Jump to content

దేశం విస్తుపోతున్నది..!


Raaz@NBK

Recommended Posts

👉దేశం విస్తుపోతున్నది..!
-------------------
    రెండువేల పధ్నాలుగు ఎన్నికల ముందు....
దేశం మొత్తం అవనీతి కి వ్యతిరేకంగా స్పందించింది..

అన్నాహజారే..కేజ్రీవాల్..కిరణ్ బేడి...రగిలించిన నిప్పురవ్వ కాంగ్రెస్ ని ఖాండవదహనం చేసింది.
స్వాములు..రామ్ దేవ్ బాబా లు..ఆసనాలు ఇంకా అనేక రకాల విన్యాసాలు చేసి..
దేశం మొత్తాన్ని ఒక మూడ్ లో ఉంచారు..

   సంఘపరివార్ నిర్దేశకత్వంలో బీజేపి గోవా సమావేశంలో...

   ప్రధాని అభ్యర్థి గా మోదీ గారిని ముందుకు తీసుకొచ్చినపుడు..

అద్వానీ సాబ్ ..నివ్వెరపోయారు..
అదీ మోదీ గారు ఇచ్చిన మొదటి షాక్!

తీవ్ర అసహనంతో.. అసంతృప్తితో ..రగిలిన అద్వానీ సాబ్ భారత్ భవిష్యత్ ను ముందే చెప్పేసారు.
దేశం అప్రకటిత ఎమర్జన్సీ ఎదుర్కోబోతున్నది అంటూ..

ఎవరూ పట్టించు కోలేదు..

ముందు కాంగ్రెస్ పీడ విరగడైతే చాలనుకున్నారు.

ప్రతి తెలుగు వాడు ..రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడున్నా బీజేపి వైపు నిలుచున్నారు.

  ఆంధ్రా వాడైతే..కోటి ఆశలతో స్వాగతించాడు..

మోదీ మానియా.. ఉద్వేగం..తో ఊగిపోయారు..

దానికి తోడు.. ప్రమాణస్వీకారానికి ముందు పార్లమెంటుకు మోకరిల్లిన మోదీ గారిని చూసి దేశం యావత్తూ భావోద్వేగానికి లోనయింది.

ప్రత్యర్థులు బిక్కచచ్చి పోయి నిర్ఘాంత పోయారు.

వారు తీసుకున్న నిర్ణయాలు..గత ఎన్నికల ముందు కాలంలో ..
దేశాన్ని ఈడ్చి ఈడ్చి కొట్టాయి..
భరించారు..సహించారు.. ఫొటోషూట్లు..పబ్లిసిటీ.. మీడియా మేనేజ్మెంట్.. సహజమే కదా! అనుకున్నారు.

  కాని ఆంధ్రావాడు ఏం పాపం చేసాడు..? చంద్రబాబు ఒక రకంగా సరెండర్ అయిపోయారు.
అన్ని నిర్ణయాలకు తలవూపారు..
మద్దతుగా నిలిచారు..
అనవసర విధేయత కూడా చూపించారు..
అయినా పొమ్మనకుండా పొగబెట్టారు..

అమరావతి .. రాజధాని భూసమీకరణ...
మాస్టర్ ప్లాన్ చూడగానే.. కుళ్ళు కడుపునిండా పేరుకు పోయింది..
స్నేహాన్ని వదులుకునేదాకా వేధించారు..

చంద్రబాబు కూడా ఎదురుతిరిగారు..
వ్యక్తిగత విమర్శలు ..ప్రధాని స్దాయిలో మోదీగారు మొదలెట్టారు..
చంద్రబాబు రెండెక్కువే అన్నారు..
అవును అవి సూటిగా తాకినాయి..
కసి తో రగిలి పోయారు..
ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు..

మళ్ళీ గెలిచారు..
ఇది మోదీ ఇచ్చిన రెండో షాక్!
ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తీర్పు రాబట్టుకోగలగటం నిజంగా షాక్ కదా!

ఎన్నాళ్ళు గానో నానుతున్న సమస్యల పరిష్కారం చేసారు.
అంతకు ముందున్న వారికి చేతకాలేదు..
వారికి వ్యవస్థల ను..ఎలా వాడుకోవాలో ..ఎలా అదుపులో ఉంచుకోవాలో.. వీరికి తెలిసినంతగా వారికి తెలియదు..

తలుపులు మూసి రాష్ట్రాన్ని విడదీయటమే దుర్మార్గం అనుకుంటే..
అంతకు మించి.. మొత్తం సిస్టాన్ని గుప్పిట పట్టి ..అప్రకటిత ఎమర్జన్సీ విధించటం..ఈడీ..సీబీఐ..తో వేటకొనసాగించటం..
వీరికి తెలిసినంతగా ముందున్న వారికి తెలియదు.. పాపం.

అవినీతి మకిలి అంటని పార్టీ ..అధినేత పాలనలో..అవినీతి కేసుల్లో ఉన్నవారు..జైలు కెళ్ళిన వారు ముఖ్యమంత్రులవుతారు..

అదానీ..అంబానీ..ప్రపంచ స్థాయి సంపన్నులవుతారు..
మాల్యాలు..నీరవ్ మోదీలు.. తప్పించుకుంటారు.

ఇవన్నీ రాజకీయాల్లో సహజమే!

దేశం మొత్తం తనవెనుక ఉన్నపుడు..
ప్రపంచాన్ని మొత్తం వైరస్ వణికిస్తున్నపుడు..
మనకు పక్కన సరిహద్దు దేశంలో వైరస్ విజృంభించినపుడు..

మనమేమి చేసాము..?

ట్రంపు కి స్వాగత సత్కారాల్లో మునిగాము..

మొదట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన వేళ నిర్లక్ష్యం వహించాము..

వైరస్ దేశంలో అడుగుపెట్టిన తర్వాత..కూడా ..ప్రజల చేత చప్పట్లు..కొట్టించారు..
దీపాలు పెట్టించారు..
జనం కూడా భయంతో చెప్పినట్టు చేసారు..

వైరస్ చేసిన గాయం ...
అతి పెద్ద విపత్తు...

మనుషుల మధ్య దూరం.. మమతలు మాయం..
మానవత్వం మృగ్యం..
ఆర్థిక సంక్షోభం...పనిలేదు.. ఆదాయం లేదు..
ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు..
ప్రజలు దిక్కుతోచని పరిస్థితి లో ఉన్నారు..

వారిని ఎలా ఆదుకోవాలన్న.. ఆలోచన కాని..వారికి అండగా ఉండే పరిస్థితి కాని..
కనిపించటం లేదు..

రాజకీయం..ఎన్నికలు..ఇవే ముఖ్యమైపోయాయి.
రానున్న రోజులను తలుచుకుని ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఉన్నారు.

మధ్యతరగతి వారి గోడు.. వారి బాధ చెప్పనలవి కాదు.

వాక్సిన్..వస్తుందా రాదా!?
ఎప్పటికి పరిస్థితులు చక్కబడతాయి..
అస్తవ్యస్తమైన బతుకులు ఎప్పటికి సర్దుకుంటాయన్న వర్రీలో జనం ఉన్నారు.

అయ్యగారు మాత్రం ..తపస్సు లో మునిగి పోయారు..
పుస్తక పఠనం..పక్షులకు ఆహారం వేసే చిత్రాలను ప్రజలమీద కు వదిలారు.

ఇదీ మోదీ గారు ఇచ్చిన మరో షాక్!

దేశం మొత్తం నివ్వెరపోతున్నది...

ఈ దేశం పరదాస్య పాలనలో కంటే వేధించబడుతున్నది.

మోదీ గారిని అభిమానంగా ఆరాధించాము..

ఆంధ్రులు  మొదటి కాజా తిన్నారు...

రెండవ సారి వచ్చినపుడు దేశం మొత్తానికి తినిపిస్తున్నారు.

గుదిబండను నెత్తికెత్తుకున్నాక.. తప్పదు మొయ్యాల్సిందే!

Lifted from FB

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...