Jump to content

***AP Panchayathi Election Updates***


RamaSiddhu J

Recommended Posts

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తి రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ నామినేషన్లకు అనుమతించి కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలో వైకాపా బెదిరింపులకు పాల్పడి తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ చేయించిందని ఆరోపించారు. ఆ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈసీ ఎదుట పార్టీలు ఇదే అభిప్రాయాలను వెల్లడించాయని గుర్తు చేశారు. మరోవైపు పోలవరం అంశంపై మాట్లాడుతూ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అవినీతి డబ్బు పంపకాల్లో తేడాలు వచ్చి వైకాపా నేతలు రోడ్డెక్కి కొట్టుకుంటూ చంపుకొనేదాకా వెళ్తున్నారని.. సీఎం జగనే స్వయంగా పంచాయతీలు చేసి వాటాలు కుదుర్చుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. త్వరలో జరగనున్న  తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో వైకాపాకు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

 
 
ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: సీఎస్‌
ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: సీఎస్‌
 
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.
 
‘‘కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. ఏపీలో 6,890మంది కరోనా వల్ల మృతి చెందారు. మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదముంది. ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, వివిధశాఖల ఉద్యోగులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తాం. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్టు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ అవసరం లేదని మేము భావిస్తున్నాం’’ అని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.
 
మీ లేఖ రాజ్యాంగ విరుద్ధం: నిమ్మగడ్డ
 
 
సీఎస్‌ నీలం సాహ్ని రాసిన లేఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బదులిచ్చారు. ‘మీ లేఖ ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమే. రాజ్యంగ వ్యవస్థను కించపరచడమే. రాజ్యాంగ, చట్ట విరుద్ధం’’ అని సీఎస్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై గవర్నర్‌తో ఎస్ఈసీ చర్చించనున్నారు.  
Link to comment
Share on other sites

 
 
కంటెంట్‌ని ప్రకటన ఆక్రమించింది
ఈ ప్రకటనపై ఆసక్తి లేదు
ఈ ప్రకటనను చాలాసార్లు చూసాను
ప్రకటన అనుచితంగా ఉంది
ఆ ప్రకటనను మళ్లీ చూపకుండా ఉండేందుకు మేము ప్రయత్నిస్తాము
ద్వారా ప్రకటన మూసివేయబడింది

 
 
 
 
 
 
ప్రధానాంశాలు
Published : 18/11/2020 04:59 IST
పంచాయతీ పోరు ఫిబ్రవరిలో
ప్రభుత్వంతో సంప్రదించాక షెడ్యూలు
నాలుగు వారాల ముందు నుంచి కోడ్‌
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
న్యాయపరమైన ఇబ్బందులు లేవు: ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌
ఈనాడు - అమరావతి
 
పంచాయతీ పోరు ఫిబ్రవరిలో
 
 
గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. షెడ్యూలు ఖరారు చేస్తామని తెలిపింది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ మంగళవారం ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. వాటిని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు, ఒక పత్రికా ప్రకటనా విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు నాలుగు వారాల ముందునుంచి కోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం భారత రాజ్యాంగంలోని 243కె, 243 జెడ్‌ఏ అధికరణాల ప్రకారం తప్పనిసరన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి, ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవన్నారు. కొవిడ్‌ పరిస్థితులు ఉన్నా దేశంలో ఎక్కడెక్కడ ఎన్నికలు నిర్వహించినదీ ప్రస్తావించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని, ఒకప్పుడు రోజుకు 10 వేల కేసులకు పైగా నమోదైన పరిస్థితి నుంచి, ఇప్పుడు 2 వేల కంటే తక్కువే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత, రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే, తగిన కొవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు వెల్లడించారు. ‘‘ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన విధి. ఎన్నికల్ని నిరవధికంగా వాయిదా వేయలేం. క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. అదే విషయాన్ని మేం హైకోర్టుకూ తెలియజేశాం’’ అని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
 
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్ని, వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికల్ని ఇటీవల నిర్వహించిన విషయాన్ని రమేశ్‌కుమార్‌ ప్రస్తావించారు. అక్కడ ఎన్నికల నిర్వహణ వల్ల కరోనా వ్యాప్తి పెరిగినట్టుగా నిర్ధారణ కాలేదన్నారు. ‘‘రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అక్కడి యంత్రాంగం సిద్ధమైంది’’ అని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

సీఎస్‌ నీలం సాహ్ని రాసిన లేఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బదులిచ్చారు. ‘మీ లేఖ  ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమే. రాజ్యంగ వ్యవస్థను కించపరచడమే. రాజ్యాంగ, చట్ట విరుద్ధం’’ అని సీఎస్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై గవర్నర్‌తో ఎస్ఈసీ చర్చించనున్నారు

Link to comment
Share on other sites

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్  బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను  కలిశారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత రమేశ్‌ కుమార్‌ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. ఈరోజు సాయంత్రం జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Link to comment
Share on other sites

11 minutes ago, ramntr said:

మంచి గా dorikai situations, బీహార్ election ghmc n all other elections ni chupinchi నిమ్మగడ్డ aadukuntademo... Last notifications cancel అనగానే sachettu వున్నారు.. 😅

 

Jaggadu bayam okate, local body elections lo kanuka eduru debba tagilite, veedi MLAs and ministers kalisi veedini dimpi dobbutaru. 

manaki next 4 months mamoolu  show kaadu .. 

 

Link to comment
Share on other sites

ఫిబ్రవరిలో కుదరదు

ఫిబ్రవరిలో కుదరదు

 

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా

కరోనా తీవ్రత నేపథ్యంలో ముందుకెళ్లలేం

కలెక్టర్లతో వీడియో సమావేశమూ అక్కర్లేదని స్పష్టీకరణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ నీలం సాహ్ని లేఖ

ఈనాడు - అమరావతి

 

ఫిబ్రవరిలో కుదరదు

 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయించగా.. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు చెబుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై బుధవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో సమావేశం కూడా అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ తీరుపై ఎన్నికల సంఘం మండిపడింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయమే గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ విముఖతను అవసరమైతే సుప్రీంకోర్టుకూ దృష్టికీ తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు సమాచారం.

 

 

రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చలికాలంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని.. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి ప్రజలను ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొంది. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో బుధవారం మధ్యాహ్నం వీడియో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాసిన లేఖకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు మంగళవారమే ప్రత్యుత్తరం పంపారు. కరోనా దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు వాతావరణం అనుకూలం కాదని ఇదివరకే తాను ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఒక లేఖ అందజేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

‘రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల శాతం ఎక్కువగా ఉంది. యాక్టివ్‌ కేసులూ అధికంగానే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంది. పోలీసులు సహా మొత్తం జిల్లాల యంత్రాంగమంతా ప్రస్తుతం కరోనా నియంత్రణపైనే పనిచేస్తోంది. కరోనా వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. దానికి తగ్గట్లుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల వ్యూహాలు అనుసరించాయి. ఆ విషయంలో రాష్ట్రాల మధ్య పోలిక తేవాలనుకోవడం సరికాదు. చలికాలంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో.. మేం రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే కరోనాతో 6,890 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారి కరోనా విజృంభిస్తే తట్టుకోవడం కష్టం’ అని లేఖలో సీఎస్‌ స్పష్టం చేశారు.

 

అనుకూలం కాగానే మేమే చెబుతాం

స్థానిక సంస్థల నిర్వహణకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఏర్పడిన మరుక్షణం రాష్ట్ర ప్రభుత్వమే ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తుందని సీఎస్‌ పేర్కొన్నారు. వాయిదాపడ్డ ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరణకు సంసిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తుందని వివరించారు. ‘ప్రస్తుతం కరోనా తీవ్రత ఎలా ఉందో చెప్పాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాష్ట్ర ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా శ్రేయస్కరం కాదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకసారి పునరాలోచించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరమూ లేదు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనప్పుడు అలాంటి ప్రక్రియ చేపడితే సరిపోతుంది. అందువల్ల ఎన్నికల సంఘం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనక్కర్లేదని భావిస్తున్నాం. దానిపై తదుపరి మళ్లీ సంప్రదింపులు జరుపుదాం’’ అని లేఖలో సీఎస్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనల్ని ఎన్నికల కమిషన్‌ సానుకూల దృక్పథంతో అర్ధం చేసుకుంటుందని భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

 

 

మరిన్ని

రెండు నెలల్లో బకాయిలు చెల్లించండిరెండు నెలల్లో బకాయిలు చెల్లించండి

ఉద్యోగులు, పింఛనర్లకు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నిలిపివేసిన 50 శాతం వేతనాలు, పింఛన్లను రెండు నెలల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వైభవంగా పెద్దశేష వాహన సేవవైభవంగా పెద్దశేష వాహన సేవ

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం రాత్రి పెద్దశేష వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై

ఎన్నికల ప్రక్రియ మధ్యలో సీఎస్‌ జోక్యం అనుచితంఎన్నికల ప్రక్రియ మధ్యలో సీఎస్‌ జోక్యం అనుచితం

ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవడం, వీడియో కాన్ఫరెన్స్‌ అవసరం లేదని చెప్పడం అనుచితమని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎన్నికల

ట్రక్కుఇసుక రూ.8 వేలకూ దొరకట్లేదుట్రక్కుఇసుక రూ.8 వేలకూ దొరకట్లేదు

ఈ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కట్టే సత్తా లేదు. పేదలకు పునరావాసం కల్పించలేరు. పరిహారం ఇవ్వలేరు గానీ.. అక్కడ రాజశేఖరరెడ్డి విగ్రహం పెడతారట. దీనిపై బెట్టింగ్‌ మంత్రి ఏం చెబుతారో?

2024 కన్నా ముందే ఎన్నికలు2024 కన్నా ముందే ఎన్నికలు

రాష్ట్రంలో 2024 కంటే ముందే ఎన్నికలు రావచ్చని, ఆ దిశగా సన్నద్ధం కావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘అధికారంలోకి వచ్చి ప్రజల కోసం నిలబడాలన్న

ఇళ్ల స్థలాల పంపిణీ డిసెంబరు 25నఇళ్ల స్థలాల పంపిణీ డిసెంబరు 25న

రాష్ట్రంలోని పేదలకు డిసెంబరు 25న డి-ఫారం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అదే రోజున 15లక్షల ఇళ్ల

రాజ్యాంగ విరుద్ధంరాజ్యాంగ విరుద్ధం

పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని, వాటికి సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌ కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంపై.. ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎస్‌ నుంచి ఈ మేరకు తనకు ప్రత్యుత్తరం అందగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లి

ఫిబ్రవరిలో కుదరదుఫిబ్రవరిలో కుదరదు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయించగా.. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు చెబుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై బుధవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో సమావేశం కూడా అక్కర్లేదని

5శాతానికి క్రియాశీల కేసుల రేటు5శాతానికి క్రియాశీల కేసుల రేటు

దేశంలో గత 24 గంటల్లో 38,617 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.52%, మరణాల రేటు

కేంద్రంపై యుద్ధమేకేంద్రంపై యుద్ధమే

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని తెరాస

కొనసాగుతున్న కొవాగ్జిన్‌ ప్రయోగాలుకొనసాగుతున్న కొవాగ్జిన్‌ ప్రయోగాలు

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ ప్రయోగ పరీక్షలు హైదరాబాద్‌ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి. మూడోదశలో భాగంగా బుధవారం 22 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య

విజయనగరం మన్యంలో మృత్యుఘోషవిజయనగరం మన్యంలో మృత్యుఘోష

విజయనగరం మన్యంలోని పాచిపెంట మండలం చిల్లమామిడి గూడేనికి చెందిన పలువురు గిరిజనులు వరుసగా మృత్యువాత పడుతున్నారు.

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులురాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 69,618 పరీక్షలు చేయగా 1,236 (1.77%) కేసులు నమోదయ్యాయి.

150 అడుగుల ఎత్తులోనే పోలవరం నిర్మించాలి150 అడుగుల ఎత్తులోనే పోలవరం నిర్మించాలి

అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు నిర్లక్ష్యం వహించడం తగదని పలువురు రైతు సంఘాల

ఇదే చివరి అవకాశంఇదే చివరి అవకాశం

వ్యక్తుల అక్రమ నిర్బంధం వ్యాజ్యాల్లో విచారణను వాయిదా వేయడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ కారణం చేతనైనా పోలీసుల తరఫు న్యాయవాది మరోసారి వాయిదా కోరితే.. పోలీసులు

30 నుంచి అసెంబ్లీ సమావేశాలు!30 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయమై శాసనసభ వ్యవహారాల సలహా మండలిలో చర్చించి తుది నిర్ణయం

సాలూరు డీఈఈ అక్రమార్జన రూ.1.63 కోట్లు!సాలూరు డీఈఈ అక్రమార్జన రూ.1.63 కోట్లు!

పంచాయతీరాజ్‌ శాఖ సాలూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కర్రి నాగేశ్వరరావు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు విశాఖపట్నం,

ప్రధానితో భేటీకి ప్రయత్నిస్తాప్రధానితో భేటీకి ప్రయత్నిస్తా

ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంటు కోసం తాను ప్రయత్నిస్తానని రాజధాని అమరావతి ఉద్యమ జేఏసీ నేతలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. భాజపా కేంద్ర నాయకత్వం దృష్టికీ

ఫైజర్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 95%ఫైజర్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 95%

తాము తయారు చేస్తున్న కరోనా టీకా మూడో దశ ప్రయోగాలు పూర్తయినట్టు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు బుధవారం ప్రకటించాయి. దీని సామర్థ్యం 95 శాతం వరకు ఉందని వెల్లడించాయి.

రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు

తుంగభద్ర నది పుష్కరాలు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.21 గంటల నుంచి మొదలయ్యేలా ముహూర్తం ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వ

Link to comment
Share on other sites

 
"https:

"

ఎన్నికల ప్రక్రియ మధ్యలో సీఎస్‌ జోక్యం అనుచితం
తెదేపా నేత యనమల రామకృష్ణుడు ధ్వజం
 
ఎన్నికల ప్రక్రియ మధ్యలో సీఎస్‌ జోక్యం అనుచితం
 
 
 
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవడం, వీడియో కాన్ఫరెన్స్‌ అవసరం లేదని చెప్పడం అనుచితమని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎన్నికల వాయిదాకు కొత్త జిల్లాలను సాకుగా చూపటం పలాయనవాదమేనని ఓ ప్రకటనలో విమర్శించారు. ‘73, 74వ రాజ్యాంగ అధికరణలను ప్రభుత్వం గౌరవించాలి. ఎస్‌ఈసీ కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దే అని ఆర్టికల్‌ 243కె(3) నిర్దేశిస్తోంది. కాబట్టి ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలి. బలవంతపు ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేసి తాజా నోటిఫికేషన్‌తో ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండు చేశారు. ‘దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు, విధ్వంసాలు, హత్యలు, అవినీతి, కుంభకోణాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. విశాఖలో వైద్యుడు సుధాకర్‌ ఘటన మొదలు నంద్యాలలో సలాం ఉదంతం వరకు వివిధ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తాయనే భయంతోనే కరోనా వంకతో ఎన్నికల వాయిదా మంత్రం జపిస్తున్నారు’ అని అన్నారు.
బడులు తెరిచారు.. ఎన్నికలకు భయమేంటి?: అచ్చెన్నాయుడు
తల్లిదండ్రులు, మేధావుల సూచనల్ని ఖాతరు చేయకుండా కరోనా సమయంలో పాఠశాలల్ని తెరిచిన ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు భయపడుతోంది? సీనియర్‌ ప్రభుత్వ అధికారి నీలం సాహ్ని.. అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవడం బాధాకరం. స్థానిక ఎన్నికలు నిర్వహించలేమంటూ ఎస్‌ఈసీకి సీఎస్‌ రాసిన లేఖ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ లేఖ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎస్‌ఈసీకి రాసిన లేఖలో అంశాలను పున:పరిశీలించి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
జగన్‌ సుముఖంగా లేరు: జేసీ దివాకర్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం రెండూ జోడెద్దులు లాంటివన్నారు. రెండూ ఒకేవైపు వెళ్లకపోతే ప్రయాణం సాగదు. ముఖ్యమంత్రి జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడానికి సుముఖంగా లేరు. రాష్ట్రంలో ఏదీ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదు.

Link to comment
Share on other sites

రాజ్యాంగ విరుద్ధం

రాజ్యాంగ విరుద్ధం

 

అధికారులతో సమీక్ష కూడా వద్దంటారా ?

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆగ్రహం

గవర్నర్‌తో భేటీ

రాష్ట్ర ప్రభుత్వం, కొందరు మంత్రుల వ్యాఖ్యలపై ఫిర్యాదు

ప్రభుత్వ వైఖరిపై కోర్టుకెళ్లే యోచన

ఈనాడు - అమరావతి

 

రాజ్యాంగ విరుద్ధం

 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయించగా.. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు చెబుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై బుధవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో సమావేశం కూడా అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ తీరుపై ఎన్నికల సంఘం మండిపడింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయమే గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ విముఖతను అవసరమైతే సుప్రీంకోర్టుకూ దృష్టికీ తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు సమాచారం.

 

 

పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని, వాటికి సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌ కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంపై.. ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎస్‌ నుంచి ఈ మేరకు తనకు ప్రత్యుత్తరం అందగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు విముఖత వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని, హైకోర్టు దృష్టికీ ఆ అంశాన్ని తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు సమాచారం.

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా లేమని సీఎస్‌ లేఖ రాయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటోందనడానికి తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని గవర్నర్‌కు రమేశ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడమే కాక నివేదిక రూపంలోనూ అందజేశారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొందరు మంత్రులు కూడా విచక్షణరహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల్ని అడ్డుకునే ఉద్దేశంతో ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని రమేశ్‌కుమార్‌ గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వం, మంత్రుల తీరును తీవ్రంగా పరిగణించాలని.. వారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా కట్టడి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకూ ప్రభుత్వం వీలు కల్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసుల గురించి, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాల గురించీ వివరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరంగా ఎలాంటి అవరోధాలూ లేవని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

 

రాజ్యాంగ విరుద్ధం

 

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమే

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎలాంటి సమీక్ష గానీ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ గానీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాయడంపై రమేశ్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అది రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన సీఎస్‌కు సందేశం పంపినట్టు సమాచారం. ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్ని గోప్యంగా ఉంచకుండా బయటకు పొక్కేలా చేశారని, అది కూడా తీవ్ర అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను తాము రద్దు చేసుకోలేదని, అది జరగకుండా ప్రభుత్వమే అడ్డుకుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ‘ఎన్నికల సంఘం వ్యక్తిగతంగా అధికారులందరికీ లేఖ రాయదు. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకుంటున్నామని సీఎస్‌కు తెలియజేస్తుంది. అందర్నీ సమాయత్తపరచాల్సిన బాధ్యత సీఎస్‌దే’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

 

గవర్నర్‌ స్పందన చూశాక కోర్టుకు!

 

రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై ఆయన ఎలా స్పందిస్తారో చూశాక, తప్పనిసరైతే ఈ అంశాన్ని కోర్టుకు నివేదించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని, వారు అనుమతించకపోతే తమ దృష్టికి తీసుకురావాలని.. సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అభివృద్ధి పనులకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ కోర్టు ఆ సూచనలు చేసింది. దానిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు... రాష్ట్రంలో తాజా పరిస్థితిని, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ప్రభుత్వం అడ్డుపడుతున్న తీరును అఫిడవిట్‌ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగానూ ఈ అంశాన్ని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిసింది

Link to comment
Share on other sites

ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు  
ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు గురించి అందులో ప్రస్తావించినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

ఎస్‌ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు. కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ కార్యాలయం ఎర్పాట్లు చేయగా.... కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్‌ కూడా రద్దవడంతో ఎస్‌ఈసీ కార్యాలయం‌ కార్యాచరణ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు


ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌  విజ్ఞప్తి చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియో టేపులను గవర్నర్‌కు పంపారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, అయినా.. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా  రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

Link to comment
Share on other sites

5 hours ago, RamaSiddhu J said:

ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు  
ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు గురించి అందులో ప్రస్తావించినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

ఎస్‌ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు. కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ కార్యాలయం ఎర్పాట్లు చేయగా.... కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్‌ కూడా రద్దవడంతో ఎస్‌ఈసీ కార్యాలయం‌ కార్యాచరణ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు


ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌  విజ్ఞప్తి చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, వీడియో టేపులను గవర్నర్‌కు పంపారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, అయినా.. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా  రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

Endhi ippudu kodali Nani bochu peekuthada governor ani anala. Sare gaddapodu antadu le. WDWR

Link to comment
Share on other sites

ఎన్నికల తేదీలపై నిర్ణయాధికారం మాదే
 మీరు చెప్పినట్టే జరగాలనుకోవడం భ్రమ
 సందేహముంటే కోర్టును అడగండి
 ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించొద్దు
 సీఎస్‌కు ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ లేఖ
 ప్రభుత్వం సహకరించేలా చూడాలని గవర్నర్‌కు మళ్లీ విజ్ఞప్తి
 మంత్రి కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు
 అధికారులతో ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి రెండోరోజూ సీఎస్‌ సహాయనిరాకరణ
ఈనాడు - అమరావతి

ఎన్నికల తేదీలపై నిర్ణయాధికారం మాదే

పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య మొదలైన ప్రచ్ఛన్నయుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తేదీలను నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కాదని స్పష్టం చేస్తూ గురువారం ప్రధాన కార్యదర్శికి ఎస్‌ఈసీ లేఖ రాశారు. ఎన్నికల తేదీలను నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదన్న భ్రమల్లో ఉంటే తొలగించుకోవాలని, దీనిపై ఏమైనా సందేహాలుంటే కోర్టును అడిగి స్పష్టత తెచ్చుకోవాలనీ ఆయన లేఖలో సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వం తన స్వీయ, సంకుచిత ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు ప్రేరేపించడం అనైతికమని ఎస్‌ఈసీ అభిప్రాయపడినట్టు తెలిసింది.
మరోవైపు ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో సమావేశం నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం రెండోరోజు గురువారమూ సఫలం కాలేదు. వీడియో సమావేశానికి హాజరవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల్ని ఆదేశించాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొనాలని నీలం సాహ్నికి ఆయన మరోసారి సమాచారమిచ్చినా ఆమె సానుకూలంగా స్పందించలేదు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, కాబట్టి ప్రస్తుతం కలెక్టర్లతో వీడియో సమావేశమూ అక్కర్లేదని ఆమె పునరుద్ఘాటించారు. వీడియో సమావేశంలో పాల్గొనాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ నుంచి వర్తమానం వెళ్లకపోవడంతో గురువారం కూడా సమావేశం జరగలేదు. మంత్రి కొడాలి నాని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్య తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు రమేశ్‌కుమార్‌ గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టుకెళ్లాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ సమ్మతి అక్కర్లేదు
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని, కలెక్టర్ల సమావేశం కూడా అవసరం లేదని సీఎస్‌ రాసిన లేఖకు.. ప్రభుత్వ వైఖరి రాజ్యాంగ విరుద్ధమంటూ బుధవారం రమేశ్‌కుమార్‌ ప్రత్యుత్తరమిచ్చారు. దానిపై సీఎస్‌ గురువారం ఆయనకు మరో లేఖ రాశారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని ఆమె పునరుద్ఘాటించినట్టు సమాచారం. ఈ అంశంపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిద్దామని, ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తాము భావించినప్పుడు తెలియజేస్తామని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో రమేశ్‌కుమార్‌ సీఎస్‌కు ఈసారి కాస్త ఘాటుగానే లేఖ రాసినట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ‘ఎన్నికల తేదీలను మీరు చెప్పాకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలనడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధం. మీరు చెప్పిందే జరగాలన్న, జరుగుతుందన్న భ్రమలో ఉండటం సరికాదు. ఎన్నికల తేదీ నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలే తప్ప సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ కోర్టు చెప్పింది. ప్రభుత్వ సమ్మతి తీసుకోవాలని చెప్పినట్టుగా వక్రభాష్యం చెప్పడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరా? అన్న అంశంపై ప్రభుత్వం ఇటీవల కోర్టుకెళ్లగా, దానిపై కోర్టు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల తేదీలు ఎవరు నిర్ణయించాలన్న విషయంలోనూ మీకు సందేహం ఉంటే కోర్టునే అడగండి. అంతే తప్ప మీకు తోచినట్లుగా వక్రభాష్యం చెప్పడం శిక్షార్హమైన నేరం’’ అని ఆ లేఖలో రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిద్దామని ఒకపక్క చెబుతూ.. కలెక్టర్లతో తాను నిర్వహించాలనుకున్న వీడియో సమావేశం జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధమని లేఖలో రమేశ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కలెక్టర్లతో తాను సమావేశం పెట్టింది కూడా సంప్రదింపులు జరపడానికేనన్నారు. ప్రభుత్వ వైఖరి పరస్పర విరుద్ధంగా, కపటత్వంతో కూడినదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కరోనా కేసుల నమోదును రోజుకు 10 వేల నుంచి 2 వేల కంటే తక్కువకు తీసుకురావడంలో వైద్య సిబ్బంది కృషి అభినందనీయం. వారి గొప్పతనాన్ని, పనితనాన్ని కించపరిచే రీతిలో ప్రభుత్వం సంకుచిత ప్రయోజనాల కోసం కొవిడ్‌ బూచిని చూపించి ప్రజల్లో భయాందోళనలు కలిగించాలనుకోవడం అనైతికం. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులను మేం నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాం. అన్ని అంశాలపై అవగాహనకు వచ్చాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం’ అని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.
గవర్నర్‌కు మళ్లీ లేఖ
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించేలా చూడాలని రమేశ్‌కుమార్‌ బుధవారం గవర్నర్‌ను కలిసి కోరారు. వీడియో సమావేశానికి ప్రభుత్వం గురువారమూ సహకరించకపోవడం సహా తాజా పరిణామాల్ని వివరిస్తూ గవర్నర్‌కు ఎస్‌ఈసీ గురువారం మరో లేఖ రాశారు. ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన వ్యవహారమని 2018లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు తీర్పిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే ఎన్నికల కమిషన్‌ గవర్నర్‌ను సంప్రదించాలని.. ఆయన కూడా తగు చర్య తీసుకోకపోతే అప్పుడు తమ దగ్గరకు రావాలని కోర్టు చెప్పింది. ఈ పరిస్థితుల్లో చొరవ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌గా మీ పైనే ఉంది’  అని ఆ లేఖలో రమేశ్‌కుమార్‌ ప్రస్తావించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కొడాలి నానిపై చర్యలు తీసుకోండి


రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొడాలి నాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని, ఎన్నికలు నిర్వహించడం కుదరదని, ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గవర్నర్‌కు రమేశ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఆయన ప్రభుత్వోద్యోగుల్ని రెచ్చగొట్టడం, ఎన్నికల్ని వ్యతిరేకించేలా వారిని ప్రేరేపించడం నేరపూరిత చర్యగా అభివర్ణించారు. కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను కూడా ఆయన తన లేఖతో పాటు గవర్నర్‌ పరిశీలనకు పంపినట్టు తెలిసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...