Jump to content

Ella vunnai Delhi lo medalu blanche program ?


kalyan babu

Recommended Posts

Telugu 360
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హోంమంత్రి అమిత్ షాతో దాదాపుగా యాభై నిమిషాల సేపు జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పీఎంవో కీలక అధికారి మిశ్రా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఎజెండా ప్రకారం అమరావతి భూములు, ఫైబర్ నెట్ వంటి వాటిపై సీబీఐ విచారణలు కోరినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా వినతి పత్రం సమర్పించారు. వాస్తవానికి నిన్న ఉదయం వరకూ ఢిల్లీ పర్యటన అనే ఆలోచనే లేని.. ముఖ్యమంత్రి సాయంత్రానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దీంతో ఏదో అర్జంట్ మ్యాటర్ ఉందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే జగన్‌ తన పాటు న్యాయనిపుణులను ఢిల్లీ తీసుకెళ్లారు. జగన్ తో పాటు ఢిల్లీ వెళ్లిన వారిలో అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యంశ్రీరాంతో పాటు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు భూషణ్ కూడా ఉన్నారు. భూషణ్ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇప్పుడు.. జగన్ కోసం ఆయన కుమారుడు పని చేస్తున్నారు. అమిత్ షాతో భేటీ సమయంలో… ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారయినప్పటికీ… ఎనిమిది తర్వాతే భేటీ అయ్యే అవకాశం దొరికింది. దాంతో ఇతర కేంద్రమంత్రుల్ని కలవలేకపోయారు. బుధవారం మధ్యాహ్నం వరకు వివిధ కేంద్రమంత్రుల్ని కలిసి..మధ్యాహ్నం తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం ఉంది.
 

Link to comment
Share on other sites

andhrajyothy 
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి అమిత్‌ షా క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అమిత్‌ షా అన్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో జగన్‌ భేటీ  అసంపూర్తిగా ముగిసింది.  బుధవారం ఉదయం మరోసారి కలవాలని జగన్‌కు అమిత్‌ షా చెప్పి పంపినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయం 10.30కు అమిత్‌షాను జగన్‌ మరోసారి కలవనున్నారు. అమిత్‌షా సమక్షంలో పీఎంవో ఉన్నతాధికారి కేకే మిశ్రాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌, అంతర్వేది వ్యవహారాలపై సీబీఐ విచారణకు అంగీకరించాలని కేకే మిశ్రాకు జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. 

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

andhrajyothy 
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి అమిత్‌ షా క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అమిత్‌ షా అన్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో జగన్‌ భేటీ  అసంపూర్తిగా ముగిసింది.  బుధవారం ఉదయం మరోసారి కలవాలని జగన్‌కు అమిత్‌ షా చెప్పి పంపినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయం 10.30కు అమిత్‌షాను జగన్‌ మరోసారి కలవనున్నారు. అమిత్‌షా సమక్షంలో పీఎంవో ఉన్నతాధికారి కేకే మిశ్రాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌, అంతర్వేది వ్యవహారాలపై సీబీఐ విచారణకు అంగీకరించాలని కేకే మిశ్రాకు జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. 

వ్యవహార శైలిపై.......   Ee comedy enti...  Emi theliyantlu

Link to comment
Share on other sites

మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు భూషణ్ కూడా ఉన్నారు. భూషణ్ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇప్పుడు.. జగన్ కోసం ఆయన కుమారుడు పని చేస్తున్నారు

 

Yemiti idi... 

Link to comment
Share on other sites

జ‌గ‌న్‌రెడ్డిపై అమిత్‌షా ఆగ్ర‌హం న‌మ్మొచ్చా?

జ‌గ‌న్‌రెడ్డిపై అమిత్‌షా ఆగ్ర‌హం అని ఏబీఎన్ బ్రేకింగ్‌, చ‌ర్చ‌ల‌తో హోరెత్తిస్తున్నారు. 
ఉన్న‌ది ఇద్ద‌రే..అటువంట‌ప్పుడు జ‌గ‌న్‌రెడ్డిపై ఆగ్ర‌హం ఎలా అనే డౌటొస్తుంది.
దీనిపై అనేక కోణాలు ప‌రిశీలించి ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా నా విశ్లేష‌ణ అందిస్తున్నాను.
అమిత్ షా అనారోగ్యం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న ద‌శ‌లో ఎవ‌రు అడిగితే వాళ్లకు అపాయింట్ మెంట్ ఇచ్చే అవ‌కాశం లేదు.
అంటే ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కేంద్ర హోంశాఖా మంత్రే నేరుగా పిలిపించుకున్నార‌ని అర్థం అవుతోంది.
సీఎంవో పీఆర్ టీం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి మీడియాకి ఇచ్చిన లీకుల ప్ర‌కారం పోల‌వ‌రం నిధులు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే అజెండా అన్నారు.
పోల‌వ‌రం కోసం అయితే కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌ల‌వాలి..జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల‌ను తీసుకెళ్లాలి కానీ అటువంటిదేమీ లేదు.
సీఎం పీఆర్ టీమ్ ఇచ్చిన స‌మాచారం ఇక్క‌డే అవాస్తవం అని తేలిపోయింది.
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే అయితే వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను తీసుకెళ్లాలి.
కానీ సీఎం జగన్ తోపాటు ఢిల్లీకి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్,  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ కుమారుడు అడ్వకేట్ భూషణ్, సీఎంవో నుంచి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ మాత్ర‌మే.
అంటే కోర్టుల‌పై యుద్ధం ప్ర‌క‌టించాన‌ని సంబ‌ర‌ప‌డుతున్న జ‌గ‌న్‌రెడ్డికి న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై దాడి నేప‌థ్యంలోనే అమిత్ షా నుంచి పిలుపు వ‌చ్చింద‌నేది అర్థం అవుతోంది.
అందుకే జ‌గ‌న్‌రెడ్డి త‌న వెంట‌న న్యాయ‌స‌హాయం కోసం ఏజీ, మాజీ చీఫ్ జ‌స్టిస్ త‌న‌యుడు అడ్వ‌కేట్‌ని తీసుకెళ్లార‌ని తెలుస్తోంది.
జ‌గ‌న్‌తో భేటీ సంద‌ర్భంగా పీఎంవో ఉన్న‌తాధికారి కెకె మిశ్రాని అమిత్ షా లైనులోకి తీసుకోవ‌డం ఏదో తీవ్ర ప్ర‌మాద సంకేతాల‌నే పంపుతోంది.
బీజేపీతో ర‌హ‌స్య ఒప్పందం మేర‌కు ఏం చేసినా ఎంజాయ్ చేస్తున్న క‌మ‌ల‌నాథులు ఆల‌యాల విష‌యాన్ని ఎంజాయ్ చేసిన‌ట్టే.
గుడుల‌ను మేము ధ్వంసం చేయిస్తాం..మీరు ఆందోళ‌న‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు పొందండి అనే టైఅప్ ఒప్పందంతో వైకాపా, ఏపీ బీజేపీ వెళ్తున్నాయ‌ని అనుమానాలున్నాయి.
అయితే హిందుత్వాన్ని, ఆల‌యాల‌ను ఈ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డి భ్ర‌ష్టు ప‌ట్టించ‌డంపై నాగ్‌పూర్ పెద్ద‌లు తీవ్ర ఆగ్ర‌హంగా వున్నారు.
నాగ్‌పూర్‌కి ఆగ్ర‌హం వ‌స్తేనే.. అమిత్ షా నుంచి పిలుపు వ‌స్తుంద‌నేది గ‌తంలో చీవాట్లు తిన్న సీఎంల అనుభ‌వం.
ఈ కోణం కూడా వుండి వుండొచ్చు.
 ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసుల విచార‌ణ ఏడాదిలో పూర్తి చేయాల‌ని తొంద‌ర‌ప‌డుతున్న అత్యున్న‌త న్యాయ‌స్థానం అంశంపై జ‌గ‌న్‌రెడ్డి కేంద్రాన్ని శ‌ర‌ణు కోరి వుండొచ్చు.
జ‌గ‌న్‌రెడ్డిపై అమిత్ షా ఆగ్ర‌హంగా లేక‌పోతే.. అమ‌రావ‌తి భూకుంభ‌కోణం, సెట్‌టాప్ బాక్సుల కుంభ‌కోణంపైనా సీబీఐ విచార‌ణ కావాల‌ని ఏపీ సీఎం అడిగే చాన్స్ వుంది.
ఏపీ ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌గ‌న్‌రెడ్డి చాలా సార్లు అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యారు.
గ‌త ప‌రిస్థితులు ప‌రిశీలిస్తే..ఇది జ‌గ‌న్‌రెడ్డి కోరుకున్న అపాయింట్‌మెంట్‌లా లేదు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎప్పుడూ సీరియ‌స్‌గానే వుంటారు..జ‌గ‌న్‌రెడ్డితో భేటీ సంద‌ర్భంగా ఫోటోలోనూ సీరియ‌స్‌గానే వున్నారు.
అయితే త‌న‌కు ఎట్ట‌కేల‌కు షా అపాయింట్‌మెంట్ దొరికింద‌నే ఆనంద‌పు ఆన‌వాళ్లు జ‌గ‌న్‌రెడ్డి మొఖంలో ఏ ఒక్క‌టి క‌నిపించ‌డంలేదు.
ఏపీ ప్ర‌భుత్వం అడిగిన అపాయింట్‌మెంట్ అయిన‌ట్ట‌యితే.. అదీ ఏపీ అభివృద్ధికి సంబంధించిన‌ది అయితే ఈ రోజు 50 నిమిషాల‌తోనే ముగిసిపోయేది.
రేపు అన‌గా బుధ‌వారం ఉద‌యం కూడా అమిత్‌షా వ‌చ్చి క‌ల‌వ‌మ‌న్నారంటే.. ఇదేదో ఉప‌ద్ర‌వం ముంచుకొచ్చే భేటీగానే సంకేతాలు అందుతున్నాయి.
తిరుమ‌ల‌లో ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌కే ప‌రిమితం కావాల్సిన షెడ్యూల్ మారి..ద‌ర్శ‌నాలు, మ‌ళ్లీ ద‌ర్శ‌నాలు, ఆంజ‌నేయ‌స్వామికి వేడుకోళ్ల‌కు పొడిగించ‌డం కొత్త అనుమానాల‌కు తావిస్తోంది.
బుధ‌వారం నుంచి న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై జ‌గ‌న్‌రెడ్డి ఉసిగొల్పే వైకాపా మంత్రులు, స్పీక‌ర్‌, మీడియా, సోష‌ల్‌మీడియాలో పోస్టులు క‌నిపించ‌లేదంటే! ఢిల్లీలో వ‌న్‌సైడ్ బ్యాటింగ్ అయిన‌ట్టే.
అలా కాకుండా మ‌రింత‌గా దాడి తీవ్రం చేశారంటే..ఏదో మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టేన‌నే కోణంలో విశ్లేషించ‌వ‌చ్చు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...