Jump to content

Recommended Posts

ఫైబర్ గ్రిడ్ లో స్కాం జరిగింది అంటూ సంబంధం లేని కొన్ని కంపెనీలను పేర్లను చాకచక్యంగా తెరపైకి తేవడం ద్వారా ఒక టన్ను బురదను టీడీపీ మీద వేసి తుడుచుకోమని చెప్పింది వైసీపీ బృందం. 

ఈ రాజకీయ కోలాటంలో అయోమయానికి గురికాకుండా వారి వ్యూహాన్ని పకడ్బందీగా అదే సోషల్ మీడియా వేదికగా పటాపంచలు చేశారు తెలుగుదేశం నాయకులు. వెయ్యి కోట్లు కూడా విలువ చేయని ప్రాజెక్టు లో 2 వేల కోట్ల స్కాం అంటూ ప్రచారం చేయడంలోనే ఇది ఎంత అబద్ధమో చూడండి

అబద్ధం #1 :
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.2,000 కోట్ల అవినీతి 

నిజం :
2019 మే నెల వరకు, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.770 కోట్ల ఖర్చు పెడితే రూ.2,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది ?
AP Fiber Project Phase I - Rs.307.86 Cr 
CPE Boxes - Rs.395.12 Cr 
Other Capital Expenditure - Rs.67.11 Cr

అబద్ధం #2:
తన తండ్రి శాఖలోని ఫైల్‌ తెప్పించుకుని, లోకేశ్‌ సంతకం చేసారు

నిజం :
ఏ ఫైల్ పై సంతకం చేశారు ? ఆ ఫైల్ లో ఏముంది ? బురద చల్లే వారు, ఇది కూడా చెబితే బాగుండేది

అబద్ధం#3 :
కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి ఖరారు చేసారు

నిజం :
ఈ టెండర్, కేంద్ర సంస్థ అయిన, భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌) పర్యవేక్షణలోనే జరిగింది. మొత్తం బీబీఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలోనే జరిగింది. అంచనా పెంపు అనేది అవాస్తవం.

అబద్ధం #4:
బీబీఎన్‌ఎల్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కి టెండర్‌ పిలిచి అర్హత లేని టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 

నిజం :
అంచనా వ్యయం రూ.907.94 కోట్లు అనేది అవాస్తవం
టెండర్‌ ప్రక్రియ మొత్తం బీబీఎన్‌ఎల్‌ మార్గదర్శకాలు ప్రకారమే జరిగింది. 
టెండర్ పిలవటం దగ్గర నుంచి, టెండర్ కట్టబట్టే దాకా, మొత్తం బీబీఎన్‌ఎల్‌  పర్యవేక్షణలోనే జరిగింది.
బీబీఎన్‌ఎల్‌ పిలిచిన టెండర్ లో TCIL, L&T, HFCL, VTL, TSL, Sterilite అనే ఆరు సంస్థలు పాల్గున్నాయి. 
వీటిలో ప్రభుత్వరంగ సంస్థ అయినటు వంటి TCIL మరియు L&T ఎల్ 1 గా నిలిచారు.

అబద్ధం #5:
గల్లా జయదేవ్‌ కంపెనీలోనే సెట్‌టాప్‌ బాక్సుల తయారు చేసారు

నిజం :
మొత్తం 10 లక్షల సెట్ అప్ బాక్సుల్లో, 95 శాతానికి పైగా దాసాన్ అనే కొరియన్ కంపెనీ సప్లై చేసింది. మిగతా 5 శాతం వరకు, మూడు కంపెనీలు సప్లై చేసారు.
అందులో ఒక యూరోపియన్ కంపెనీ, అమర రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి, పైలట్ మ్యానుఫాక్చరింగ్ కింద, కేవలం 30 వేల బాక్సులు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది.
మిగతా 9.7 లక్షల సెట్ అప్ బాక్సులు, దాసాన్ అనే కొరియన్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి.

అబద్ధం#6 :
కొనుగోలు చేసిన 12 లక్షలసెట్‌టాప్‌ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది.

నిజం :
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, మంత్రి మేకపాటి గారే చెప్పారు.
3.40 లక్షల బాక్స్‌లు ఇక నాసిరకం అంటున్నారు, అవి ఎక్కడ ఉన్నాయి ? రిటర్న్ ఇచ్చారా ? రిపేర్ కి ఇచ్చారా ?  

అబద్ధం #7:
టెరా సాఫ్ట్ అనే కంపెనీలో వేమూరి హరి ప్రసాద్ డైరెక్టర్ గా ఉన్నారు. అందుకే ఆ కంపెనీకి అప్పచెప్పారు

నిజం :
టెరా సాఫ్ట్ అనేది లిస్టెడ్ కంపెనీ.  వేమూరి హరి ప్రసాద్ కి టెరా సాఫ్ట్ అనే కంపెనీతో కానీ, భాగస్వామ్య కంపెనీలతో కానీ అసలు సంబంధమే లేదు. కేవలం విష ప్రచారం చేస్తున్నారు.

అబద్ధం#8 :
రూ.1200 ఉన్న సెట్ టాప్ బాక్సును రూ.4వేలకు కొని అవినీతి చేసారు 

నిజం :
కేవలం టీవీకి అయితే రూ.1200 కూడా కాదు, రూ.700 కే వస్తుంది. 
కానీ ఇక్కడ జీ-పాన్ టెక్నాలజీతో టీవీ, వైఫై రోటర్, టెలిఫోన్ కనెక్షన్ అందించే బాక్సును రూ.3,900కు కొన్నారు

అబద్ధం #9:
ఫైబర్ నెట్ ప్రాజెక్టు భోగస్ అంటూ ప్రచారం :

నిజం :
ఫైబర్ నెట్ లో అసలేం చేయలేదు అంటున్న నేటి ప్రభుత్వం, నాడు ఇచ్చిన కనెక్షన్ల ద్వారానే నెలకు రూ.14 కోట్లను సర్వీస్ ఛార్జీలుగా వసూలు చేస్తోంది. 

అబద్ధం#10 :
చంద్రబాబు, లోకేష్ స్కాం చేసారు 

నిజం :
అవినీతికి పాల్పడ్డారు అంటున్నారే తప్ప, గత 16 నెలల పాలనలో ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు.
ఫైబర్ నెట్ ప్రారంభ దశలో నారా లోకేశ్ అసలు ప్రభుత్వంలోనే లేరు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...