Jump to content

సీమ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కి శ్రీకారం చుట్టిన వైసీపీ..?


Npower

Recommended Posts

సీమ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కి శ్రీకారం చుట్టిన వైసీపీ..?

October 5, 2020

తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎలా అయినా సరే పార్టీలోకి చేర్చుకోవాలని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే అవి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది బలమైన నేతలను టార్గెట్ చేసి ఎక్కువగా ఇప్పుడు ఏపీలో పావులు కదుపుతున్నారు. అయినా సరే కొంతమంది మాత్రం పార్టీ మారడానికి ఎంత వరకు కూడా ఇష్టపడటం లేదు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా మాజీ మంత్రులను కూడా టార్గెట్ చేసేలా పావులు కదుపుతున్నారు అని సమాచారం.

ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయంగా బలమైన ఒక కుటుంబానికి ఇప్పుడు వైసీపీ అధిష్టానం గాలం వేసింది. పార్టీ మారడానికి ఒప్పుకోకపోతే ఇబ్బంది పెట్టడానికి కూడా వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మంత్రి ఇప్పుడు వారిని వైసీపీలోకి ఎలా అయినా తీసుకురావాలని, కుదిరితే స్థానిక సంస్థల ఎన్నికల లోపు వారిని పార్టీలో చేర్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. వారు మాత్రం పార్టీ మారడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఇందుకోసం పదవులను ఆఫర్ చేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి సీటు ఇస్తామో కూడా చెప్పేశారు. ఒక ఎంపీ సీటుతో పాటుగా ఎమ్మెల్యే సీటు కూడా కుటుంబానికి ఆఫర్ చేసారు. అయినా సరే ఇష్టపడలేదు అని టాక్. అదే విధంగా ఇటీవల ఒక ఇద్దరు నేతలతో ఒక మంత్రిగారు సమావేశం అయినా, ఆయన ఆశించిన విధంగా వారి నుంచి సమాధానం పొందలేదు అని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో కూడా తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఆయన వ్యాపారాలను టార్గెట్ చేసినా సదరు ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారేందుకు మొగ్గుచూపడం లేదు.

కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మీద కూడా ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేశారు. పార్టీలో ఆయనకు ఒక పదవి కూడా ఉంది. ఆ పదవిని తిరిగి వైసీపీలో ఇస్తామని అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు కృషిచేయాలని చెప్పినా, పార్టీ మారడానికి ఆసక్తి చూపించడం లేదట. ఈయనకు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఆఫర్ చేసారు. సదరు మాజీ మంత్రి గారి భార్యకు జెడ్పీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇన్ని ఆఫర్లు ఇచ్చినా వారు పార్టీ మారతారో లేదో తెలియటం లేదని సమాచారం.

Link to comment
Share on other sites

On 10/6/2020 at 2:10 AM, kumar_tarak said:

wave vunte evarni nilapettina gelustaru atu vaipu enta mandi pedda leaders vunna..elections ki 6 months mundu crucial period..based on the situations at that time people will decide whom to vote..

Poll management comes with experience.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...