన 2021-22లో రాష్ట్రం రూ.27,589 కోట్లు పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయాలని నిర్దేశించింది. ఆ ప్రకారం ఖర్చు చేయకపోతే జీడీపీలో 0.50 శాతం అంటే... రూ.5 వేల కోట్లకుపైగా నికర రుణ పరిమితిలో కోత పెట్టనుంది. ఏడాదికి మూడు సార్లు దీన్ని సమీక్షిస్తుంది. సెప్టెంబరులో తొలి మూడు నెలల పరిస్థితిని, డిసెంబర్‌లో ఆరు నెలల పరిస్థితిని, మార్చిలో తొమ్మిది నెలల కాలంలో పెట్టుబడి వ్యయం నిర్దేశించినట్లుగా ఉందో లేదో సమగ్రంగా పరిశీలిస్తుంది.

ఫార్మాట్లలో వివరాలు పంపండి

కేంద్ర ఆర్థిక శాఖ రెండు ఫార్మాట్లు పంపి అందులో గణాంకాలు నింపి తక్షణమే కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగానికి తెలియజేయాలని సూచించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం వాస్తవ లెక్కల నుంచి 2021-22 అంచనాల వరకు ఆ ఫార్మాట్‌లో వివరాలు నింపాలి. అందులో ప్రతీ ఏడాది వారీగా... అన్ని విభాగాల్లో ఆ ఏడాది చేసిన అప్పు, తీర్చిన రుణం, నికర రుణం వివరాలు తెలియజేయాలని కోరింది. అన్ని రకాల అప్పుల వివరాలు నమోదు చేయాల్సిందే. అలాగే విద్యుత్తు డిస్కంల నష్టాల వివరాలు, అందులో రాష్ట్రం వాటా పేర్కొనాల్సి ఉంది. దీంతో పాటు పెట్టుబడి వ్యయంగా ఎంత ఖర్చు చేశారో తేల్చి చెప్పాలి.

Link to comment
Share on other sites

మరో ఫార్మాట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రుణ గ్యారంటీలు ఎంత మేర ఇచ్చిందో వివరాలు కోరింది. 2020-21లో డిసెంబరు వరకు ఏ మేర గ్యారంటీలు ఇచ్చారు, ఆ తర్వాత మూడు నెలల్లో ఎన్ని ఇచ్చారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత మేర రుణ గ్యారంటీ ఇవ్వబోతుందో అంచనాల వివరాలు కూడా తెలియజేయాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర పబ్లిక్‌ రంగ సంస్థలు ఏ మేరకు నిధులు రాబట్టుకున్నాయన్న వివరాలూ పంపాలని పేర్కొంది. ఈ వివరాలన్నీ ఏప్రిల్‌ మొదటి వారానికల్లా పంపాలని గడువు విధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల బహిరంగ మార్కెట్‌ రుణ క్యాలెండర్‌ ఖరారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మాట్‌ ప్రకారం వివరాలు పంపితేనే సాధ్యమవుతుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...