Jump to content

HSBC Bank going out of Vizag.


Sunny@CBN

Recommended Posts

విశాఖపట్నం : యూరప్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం ‘హాంగ్‌కాంగ్-షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్(హెచ్‌ఎస్‌బీసీ)’కు విఖాఖపట్నంలో ఉన్న డేటా సెంటర్ అండ్ ప్రాసెపింగ్ యూనిట్ త్వరలో విదేశాలకు తరలిపోనుంది. విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన ‘సిరిపురం’లో ఉన్న ఆ బ్యాంకు శాఖను ఖాళీ చేయాల్సిందిగా బ్యాంకు యాజమాన్యానికి ఇప్పటికే తాఖీదులు వెళ్ళినట్లు సమాచారం.

 

ఓ రాజకీయ నాయకుడు ఇందుకు సంబంధించిన వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు వినవస్తోంది.  సిరిపురం లోని ప్రభుత్వ భవనం నుంచి బ్యాంకు శాఖను ఖాళీ చేయాల్సిందిగా  హెచ్‌ఎస్‌బీసీ యాజమాన్యానికి ఇప్పటికే తాఖీదులు వెళ్ళినట్లు కూడా వినవస్తోంది. వివరాలిలా ఉన్నాయి. 

 

     విశాఖలోని ప్రముఖ ప్రదేశాల్లో ఒకటైన సిరిపురంలోని ఓ ప్రభుత్వ బ్యాంకులో ప్రస్తుతం హెచ్‌ఎస్‌బీసీ శాఖ నడుస్తోంది. దశాబ్దం క్రితం... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో విశాఖలో హెచ్‌ఎస్‌బీసీ శాఖ ఏర్పాటైన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ప్రభుత్వ భవనంలో ఈ శాఖను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాదేశాల నేపధ్యంలో ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితులేర్పడడంతో... ప్రస్తుతం అందులో పనిచేస్తోన్న సిబ్బందిలో కొంతమందిని... బ్యాంకు తరలిపోనున్న... ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు, మరికొంత మందిని వెనిజులా, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ లకు బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 

 

కాగా విశాఖ నుంచి హెచ్‌ఎస్‌బీసీ శాఖను తరలించేందుకు ఆ బ్యాంకు యాజమాన్యం నిర్ణయించినట్లుగా వినవస్తోన్న క్రమంలో... సిబ్బంది తరలింపులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు వినవస్తోంది. ఉద్యోగులను దశలావారీగా పంపిస్తున్నట్లు సమాచారం. విశాఖలోని హెచ్‌ఎస్‌బీసీ శాఖలో మూడు షిఫ్టుల్లో కలిపి ప్రస్తుతం పెద్దసంఖ్యలోనే ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక...  ట్యాక్సీలు, హోటళ్లు, లాడ్జీలకు చెందిన వారికి కూడా ఈ శాఖ ద్వారా ఉపాధి లభిస్తోంది. 

 

హెచ్‌ఎస్‌బీసీ శాఖ తరలిపోయినపక్షంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద షాకింగ్ పరిణామమే అవుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బ్యాంకు నడుస్తోన్న ప్రభుత్వ బ్యాంకును ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వ పెద్దలిచ్చిన తాఖీదుల నేపధ్యంలో... ఆ శాఖను విశాఖ నుంచి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు తరలించేందుకు హెచ్‌ఎస్‌బీసీ యాజమాన్యం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  తరలించనున్నట్లు సమాచారం. విశాఖలో ఈ యూనిట్ దాదాపు ఒకటిన్నర దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. 

 

కాగా... నిర్వహణా భారాన్ని తగ్గించుకునే క్రమంలో... సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే యత్నాల్లో పడినట్లు కిందటి సంవత్సరంలోనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. కాగా... ఇప్పుడు ఏకంగా ఆ బ్యాంకే విశాఖ నుంచి తరలిపోయే పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తుండడం ఆందోళన కలిగించే పరిణామమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద ఈ పరిణామాలు సషాకింగేనన్న వ్యాఖ్యానాలూ ఈ సందర్భంగా వివనవస్తున్నాయి. 

 

కాగా విశాఖనుంచి హెచ్‌ఎస్‌బీసీ ని తరలించేందుకు నిర్ణయం జరిగినట్లుగా వినవస్తోన్న తెలుస్తోన్న నేపధ్యంలో... ఇందుకు దారితీసిన పరిస్థితులేమిటన్న విషయమై సంబంధిత వర్గాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. 

Link to comment
Share on other sites

B

Boss idi evaru pattinchukoru akkada BJP gane start chesindi christians vs hindus,reddy vs kapus(madyalo TDp ni nasanam cheddam ani ).meeru observe chesaro ledo ee madya BJP gelichina anniti daggara MIM party poti chestu undi kani mana daggara aa avasaram ledu YSRCP undi mataparamina party so hindus andarni one sided ga BJP ki techukovalani mata rajakeeyam nadipiyyatam start chesaru idi manaki teleka anavasaram ga assembly ki vellu aa yedavatho bootulu anipichukovatam avasarams

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...