Jump to content

3 years ago this time


BalayyaTarak

Recommended Posts

ఒక మూడేళ్ళ  క్రితం సరిగ్గా రేపటికి జనవరి 27ఒక మాహాద్భుతాన్ని చూసాను. తమ వ్యక్తిగత లాభం కోసం కాకుండా తమ భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం, లక్షలాది ఉద్యోగాలను తెచ్చే పరిశ్రమల కోసం అంతిమంగా ఒక సువర్ణ రాష్ట్రం కోసం యువత సోషల్ మీడియా అనే శక్తి ద్వారా సంఘతీతమై మహోజ్వలమైన పోరాటం చేసింది ..

తెలంగాణ ఉద్యమం తరువాత అలాంటి పోరాటాన్ని యువతలో పోరుషాన్ని తెగింపుని  నా జీవితంలో మళ్ళీ చూస్తాను అనుకోలేదు..  మహేష్ కత్తులు ,సంపూర్ణేష్ బాబులు ఇలా అసలు రాష్ట్రం తో సంబంధం లేని ప్రతి ఒక్కరు ప్రాణాలకు తెగించి, పోలీసుల దాష్టీకాన్ని ఎదుర్కొని  విశాఖపట్నం వచ్చి అనాథ లాంటి రాష్ట్రానికి మద్దతు తెలిపారు. అరెస్టులు అయ్యారు,కేసులు ఎదుర్కొన్నారు, ఆస్తులని అమ్ముకొని మరీ ఉద్యమానికి విరాళాలు ఇచ్చారు. 

 

యువత సోషల్ మీడియాలో హాస్యాన్ని వెకిలి తనాన్ని ప్రోత్సహించే మేమె లని స్వచ్చధంగా  వదిలేసి రాష్ట్రం కోసం ఒక  వారం పాటు  చలో విశాఖ అంటూ అందరిని కదిలించింది. ప్రతి పేజీ ప్రతి వెబ్సైట్స్ ఉచితంగా తమ వంతు సహకారం అందించాయి. అలా ఒక మాట తప్పిన దుర్మార్గపు ముఖ్యమంత్రి పై  దండయాత్ర చేశారు....కులగజ్జి పార్టీ మీద పోరాడారు. విశాఖపట్నానికి తరలి వచ్చారు. విశాఖలో  మరో సముద్రమే నేల నుండి ఎగజిమ్మిందా అనేంత ఆవేశానికి  విశాఖ బీచ్ రోడ్డు వేదిక అయ్యింది. 

 

 అలా.పోరాడిన ప్రతి యువకుడికి ,యువతికి, యువతరానికి సోషల్ మీడియా పేజీ వెబ్సైట్స్ నిర్వాహకులకు వందనం పాదాభివందనం.. 

జై యువతరం..మీరొక తరంగం..  ఆంధ్ర  రాష్ట్రం మరువదు మీ పోరు..

పాపం అంబానీ jio డాటా ఫ్రీ ఇవ్వడం మానేసి ఎయిర్టెల్ లాగా  రేట్లు పెంచినాక ఆ పోరాటాలు ఆగిపోయాయి...మీ తప్పు ఏమి లేదు.. తప్పంతా రేట్లు పెంచి మోసం చేసిన అంబానిదే..డౌన్ డౌన్ అంబానీ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...