Jump to content

Modi government for Capitalists


adithya369

Recommended Posts

మోడీ పేరుతో భక్తులు ప్రచారం చేస్తున్న ఒక ఆర్టికల్ ను నాకు మెస్సెంజర్ లో పంపి దానికి నా స్పందన అడిగారు. దానికి నా స్పందన అనుకోండి లేదా అసలు వాస్తవం ఏంటి అని అయినా అనుకోండి. 
దానిలో ముఖ్యాంశాలు:- 1)యూపీఏ ప్రభుత్వం ఇరాన్, యుఎఈ దేశాలలో ఆయిల్ దిగుమతి చేసుకుని అప్పులు(నిజానికి గతంలో కేవలం ఇరాన్ కు మాత్రమే అని ప్రచారం చేశారు, దానికి పీయూష్ గోయల్ ఫేస్బుక్ పోస్ట్ ఉంది, ఇప్పుడు అధనంగా యుఎఈ ని కూడా జోడించారు) చేసింది.
2) విమానయాన సంస్థ అప్పులు
3) రైల్వేకి చెందిన అప్పులు 
4) బిఎస్ఎన్ఎల్ అప్పులు
5) సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
6) ముద్రా లోన్లు 
7) ఉచిత గ్యాస్ సిలిండర్
😎 18,500 గ్రామాలకు విద్యుత్
9) రోడ్లు 
1) చమురు దిగుమతి చేసుకున్నది భారతీయ చమురు కంపెనీలు తప్పించి భారత ప్రభుత్వం మాత్రం కాదు. ఒకవేళ ప్రభుత్వం కనుక చమురు కంపెనీలు చేసిన అప్పులు తీర్చడం అంటే సదరు మొత్తాన్ని ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ లో చూపించాలి. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఏదైనా బడ్జెట్ లో చూపించారా ఫలానా మొత్తం ఇరాన్, యుఎఈ దేశాలకు చమురు దిగుమతి కారణంగా పడిన బకాయిలు తీర్చడానికి అని? లేదు అంటే మోడీ ప్రభుత్వం అటువంటి అప్పులు ఏమి తీర్చలేదు. 
నిజానికి మన దేశ చమురు కంపెనీలు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు బదులుగా చెల్లించే మొత్తంలో 55% డాలర్ల రూపంలో తుర్కీకి చెందిన హల్క్ బ్యాంకు ద్వారా మిగిలిన 45% మొత్తాన్ని భారత దేశ రూపాయలలో యూకో బ్యాంకు ద్వారా చెల్లించేవి. మన రూపాయలలో ఇరాన్ తీసుకోవడం ద్వారా మనకు లాభం ఏమంటే ఇరాన్ తిరిగి ఆ మొత్తంతో మన దేశం నుండి పలు వస్తువులను దిగుమతి చేసుకునేది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ హల్క్ బ్యాంకు ద్వారా చెల్లించే మొత్తం నిలిచిపోయింది, కారణం అమెరికా వంటి దేశాలు ఇరాన్ చేస్తున్న అణు పరిక్షలు కారణంగా శాంక్షన్స్ విధించడం కారణంగా, అంతే తప్పించి మోడీ ప్రభుత్వం ఎటువంటి అప్పులు తీర్చలేదు. 2015 తరువాత శాంక్షన్స్ సడలించడంతో తిరిగి చమురు కంపెనీలు తమ అప్పులను చెల్లించాయి. దానికి 2016 లో మోడీ ఇరాన్ వెళ్ళిన సందర్భంగా కొన్ని ఒప్పందాలలో మార్పులు చేసుకోవడం జరిగింది తప్పించి మరేమీ లేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం చమురు అప్పులు తీర్చింది అనేది శుద్ధ అబద్ధం. 
2) విమానయాన సంస్థ అప్పులు, నిజానికి అవి అప్పులు కావు ప్రభుత్వ బకాయిలు, పోనీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ బకాయిలు చెల్లించడం సంగతి దేవుడెరుగు. మోడీ ప్రభుత్వం మరింతగా బకాయిలు పడింది, వాటి నుంచి బయటపడటానికి సంస్థనే అమ్మకానికి పెట్టింది. అంటే ఇది కూడా పూర్తిగా వాస్తవం కాదని తేలిపోయింది. 
3) రైల్వే అనేది మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. దానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ప్రయివేటు సంస్థలు మాదిరిగానే దాని నిర్వాణ కోసం అప్పులు తీసుకుంటుంది తీరుస్తుంది. దానికి 22 వేల కోట్ల రూపాయల అప్పు అనేది పెద్ద మొత్తం ఏం కాదు. మోడీ ప్రభుత్వం ఏమైనా అప్పులు తగ్గించందా అంటే ఏం లేదు సరికదా మరింతగా అప్పులు పెంచి రైల్వే స్టేషన్లు మొదలు రైళ్ళను కూడా తన మిత్రులకు దానం చేసింది. నిజానికి వాళ్ళకు దారబోయడం కోసమే ఇలాంటి దుష్ప్రచారం. ఇది కూడా తప్పుడు ప్రచారమే. 
4) బిఎస్ఎన్ఎల్  కూడా రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థే దాని నిర్వాణ కోసం కూడా అప్పులు తీసుకోవడం తీర్చడం అనేది సర్వసాధారణం. పోనీ మోడీ ప్రభుత్వం ఏమైనా bailout ప్రకటించి దానికి ఆర్థిక సహాయం ఏమైనా చేసిందా లేదే? అలాంటిది ఏమి చేయకపోగా సదరు సంస్థకు 3జీ, 4జీ స్పెక్ట్రమ్ ఇవ్వకుండా ఆంక్షలు విధించి దాని టవర్లను జియో సంస్థకు వాడుకోవడానికి అప్పనంగా ఇచ్చి సంస్థను మరింతగా అప్పుల పాలు చేయడమే కాకుండా ఇప్పుడు దానిని కారుచౌకగా మిత్రులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోంది మోడీ ప్రభుత్వం. గత ప్రభుత్వం మీద నిందలు వేసి దోపిడీ దిశగా మోడీ ప్రభుత్వం. 
5) సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు : - ఈరోజు కొత్తగా ఏం జరగడం లేదు, నిజానికి progress అనేది నిరంతర ప్రక్రియ అయితే గతంలో జరిగినంతగా జరిగిందా అంటే లేనేలేదు. ఆమధ్య పారామిలటరీకి చెందిన జవాన్లు తమను బుల్లెట్ ప్రూఫ్ లేని వెహికిల్ లో ఆపరేషన్ కోసం పంపడం అంటే తమ ప్రాణాలకు విలువ లేదా అని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో, దాంతో వారు ఎవరో కనిపెట్టి శిక్షించాలని నిర్ణయించారు. కాగ్ స్వయంగా నివేదిక ఇచ్చింది మోడీ ప్రభుత్వం గ్లేషియర్స్ లో సైనికులకు సరైన భోజనం కూడా పెట్టడం లేదని అంతేనా అంటే కాదు గతంలో రిజెక్ట్ చేసిన sleeping bags ను సంవత్సరాల తరువాత బయటకు తీసి ఇప్పుడు లే లో సైనికులకు ఇచ్చారు. ఇలాంటి అంశాలు కోకొల్లలు, కావాలంటే గూగుల్ చేయండి. 
6) ముద్రా లోన్లు:- కోట్ల మందికి ముద్రా లోన్లు ఇచ్చామని డప్పులు కొడుతున్నారు. ఇదేదో వీళ్ళే కొత్తగా ఇస్తున్నట్లు. నిజానికి ముద్రా లోన్లు అనేది ఒక పెద్ద హంబక్కు. ఎందుకంటే ఇచ్చిన లోన్లలో తొంబైఐదు శాతం పైగా పది వేల రూపాయల నుంచి 47 వేల రూపాయలు. ఆ మొత్తంతో ఏ వ్యాపారం చేస్తారు? నిజానికి మోడీ చెప్పే పకోడీల బండి కూడా రాదు. ఉదాహరణకు ఎనబైవ దశకంలో గ్రామాల్లో మహిళలకు పాడి సంరక్షణ కోసం మూడు వేల రూపాయల వరకు ఇచ్చే వారు ఎటువంటి కొలేట్రల్ లేకుండా, లోను కనుక నియమానుసారంగా కడితే, వెయ్యి రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే వారు. అప్పట్లో ఒక బర్రే ఖరీదు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య ఉండేది. మరదే ఇప్పుడు బర్రేను కొనాలంటే కూడా కనీసం రెండు లక్షల రూపాయలు కావాలి. అంటే మోడీ ముద్రా లోన్ తో కనీసం బర్రే కాదు కదా దూడ కూడా రాదు. ఇది కూడా ప్రచారమే తప్పించి ఉపాధి కల్పన మాత్రం కాదు. 
7) ఉచిత గ్యాస్ సిలిండర్:- ఈ పథకం ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు, అయితే గతంలో తీసుకున్న వారిలో ఎక్కువ శాతం ఉపయోగించుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా ఇచ్చినా తీసుకున్న వారిలో తొంబై శాతం మంది ఉపయోగించుకోవడం లేదు కారణం వారికి మరలా సిలెండర్ నింపించుకునే స్థోమత లేక అక్కడ వరకు ఎందుకు, సదరు పథకం ప్రచారం కోసం ఏ మహిళ ఫోటోను ఉపయోగించారో ఆ మహిళే సిలెండర్ పక్కన పెట్టి తమ సాంప్రదాయ కట్టెల పొయ్యి ఉపయోగించుకొంటుంది. 
😎 18,500 గ్రామాలకు విద్యుత్:- 66 సంవత్సరాలలో 5 లక్షల 20 వేల గ్రామాలకు విద్యుత్ ఇస్తే మోడీ ప్రభుత్వానికి 18,500 గ్రామాలకు విద్యుత్ ఇవ్వడానికి  మూడు సంవత్సరాలు పట్టింది. అంటే గత ప్రభుత్వాలు సంవత్సరానికి 7878 ల పైచిలుకు గ్రామాలకు ఇస్తే మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 6,166 గ్రామాలకు విద్యుత్ ఇచ్చింది. ఎంతో టెక్నాలజీ వచ్చిన తరువాత కూడా మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే కూడా వెనకబడే ఉందనేగా? 
9) రోడ్లు:- కేంద్ర ప్రభుత్వం రోడ్లను ఏమైనా కేవలం కట్టిన పన్నులతో మాత్రమే వేస్తుందా లేదే టోల్ గేట్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేస్తుంది. మధ్యతరగతి వాడు కష్టపడి కారు కొనుక్కుంటే టోల్ గేట్లకు/పెట్రో వడ్డనకు భయపడి కారును బయటకు తీయడం లేదు. ఇకపోతే బోర్డర్ లో వేస్తున్న రోడ్లకు మోడీ ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు చేసింది లేదు. వాటన్నింటికి మన్మోహన్ ప్రభుత్వమే కేటాయింపులు చేసింది. ఉదాహరణకు ఈమధ్యనే మోడీ ప్రారంభించిన రొహ్తాంగ్ టనెల్, గురించి చూస్తే టనెల్ తవ్వేటప్పుడు పక్కన ఉన్న కారణంగా సిల్ట్ రావడంతో ఆలస్యం జరిగిందని అధికారులు చెబుతుంటే గత ప్రభుత్వం చేయలేదు అంత నేనే అని మోడీ చెప్పుకున్నాడు. 
ఇదంతా ఎందుకు గత ప్రభుత్వాలు 66 సంవత్సరాలలో వేలాది సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా చేసిన అప్పులు కేవలం 54 లక్షల కోట్ల రూపాయలు అయితే మోడీ ఏర్పాటు చేసిన సంస్థ ఒకటి కూడా లేకపోగా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలు అమ్ముకున్న తరువాత కూడా కేవలం 6.5 సంవత్సరాల పాలనలో మోడీ చేసిన అప్పు మరో 54 లక్షల కోట్ల రూపాయలు. ఇదొక్కటే చాలు మోడీ ఏంటో తెలియడానికి. 
చివరగా ఒక మాట, ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి కోసం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో 75 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెబుతున్నారు. నిజానికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి అరవై కోట్ల మందికి పైగా తమ జీవికను కొనసాగిస్తుంటే వాళ్ళకు 75 వేల కోట్ల రూపాయలు అంటే ఒక్కో రైతు కుటుంబానికి సరాసరిన రోజుకు 16 రూపాయల 32 పైసలు ఇచ్చి తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరదే గుప్పెడు మంది పారిశ్రామిక వేత్తలకు లక్షాయాబై వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ చేస్తే వాళ్ళు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 
Modi government is for capitalists not for poor. 

--From Fb

Link to comment
Share on other sites

5 hours ago, kdrmk1sat said:

Modi is managing media. He is not resolving unemployment issue. When he is in opposition ,he urged create jobs for youth. Now he telling Aatmanirbar

Yes,  he is 

Indian youth kooda peddaga pattinchukovatla, SM lo  Pakodi Saab pics choosukoni,  paravasinchi pothunnaaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...