Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

  • Replies 189
  • Created
  • Last Reply

*ప్యాన్‌కు.. ఎదురుగాలి*

తుది దశలో వైసీపీ దూకుడుకు కళ్లెం

అధికార పార్టీకి ఎదురొడ్డి నిలిచిన టీడీపీ అభ్యర్థులు 

బెల్లంకొండ వంటి మేజర్‌ పంచాయతీలో తమ్ముళ్ల జోరు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఊహించిన విధంగానే నాలుగోదశ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదురుగాలి వీచింది. అన్ని గ్రామాలను ఏకగ్రీవం చేసు కోవాలనే ఆలోచనకు ఆదిలో గండిపడింది. కేవలం 10శాతం గ్రామాలోనే ఏకగ్రీవాలకు అవకాశం ఏర్పడింది. మిగతా 239 గ్రామాల్లో అధికార పార్టీతో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. 16 మండలాల్లో ఎన్నికలు జరగ్గా రాత్రి 12 గంటలకు మొత్తం 239 పంచాయతీలకు 236 పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 147 మంది, వైసీపీ రెబల్స్‌ 13, గెలిచారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 68 మంది, టీడీపీ రెబల్‌ ఒకరు, జనసేన 4, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన కొన్ని గ్రామాల్లో ఫలితాలను తారుమారు చేయటం ద్వారా తమ ఖాతాలో వేసుకున్నారని టీడీపీ వర్గీయులు ఆందోళనలు నిర్వహించారు.  66 గ్రామాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి ఎన్నోవిధాలుగా ప్రయత్నించి ఫలితాలను ఏకపక్షం చేసుకోవాలని చూశారు. అయినప్పటికీ వారి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగకుండా టీడీపీ వర్గీయులు బరిలోకి దిగటమే కాకుండా ఒకవంతు స్థానాల్లో సత్తా చాటారు.

పేరేచర్లలో బారులు తీరిన ఓటర్లు
పెదకాకాని మండలంలో టీడీపీ తన హవాను చాటుకొంది. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన పెదకాకాని పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. వారి ఇంటి చుట్టూ ఉన్న వార్డుల్లో సైతం వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా టీడీపీ, వైసీపీకి గట్టిపోటీ ఇచ్చింది. ప్రకటించిన 19 స్థానాలల్లో 7 గ్రామాల సర్పంచ్‌ పదవులను టీడీపీ చేజిక్కించుకుంది. ఈ నియోజకవర్గంలోని  బెల్లంకొండ మేజర్‌ పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌ టీడీపీ ఉనికిని చాటేందుకు కృషి చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా టీడీపీ శ్రేణులు అధికారపార్టీ బెదిరింపులకు లొంగకుండా హోరా హోరీగా తలపడ్డారు. ప్రకటించిన 10 స్థానాల్లో 5  సర్పంచ్‌ పదవులను టీడీపీ వర్గీయులు చేజిక్కించుకున్నారు. వట్టిచెరుకూరు మండలంలో ప్రకటించిన 15 స్థానాలకు గాను 8 గ్రామాల్లో టీడీపీ విజయం సాధించింది.  ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన ప్రత్తిపాడుకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పార్టీ ఉనికిని కాపాడేందుకు కృషి చేశారు. 

డివిజన్‌లో అధికార పార్టీని వైసీపీ రెబల్‌ అభ్యర్థులు దెబ్బతీశారు. సత్తెనపల్లి మం డలం కంటెపూడిలో మాజీ ఎంపీపీ మాధ విని రెబల్‌ అభ్యర్థి ఓడించారు. ఎన్నికలకు ముందు గొడవ జరిగిన అమరావతి మండలం లింగాపురం, ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. నాలుగో దశలో వైసీపీ రెబల్స్‌ ను అదుపుచేయక పోవటం వల్ల అధికార పార్టీ ఎక్కువగా నష్టపోయింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...