Royal Nandamuri Posted March 4, 2021 Share Posted March 4, 2021 టీవీ వంక చూసాను.. నన్ను ఇంటికి తెచ్చిన రోజు రిబ్బన్ కటింగ్ ఎందుకు చెయ్యలేదూ? అని అడిగింది. నీక్కూడా బడాయి ఎక్కువైంది అనుకొని.. వెళ్ళి పూల కుండీలో నీళ్ళు పోస్తున్నాను.. అందులో ఓ రాయి ఉంది.. ఏనాడైనా నా జన్మ స్థలం ఎక్కడో చెప్పావా? అంది.. పాలమూరో, పెనమలూరో, పలమనేరో నాకెట్టా తెలుసుద్ది అనుకొని మొఖం పక్కకి తిప్పుకుంటే కరెంట్ స్థంభం, ట్రాన్స్ఫార్మర్ కనపడింది. నన్ను ఇక్కడ పెట్టిన రోజు రిబ్బన్ కటింగ్ చేసి అన్ని పత్రికల్లో వార్తలు రాయించావా? అంది.. నాది అంత పెద్ద స్థాయి కాదమ్మా అని చెబుతున్నంతలో అటుగా ఓ ఆంబులెన్స్ వచ్చింది.. నన్ను కొన్నప్పుడు డ్రోన్లతో వీడియోలు తీసి నన్ను మన మండలంలోని అన్ని ఊళ్ళల్లో కుయ్ కుయ్ మని ఊరేగించారా? నా ముందు తీన్మార్ డ్యాన్స్ వేసావా? అని అడిగింది.. నిన్నే అప్పు చేసి కొన్నారమ్మా! మళ్ళీ ఆ ఖర్చులెందుకు అనుకుంటుండగా అటుగా చేతిలో ఫోనుతో చెవిలో ఇయర్ ఫోన్స్ తో రాజ్యానికి రాజులా నడచి వస్తున్న సేవకుడు నావైపే చూస్తూ కళ్ళెగరేసాడు.. వోట్ మనకే వేసావా?? లేదంటే కరెంట్ కట్, నీళ్ళు కట్, స్కీం లు కట్ అన్నట్లు.. వెకిలిగా నవ్వుతూ కత్తిరిస్తున్నట్లుగా రెండు వేళ్ళతో సైగలు చేసుకుంటూ పోయాడు.. ఇలా ఎన్నో!! ఖంఢాంతరాల్లో ఉన్నా ఏ వస్తువు కనపడినా అందులో మన మార్కు కనపడతాంటే "పెపెంచ దేశాలన్నీ మన వైపే తిరిగి చూస్తున్నయ్యి" అన్న మన లెక్కల పండితుడి మాటలు చెవిలో రింగుమన్నాయి.. వేల కోట్ల నష్టాన్ని లాభం అని చెప్పాడంటే లెక్కల్లో పండితుడేగా? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.