Jump to content

Capital Tragedy -Parakala Prabhakar


gnk@vja

Recommended Posts

WhatsApp received 

ఏం టైమింగయ్యా..! ప్రభాకరూ!
-------------------------
అయ్యా ప్రభాకర్ గారూ...ఎంత వేదన ఉందయ్యా మీలో!

మూడు పంటలు పండే...మాగాణి లాగేసుకున్నారా!?

ఆశలు చూపించి నిర్మాణాలు ఆలస్యం చేసారా!?

నిర్మించలేక పోయిందా గత ప్రభుత్వం!

నిలువెల్లా విషం నింపుకున్న ఉండవల్లి..పొత్తులో ఉండి కాలడ్డం పెట్టిన వారు సుద్దపూసలా!?

పెట్టుబడుల కొరకు విదేశీ పర్యటనల్లో ..ఆరోవేలు లాగ చంద్రబాబు వెంట ఉన్నదెవరు!?

భూసమీకరణ నుండి..శంకుస్దాపన..డిజైన్ల ఆమోదం వరకు చంద్రబాబు ని అంటి పెట్టుకున్నదెవరు!?

యన్జీటి అనుమతులు..కోర్టు కేసులు..ఆటంకాలు ..అడ్డంకులు కల్పించిందెవరు!?

అమరావతి ప్లాన్ చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఎవరు!!

పదవి ఊడేవరకు నోర్మూసుకున్న ఐవైయ్యార్ కి భ్రమరావతి అనిపించలేదు.

అవనీతి కనిపించలేదు.

మూడుపంటలు పండే భూములు కనిపించలేదు.

రెండేళ్ళ వరకు మీకు రైతుల గోడు కనిపించలేదు..వినిపించలేదు.

అమరావతి రైతుల ఉద్యమం మొదలై ఏడాది అవుతుంది.

కుక్కిన పేనులా ఎక్కడున్నావో ఎవరికీ తెలియదు.

అమరావతి మీద విషం కక్కినాళ్ళు కక్కినట్టు ఉన్నారు.

ఈర్ష్య ..అసూయ..ద్వేషం..ఓర్వలేని తనం ఈరకమైన రుగ్మతల తో బాధ పడి చస్తున్నారు.

అసలు అమరావతి నిర్మాణాలు ప్రారంభమై ఎన్నాళ్ళయింది.

ఆ తక్కువ సమయంలోనే ఎంత ముందుకు వెళ్ళిందీ..మీకు మాత్రమే తెలుసు..అందరి కంటే!

కేంద్రం అనుమతుల పేరుతో ఎన్ని కొర్రీలు వేసిందీ..నిధుల విడుదలకు ఎంత జాప్యం చేసిందీ మీకు తెలియదా!?

ఇవన్నీ కూడా ప్రస్తావించాలి కదా!

చంద్రబాబు మీద మీరు కూడా ఒక రాయి వెయ్యాలనుకున్నారా!?

యూ టూ బ్రూటస్!

అసలు మీరు సలహాదారు గా ఉన్నపుడే పిల్లిని చంకలో పెట్టుకున్నాడేంటి ఈయన అనిపించింది.

చంద్రబాబు ..యన్డీయే నుండి బయటకొచ్చినపుడు..కేవలం మీ వల్ల సందేహాలు చెలరేగాయి.

తప్పక తెరవెనుకకు వెళ్ళారు మీరు.

అమరావతి యాగం దగ్గరుండి చూసిన మీరు కూడా..చంద్రబాబు వంక వేలు చూపిస్తున్నారు.

రెండేళ్ళయింది కదా మరచిపోతారనుకున్నారు.

అసలు మీరు మీ ధేభ్యం మొఖం లేని దృశ్యం ఉన్నదా అప్పట్లో!

మీరు డబుల్ ఏజెంట్ అనిపిస్తుంది.

చంద్రబాబు వెంట ఉండి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేతలో బిజీగా ఉండి ఉంటారు.

కచ్చితంగా మీ సలహాదారు పోష్డు కేంద్ర పెద్దల సిఫార్సు మేరకు లభించి ఉంటుందనిపిస్తుంది.

అంతా సర్వనాశనం అయిన తర్వాత..

ఇప్పుడు మీ డాక్యుమెంటరీ..బీజేపి..అమరావతి కి మద్దతు..అదీ నిత్యం విషం కక్కే సోము నోటి వెంట.

స్దానిక ఎన్నికలు..తిరుపతి ఉప ఎన్నిక.

ఏం టైమింగ్ అయ్యా!

అవును చంద్రబాబు తప్పే చేసారు.

మీలాంటి ఆషాఢభూతులను వెంట తిప్పుకోవటమే ఆయన చేసిన తప్పు.

ఒంటికి పడనిది తింటే ఎలర్జీ వస్తుంది.

అసలు మీరు టీడీపి ఫ్రేమ్ లో ఇమడరు.

అప్పుడే విషం కక్కి..బురద చల్లి బయటకొస్తారనుకున్నాము.

కాని ..రెండేళ్ళు లేటయినా లేటెస్టు గా వచ్చారు.

ఎంత గా భ్రమింప చేసారంటే..టీడీపి కేడరు..అమరావతి రైతులు కూడా మీరేదో ఉద్దరించేసారు అనుకునేంతగా..!

అమరావతి పట్ల ప్రేమతో...ఆవేదనతో ..వైసీపి ప్రభుత్వ నిర్వాకాల్ని ఎత్తి చూపుతారనుకున్నారు

అయిందేదో అయింది.

ఇక ముసుగు తియ్యండి...!

జీవీయల్ ..ఫేడవుట్ అయ్యాడు..ఇక మీరు లైనులోకి రండి.

ఎంతగా వగచినా..ఎంత నిప్పర్తి కబుర్లు చెప్పినా..అందరికీ విషయం అర్దమయింది.

ఇక బుడి బుడి దుఃఖాలు చాలు...!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...