Jump to content

ఓ 'చెప్పు' ఆత్మ హత్య


JVC

Recommended Posts

"ఓ 'చెప్పు' ఆత్మ హత్య"
-------------

నాకంటూ ఓ ప్రత్యేక 'గౌరవం' ఉండేది మా జాతిలో----
నిన్నటి దాకా!

నాకంటూ ఓ నిండైన 'ఆత్మ విశ్వాసం' వుండేది నా మది లో...నిన్నటి దాకా!!

నాకంటూ ఎవడూ కొనలేని ఓ 'ఆత్మ గౌరవం' ఉండేది మా పల్లె లో --నిన్నటి దాకా!!

నాకంటూ మచ్చలేని 'వ్యక్తిత్వం' ఉండేది మా ఇలాకా లో ---నిన్నటి దాకా!!!

నేనంటే ఓ 'డిసిప్లిన్,నేనంటే ఓ డెడికేషన్'మా జనాల్లో--నా దారి రాదారి అని!!

కానీ...
.
నిన్న...
.
అరకోటేసిన 
ఓ'అశుద్ధపు మొహాన్నీ'... 

కుల కుష్టు తో
కుళ్ళిపోయిన
ఓ 'నికృష్టపు మొహాన్నీ'...

ఓ నిలువెత్తు
'అసహ్యాపు ముఖాన్ని'...
ఓ రెండు కాళ్ళ
'సూకరాన్ని',

ఓ నిటారైనా
'అమానవీయాన్ని,
ఓ సిగ్గుఎగ్గు లేని నీచపు ముఖాన్ని,
ఓ కాషాయ 'అంట రానితనపు ముఖాన్ని'.........

లిప్త కాలమైనా తాకినందుకు,
అంటుకుని మైల పడినందుకు.....

అవమానాన్ని భరించలేక,
పరాభవాన్ని తట్టుకోలేక,
'ఆత్మహననం' చేసుకుంటున్నా!!

'ఆత్మ ఘోష' ని చెప్పుకోలేక 
'ఓ చెప్పు' చేసుకుంటున్న 'ఆత్మహత్య'ఇది!

#పాకాల_పరిశుద్ధరావు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...