Jump to content

Tejaswi Yadav @Bihar CM 🎫🎟️🎫🎟️🎫🎟️


GOLI SODA

Recommended Posts

రిపబ్లిక్, జన్ కీ బాత్ సర్వే: మహాగటబంధన్ ముందంజ ,వెనుకంజలో ఎన్డీయే కూటమి

  ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు  సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము. 

Bihar Exit Polls: Republic Jan Ki baat Projects a tough fight with a narrow lead for Tejashwi Yadav

హోరాహోరీగా సాగిన బిఓహార్ ఎన్నికలు ఇందాక ముగిసిన  మూడవ దశ వోటింగ్ తో ముగిసాయి. ఎన్నికలు ముగియగానే, వెనువెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు  సర్వే సంస్థలు విడుదల చేస్తూ విజేతలను ఊహించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం కూడా చూద్దాము. 

రిపబ్లిక్, జన్ కీ బాత్ సర్వే:

ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 91- 117

యూపీఏ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 118-138

ఎల్జేపీ:  5-8

ఇతరులు: 3-6

బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అధికారంలో ఉన్న నితీష్ కుమార్  జేడీయూ - బీజేపీల కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కుంటుండగా.... ఆర్జేడీ పార్టీ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకొని తిరిగి తన బలాన్ని నిరూపించుకోవాలని ఉబలాటపడుతోంది. 

కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న వేళ ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలను తీసుకొని మూడుదశల్లోను ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. 28 అక్టోబర్ నాడు మొదటి దశ ,పోలింగ్ జరగ్గా, నవంబర్ 3న రెండవ దశ పోలింగ్ జరిగింది. నేడు చివరిదైన మూడవదశ ముగిసింది. 

కరోనా నేపథ్యంలో ఈసారి 80 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యంగులకు పోస్టల్ బాలట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కానీ చాలా వరకు ప్రజలు ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూతులకే వచ్చారు. 

రాష్ట్రంలో మొత్తం 243 సీట్లకు గాను తొలి దశలో 71 సీట్లకు ఎన్నికలను నిర్వహించారు. రెండవ దశలో 94 సీట్లకు ఎన్నిక నిర్వహించగా... నేడు ఆఖరుదైన మూడవ దశలో మిగిలిన 78 సీట్లకు పోలింగ్ జరిగింది. 

ఎగ్జిట్ పోల్ ఫలితాలు అక్కడి గత పరిస్థితులను, ఓటర్ల ఎన్నుకునే సరళి, ఓటర్ల సమాధానాలు ఇత్యాదుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఒక అంచనాను మాత్రమే అందిస్తాయి. గతంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం. అసలైన ఫలితాలు తెలుసుకోవాలంటే మాత్రం కౌంటింగ్ జరిగే 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే!
#Biharexitpolls2020 టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే: 
ఎన్డీయే కూటమి(బీజేపీ+జేడీయూ +వీఐపీ +హెచ్ఏఎం ) 116 యూపీఏ (కాంగ్రెస్+ఆర్జేడీ + లెఫ్ట్) 120 
ఎల్జేపీ: 1 
ఇతరులు: 6

Link to comment
Share on other sites

 

If Tejaswi wins in Bihar, this will be a good signal for us. 

Nitish kooda liquor to aadu konnadu,  janalalo anti ravadaniki edi kooda oka karanam ani antunnaru. 

mana jaggadiki nitish ki pedda teda ledu ..  Nitish gaadu BJP ni vaadi RJD ni kottadu. 

ekkada jaggadu BJP and KCR ni vaadi TDP ni kottadu. 

 

If Tejaswi wins, no longer BJP will hold jaggad ... they will dump him. Equations chala fast gaa change avvutai. 

 

Link to comment
Share on other sites

7 minutes ago, sagar_tdp said:

Tejaswi gadu bjp tho kalisuthe, valla nanna ni baitaki theppinchukontadu anukontunna.

Mulayam lalu vella ki  values aythe levu

I don't think so...laloo time is over and also It's a sympathy card... however they may try parol based on health grounds

Link to comment
Share on other sites

మహాఘట్ బంధన్‌‌కు 124, ఎన్డీయేకు 110... ఎగ్జిట్ పోల్స్ జోస్యం

Nov 7 2020 @ 19:41PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
11072020194555n35.jpg

 

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ వెలువడుతున్నాయి. తేజస్వి యాదవ్ సారథ్యంలోని విపక్ష కూటమి 124 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉండగా, నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయేకు 110 సీట్లు వస్తాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

 

 

టైమ్ నౌ- సీ ఓటర్‌ అంచనా ప్రకారం ఎన్డీయేకు 116 సీట్లు రానున్నాయి. దీనికి కొంచెం ఎక్కువగా విపక్ష మహాఘట్ బంధన్‌కు 120 సీట్లు వస్తాయి. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్‌జేపీకి ఒక సీటు వస్తుంది.

 

 

రిపబ్లిక్ టీవీ జన్ కీ బాత్ ప్రకారం, విపక్ష కూటమికి 118 నుంచి 138 సీట్లు వస్తాయి. అధికార ఎన్డీయేకు 91 నుంచి 117 సీట్లు వస్తాయి. ఎల్జేపీకి 5 నుంచి 8 సీట్లు, ఇతరులకు 3 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

 

 

పీపుల్స్ పల్స్- పీఎస్జీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష కూటమికే స్వల్ప ఆధిక్యం

రానుంది. ఆర్జేడీ 85-95 సీట్లు, కాంగ్రెస్ 15-20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలకు 3-5 సీట్లు, 

బీజేపీ 65-75, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం. జీడీఎస్ఎఫ్, ఇండిపెండెంట్లు 5-13 సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది.

 

 

తేజస్వికి పెరిగిన ఓటర్ల మద్దతు..

బిహార్‌ తదుపరి సీఎంగా తేజస్వి యాదవ్‌కు 36 శాతం, నితీష్ కుమార్‌కు 34 శాతం మద్దతు ఉన్నట్టు పీపుల్స్ పల్స్-‌పీఎస్జీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, వలసలు, వరదలు ప్రభావం చూపినట్టు చెప్పింది. ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపు మొగ్గు చూపినట్టు పేర్కొంది. జేడీయూకి ఉన్నత కులాల ఓటర్లు దూరమయ్యారని అంచనా వేసింది. పాశ్వాన్ తనయుడు చిరాగ్ ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. పాట్నా, నలంద ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్‌ పల్స్‌ సర్వే జరిపింది. పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు రెబల్స్‌, ఇండిపెండెంట్ అభ్యర్థులు గండి కొట్టారని పేర్కొంది.

 

 

కాగా, అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు గాను మెజారిటీ మార్క్ 122. ఈ స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈనెల 10న ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.

Link to comment
Share on other sites

I never thought till 3-4 years ago that I would have to support the parties that I hated so much while I was growing up..both Congress and RJD..Now this news is making me happy..Both the BJP morons at the top made it possible.

Link to comment
Share on other sites

13 hours ago, ramntr said:

తేజస్వి ఆ, New guy ని ఎలా నమ్ముతున్నారు with లాలూ baggage, Nitish not tht bad guy కదా... 

Lotus effect ల vundi Nitish మీద.. 

20 years of anti incumbency and nithis also be proven that a power mangrov 

Link to comment
Share on other sites

1 hour ago, Gunner said:

RJD tho alliance lekunte 2015 lo ne poyevadu emo Nitin uncle...

Yes RJD won more seats than Nitish but still Lalu agreed for nitish to be CM as per prepoll agreement... lalu entha vedhava aina he behaved like a gentleman but Nitish entha goppodu aina he ditched the alliance and joined pushpams just to degreade his own image for power

Link to comment
Share on other sites

5 hours ago, nbk@myHeart said:

Yes RJD won more seats than Nitish but still Lalu agreed for nitish to be CM as per prepoll agreement... lalu entha vedhava aina he behaved like a gentleman but Nitish entha goppodu aina he ditched the alliance and joined pushpams just to degreade his own image for power

❤️❤️❤️

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...