Jump to content

Jammu and Kashmir DDC Election Results...


KING007

Recommended Posts

భాజపా మాజీ మంత్రి.. 11ఓట్లతో ఓటమి

JK డీడీసీ ఎన్నికల్లో గుప్కార్‌కు 110.. భాజపాకు 74సీట్లు

భాజపా మాజీ మంత్రి.. 11ఓట్లతో ఓటమి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ) ఎన్నికల్లో స్థానిక పార్టీల కూటమి ‘పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’ సత్తా చాటింది. మొత్తం 280 స్థానాలకు గానూ ఇప్పటివరకు 276 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో గుప్కార్‌ కూటమి 110 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక భాజపా 74చోట్ల విజయం సాధించింది. ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో గుప్కార్‌ హవా కొనసాగించగా.. జమ్మూలో భాజపా పట్టు నిలుపుకుంది. ఇక మరో 49 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా.. కాంగ్రెస్‌ 26 చోట్ల, జమ్మూకశ్మీర్‌ అప్నీ పార్టీ 12 స్థానాల్లో, ఇతరులు ఐదు చోట్ల విజయం సాధించారు. కాగా.. బండిపొరా, కుప్వారా, పూంఛ్‌, రాజౌరీ జిల్లాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

మాజీ మంత్రికి షాక్‌..

 

కాగా.. జమ్మూలోని సుచేత్‌గఢ్‌ నియోజకవర్గంలో భాజపా మాజీ మంత్రి శ్యామ్‌ లాల్‌ చౌధరీకి గట్టి షాక్ తగిలింది. ఫలితాల్లో ఆయన కేవలం 11 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. స్వత్రంత్య అభ్యర్థి తరణ్‌జీత్‌ సింగ్‌ 12,969 ఓట్లతో ఇక్కడ విజయం సాధించగా.. శ్యామ్‌లాల్‌కు 12,958ఓట్లు పోలయ్యాయి. పునర్‌వ్యవస్థీకరణకు ముందు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని భాజపా-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వలో ఆయన‌‌ మంత్రిగా పనిచేశారు. ఆర్‌ఎస్‌ పురా బోర్డర్‌ బెల్డ్‌ రీజియన్‌లో కాషాయ పార్టీకి బలమైన నేతగా పేరొందిన ఆయన.. 2008, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుచేత్‌గఢ్‌ నుంచి విజయం సాధించారు. తాజాగా డీడీసీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగగా.. స్వతంత్ర అభ్యర్థి ఆయనకు షాకిచ్చారు. 

జమ్మూకశ్మీర్‌లోని 20 జిల్లాల్లోని 280 డీడీసీలకు నవంబరు 28 నుంచి డిసెంబరు 19 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 370 అధికరణ రద్దు, పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి ప్రజాస్వామ్య ప్రక్రియ ఇదే. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల గుప్కార్‌ కూటమి సంబరాల్లో మునిగింది. ఈ ఫలితాలు భాజపాకు కనువిపప్పు అని, ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) లాంటి ప్రధాన పార్టీలతో పాటు మరో అయిదు చిన్న పార్టీలు కలిసి గుప్కార్‌ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 

Link to comment
Share on other sites

Amit Shah Lauds Mass Participation In DDC Polls, Thanks People For Reposing Faith In BJP

On Wednesday, Union Home Minister Amit Shah thanked the people of Jammu and Kashmir for propelling BJP as the single-largest party in the recent DDC polls.

 

The DDC election was conducted in 8 phases between November 28 and December 19, with a voter turnout of 51.42%. It was the first big election held after the revocation of J&K's special status. Requisite amendments in the Jammu and Kashmir Panchayati Raj Act 1989 and J&K Panchayati Raj Rules 1996 enabled the setting up of District Development Councils. The DDC which will have a term of 5 years replaces the District Planning and Development Boards which were headed by a Cabinet Minister of the erstwhile state of J&K. 

The People's Alliance for Gupkar Alliance emerged as the single-largest coalition by winning 110 seats. Its constituents- NC, PDP, JKPC, CPI(M) and JKPM bagged 67, 27, 8, 5 and three seats respectively. After winning 26 seats in the DDC election, Congress too has decided to support the opposition alliance. On the other hand, BJP too made inroads in the Union Territory by becoming the single-largest party with 75 seats. However, the newly formed Jammu and Kashmir Apni Party (JKAP) could not make a substantive impact gaining only 12 seats.

Independents too made a major dent with 50 seats. As per BJP's DDC polls in-charge Anurag Thakur, the combined vote share of BJP and Independents amounts to a little over 52%. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...