Jump to content

*****GHMC Election Results*****


niceguy

Recommended Posts

  • Replies 155
  • Created
  • Last Reply
చతికిలపడిన తెదేపా!

చతికిలపడిన తెదేపా!

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. మొత్తం 150కి గాను 106 డివిజన్లలో అభ్యర్థులను రంగంలోకి దించినా ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేక ఫలితాల్లో కనుమరుగైంది. ప్రస్తుత ఎన్నికల్లో 90 శాతం టిక్కెట్లు బడుగు, బలహీనవర్గాలకే ఇచ్చినట్లు పార్టీ ప్రచారం చేసుకుంది. ఆటోడ్రైవర్‌ సతీమణికి ఓ డివిజన్‌లో, పాలు అమ్ముకునే సాధారణ వ్యక్తికి మరోచోట...ఇలా పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినా చివరికి ఫలితాలు నిరాశపరిచాయని తెదేపా నేతలు వాపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, తెరాస నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, తాము డబ్బును పంచకుండా నిజాయితీగా ప్రచారం చేశామని నగర ఎన్నికల కమిటీ కన్వీనర్‌ అరవిందకుమార్‌గౌడ్‌ ‘ఈనాడు’కు చెప్పారు.

పార్టీ మారరన్న నమ్మకం లేకే..!
2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం కేపీహెచ్‌బీ డివిజన్‌లో మాత్రమే తెదేపా నెగ్గింది. గెలిచిన కొద్దిరోజులకే ఆ ఒక్క కార్పొరేటర్‌ అధికార తెరాస పార్టీలో చేరిపోవడం పార్టీ శ్రేణులను నిరాశపరిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడైనా తెదేపాను గెలిపించినా కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మళ్లీ అధికార తెరాసలో చేరరనే నమ్మకం ఏముంటుందని పార్టీ అభిమానులు ప్రచారం సందర్భంగా ప్రశ్నించారని ఓ ముఖ్యనేత వివరించారు. పార్టీపై అభిమానమున్నా గెలిచినవారు అధికార పార్టీలోకి వెళ్లడం వల్ల వారు కూడా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదని ఆయన విశ్లేషించారు. తెదేపా ఎటూ గెలవలేదని, కొందరు భాజపా వైపు మొగ్గుచూపారని ఆయన తెలిపారు.

2002లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగగా మేయర్‌ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) అవతరించింది. అనంతరం 2009లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా తెదేపా మొత్తం 150 డివిజన్లకు గాను 45 స్థానాలు దక్కించుకుంది. కానీ ఎక్కువ స్థానాలు నెగ్గిన కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి చెరో రెండున్నర ఏళ్లు మేయర్‌ పదవి పంచుకున్నాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్‌లో తెదేపా సత్తా చాటింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా వాటిలో అత్యధిక సీట్లు గ్రేటర్‌లోనే సాధించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ బలహీన పడుతూ వచ్చింది. తెదేపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి తెరాసలో చేరారు.

Link to comment
Share on other sites

ఏనందన్న..ఈ సున్నా!

● జంగంమెట్‌లో ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడని వైనం

● పది కూడా దక్కని అభ్యర్థులెందరో

ఈనాడు, హైదరాబాద్‌

ఏనందన్న..ఈ సున్నా!

జంగంమెట్‌ డివిజన్‌లోని ఓ స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా..? సున్నా! తన ఓటు కూడా తాను వేసుకోలేదన్నమాట.

0, 1, 2, 3, 4, 5, 6.. ఇవి అంకెలు మాత్రమే కాదు.. గ్రేటర్‌ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు. చిన్న పార్టీలు, అనేకమంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈసారి 150 డివిజన్లకు అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 1122 మంది పోటీ చేశారు. వీరిలో 70 మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఇదీ పరిస్థితి..

*● జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది పోటీ చేశారు. పెద్ద బ్యాలెట్‌ అవసరం పడింది. 13 మంది స్వతంత్రులే. ఆరుగురు పది లోపే ఓట్లు సాధించారు. రజనీకాంత్‌ అనే అభ్యర్థికి ఒక్క ఓటూ పోలవ్వలేదు. మరో అభ్యర్థి వెంకటేశ్‌కు మూడే వచ్చాయి.

మైలార్‌దేవ్‌పల్లి నుంచి బీఎంపీ తరఫున పోటీ చేసిన గిరిబాబుయాదవ్‌కు ఒక్క ఓటే వచ్చింది. తన ఓటు మాత్రమే తనకు పడిందన్నమాట. మెహిదీపట్నం బీఎంపీ అభ్యర్థి నజీర్‌అహ్మద్‌కు 8 ఓట్లే దక్కాయి.

* ● మన్సూరాబాద్‌ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి, సరూర్‌నగర్‌లో పోటీ చేసిన దీపికయాదవ్‌కు రెండు ఓట్ల చొప్పున వచ్చాయి.

* ● హెచ్‌బీకాలనీలో పృథ్వికుమార్‌కు 4, సరూర్‌నగర్‌ స్వతంత్ర అభ్యర్థి సాయికి ఆరు ఓట్ల చొప్పున పోలయ్యాయి.

* ● కుర్మగూడ స్వతంత్ర అభ్యర్థికి 3, పురానాపూల్‌లో టీజేఎస్‌పీ అభ్యర్థి అనిల్‌సేన్‌కు ఆరు ఓట్లు దక్కాయి.

బంజారాహిల్స్‌లో ఐదుగురికి సింగిల్‌ డిజిట్‌ ఓట్లే వచ్చాయి.

* ● కేపీహెబ్‌బీలో 11మంది పోటీచేస్తే ముగ్గురికి 5 మించి ఓట్లు రాలేదు.

 
 
 
 
 
 
 
 
 

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...