Jump to content

Risky operation


Siddhugwotham

Recommended Posts

●● నాన్న గారి ఆదర్శం కోసం….. పేదలకు వైద్యం చేస్తున్నామ‌ని చెప్పారు సీనియ‌ర్ హీరో, బ‌స‌వ‌తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నంద‌మూరి బాల‌కృష్ణ‌. కోవిడ్ పేషెంట్స్ కు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తామ‌ని, ఎన్నో ఛాలెంజింగ్ కేసులకు ఇక్క‌డి డాక్ట‌ర్స్ ట్రీట్‌మెంట్ అందించారన్నారు. 515 పడకల ఈ హాస్పిటల్.. ఎంతోమంది దాతల సాయం వల్ల ఈ స్థాయికి వచ్చామని అన్నారు.

కాళ‌హ‌స్తికి చెందిన చైత‌న్య అనే పేషెంట్ కు ఉచితంగా ట్రీట్మెంట్ అందించి, త‌మ డాక్ట‌ర్లు ఆమె ప్రాణాల‌ను కాపాడ‌ర‌‌ని అన్నారు బాల‌కృష్ణ . కేవ‌లం 5 నుంచి‌ 10 శాతం మాత్రమే బతికే అవ‌కాశం ఉన్న ఆ పేషెంట్ విష‌యంలో రిస్క్ తీసుకున్నామని తెలిపారు. స‌ర్జరీ తరువాత ఆ పేషెంట్ వారం రోజులు కోమాలోకి వెళ్లింద‌ని.. అనస్థీషియా డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసి ఆమె ప్రాణాలు కాపాడార‌న్నారు.

పేషెంట్ లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ లో చాలా పెద్ద కణితి ఉంద‌ని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చూసి ..బాలకృష్ణ గారు ఆమెను వెనక్కి పంపవద్దని, ఆమెకు సర్జరీ చెయ్యాల‌ని సూచించార‌ని డాక్ట‌ర్స్ అన్నారు. సర్జరీ చేసే టైం కి ఆమెకు కోవిడ్ పాజిటివ్ ఉండ‌డంతో వాయిదా వేశామ‌ని, కోవిడ్ నెగటివ్ వచ్చిన తరువాత సర్జరీ చేద్దామనే టైం కి.. క‌ణితి కుళ్ళిపోయింద‌ని వారు తెలిపారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆమెను కాపాడామ‌ని చెప్పారు. త‌మ పాప బ‌తికిందంటే అందుకు బాల‌య్య , డాక్ట‌ర్స్ కార‌ణ‌మని పేషెంట్ కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.

Link to comment
Share on other sites

9 hours ago, Raaamu said:

aa time lo COVID antey mulige nakka meeda tatikaya paddatte. Family ki and aa person ki mamulu torture kadu mentally. Hatsoff to doctors and staff to uphold hopes and making it successful. For seeing that smile on her face .

 

🙇‍♂️

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...