Jump to content

Jena Sena 🛑 BJP 🛑 PK fan 👍


GOLI SODA

Recommended Posts

జనసేన ని ఎంతవరకు ట్రాల్ చెయ్యచ్చు?

GHMC ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఉండటం వల్ల జనసేనకి వచ్చే నష్టం ఏమి లేదు. ఎన్నికలకి అస్సలు సన్నర్ధం కాకుండా పోటీకి దిగాలి అనుకోవటమే ఇక్కడ ప్రధాన సమస్య.

GHMC ఎన్నికలు సడెన్గా ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఇందులో పోటీ చేసే ఉద్దేశ్యం జనసేనకు ఉండి ఉంటే, కసరత్తు ఎప్పుడో మొదలు అయ్యి ఉండేది. హడావుడిగా వారం రోజులు ముందు డిసైడ్ అయ్యి, రోజుకి ఒక మాట మార్చటం వల్ల అందరూ ట్రాల్ చెయ్యటానికి అవకాశం ఇచ్చింది.

పోటీ చెయ్యను అన్నా ఎవ్వరు పట్టించుకొనే వారు కాదు, కానీ బండి సంజయ్ గారు అన్న మాటల తరువాత కొన్ని చోట్ల పోటీ చేస్తాం అనేగానే లోకల్ గా ఆయనకు ఉన్న కొద్దిమంది అభిమానులు హల్చల్ చేశారు. ఒక్క రోజు వ్యవధిలో పోటీలో ఉండము అంటే ఒక సగటు అభిమానికి కోపం ఉండటం సహజం.

పోటీ నుంచి జనసేన విరమించుకొంటున్నట్లు ప్రకటించటం పార్టీకి మంచిదే. సన్నర్ధం కాకుండా యుద్ధంలో దిగితే ఘోర ప్రభావం తప్పదు. సో కొన్ని కారణాల వల్ల పోటీ చెయ్యటం లేదు అని చెప్పినా ఫ్యాన్స్ కూడా కొంచెం బాధపడి వదిలేసేవారు.
ఇక్కడ జరిగిన ప్రధానమైన తప్పిదం ఒక్కటే. ఒక పది సీట్లు కూడా డిమాండ్ చెయ్యకుండా సంపూర్ణ మద్దతు తెలియజేయటం. 2014 ఇదే తప్పు చేసి 3 సంవత్సరాల తరువాత రియలైజ్ అయ్యినా.. ఆ బ్రాండ్ మాత్రం పోలేదు. 2019 లో కూడా తెలుగు దేశానికి బి టీమ్ అనే నింద మైయ్యాల్సి వచ్చింది.

పోటీ నుంచి విరమించుకోవటం ఎత్తు అయితే, బిజెపికి మద్దతు ప్రకఠించటం పిచ్చి పని. సంజాయ్ గారు ఎలాగో పొత్తు ఆంద్ర వరకె అన్నారు కాబట్టి. తెలంగాణలో మీ దారి మీరు చూసుకోండి మేము వైదొలగుతున్నాం అని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది.

ఇలా చెయ్యటం వల్ల అక్కడ ఉన్న కొద్దిపాటి అభిమానులు కమలాన్ని మోస్తరు. తరువాత పూర్తి స్థాయి బిజెపి కార్యకర్తలుగా అయిపోతారు. ఒక్క సీటు కూడా అడగకుండా మద్దతు ఇవ్వడం ఆత్మహత్య సాదృశ్యం. లీడర్ గా క్యాదర్ని కాపాడుకొనే భాద్యత పవన్ కల్యాణ్ గారిదే. బిజెపి వేసిన స్కెచ్ లో పవన్ గారు తీవ్రంగా నష్టపోతారు.

పూర్తిగా క్రిమిమనల్ బ్రెయిన్ తో ఆలోచిస్తే, ఈ పోటీలో బిజెపి కి మద్దతు ఇచ్చి బిజెపి గెలిస్తే, తరువాత తిరుపతిలో కూడా బిజెపి కి మద్దతు ఇచ్చి గెల్పించుకోగలిగితే, జనసేన పార్టీ విలీనమ్ సుగమం అవుతుంది. డైరెక్ట్ గా పార్టీని విలీనం చెయ్యకుండా ముందు క్యాడర్ని విలీనం చేసి తరువాత పార్టీ ని చేస్తే ఎక్కువ వ్యతిరేకత రాదు. ఆంధ్రలో బిజెపి నాయకత్వం పూర్తిగా పవన్ గారికి ఇచ్చి, జనసేన ను బిజెపి లో విలీనం చేసేస్తే, క్యాడర్ కూడా పెద్దగా ఆక్షేపించదు. ఇది కూడా ఒక ప్లాన్ అయ్యి ఉండవచ్చు. పవన్ గారి మీద వీరాభిమానం ఉన్నవారు పార్టీ గురించి ఆలోచించరు. తమ నాయకుడు ఉంటే చాలు, ఏ పార్టీ అయినా ఓకే అనుకునేవారు ఎక్కువ ఉంటారు.

ఒకవేళ స్కెచ్ ఇది కాకుండా జనసేన విలీనం ఆలోచన లేకుండా ఈ మద్దతు ప్రకటించి ఉంటే, తెలంగాణలో ఆ పార్టీ పేరు ఇకపై వినిపించే అవకాశాలు ఉండవు. అసలు ఒకే తప్పును రెండో సారి ఎందుకు రిపీట్ చేస్తున్నారో నాలాంటి అర మెదడుకు ఆర్ధ్జం కావటం లేదు. రేపు బిజెపి తో తెగతెంపులు అయినా, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు బి టీమ్ గా ప్రమోట్ అవుతుంది.

ఆయన చుట్టూ అంతమంది మేధావులు ఉండి కూడా ఈ జీరో సీట్ 100 పర్సెంట్ సపోర్ట్ కి ఎందుకు ఒప్పుకొన్నారో అర్దం కావటం లేదు. క్యాడర్ కి క్లారిటీ ముందు నుంచే ఇవ్వాలి. క్యాడర్ కె ఆయన నిర్ణయాలు అర్దం కాకపోతే సామాన్య ఓటర్ కి ఎం అర్దం అవుతాయి. బిజెపి ది దృతరాష్ట్ర కౌగిలి. దానితో పొత్తు పెట్టుకొన్న ఒకటి రెండు పార్టీలు తప్ప మిగిలినవి నాశనం అయిపోయాయి.

నేను చెప్పే విషయాలు భజన బ్యాచ్ కి అర్దం కావు. కనీస హేతుబద్ధత ఉన్నవారికి ఆర్ధ్జం అవుతుంది. 7 నుంచి 8 కి వెళ్ళాలి కానీ 6 కి కాదు..

Copied From FB

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...