Jump to content

RTC employess naaki poyaru


bharath_k

Recommended Posts

 

Veededo vellaku podichadani palabhishekalu chesaru.  eppudu valla batuku kukka batuku aiyyindi 

Vellanu choosi telangana lo vallu susidie lu chesukoni recchi poyaru . 

Veedi aslu roopam evvala choosi ..  nana nakutunnaru. 

Vallaki vunnadi poyindi , vastadi anukndi poyindi. 

 

12242020090715n10.jpg

 

 

ఆర్టీసీలో విలీనానందం ఆవిరి

పీటీడీ ఉద్యోగుల విలవిల! 

పాత సదుపాయాలను కోల్పోయారు 

కొత్తగా అవకాశాలు కల్పించరు

కష్టాల్లో ఆరు వేల మంది  పీటీడీ ఉద్యోగులు

 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)లో విలీనమైందన్న ఉద్యోగుల ఆనందం ఆవిరైపోయింది. విలీనం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించిన ఉద్యోగులు నేడు కోల్పోయిన వాటిని తలచుకుని ఆవేదనకు గురవుతున్నారు.  పాలకుల ఆటలో తాము పావులుగా మారిపోయామన్న భావనలో ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ఉన్నారు. 

 

ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరే గానీ, పీటీడీ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు అంతకు ముందు ఉన్న సదుపాయాలను కూడా కోల్పోయి, అభద్రతాభావానికి గురవుతున్నారు. కృష్ణా రీజియన్‌ పరిధిలో ఆరు వేలకు పైగా ఉద్యోగులు ప్రతి రోజూ తమ దుస్థితిని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనాన్ని కోరుకోవడానికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. పాత పెన్షన్‌ను అందుకోవటం ద్వారా మలి దశలో భద్రత ఉంటుందన్నది ఒక కారణంకాగా, ఉద్యోగ భద్రత ఉంటుందనేది రెండోది. అందుకే వారంతా విలీనాన్ని బలంగా కోరుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంలో విలీనమైతే అదనపు ప్రయోజనాలు పొందుతామన్న ఆశతో విలీనాన్ని బలంగా కోరుకున్నారు. తీరా చూస్తే, విలీనంతో అంతకు ముందు ఉన్న ప్రయోజనాలు కూడా లేకుండా పోయాయి. కొత్తగా వచ్చింది కూడా ఏమీ లేదు.

 

ఇటీవల కరోనా కారణంగా రీజియన్‌లోని ఆర్టీసీ ఉద్యోగులు పలువురు మరణించారు. ‘ఆర్టీసీ’లో ఇలా మరణించిన వారి కుటుంబాలకు సంస్థాగతంగా ఆర్థిక సాయం అందేది. ఆర్టీసీని కాకుండా, కేవలం ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేయడంతో, సాంకేతిక సమస్యలు విలీనమైన ఉద్యోగులకు శాపాలుగా మారుతున్నాయి. వీటిపై ప్రభుత్వం బాధ్యత లేనట్టు వ్యవహరిస్తోంది. కొవిడ్‌ వల్ల చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు అనుభవిస్తున్న ఆందోళన ఇప్పుడు అంతా, ఇంతా కాదు.  ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) తరపున ఎలాంటి సెటిల్‌మెంట్స్‌ జరగకపోవటంతో వారి కుటుంబాలకు పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి. పాత పెన్షన్‌ విధానం అమలవుతుందనుకుంటే.. అది కూడా అమలు కావటం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చెందటం ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నామన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. 

 

పీటీడీ ఉద్యోగులకు ఇంకా సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి రాలేదు. ఈ సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి రావటానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు. పోనీ అప్పటి వరకు ఆర్టీసీ సర్వీస్‌ రూల్స్‌ను అమలు పరుస్తున్నారా అంటే అదీ లేదు. ఆర్టీసీలో ఉద్యోగులుగా ఉన్నప్పుడు అందరికీ అపరిమిత వైద్య సహాయం అందేది. ప్రభుత్వంలో విలీనం కావటం ద్వారా పరిమితి ఏర్పడింది. కిడ్నీ మార్పిడి, లివర్‌ మార్పిడి, డయాలసిస్‌, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాల వ్యాధులకు రూ.5 లక్షల సీలింగ్‌ దాటిపోయిందని, ఆ తర్వాత మంజూరు చేయడం లేదు. దీంతో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేపోతున్నారు. దీంతో పీటీడీ ఉద్యోగులు ఆర్టీసీలో గతంలో ఉన్న పరిమితి లేని సేవలను కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

పదోన్నతులూ లేవు

దీనికి తోడు అన్ని స్థాయిల్లో పదోన్నతులు నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో పదోన్నతులు  పొందేందుకు అర్హులైన ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని కేటగిరీల్లోనూ ప్రమోషన్లను అమలు చేయాలని ఉద్యోగులు ఇప్పుడు గొంతెత్తుతున్నారు. 

 

లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ దూరం

ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసినా, ఆర్టీసీలో పని స్వభావం ఒకటే. సిబ్బంది మీద క్రమశిక్షణా చర్యల కేసులను లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తీసుకోవటం లేదు. గతంలో ఇండస్ర్టీస్‌ యాక్ట్‌ పరిధిలో ఉండటం వల్ల కేసులను తీసుకునేవారమని ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా మారటం వల్ల తీసుకోవటం లేదని చెబుతుండడం వల్ల వారికి అన్యాయం జరుగుతోంది. విలీనం తర్వాత డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పోస్టులు భర్తీ అవుతాయనుకుంటే ఇప్పటి వరకు ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డబుల్‌ వర్క్‌ తగ్గుతుందని భావించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న ప్రత్యేక సెలవలు, సౌకర్యాలను పీటీడీ మహిళా ఉద్యోగులు అందుకోలేకపోతున్నారు. ఏప్రిల్‌ 1, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2019 వరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు 2017 మే నెల వేతన సవరణ అమలు చేయకపోవటం వల్ల వారికి పెన్షన్‌ చాలా తక్కువ వస్తోంది. వేతన సవరణ అమలు చేయటం ద్వారా వారికి రావలసిన వేతన బకాయిలు, ఎన్‌క్యాష్‌మెంట్‌ డిఫరెన్స్‌, గ్రాట్యుటీ చెల్లింపులు చేయటానికి అవకాశం కలుగుతుంది. ఇవి చెప్పుకోవటానికి పైకి కనిపించే ప్రధాన విషయాలు. సూక్ష్మంగా ఇంకా అనేక సమస్యలు పీటీడీ ఉద్యోగులను వెన్నాడుతున్నాయి.

Link to comment
Share on other sites

I spoke to KKD apartc depot employee.

Initial ga Chala happy feel ayyadu.... Babu worst ani annadu ....

Same person within 6 months mosapoyam antunnadu.

No allowance , no promotion , no transfer antunnadu...

Earlier independent avvadam valla easy ga undi 

Now everything under government and follow process .

Link to comment
Share on other sites

3 minutes ago, Andhrudu said:

I spoke to KKD apartc depot employee.

Initial ga Chala happy feel ayyadu.... Babu worst ani annadu ....

Same person within 6 months mosapoyam antunnadu.

No allowance , no promotion , no transfer antunnadu...

Earlier independent avvadam valla easy ga undi 

Now everything under government and follow process .

Ippudu babu gari gurinchi emannadu??

Link to comment
Share on other sites

6 minutes ago, Andhrudu said:

I spoke to KKD apartc depot employee.

Initial ga Chala happy feel ayyadu.... Babu worst ani annadu ....

Same person within 6 months mosapoyam antunnadu.

No allowance , no promotion , no transfer antunnadu...

Earlier independent avvadam valla easy ga undi 

Now everything under government and follow process .

Elections ki 6 months before biscuits vasthayani cheppu. Milk ready ga pettukomani cheppu abhishekaniki. Eesari state daddarillali.

Link to comment
Share on other sites

10 minutes ago, ChiefMinister said:

Ippudu babu gari gurinchi emannadu??

Krutagnatha anedi last word for them.

Babu meda emka positive opinion ledu but Jagan meda kopamga unnadu 

Villaki okkate margam ..... Golimar lo oka scene untadi ... Vallu mosam chesaru kabatti malla manam mosam cheseyadame 

Link to comment
Share on other sites

21 hours ago, Andhrudu said:

I spoke to KKD apartc depot employee.

Initial ga Chala happy feel ayyadu.... Babu worst ani annadu ....

Same person within 6 months mosapoyam antunnadu.

No allowance , no promotion , no transfer antunnadu...

Earlier independent avvadam valla easy ga undi 

Now everything under government and follow process .

RTC ollantha kalisi ee kinda paata padukunnaru appudu.....hahahahahaha

 

Link to comment
Share on other sites

భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్ని ముంగిటిలోనె నిలిచిన రోజూ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్ని సన్నజాజులై విరిసిన రోజూ భలే మంచి రోజు పసందైన రోజూ వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు ఆ... హాహాహాహహా... ఆ... హాహాహాహహా... ఆ... హాహాహాహహా... ఆ... హాహాహాహహా...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...