Jump to content

Bars opening in AP from tomorrow


Munna_NTR

Recommended Posts

500 కోట్లిచ్చి `బార్`‌లా తెర‌చుకోండ‌న్న జ‌గ‌న్ 100 కోట్ల‌కు డీల్ సెట్ చేసిన స‌జ్జ‌ల రెడ్డి బార్ల‌న్నీ క‌మ్మోళ్ల‌వ‌నే డౌట్‌తో లైసెన్స్ రెన్యువ‌ల్ చేయ‌ని స‌ర్కారు బార్‌లలో దాదాపు 200 రెడ్ల‌వే కావ‌డంతో రంగంలోకి కుల‌పెద్ద‌లు లాక్‌డౌన్ ఎత్తేయ‌గానే బార్‌లు తెర‌చుకోవ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ రెడ్డి అంత తెలివైన‌, క‌న్నింగ్ పొలిటీషియ‌న్ ప్ర‌పంచంలో ఎవ్వ‌రూ వుండ‌రేమో! తాను అధికారంలోకి వ‌చ్చేందుకు మ‌ద్య‌నిషేధం హామీ ఇచ్చి, అధికారంలోకొచ్చాక స‌ర్కారుతోనే మ‌ద్యం అమ్మిస్తూ ఐదేళ్ల‌లో 25 వేల కోట్లు క‌మీష‌న్ల రూపంలో దండుకునే స్కెచ్ వేశారంటే ఆయ‌న తెలివిని త‌క్కువ‌గా అంచ‌నా వేసేవారు బొక్కాబోర్లా ప‌డ్డ‌ట్టే! అటువంటి జ‌గ‌న్ రెడ్డి క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై విపరీత‌మైన ద్వేషంతో వారి ఆర్థిక‌మూలాలు దెబ్బ‌కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ పాల‌సీలు రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశిస్తున్నారు. నిబంధ‌న‌లు అడ్డొస్తే ఏకంగా చ‌ట్టాల‌నే మార్చేస్తున్నారు. కేవ‌లం క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని దెబ్బ‌కొట్టాల‌నే ల‌క్ష్యంతోనే అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపు కోసం ఏకంగా మూడు రాజ‌ధానులంటూ రాజ‌కీయ క్రీడ‌కు తెర‌లేపారు. అలాగే క‌మ్మ నేతల వ్యాపారాలు దెబ్బ‌కొట్టే ప‌న్నాగానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న అధికారంలోకొచ్చిన వెంట‌నే అందిన నివేదిక ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాల‌లో వున్న మొత్తం 810 బార్ల‌లో చాలా వ‌ర‌కూ క‌మ్మ వారి చేతిలోనే వున్నాయ‌ని మ‌న‌సులో పెట్టుకున్నారు. ఆ బార్‌ల‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని ఐదేళ్ల‌కు లైసెన్సు కాల‌ప‌రిమితి వుండగానే ర‌ద్దు చేశారు. 600 బార్‌ల‌కు లాట‌రీ ద్వారా లైసెన్సులిస్తామ‌ని చెబుతూ త‌న వారికి క‌ట్ట‌బెట్టే స్కెచ్ వేయ‌గా 10 ల‌క్ష‌ల డిపాజిట్ ని 625 మంది చేశారు. వివిధ కార‌ణాల‌తో బార్ య‌జ‌మానులు కొంద‌రు కోర్టుకెక్కారు. ఇంత‌లో బార్‌ల‌పై ప్ర‌భుత్వానికి ఇంత క‌క్ష ఎందుకని అసోసియేష‌న్ ఆరా తీయ‌గా..బార్‌లు క‌మ్మోళ్ల‌వ‌ని ఇలా క‌క్ష క‌ట్టార‌ని తేలింది. అప్పుడు అసోసియేష‌న్ తెలివిగా బార్‌లు ఏ కులానికి ఎన్ని వున్నాయో లెక్క‌గ‌ట్ట‌గా కమ్మోళ్ల చేతిలో 190, రెడ్ల చేతిలో 180 వుండ‌గా, మిగిలినన్నీ 440 చాలా కులాల చేతిలో వున్నాయి. ఈ విష‌యాన్ని అసోషియేష‌న్ పెద్ద‌లు స‌ర్కారులో కింగ్‌పిన్‌లాంటి స‌జ్జ‌ల దృష్టికి తీసుకెళ్లారు. అయితే క‌మ్మోళ్ల‌నే క‌క్ష‌తో ఆపామ‌ని,ఈ వ్యాపారంలో మ‌న‌వాళ్లూ వున్నారా అని ఆశ్చ‌ర్య‌పోయిన ఆయ‌న సీఎంతో మాట్లాడి డీల్ సెట్ చేద్దామ‌ని హామీ ఇచ్చారు. ఓ ఫైన్ మోర్నింగ్ స‌జ్జ‌ల క్యాంప్ నుంచి బార్ అసోసియేష‌న్‌కి పిలుపు వ‌చ్చింది. బేరం ఆరంభ‌మైంది. ఎంతిస్తార‌ని స‌జ్జ‌ల అడ‌గ్గా..బార్‌కి 7 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకుంటామ‌ని చెప్పారు. సీఎం గారు బార్‌కి 50 ల‌క్ష‌లైతే ఓకే అన్నార‌ని స‌జ్జ‌ల చెప్ప‌డంతో అసోసియేష‌న్ వాళ్లు నోరెళ్ల‌బెట్టేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా వున్న‌ప్పుడు అంటే 2006లోనే తామంతా లైసెన్సులు తెచ్చుకున్నామ‌ని, 810 బార్ల‌లో 42 త‌ప్పించి బార్ల‌న్నీ వైఎస్ గారి జ‌మానాలో వ‌చ్చిన‌వ‌నీ, లాక్‌డౌన్‌.. లైసెన్సులు పున‌రుద్ధ‌రించ‌క‌పోవ‌డం, సీజ‌న్‌లో బార్‌లు క్లోజ్ చేయ‌డంతో తీవ్ర న‌ష్టాల‌లో వున్నామ‌ని స‌జ్జ‌ల ద‌గ్గ‌ర అసోసియేష‌న్ వాళ్లు త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. స‌రే ఎంతిస్తారు ఫైన‌ల్‌గా అంటే.. ఒక్కో బార్ 10 ల‌క్ష‌ల చొప్పున చెల్లిస్తామ‌ని చెప్ప‌గా.. 100 కోట్ల‌యినా ఇవ్వ‌క‌పోతే క‌ష్ట‌మ‌ని ఆయ‌న తేల్చేశారు. ముందు మీరు ఓకే అనండి..ఎలాగోలా అరేంజ్ చేస్తామ‌ని బ‌తిమాల‌డ‌గా..సీఎంవోలో కీల‌కంగా వున్న మ‌రో రెడ్డిగారిని వెళ్లి క‌ల‌వండ‌ని స‌జ్జ‌ల అసోసియేష‌న్ వారికి సూచించారు. క‌మ్మోళ్ల‌వ‌నే కార‌ణంతో ఆపేశారు..ఇప్పుడు క‌మీష‌న్ ఇస్తున్నార‌నే కార‌ణంతో తెరిచేస్తారు. ఇదే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌నిషేధానికి తీసుకుంటున్న చ‌ర్య‌లు అని భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకోవ‌డం మేజిక్ కాక‌పోతే మ‌రేంటి?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...