Jump to content

Pointe PK first time


skilaru

Recommended Posts

అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధానన్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్‌ఫేర్‌ చేయడానికి ఎవరు సాహసిస్తారు?’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు  పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎ్‌సలు... మరో 115 మంది అదనపు ఎస్‌పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకొని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో అన్నారు. ‘‘నిస్సహాయుడైన డాక్టర్‌ సుధాకర్‌పైనా, సోషల్‌మీడియాలో మీపై, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు...దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? వార్డుకో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? గత రెండేళ్లలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి.

 

ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’’ అని పవన్‌ ప్రశ్నించారు. ఈ అరాచకంపై మాట్లాడితే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ ఫేర్‌ నడిపిస్తున్నాయని సీఎం జగన్‌ అనడం భావ్యం కాదని, అది బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని విమర్శించారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన  పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్‌ మండిపడ్డారు.

 

విగ్రహాల ధ్వంసంపై నేడు గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర నాయకులు గురువారం ఉదయం 11గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి

Link to comment
Share on other sites

CBN time lo istamvachinattu yegiri, ippudu moosukuni kurchunna mudragada ki, naaku telusu meeru yenta powerfull oo ani..

permission ledu ani last year maa mega family movie set ni teesepinchi 2cr bokka pettina kani, yemi peekaleni maaku telusu meeru yenta powerfull oo ani.. 

CBN time lo capital shift ante gonthemma korikalu kori, ippudu g** moosukuni kurchunna govt employees ki telusu meeru yenta powerfull oo ani..

................ ilanti points chepite inka bagundedi.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...