Jump to content

Kesineni swetha credentials


Recommended Posts

తెలుగుదేశంపార్టీ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల మేయర్ అభ్యర్థి బయో-డేటా 
 
అభ్యర్థి పేరు : శ్వేత చౌదరి కేశినేని
వయస్సు : 25 సంవత్సరములు
జన్మస్థలం : విజయవాడ
వివాహం : అవివాహిత
తండ్రి పేరు : శ్రీనివాస్‌ కేశినేని
తల్లిపేరు : పావని కేశినేని
కుటుంబ నేపధ్యం : సోదరి : హైమ
విద్యార్హతలు : 

1) ప్రాథమిక విద్య :  ATKINSON SCHOOL & V.P. SIDDHARTHA SCHOOL, VIJAYAWADA.
THE LAWRENCE SCHOOL LOVEDALE, OOTY.

2) ఇంటర్మీడియట్‌ : THE INTERNATIONAL SCHOOL, BANGALORE.

😎 డిగ్రీ : B.A. PSYCHOLOGY, B.A. ECONOMICS,
EMORY UNIVERSITY, ATLANTA, USA.

వృత్తి : 
మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటి సర్వీస్‌ ప్రాజెక్ట్‌ ఘానా, ఆఫ్రికా.
చైల్డ్‌ సైకాలజి ప్రోగ్రామ్‌, ఐర్లాండ్‌, గాల్వే,
టాటా ట్రస్ట్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ MVSTF 1000 VILLAGE PROGRAM PROJECT, మహారాష్ట్ర
టాటా ట్రస్ట్‌ క్యాన్సర్‌ కేర్‌ ప్రోగ్రామ్‌, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, రాజస్ధాన్‌.

రాజకీయ నేపధ్యం :
2014 అట్లాంటా సెనేటర్‌ ఎన్నికలలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థి హిల్లరి క్లింటన్‌ తరపున ప్రచారం నిర్వహించారు.

2014-2019 ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని టిడిపి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార భాద్యతలు నిర్వహించారు.

రాజకీయ నేపధ్యం :
పశ్చిమ నియోజకవర్గం కొండ పైన, క్రింద ప్రాంతాల్లో పలుసార్లు సందర్శించి ఆ ప్రాంత ప్రజల సమస్యలు అయిన రోడ్డు, మంచినీరు, డ్రైనేజి, వీధి దీపాలు, దోమల బెడద తదితర అంశాల మీద ఎంపిగారికి ప్రణాళిక తయారు చేసి ఆ ప్రాంత సమస్యల మీద నివేదిక ఇవ్వడం జరిగింది.

గత రెందేళ్ళుగా పట్టణంలోని పేదప్రజల నివాస ప్రాంతాలు, రవాణా కార్మికుల ఆర్ధిక స్థితిగతులు, బీసెంట్‌ రోడ్డు, వన్‌టౌన్‌ వంటి వ్యాపార సంస్థల్లో పనిచేసే చిరు ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితులు వంటి అంశాల మీద వారికి కావలసిన మౌలిక సదుపాయాలు వంటి అంశాల మీద ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి, కార్పొరేషన్‌కి ఇవ్వడానికి నివేదిక తయారు చేయడం జరిగింది.

సేవా కార్యక్రమాలు :
కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో అనేకమంది పేదప్రజలకు ఆహారం, కోడిగుడ్రు, కూరగాయలు, బియ్యం మరియు నిత్యావసర సరుకులు, మాస్కులు, శాన్నిటైజర్లు ఉచితంగా అందజేయడం జరిగింది.

లాక్‌డౌన్‌ వల్ల రవాణా వ్యవస్థ స్థంబించడంతో దూరప్రాంత్రాలకు నడిచివెళ్ళే వలస కూలీలకు ఆహారపదార్ధాలు, చెప్పులు పంచడం జరిగింది.

సుదూర ప్రాంతాలకు శ్రామిక రైళ్ళ ద్వారా పనులు లేక స్వస్థలాల వెళ్ళే వలసకూలీలకు ఆహారం అందించడం జరిగింది.

కోవిడ్‌ సమయంలో విజయవాడలోని అనేక ప్రాంతాలలో వ్యాధి నిరోధక (స్పే చల్లించడం జరిగింది.

కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, కరోనా వ్యాధిపై అవగాహన కల్పించుటకు ఎలక్షానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా వేదికగా అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

గత రెందేళ్ళుగా పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగ కార్మికుల ఆర్ధిక స్థితిగతులు, బీసెంట్‌ రోడ్డు, వన్‌టౌన్‌, ఆటోనగర్‌, ప్రైవేటు టీచర్స్‌, వివిధ సంస్థల్లో పని చేసే చిరు ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన చిరు వ్యాపారుల ఆర్థిక పరిస్థితులు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, ఆదాయం ఖర్చు వంటి అంశాల మీద స్వచ్చంద సంస్థతో నివేదిక తయారుచేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...