Jump to content

Chief Minister vs Chief Justice in waiting


Recommended Posts

Interesting read to what level these guys have researched to defend their stupid acts🙂

 

పోల్చడానికి ఒక స్థాయి ఉండాలి. సమర్థించుకోవడానికి ఒక పద్ధతి ఉండాలి! కానీ... ఇవేవీ లేకుండా అప్పట్లో దామోదరం సంజీవయ్య హైకోర్టు సీజేపై రాసిన లేఖను, ఇప్పుడు సీఎం జగన్మోహన్‌ రెడ్డి జడ్జిలపై చేసిన ఫిర్యాదులనూ ఒకే గాటన కడుతూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ‘జడ్జిలపై ఫిర్యాదులు చేయడం ఘోరం, నేరం కాదు’ అనే అభిప్రాయం కల్పించేందుకు సోషల్‌ మీడియా వేదికగా వ్యూహాత్మక ప్రచారానికి తెరలేపారు. నిజానికి... అప్పట్లో దామోదరం సంజీవయ్య ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన నిజాయితీ, నిరాడంబరత, ఆయన రాసిన లేఖలోని వివరాలకూ.... ఇప్పుడు జరుగుతున్నదానికీ ఎలాంటి సంబంధమూ లేదు. దామోదరం సంజీవయ్య... కర్నూలు జిల్లాకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు! నీలం సంజీవ రెడ్డి తర్వాత... 1960 జనవరి 11న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ... అప్పటి కాంగ్రె్‌సలో సహజమైన వర్గాలు, ఆధిపత్య పోరుతో ఆయన నిత్యం ఇబ్బంది పడేవారు. కేవలం రెండేళ్లలోనే పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు కల్పించారు.

ఆయన తర్వాత మళ్లీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తాను పదవి నుంచి దిగిపోవడానికి ఆరు నెలల ముందు... సంజీవయ్య అప్పటి కేంద్ర హోంమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రికి లేఖ రాశారు. ఇది ఏడు పేజీల లేఖ. ఇందులో తాను ఎదుర్కొంటున్న రాజకీయ ఇబ్బందుల గురించి అస్సలు ప్రస్తావించలేదు. అప్పటి చీఫ్‌ జస్టిస్‌ చంద్రారెడ్డి విపరీతమైన కులాభిమానం ప్రదర్శిస్తూ, గ్రూపులు కట్టి, పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని.. సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జడ్జిని అవమానిస్తున్నారని తెలిపారు. ‘‘ఇది ఇలాగే కొనసాగితే... న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మీరు తగిన చర్యలు తీసుకోండి. జస్టిస్‌ చంద్రారెడ్డిని బదిలీ చేయండి’’ అని మాత్రమే కోరారు. ఈ లేఖ విషయంలో సంజీవయ్య పూర్తి హుందాతనం ప్రదర్శించారు. అప్పట్లో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులేవీ లేఖలో రాయలేదు. న్యాయ వ్యవస్థ తనను ఇబ్బంది పెడుతోందని ఒక్కమాట కూడా చెప్పలేదు. అన్నింటికంటే మించి.. ‘‘దయచేసి ఈ లేఖను, మీ వద్దే రహస్యంగా ఉంచండి. నేను రాసిన వివరాలతో మీరు స్వయంగా సంతృప్తి చెందితే తగిన సంస్థతో, అంతే గోప్యంగా విచారణ జరిపించండి’’ అని శాస్త్రిని కోరారు. అంతేతప్ప, కేంద్రానికి లేఖ పంపిన రెండోరోజే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ వివరాలను బయటపెట్టలేదు. ‘‘న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రారెడ్డి ఇచ్చిన తీర్పులు, ఆయన పని తీరు గురించి నేను ప్రస్తావించడంలేదు.

కోర్టులపై ప్రజలు ఇసుమంత నమ్మకం కోల్పోవడం కూడా న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి, చివరికి... స్వయంగా జస్టిస్‌ చంద్రారెడ్డికి కూడా మంచిది కాదు’’ అని సంజీవయ్య తన లేఖలో రాశారు. జస్టిస్‌ చంద్రారెడ్డి తీరువల్ల ఇప్పటికే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గిందని, సత్వరం ఆయనను బదిలీ చేయకపోతే పూడ్చుకోలేనంత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన  కోసం, తన ప్రభుత్వం కోసం ఈ లేఖ రాయలేదు. ఇప్పుడు జగన్‌ పూర్తిగా కోర్టుల తీర్పులు, జడ్జిల వ్యాఖ్యలను తప్పుపడుతూ చేసిన ఫిర్యాదులో ఇలాంటి స్ఫూర్తి ఎక్కడుందని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘‘నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. నా ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారు’’.. ఇదే ఆయన ఆవేదన! ‘‘న్యాయవ్యవస్థను కాపాడాలని సంజీవయ్య ప్రయత్నించారు. వ్యవస్థపై బురదజల్లాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారు. వారి మధ్య పోలిక తేవడం హాస్యాస్పదం’’ అని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

పూరి గుడిసెలోనే కుటుంబం 

దామోదరం సంజీవయ్యపై అప్పట్లో సొంతపార్టీలోని ప్రత్యర్థి వర్గం విపరీతంగా ఫిర్యాదులు చేసేది. దీంతో అధిష్ఠానం... అసలు విషయం కనుక్కోవాల్సిందిగా కొందరు వేగులను సంజీవయ్య సొంత ఊరికి పంపింది. ఆ వ్యక్తులు ఊరిలోకి వచ్చి... ‘దామోదరం సంజీవయ్య ఇల్లు ఎక్కడ?’ అని స్థానికులను అడిగారు. ‘అదిగో అదే’ అంటూ దూరంగా కనిపిస్తున్న పూరి గుడిసెను చూపించారు. సంజీవయ్య అప్పటికే సీఎం అయినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు పూరి గుడిసెలోనే నివసిస్తున్నారు. ఇక...  ఆయన నిబద్ధతపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని వేగులు వెనుదిరిగిపోయారు. గ్రూపుల కారణంగా ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించినప్పటికీ, ఆ వెంటనే ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడమే ఆయన నిజాయితీ, సమర్థతకు నిదర్శనం.

Link to comment
Share on other sites

సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించండి.. సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేశారంటూ సీఎం జగన్‌పై న్యాయవాదులు జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదైందని జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Link to comment
Share on other sites

11 minutes ago, gnk@vja said:

AP and TG HIGH COURT BAR association condemn cheyali first ekkado Delhi high vallu react ayyaru mana Telugu vadaina judge ni ee AP and TG BAR association vallu support cheyali 

NV Ramana worked at Delhi Highcourt so they responded quickly.. 

Agree AP & TS vallu respond avvali.. But avvaru emo.. Becoz of polluted and Divided by party's.. 

Link to comment
Share on other sites

Jaffa gaadiki edo ayyiddi ani manam anukovatame kani, courts oka stage daati munduku polevu ani vaadiki telusu. Anduke achhosina ambothulaa behave chesthunnadu. Veedini support chese National media lo chamchaalu chaala mandi unnaru. Inka Telugu states lo vedhavalaki anthe ledu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...