Jump to content

BJP తిరుపతి ఎన్నికలకు బైబిల్ కావాలా? భగవత్ గీత కావాలా? తేల్చుకోమంటుంది


JVC

Recommended Posts

BJP తిరుపతి ఎన్నికలకు బైబిల్ కావాలా? భగవత్ గీత కావాలా? తేల్చుకోమంటుంది!!! 

☞ ఢిల్లీని తలదన్నే రాజధాని కావాలా వద్దా అని అడగట్లేదు!! 

☞ స్పెషల్ స్టేటస్ కావాలా వద్దా అని అడగట్లేదు!!

☞ పోలవరం కావాలా వద్దా అని అడగటంలా!! 

☞ రైల్వే జోన్ కావాలా వద్దా అని అడగరే!! 

☞ మన్నవరం కావాలా వద్దా అని మాట్లాడరే!!

☞ 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్ల ధనం తేవాలా వద్దా అని పలకరే .??

☞ ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలుకావాలా వద్దా అని అడగట్లా!!

☞ 35 రూపాయలకు పెట్రోలు.. కావాలా వద్దా .అని అడగరేంటి .??

☞40 రూపాయిల కి  డాలర్.. కావాలా వద్దా .అని అడగరేమిటి . ??

☞ పఠాన్కోట్ నిందితులు పట్టుకోవాలా వద్దా  
అని అడగట్లే!!! 🤭🤭

మరి ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పే దమ్ముందా???

☞ మాకు అధికారం వస్తే చొక్కా కాలరు పట్టుకుని లాక్కొస్తాం అన్నా దావూద్ ఇబ్రహీం ఎక్కడ.. ??

☞ ముంబై మీద తీవ్రవాద దాడికి బాధ్యుడైన హాఫీజ్ సయిద్ తల ఎక్కడ.. ??

☞ ప్రజాధనం పంది కొక్కుల్లాగా తిని హాయిగా దేశం నుండి పారిపోయిన మీ పార్టీ MP (రాజ్య సభ కు బిజేపి ఎం.పి. గా కర్ణాటక నుండి ఎన్నికయ్యారు) విజయ్ మాల్య ఎక్కడ..??

☞ ప్రజాధనాన్ని కొల్లగొట్టి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుని, హాయిగా విదేశాలలో జల్సా చేస్తున్న నీరవ్ మోడీ ఎక్కడ.. మేహుల్ చోస్కీ ఎక్కడ.. ??

☞ లాడాక్ నుండి చైనాను, టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతాం అన్నారు..  ఎక్కడ దాకా తరిమారు.. ??

☞  ఇక మాట్లాడ్డాలు లేవు.. కళ్లెర్ర జేస్తాం,, 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు.. ఏది..?? ఎక్కడ..??

☞  రైతు ఆదాయాన్ని పదిరెట్లు చేస్తానన్నారు.. ఎక్కడిదాక వచ్చింది.. ??

☞  మేడ్ ఇన్ ఇండియా అని అమెరికాకి ఎగుమతి చేస్తాము అన్నారు.. ఎక్కడిదాక చేశారు.. ??

☞   బేటీ బచావో అన్నారు... ఆడబిడ్డలను రేపులు చేసి చంపుతున్న మీ MP లకు, MLA లకు శిక్షలేవి.. ??

☞  బేటీ పడావో అన్నారు... ఎంతమంది ఆడబిడ్డలను చదివించారు..  ఎన్ని బడులు కట్టారు..?? 

☞  పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించినది ఏమిటి.. ??

☞ రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి.. ??

☞ అవినీతిని నిర్మూలనించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ??

☞ నత్త నడక నడుస్తున్న న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టి పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు.. మీరు తీసుకున్న చర్యలు ఏమిటి...??

☞  ఒక్క పూట తిండితో జీవనం గడుపుతూ వస్తున్న 35% పేదలకు, రెండోపూట తిండిని కూడా దూరం చేస్తున్న ధరల పెరుగుదల సమస్యపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ??

☞ ఈ దేశంలో గంటకు 4గురు మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.. రోజుకు 6 మంది అత్యాచారాలకు బాధితులుగా మారుతున్నారు.. వాటికి నివారణ చర్యలు ఏమిటి....?? 

సమాధానం చెప్పండి . 

కావాలంటే మరో 1000 సార్లు జై కొడతా..

మీరు చెప్పిన ప్రతి మాతకు... జై కొడతా..

▪️పందుల్లాగా రోడ్ల మీద చెత్త విసిరి, పాన్ పరాగ్ ఉమ్ములు ఊసే మీరు, పాచి ముఖము వేసుకుని, మాకు స్వచ్ఛ భారత్ కబుర్లు చెబుతూ... దేశభక్తి పోజులు కొడతారా.??

▪️ శత్రుదేశాలు మన సైనికులను చంపుతుంటే,, ఫోనులో ఆప్లికేషన్లు తొలగించేసి,, ఏదో ఊడబోడిచాం అని సంకలు గుద్దుకునే.. మీరా.. దేశాన్ని కాపాడే వీరులు..??

▪️ పాకిస్తాన్ వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన ముస్లింల మీద..

చైనా వాడు దాడి చేస్తే... ఈ దేశ పౌరులైన  కమ్యూనిస్టుల మీద..

అమెరికా వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన క్రైస్తవుల మీద..

ఆవు పేరుతో, మతం పేరుతో.. ఈ దేశ పౌరులైన దళితుల మీద..

.... దాడులు చేస్తూ,, విషం కక్కుతూ ఉండడమేనా.. మీ వీరత్వం..?? మీ దేశభక్తి..??

ఒక్క సారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. 

🔹 ఏంటి మీ వల్ల నా దేశ దేవాలయాలకు ఒక్క ఉపయోగం.. ???

దేవాలయాలకు మీరిచ్చిన నిధులు ఎన్ని? 

నియామకాలు ఎన్ని? 

7ఏళ్లలో ఎన్ని దేవాలయాలు కట్టినారు? 

ఎంత బడ్జెట్ ఇచ్చినారు??? . 

ఇంకా దేవుడిని, మతాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని ఏళ్ళు ఏలుతారో చూస్తాం..!!!.🤔🤔

Link to comment
Share on other sites

North east lo...particularly meeru vellaleni chotla lo...bharath Veligi pothundi. Kaavalante sontha kharchu tho velli chudandi. 
😜

andhra kante..bharath mukhyam kaabatti..AP ki emi cheyyakaPoyinaa..maa tho paate...Northie batch ki..free paada pooja cheyandi. 😁

Link to comment
Share on other sites

 

తిరుపతిలో గెలవాల్సిందే

Jan 18 2021 @ 03:33AMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
01182021033327n66.jpg
  • కపిలతీర్థం టు రామతీర్థం రథ యాత్ర
  • వైసీపీ ప్రభుత్వ ప్రజా
  • వ్యతిరేక విధానాలపై పోరు
  • బీజేపీ కోర్‌ కమిటీ నిర్ణయం

 

విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలవాలి. ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలి’’ అని ఆ పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. విశాఖ శివారు రుషికొండలో జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మురళీధరన్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, సునీల్‌ దేవధర్‌, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య, తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

 

‘‘తిరుపతి ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక బృందం పనిచేయాలి. కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలి’’ అని నిర్ణయించారు. వచ్చే నెలలో తిరుపతిలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర  చేపట్టాలని, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రకటించిన ఏ పథకాన్ని సజావుగా అమలు చేయడం లేదని, ప్రకటనలతో భ్రమింపజేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా చేస్తున్న ఎదురుదాడిని సమర్థంగా తిప్పి కొట్టాలని, ప్రజల్లోకి పార్టీ వాదనలు బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడానికి తటస్థంగా ఉన్న మాజీ నాయకులు, అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొంటున్న నేతలను సంప్రతించి, బీజేపీలోకి తీసుకురావాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది.

 

 

Baga కసి ga వున్నారు గా... టిడిపి all issues tho rallies cheyyali, Bjp ni irukuna పెట్టే scs కూడా add cheyyali.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...